బెంగళూరులో యూపీవాసి ఆత్మహత్య
భార్య కేసు పెట్టిందని ఆవేదన
బనశంకరి: భార్య తనపై కేసు పెట్టిందనే ఆవేదనతో భర్త 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ (35) మారతహళ్లి మంజునాథ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తాడని సమాచారం. ఇతని భార్య గొడవపడి యూపీలో పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
కుమార్తెకు కానుక కొనుగోలు
ఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్‌నోట్ రాసి, పలు రకాల డాక్యుమెంట్లను జత చేసి ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. తన ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఏయే పనులు జరిగాయి, పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందులో రాశాడు. చివరి క్షణంలో తన నాలుగేళ్ల కుమార్తె జ్ఞాపకం రావడంతో ఒక కానుకను కొనుగోలు చేసి ఉంచాడు. దానిని ఆమెకు ఇవ్వాలని రాశాడు. ఈ డెత్‌నోట్‌ను సుప్రీంకోర్టుకు పంపాలని కోరాడు.
3 రోజుల నుంచి సన్నాహాలు
గత మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. డే1, డే 2, డే3 ఏమేం చేయాలి అనేది ఇంట్లో బోర్డు మీద కాగితాల్లో రాసి అతికించాడు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలి అని గుర్తు చేసుకున్నాడు. ఇక న్యాయం జరగడమే మిగిలి ఉంది అని ఆంగ్లంలో రాశాడు. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యూపీలోని భార్య, కుటుంబానికి సమాచారం అందించారు. అతడు సున్నిత మన స్కుడని, కుటుంబ గొడవల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడని, అందువల్లే ఇలా చేశాడని పలువురు నెటిజన్లు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment