లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్‌కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.
అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్‌మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు.
తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.
ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..
ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.
కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?
ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment