మేనకోడలితో సంబంధం.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమైందని | UP Man Kills Niece Who He Had An Affair With For She Wanted To Marry Someone Else, More Details Inside | Sakshi
Sakshi News home page

మేనకోడలితో సంబంధం.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమైందని

Published Fri, Aug 23 2024 6:49 PM | Last Updated on Fri, Aug 23 2024 7:53 PM

UP Man Kills Niece He Had An Affair With She Wanted To Marry Someone Else

యూపీలో ఘోరం వెలుగుచూసింది. మేనకోడలుతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.ఈ ఘటన హర్దోయ్‌ జిల్లాలోచోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మాన్సీపాండే అనే 22 ఏళ్ల యువతి వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి మణికాంత్‌ ద్వివేదితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కానీ యువతికి మరో వ్యక్తితో కుటుంబ సభ్యులు నవంబర్‌ 27న పెళ్లి కుదిర్చారు. ఈ క్రమంలో సోమవారం రక్షాబంధర్‌ సందర్భంగా ఆమె మణికాంత్‌ ఇంటికి వెళ్లింది. తనకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరిందనే విషయాన్ని అతడికి. అయితే అందుకు అతడు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, చేసుకోవద్దని యువతిని బలవంతం చేశాడు.

ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మణికాంత్‌ మాన్సీని గొంతు నులిమి చంపేసి నిర్మాణంలో ఉన్న భవనంలో పడేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె మొబైల్‌ను బస్సులో విసిరేశాడు. అయితే కూతురు ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి రాంసాగర్‌ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణికాంతే తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.

బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి వద్ద మాన్సీని దింపినట్లు తెలిపారు. ‘మేము స్వగ్రామానికి వెళ్ళాము, తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం మణికాంత్ నాకు ఫోన్ చేసి, మాన్సీ కనిపించడంలేదని,  ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు. కానీ నాకు అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement