ప్రతీకాత్మక చిత్రం
పక్కింటి కుర్రాడు.. అదీ వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలిసి ‘వద్దని’ చెల్లెలిని వారించాడు ఆ అన్న. అయినా ఆమె వినలేదు. అతనితో మాటలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత చనువుగా ఉండడం చూసి రగిలిపోయాడు ఆ అన్న. అతనిలో కోపం కట్టలు తెంచుకుని.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు.
ఉత్తర ప్రదేశ్ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్ ఛాటింగ్ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది.. అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్‌లో మాట్లాడుతూ దొరికిపోవడంతో.. ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు.
గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్ గ్రామంలోకూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు. అయితే వేరే వర్గానికి చెందిన కుర్రాడితో తన చెల్లెలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు.
ఇదీ చదవండి: అశ్లీల సైట్లు చూసే అత్యాచారం చేశారట!
Comments
Please login to add a commentAdd a comment