
సాక్షి, కర్నూలు: ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో కొట్టి చంపారు. మృతుడిని నందవరం మండలం గురజాలకు చెందిన ఫిజియోథెరపి వైద్యుడిగా గుర్తించారు. నెల క్రితం మహేశ్వరి అనే యువతిని స్మిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
వివాహం జరిగినప్పటి నుంచి ఆదోని విట్టా కిష్టప్ప నగర్‌లో ఆడమ్ స్మిత్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదోనిలోని ఓ నర్సింగ్ హోంలో స్మిత్ పనిచేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి నర్సింగ్ హోంకు బైక్‌పై వెళ్తుండగా అటకాయించి తలపై బండరాయితో కొట్టి దుండగులు హత్య చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నామనే కారణంతో తన కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి భార్య ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment