adoni
-
కర్నూలు జిల్లా ఆందోనిలో టీడీపీ, జనసేన బాహాబాహీ
-
ఆదోనిలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అర్ధనగ్న నిరసన
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ హౌస్ అరెస్ట్
-
బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు. -
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
టీడీపీ నాయకుల అరాచకం
ఆదోని (అర్బన్): కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందిగుత్తి గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకానికి తెగబడ్డారు. 20 మంది వైఎస్సార్సీపీ నాయకులపై సుమారు 70 మంది టీడీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా వేట కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు ఆదోని పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలసందగుత్తిలో చిగిళి తాయప్ప అనే వ్యక్తి ఇల్లు టీడీపీ నాయకుల ఇళ్ల మధ్యలో ఉంది. జంబయ్య సోమలింగ, లక్ష్మన్న, శంకరప్పతోపాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చిగిళి తాయప్ప ఇంటి ముందు ఎద్దుల బండి ఆపి దానిపై కూర్చుని వారి ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు. ఇలా చేయడం తప్పని, బండి వేరేచోట ఆపి అక్కడే కూర్చోవాలని చెప్పడంతో చిగిళి తాయప్పపై ఆదివారం ఉదయం దాడి చేశారు. బాధితుడి తరఫున మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నాయకులు రాజీ కోసం వస్తున్నారని తెలుసుకుని పథకం ఇంటి మిద్దెలపై రాళ్లు, సీసాలు, కర్రలు, వేట కొడవళ్లతో 70 మంది టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి మాట్లాడేందుకు వచ్చిన 20మంది వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఉచీ్చరప్పకు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంకటేశ్, భీరప్ప, భరత్‌తో పాటు మరో 17 మందికి గాయాలయ్యాలని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే బంధువులు వాహనాల్లో ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు క్షతగాత్రులపై మరోసారి దాడికి యత్నించారు. అక్కడే స్పెషల్ బ్రాంచ్ సీఐ రామాంజులు ఉండటంతో టీడీపీ నాయకులను చెదరగొట్టారు. దాడి చేసిన వారిలో జంబయ్య సోమలింగ, లక్ష్మన్న, శంకరప్ప, శీను, వెంకటేశ్, సోము, పాలబుడ్డితోపాటు మహిళలు, నాయకులు 60 మంది ఉన్నట్టు బాధితులు తెలిపారు. కేసులు పెడితే దాడి చేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టు వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. -
కర్నూలు జిల్లా ఆదోనిలో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
విషాదం.. అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి..
ఆదోని అర్బన్ (కర్నూలు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలను విద్యార్థిని తాత సూర్యబాబు, మామ శ్రీనివాసులు బుధవారం తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంబళ్లూరు క్యాంప్‌నకు చెందిన శ్రీకాంత్, విజయలక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీకాంత్ కానిస్టేబుల్ కాగా, విజయలక్షి ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం శ్రీకాంత్ దంపతులు ఆదోని వచ్చి స్థిర పడ్డారు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) ఆదోనిలో డిగ్రీ వరకు చదివింది. ఆమె 2021లో అమెరికాలోని సీయాటిల్ నగరంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరింది. మరో నాలుగు నెలల్లో జాహ్నవి ఎంఎస్ కోర్సు పూర్తికానుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి సియాటిల్‌లో కాలేజీ నుంచి రూమ్‌కు వస్తూ రోడ్డును దాటుతుండగా సీయాటిల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. వాహనం కింద చిక్కుకున్న జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన తల్లి విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతుందని ఆశించిన కుమార్తె అకాలమరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాహ్నవి మృతదేహాన్ని మరో మూడు రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తారని తెలిసింది. -
Fact Check: భూకబ్జా అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. వాస్తవాలు ఇవిగో!
తప్పుడు ప్రచారాలు చేయడం తమకు మించినవారు లేరని మళ్లీమళ్లీ చాటుకుంటోంది ఎల్లో మీడియా. ఇప్పటికి ఇప్పుడు ఓ కట్టుకథను సృష్టించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆయన కుమారుడు జయమనోజ్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని మీడియా ప్రచారానికి తెగించారు. ఆ కథలోని వాస్తవాలేంటో.... అవాస్తవాలేంటో మీరే గమనించండి. ఆదోనిలో ఉండే శంషుద్దీన్... అప్పుల బాధ తట్టుకోలేక నాలుగైదుసార్లు మధ్యవర్తుల చుట్టూ తిరిగి రెండు సంవత్సరాల క్రితం భూమిని అమ్ముకున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమారుడు జయమనోజ్ రెడ్డి, ఆయనతో పాటి మరి కొంతమంది భాగస్వాములకు ఆ భూమిని అమ్మారు. ఈ విషయం భూమి అమ్మిన యజమాని శంషుద్దీనే చెబుతున్నారు. శంషుద్దీన్‌కు ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పిల్లలను తీసుకుని, ఆస్తిని పంచుకుని వెళ్లిపోయింది. అయితే ఆమె కుమారులు రెండేళ్ల క్రితం అమ్మిన భూమిలో వాటా కావాలని వచ్చారు. తమకు తెలీకుండా ఎలా అమ్ముతారని తండ్రితో గొడవ పెట్టుకున్నారు. అంతే కాదు వారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారిని కలిసి తమ ఇంటి గొడవను వారికి వినిపించారు. వారు కథను మలుపు తిప్పి, కుటుంబ గొడవను కాస్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయిప్రసాద్, ఆయన కుమారుడిపైకి మళ్లించారు. వారిని భూకబ్జాదారులుగా తేల్చారు. ఇలా ఛానెల్ ద్వారా బురద చల్లారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెబుతున్నదంతా అబద్దమని...తన తండ్రే అప్పులు తీర్చడానికి భూమిని అమ్ముకున్నానని శంషుద్దీన్ రెండవ భార్య కుమారుడు అల్తాఫ్ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా కుటుంబ గొడవను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేపై బురద చల్లడం న్యాయం కాదని అంటున్నారు. శంషుద్దీన్ కూతురు రెండో భార్య కూతుర రమీజా కూడా ఇదే మాట చెబుతోంది. మా పెద్దమ్మ కొడుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మా పరిస్థితుల కారణంగా భూమిని అమ్ముకున్నామని స్పష్టం చేసింది. ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ వార అపనిందలు వేయడం సమంజసం కాదని అంటోంది రమిజ, శంషుద్దీన్ కూతురు. శంషుద్దీన్ దగ్గరనుంచి రెండు సంవత్సరాల క్రితం భూమిని కొన్నామని... అన్ని నియమ నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేయడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. భూమికి సంబంధించి శంషుద్దీన్ కుటుంబంలో అభిప్రాయబేధాలు వస్తే వాటిని ఆధారం చేసుకొని తమపై నిందలు వేశారని, తప్పుడు వార్తను ప్రసారం చేశారని ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం బురద చల్లడం వారికి అలవాటైపోయిందని ఈసారి తప్పకుండా ఏబీఎన్‌పై పరువునష్టం దావా వేస్తామని అన్నారు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి. కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నా దుష్ప్రచారాలతో వార్తలు అల్లడం ఎల్లోమీడియాకే చెల్లిందని, ఎమ్మెల్యేతో పాటు,శంషుద్దీన్ కుటుంబసభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కుటుంబగొడవలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలకోసం అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు. -
పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసింది. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయంచేస్తోంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. 'దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు. విద్యార్థుల ఖర్చు గురించి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 8వ తరగతిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ట్యాబ్. రూ.12వేల విలువైన ట్యాబ్ విద్యార్థులకు ఇస్తున్నాం. 2020-21లో విద్యాకానుకకు రూ.648 కోట్లు ఖర్చు చేశాం. 42.34 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2021-22లో విద్యాకానుకకు రూ.789 కోట్లు ఖర్చు చేశాం. 45.71లక్షల మందికి లబ్ధి చేకూరింది. మూడో ఏడాదిలో విద్యాకానుకకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 47.40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే.. విద్యాకానుకలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే.. బడిమానేసే పిల్లలు తగ్గాలి. పిల్లల్ని బడికిపంపేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. అప్పుడు ప్రతి ఇంట్లో ఆనందం చూడగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి. ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 7లక్షల మందికి పైగా చేరారు. విద్యారంగంలో 9 ప్రధాన పథకాలను అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ అన్నారు. ఆదోనికి వరాల జల్లు స్థానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికనుంచే ప్రకటించారు. అకడమిక్ కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. -
పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
ఆదోని రూరల్(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది. చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..? పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్ కాలనీకి చెందిన సురేష్(19) తన బైక్‌ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు. -
మైండ్ బ్లాక్ చేస్తున్న టమాటా ధరలు
సాక్షి, ఆదోని: ఆదోని రైతు బజారులో మంగళవారం కిలో టమాటా రూ.105గా ఉండగా, ఝాన్సీలక్ష్మీబాయి మార్కెట్లో రూ.140 పలికింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి, ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో వినియోగం పెరిగి డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్లో టమాటా ధర వినియోగదారులను బెంబేలెత్తిస్తుండగా రైతులను మురిపిస్తోంది. సాధారణంగా ప్రతి రోజు ఆదోని మార్కెట్‌కు చుట్టు పక్కల పల్లెల నుంచి 300 గంపలు, ఆస్పరి మార్కెట్‌కు వెయ్యికి పైగా బాక్సులు రైతులు అమ్మకానికి తెస్తారు. మంగళవారం ఆదోనికి 40 గంపలు, ఆస్పరి మార్కెట్‌కు 150 బాక్స్‌లు వచ్చాయి. ఆస్పరి మార్కెట్లో 20 కిలోల బాక్స్ రూ.1,500 పలుకగా, ఆదోని మార్కెట్లో రెండు గంపలు రూ.1,500 పలికాయి. కిలో రూ. 75 ప్రకారం రైతుకు గిట్టుబాటు అవుతోంది. చదవండి: (విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..) -
మటం మరిస్వామికి గుబ్బి వీరణ్ణ పురస్కారం
సాక్షి, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన హార్మోనియం విద్వాంసుడు, సంగీత సామ్రాట్ బిరుదాంకితుడు మటం మరిస్వామిని మరో విశిష్ట పురస్కారం వరించింది. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారాలలో ఒకటైన గుబ్బి వీరణ్ణ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా మరిస్వామి అవార్డుతోపాటు రూ.5లక్షల నగుదును అందుకున్నారు. ఆయన తన స్వగ్రామం మదిరకు గురువారం చేరుకున్నారు. కళాకారులు, బంధుమిత్రులు పెద్దఎత్తున ఆయన్ను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో స్వర మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన పండిట్ పుట్టరాజ గవాయి ప్రియశిష్యుల్లో మరిస్వామి ఒకరు. తన 13వ ఏట నుంచే గవాయి నాటక కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన వందలాది నాటక ప్రదర్శనలకు ఆయన ఆరేళ్లపాటు అద్భుతమైన సంగీతం సమకూర్చి పుట్టరాజ గవాయిచే ప్రశంసలు అందుకున్నారు. -
9 బృందాలు.. 36 గంటలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో శిశువు అపహరణ మిస్టరీని తొమ్మిది బృందాల సాయంతో 36 గంటల్లో ఛేదించగలిగామని ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. ఆదోనిలో శనివారం పసికందును తల్లిదండ్రులు రేణుకమ్మ, శ్రీనివాసులుకు అందించారు. చంటి బిడ్డకు ‘దిశ’గా నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇవీ.. మండగిరికి చెందిన కనకుర్తి ఝాన్సీలక్ష్మి (30), మంజునాథ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆడపిల్ల కావాలనే కోరికతో దత్తత తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఈనెల 3న ఎస్కేడీ కాలనీలోని ప్రైవేట్ నర్సిగ్‌హోమ్ వద్దకు వచ్చి ఆయాగా పని చేస్తున్న యశోదను ఝాన్సీలక్ష్మి సంప్రదించింది. ఆ సమయంలో అలసందగుత్తికి చెందిన పూజారి రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. దీంతో ఝాన్సీలక్ష్మి బురఖా ధరించి, టీకా పేరుతో డ్రామా నడిపి పసిబిడ్డను అపహరించింది. ఫోన్ సంభాషణ ఆధారంగా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం
సాక్షి, కర్నూలు: ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ.. పసి పాపను కిడ్నాప్ చేసింది. అలసంద గుత్తి గ్రామానికి మహిళకు నిన్న డెలివరీ కాగా, పసిపాపకు ఇంజక్షన్ ఇస్తానంటూ ఓ మహిళ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు -
కరోనా చికిత్సలో అందరి చూపు ఏపీ వైపు
కర్నూలు: ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం సోమవారం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షచేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ఇలా.. ‘కరోనా నివారణ కు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వివరాలు సేకరించాం. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటాం. ఆదోని, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తాం. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు భరోసా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని వివరించారు. ‘రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్ ఇంజెక్షన్లపై అధికారులు సమన్వయంతో తో పని చేస్తున్నారు. ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే ప్రమాదమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కి చికిత్సతోపాటు భోజనం, మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం అన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముందులు, ఆక్సిజన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందిస్తోంది. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే’ అని మంత్రి బుగ్గన తెలిపారు. -
ఆదోనిలో ప్రబలిన అతిసారం
ఆదోని/అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో బుధవారం అతిసారం ప్రబలింది. 50 మందికిపైగా అస్వస్థతకు గురికాగా.. ఒక మహిళ రంగమ్మ (50) మృతి చెందింది. బాధితుల్లో 20 మంది పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరికి స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యం చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో పదేళ్లలోపు వయసు కలిగినవారు 8 మంది ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆర్డీఓతో పాటు మునిసిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రంగనాయక్, తహసీల్దారు రామకృష్ణ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి చీఫ్ డాక్టర్ లింగన్న వారికి తెలిపారు. అనంతరం ఆర్డీవో తదితరులు అరుంజ్యోతినగర్‌లో పర్యటించి.. ఓవర్ హెడ్ ట్యాంకులు, మురుగుకాలువలను శుభ్రం చేయించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. తాగునీరు కలుషితం అవడంవల్లే అతిసారం ప్రబలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆర్డీవో చెప్పారు. మంగళవారం ఇక్కడ దేవర జరిగిందని, ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గోరుకల్లులో మరొకరు మృతి పాణ్యం: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసారవ్యాధికి మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం గ్రామానికి చెందిన ఉప్పరి ఎరబోయిన ఉసేని (65), సుంకరి ఎల్ల కృష్ణ (35) చనిపోగా.. బుధవారం తమ్మడపల్లె మద్దమ్మ (75) నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో బుధవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. -
బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు
ఆదోని: బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించిన ఆదోని యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అతని ప్రతిభను అత్యుత్తమంగా గుర్తించిన ముంబై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ 2021 రికార్డుల జాబితాలో చోటు కల్పించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపి సత్కరించింది. ఆదోని పట్టణం, నారాయణ గుంతకు చెందిన లక్ష్మీ, పద్మనాభం దంపతుల రెండో సంతానం శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. తాజాగా ఈ నెల 4న కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపింది. బుధవారం రాత్రి కొరియర్ అందుకున్న శ్రీవైష్ణవ శ్రీకాంత్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను సరికొత్త ప్రయోగంతో చిత్రీకరించిన బాపు బొమ్మ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టడం ఆనందం కలిగించిందన్నాడు. -
నాన్నా.. కొడుతున్నాడు! : అదే చివరి మాట
పన్నెండేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. తాగుడుకు బానిసైన భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అంతలోనే పిల్లలు పుట్టడంతో వారి భవిష్యత్ కోసమైనా బతకాలని భరిస్తూ వచ్చిన ఆమె శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కర్నూలులోని కౌతాళం మండల పరిధిలోని లింగాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. సాక్షి, కౌతాళం రూరల్: కౌతాళం మండల కేంద్రానికి చెందిన హరిజన గౌరప్ప, పెద్ద బోడెమ్మ కూతురు బుజ్జమ్మ(30)ను సమీప బంధువు లింగాలదిన్నె గ్రామానికి చెందిన హరిజన అబ్రహం, యమిలమ్మ కుమారుడు జాన్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరి సంసారం నాలుగేళ్లు అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత భర్త జాన్ తాగుడుకు బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వీరికి నలుగురు మగ పిల్లలు. అయినా భర్తతో పాటు అత్త, మామ, ఆడపడచు భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పుకుని విలపించేది. సంసారం ఆగం చేసుకోవద్దని వారు చెప్పే మాటలు, నలుగురు పిల్లల భవిష్యత్‌ను తలచుకుని భరిస్తూ వచ్చేది. (ఆదోనీలో పరువు హత్య కలకలం) బుజ్జమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో భర్త తాగి వచ్చి కొడుతుండటంతో తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా.. కొడుతున్నాడు’ అంటూ చెప్పింది. అవే ఆఖరి మాటలయ్యాయి. వెంటనే ఫోన్ కట్ కావడంతో తండ్రి తిరిగి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇలాంటి వేధింపులు గతంలోనే చూసిన అతను మిన్నకుండిపోయాడు. అర్ధరాత్రి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వాళ్ల నుంచి ఫోన్ ద్వారా సమారాచారం తెలుసుకుని గుండెలు బాదుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన లింగాలదిన్నె చేరుకుని బోరున విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో భర్త, అత్తమామలే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యనా, ఆత్మహత్మనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. -
ఆదోనీలో పరువు హత్య కలకలం
సాక్షి, కర్నూలు: ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో కొట్టి చంపారు. మృతుడిని నందవరం మండలం గురజాలకు చెందిన ఫిజియోథెరపి వైద్యుడిగా గుర్తించారు. నెల క్రితం మహేశ్వరి అనే యువతిని స్మిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆదోని విట్టా కిష్టప్ప నగర్లో ఆడమ్ స్మిత్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదోనిలోని ఓ నర్సింగ్ హోంలో స్మిత్ పనిచేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి నర్సింగ్ హోంకు బైక్‌పై వెళ్తుండగా అటకాయించి తలపై బండరాయితో కొట్టి దుండగులు హత్య చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నామనే కారణంతో తన కుటుంబసభ్యులే హత్య చేశారని మృతుడి భార్య ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
కోవిడ్ పరిస్థితులు దోసెలు వేయడం నేర్పాయి
సాక్షి, కర్నూలు: ఉదయం టిఫిన్‌లో దోసెకు ప్రత్యేక స్థానం ఉంది. హోటళ్లలో పలు రుచుల్లో లభించే దోసెలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆనియన్ దోసె మొదలు చైనీస్, ఆమెరికా, కోన్, 70 ఎం.ఎం, ఎమ్మెల్యే దోసె ఇలా.. ఎన్నో వెరైటీల్లో లభిస్తుంది. ఎప్పుడైనా ఎమ్మెల్యే దోసె తిన్నారో లేదో గాని.. ఒక ఎమ్మెల్యేనే దోసె వేసిన సంగతి ఇది. కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇందుకు ప్రజా ప్రతినిధులు అతీతులు కాలేదు. ఎప్పుడూ వంట, వార్పు ఎరుగని ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డి కూడ గరిట పట్టాల్సి వచ్చింది. నియోజక వర్గం అభివృద్ధి పనుల విషయంపై ఆయన ఇటీవల అమరావతికి వెళ్లారు. అయితే కోవిడ్ 19 కారణంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయన వంట చేసుకోడానికి స్వయంగా గరిట చేపట్టారు. (‘వర్క్ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్!) ఉదయం దోసలు చేసుకుని, ఇందులోకి బంగాళ దుంపకూర వండారు. మధ్యాహ్నం వంట చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వంట ఎప్పుడు నేర్చుకున్నారని ‘సాక్షి’ అడుగగా అవసరం అన్ని నేర్పుతుందంటూ చమత్కరించారు. కోవిడ్ పరిస్థితిలో హోటళ్లు మూత పడ్డాయని, రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో అల్పాహారం, భోజనం ఎంత వరకు సురక్షితమో తెలియని పరిస్థితిలో వంట చేసుకోవడమే మేలని భావించి అమరావతిలో ఉన్నన్ని రోజులు వంట చేసుకుంటానని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు అవసరం అయిన జాగ్రతలు తీసుకోవాలని కోరారు. ఏమవుతుందిలే అని మొండిగా వెళ్లితే ఒక్కో సారి అదే ప్రమాదానికి చేరువ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. -
అమ్మా.. నేను సేఫ్
పిల్లలు కావాలని ఎందరో దేవుళ్లను మొక్కుకుంటారు. వ్రతాలు, నోములు చేస్తారు. డాక్టర్లకు చూపించుకుని వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు. అయినా, కడుపు పండలేదని..అమ్మా అనిపించుకోలేదని కుంగిపోతుంటారు. కొందరు ఈ బాధతో లోకాన్నే వదిలివెళ్తారు. అంతటి బలీయమైన ఈ పేగు బంధాన్ని తెంపుçకుని వెళ్లింది ఓ కసాయి తల్లి. ఆడబిడ్డ పుట్టిందనో, మరేతర కారణమో తెలియదు కానీ ఆదోనిలో జరిగిన ఈసంఘటన తల్లిప్రేమకు మాయని మచ్చగా నిలుస్తోంది. కర్నూలు, ఆదోని టౌన్: ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడామైదానంలో ఉన్న వేపచెట్టు కింద ఓ పసికందును బ్యాగులో పెట్టి వదిలేసి వెళ్లారు. రోజులాగే సోమవారం ఉదయం ఈ మైదానంలో వాకింగ్‌కు వచ్చిన వారికి పసిబిడ్డ ఏడుపులు వినిపించాయి. ఎక్కడి నుంచి ఈ ఏడుపులు వస్తున్నాయని అటూఇటూ చూశారు. బ్యాగులో నుంచి రోదనలు వినిపించడంతో వెళ్లి చూశారు. వెంటనే అందులోని పసిబిడ్డను బయటకు తీసి పరిశీలించి స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తర్వాత త్రీ టౌన్ పోలీసులు, అంగన్ వాడీ ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్న అధికారులు పసికందుకు వైద్యం అందించారు. ఆరోగ్యంగా ఉండటంతో కర్నూలులోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు 108 అంబులెన్స్‌లో తరలించినట్లు సూపర్వైజర్ సావిత్రి తెలిపారు. -
అచ్చం అలాగే..
ఆదోని టౌన్: కర్నూలు మండలం గార్గేయపురంలో జనవరి 4వ తేదీ రాత్రి దొంగలు ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అన్నీ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి.. రూ.3.55 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. తాజాగా ఆదోని పట్టణంలోనూ అచ్చం అలాగే చోరీలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి.. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు చోట్లా శనివారం రాత్రే చోరీలు జరగడం, అది కూడా వరుస ఇళ్లలో ఒకే తరహాలో చోరీలకు పాల్పడడం యాదృచ్ఛికమా లేక ఒకే ముఠా పనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని పట్టణంలోని పంజ్రాపోల్ వీధిలో శనివారం రాత్రి ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్న మంజునాథ్, సంపత్‌కుమార్, శివకుమార్ పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అదే వరుసలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్న దినసరి కూలీలు వీరేష్, రాఘవేంద్ర కూడా బంధువుల ఊళ్లకు వెళ్లారు. దొంగలు ఈ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. పెద్దగా ఏమీ దొరకలేదు. చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. తర్వాత పక్క సందులోని రేష్మా, వినోద్ దంపతుల ఇంట్లో చోరీకి తెగబడ్డారు. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే రేష్మా, వినోద్ శనివారం అనంతపురం జిల్లా గుత్తిలో ప్రార్థనలకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగు చూసింది. తాళం తెగ్గొట్టి, బీరువాను పెకలించి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చలానాతో.. పోయిన బైక్ తిరిగొచ్చింది!
సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్ బైక్ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్ సీఐ అబ్దుల్ గౌస్ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు. ఏడాది తరువాత తన బైక్ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. -
పట్టుచీర కట్టుతో.. అతనే ఆమైతే..!
సాక్షి, ఆదోని(కర్నూలు): అబ్బాయి అమ్మాయి అయితే ఎలా వుంటుంది? సంప్రదాయ పట్టుచీర కట్టుతో వేదికపైకి వచ్చి.. చక్కటి హావభావాలతో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంటే ఎలా అనిస్తుంది. ఆదోని పట్టణం మండగిరి వీధికి చెందిన శ్రీనివాసులు అచ్చం ఇలాగే చేస్తున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టి, ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 23న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యంలో బెస్ట్ ఫర్మామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఇటీవల ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సెట్కూర్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కళా ప్రదర్శన పోటీల్లో కూడా కూచిపూడిలో మొదటి బహుమతి, భరత నాట్యంలో తృతీయ బహుమతి అందుకున్నాడు. అంతేగాక అంతర్జిల్లా పోటీలకు అర్హత సాదించాడు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో కూడ తన అద్భుత నాట్య కళాభినయంతో అందరి మెప్పు పొందుతున్నాడు. వర్ధమాన కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీనివాసులు.. స్థానికంగా ఉన్న అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్లు విజయ్‌కుమార్, వాసు, రాజ్‌కుమార్‌తో శిక్షణ పొందుతున్నాడు. డిగ్రీ దాకా పూర్తి చేసిన శ్రీనివాసులు తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేస్తానని చెప్పారు. తండ్రి బసన్న.. కట్టెల మండి వ్యాపారి. తల్లి రంగమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందింది. అంతర్ జిల్లా పోటీలకు అర్హత సాదించిన శ్రీనివాసులును అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచోటి రామయ్య బుధవారం అభినందించారు. నాట్యమే తన జీవితంగా భావిస్తున్న శ్రీనివాసులుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని రాచోటి రామయ్య అకాంక్షించారు. తనకు చిన్నతనం నుంచి నాట్యమంటే ఎంతో మక్కువ అని, తన అసక్తి మేరకు నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సొసైటీ నిర్వాహకులు, డాన్స్ మాస్టర్లకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను నాట్యంలో అత్యుత్తమ కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం -
దొంగ..పోలీస్ దోస్త్!
సాక్షి, ఆదోని(కర్నూలు): జిల్లాలో కొందరు పోలీసులు..అసాంఘిక శక్తులతో చేతులు కలుపుతున్నారు. దొంగలతో దోస్తీ చేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట మంట గలుపుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఒక్క ఆదోని సబ్ డివిజన్ పరిధిలోనే ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు పలు ఆరోపణలపై క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. మూడు రోజుల క్రితం కోసిగి స్టేషన్ పరిధిలోని చిన్న భూంపల్లి గ్రామంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పది మంది నిందితుల్లో నలుగురిని తప్పించి.. వారి స్థానంలో అమాయకులను కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనలో ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ ఏసేబు, ఇద్దరు కానిస్టేబుళ్లు రామాంజి, తిప్పన్నను బాధ్యులుగా చేస్తూ పలు సెక్షన్ల కింద ఆదోని టూ టౌన్ పోలీసులు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఆదోని వన్ టౌన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లో పేకాట క్లబ్బుపై దాడి చేసి.. విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈ ఆరోపణలపై కానిస్టేబుళ్లు రంగస్వామి, రంగన్నను వీఆర్‌కు పంపారు. అంతకు ముందు మట్కా, దొంగ బంగారం, బియ్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వన్‌టౌన్‌లో పని చేస్తున్న జయరాముడు, టూ టౌన్లో పనిచేస్తున్న ప్రసాద్ సింగ్, హాజీ బాష, చిన్న హుసేని, తాలూకా ఏఎస్ఐ నాగరాజుపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. నాగరాజుపై ఇంకా సస్పెన్షన్ వేటు కొనసాగుతుండగా మిగిలిన వారు మళ్లీ విధులలో చేరారు. అసాంఘిక శక్తులకు సింహ స్వప్నంగా ఉండాల్సిన పోలీసులు..అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో చాలా మంది పోలీసులు.. ఉన్నత స్థాయి అధికారులకు తెలియకుండా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ వర్గాలచే రహస్యంగా విచారణ చేపడితే ఎవరెవరికి అసాంఘిక శక్తులో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటేనే పోలీసు శాఖ ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా మట్కా, పేకాట, అక్రమ గుట్కా, మద్యం, నాటు సారా వ్యాపారాలకు చెక్ పడనుంది. -
ఆదోని ప్రభుత్వాసుపత్రిని తనికీ చేసిన ఎమ్మెల్యే
-
ఆదోని మార్కెట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్‌లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్‌కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్‌కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
వేధిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్ట్
సాక్షి, ఆదోని : పోలీస్ శాఖలో కొందరు అధికారులు తనను అవమానిస్తూ, అగౌరవ పరుస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ ఏఎస్ఐ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ అయింది. వీడియోను సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే అప్లోడ్ చేశారో, ఎవరైనా ఆయన ఆవేదనను రికార్డు చేసి పెట్టారో తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో, ఆందోళనతో ఉన్న తనను ఓ అధికారి మానసికంగా వేధిస్తున్నారని, దీంతో ఉద్యోగం చేయలేక పోతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తనకు జరుగుతున్న అన్యాయం పోలీసు శాఖలో ఏ ఒక్కరికీ రాకూడదన్న ఉద్దేశంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల విధులలో ఉన్నానని, విధులు ముగియగానే జిల్లా ఎస్పీని కలిసి తనను ఎలా వేధించారో వివరించి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పై అధికారులకు చెప్పుకోవాలి కాని ఇలా సోషల్ మీడియాలో వీడియోల ద్వారా వైరల్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సస్పెన్షన్ వేటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నతాధికారుల పట్ల అనుచితంగా మాట్లాడిన ఏఎస్ఐ నాగరాజుపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్సై నాగరాజుకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలపై ఫిర్యాదులు వచ్చాయి. పని కన్నా ఇతరత్రా విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ గతంలోనూ సస్పెండ్ అయ్యారు. అయినా పనితీరులో మార్పు రాలేదు. వెల్దుర్తిలో పనిచేస్తూ ఆదోనికి అటాచ్మెంట్ విధులు అప్పగించారు. సోషల్ మీడియాలో ఉన్నతాధికారులపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో జిల్లా పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. పోలీసు కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద జిల్లా ఎస్పీ అతనిపై చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈ పాపం ఎవరిదీ!
ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడి గట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేశాడు. సభ్య సమాజాన్ని నివ్వెరపరిచాడు. మానవీయతకు మాయని మచ్చ తెచ్చాడు. ఫలితంగా ఆ పిచ్చి తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గమనించిన స్థానికులు బిడ్డను అక్కున చేర్చుకొని ఆసుపత్రికి తరలించారు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సాక్షి, ఆదోని : పట్టణంలోని రాయలసీమ పైకొట్టాల ప్రాంతంలో మతిస్థిమితం లేని మహిళ నాలుగేళ్లుగా సంచరిస్తూ ఉంది. ఎవరైనా పెడితే తినేది. లేదంటే వీధుల వెంట తిరుగుతూ ఉండేది, రాత్రి పూట చెట్లు, గోడల చాటున తలదాచుకునేది. ఆమె ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. స్థానికులు ఆమెను పిచ్చి తల్లి అంటూ పిలుచుకునేవారు. కాటేసిన దుర్మార్గుడు.. మతిస్థిమితం లేని ఆ మహిళలను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అంటూ జాలి చూపుతారు. దయతో ఏదైనా ఆమె చేతిలో పెడతారు. అయితే ఆ కామాంధుడికి మాత్రం జాలి, దయ లాంటివేమి లేవు. సభ్యసమాజం తలదించుకునే పనికి ఒడి గట్టాడు. కాలంతో పాటు తనలో మార్పు వస్తున్నా ఆమెకు ఏం జరుగుతుందో తెలియలేదు. దుర్మార్గుడి పాపాన్ని తొమ్మిది నెలలు మోసిన ఆ పిచ్చి తల్లి శనివారం ఓ చెట్టు కింద మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల తర్వాత పసిబిడ్డ ఏడుపు విన్న ఓ మహిళ చెట్టు దగ్గరకు వెళ్లి అక్కున చేర్చుకుంది. తోటి మహిళల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు స్థానిక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తల్లీబిడ్డను కర్నూలుకు తరలించిన అధికారులు తల్లీ, బిడ్డను ఐసీడీఎస్ అధికారులు సోమవారం కర్నూలుకు తరలించారు. అంతకు ముందు స్థానిక ఐసీడీఎస్ అధికారిణి సఫరున్నిసాబేగం బిడ్డ ఆరోగ్య విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవీలతతో మాట్లాడారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. బిడ్డను కర్నూలులోని శిశు గృహకు తరలిస్తామని, తల్లిని కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పిస్తామని సఫరున్నిసాబేగం తెలిపారు. కాగా మతిస్థిమితం లేని మహిళను తల్లిని చేసిన దుర్మార్గుడు సమాజంలో ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి పాపానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని జైలుకు పంపాలని కోరుతున్నారు. -
గోల్డ్ స్కీం పేరుతో ఓ ప్రైవేటు బ్యాంకు ఎండీ..
సాక్షి, ఆదోని(కర్నూలు) : గోల్డ్ స్కీం పేరుతో డిపాజిటర్లను మోసం చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎండీని టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలు డీఎస్పీ వెంకటరాముడు.. సీఐ భాస్కర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనహాల్ గ్రామానికి చెందిన ముళ్లపూడి ఇసాక్ గత జనవరిలో పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో జాన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యువెలరీ స్కీం కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 మందిని ఫీల్డ్ ఆఫీసర్లుగా నియమించుకొని 282 మంది సభ్యులను చేర్చుకున్నాడు. వారి వద్ద నుంచి డిపాజిట్ రూపంలో దాదాపు రూ.30 లక్షలు సేకరించాడు. గడువు ముగిసినా లోన్లు, బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో ఎండీ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీరామనగర్‌కు చెందిన బాధితుడు దేవప్రసాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గత మే 10న ఫిర్యాదు చేశాడు. దేవప్రసాద్‌తో పాటు మరికొంతమంది బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మీ, గౌస్, జాఫర్, రఫీక్ కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా శనివారం ఎండీ ముళ్లపూడి ఇసాక్ కల్లుబావిలోని ఆటో స్టాండ్ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రెబెకాకు రూ.23 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని, ఆమె కోసం గాలిస్తున్నామని, త్వరలోనే నగదు రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా ఎమ్మిగనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి బాధితుల నుంచి రూ.20 లక్షల వరకు డిపాజిట్లు వసూలు చేసి ముఖం చాటేశాడని డీఎస్పీ చెప్పారు. 2014లోనూ దొంగనోట్ల కేసులో గంగావతి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. -
సొంతింటిలో చేరకుండానే...
సాక్షి, ఆదోని(కర్నూలు) : సొంతింటితో చేరకుండానే ఓ ఉద్యోగిని మృత్యువు కబళించింది. గృహం నిర్మించుకొని ప్రవేశ పూజల్లో నిమగ్నమై ఉన్న అతన్ని విద్యుదాఘాతం రూపంలో అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆదోనిలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన రవీంద్రబాబు(55) పత్తికొండ సబ్‌జైల్ హెడ్‌గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదోని సబ్‌జైల్ గార్డుగా పనిచేస్తూ ఏడాది క్రితం హెడ్‌గార్డుగా పదోన్నతిపై పత్తికొండ సబ్‌జైలుకు వెళ్లాడు. అయితే ఆదోని నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. భార్య అర్లమ్మ ఆలూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో మంచి ఇల్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు. అందులో భాగంగా దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి ఆర్టీసీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం గృహ ప్రవేశం ఉండటంతో బంధువులందరికీ కబురంపాడు. పూజల్లో భాగంగా శనివారం పండితులతో హోమం తలపెట్టాడు. హోమంలో కూర్చున్న రవీంద్రబాబు విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి పెరట్లోని మోటార్‌కు సంబంధించిన వైరు అడ్డుగా ఉందన్న కారణంతో పూజలో నుంచి బయటకు వచ్చి వైరు చుట్టగా చుట్టి గోడపై పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్ప కూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శుభ కార్యం జరగాల్సిన చోట రోదనలు.. గృహప్రవేశం పిలుపుతో పలువురు దగ్గరి బంధులు రావడంతో అప్పటి వరకు సందడిగా ఉండేది. కాగా ఇంటి యజమనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతగ్రామం సింధనూరుకు తీసుకెళ్లడంతో శుభ కార్యం జరగాల్సిన ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. -
అనుమానాస్పద స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి
సాక్షి, ఆదోని(కర్నూలు) : పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దిబ్బనకల్ గ్రామ సరిహద్దు పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆనవాళ్లు, పక్కనే బాటిల్, స్కూటీ ఉండటంతో హత్యనా? ఆత్మహత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరా నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాయీ బ్రాహ్మణ బసవరాజు(42) నివాసముంటున్నాడు. బార్బర్ షాపుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మృతుడికి భార్య సువర్ణమ్మ, కొడుకులు సునీల్‌కుమార్, వేణుగోపాల్, కూతురు సునీత ఉన్నారు. ఆదివారం సాయంత్రం రోజూ మాదిరిగా బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో తెలిసిన చోటల్లా విచారించారు. 10 గంటల తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఫోన్ చేయగా రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెతకడం ప్రారంభించారు. సెల్‌ఫోన్ ఉన్నట్లు మొదట ఢణాపురం, తర్వాత మిల్టన్ హైటెక్ స్కూల్ ఏరియాల్లో చూపించడంతో అక్కడా వెదికారు. మిల్టన్ హైటెక్ స్కూల్, బాటమారెమ్మ గుడి సమీపంలోని కొండ ప్రాంతం వైపు వెళ్లగా స్కూటీ కనిపించింది. ఫోన్ రింగ్ కూడా స్కూటీలో నుంచి వినింపించింది. కాస్త ముందుకు వెళ్లి చూడగా, ఓ కొండ దిగువన బండరాయి మధ్య కాలిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం పరిశీలన దిబ్బనకల్ సరిహద్దు ప్రాంతంలోని ఓ కొండ దిగువన రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుసుకున్న డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. టూ టౌన్ సీఐ భాస్కర్, తాలూకా ఎస్ఐ రామాంజులు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. రెండు లీటర్లు వాటర్ బాటిల్, చెప్పులు పడివుండటాన్ని గమనించి, పెట్రోల్ పోసి తగులబెట్టారా? లేక ముందుగానే హత్యచేసి ఆపై పెట్రోల్‌పోసి నిప్పంటించారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. కుటుంబ సభ్యులను ఆరా తీశారు. నా చావుకు కారణం నేనే.. ‘నా చావుకు నేనే కారణం. ఎవరు కాదు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగానే నేను చనిపోతున్నాను’. అని నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు తాలూకా ఎస్ఐ రామాంజులు తెలిపారు. అయినా మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామనిన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అల్లా.. జగన్ సీఎం కావాలి
సాక్షి, ఆదోని టౌన్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఖాజా గరీబ్ నవాజ్ దర్గాను గురువారం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, సన్నిహితులు దర్శించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో ఫాతెహాలు చేశారు. అదేవిధంగా పుష్కర్‌లోని బ్రహ్మస్వామి దేవాలయాన్ని సాయి ప్రసాద్‌రెడ్డి బృందం దర్శించుకుంది. స్వామివారికి పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలతో అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వామివారిని కోరినట్లు సాయి ప్రసాద్‌రెడ్డి ఫోన్లో తెలిపారు. వారం రోజుల్లో వెలుబడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఈ సందర్భంగా సాయి ధీమా వ్యక్తం చేశారు. 120 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు శకం వచ్చే గురువారంతో ముగి యనుందని చెప్పారు. నీరజ్ డాంగిని కలిసిన సాయి రాజస్థాన్ రాష్ట్రం మాజీ హోంమంత్రి దినేష్ డాంగి తనయుడు, ప్రస్తుత రాజస్థాన్ పీసీసీ ప్రధాన కార్యదర్శి నీరజ్ డాంగిని జైపూర్‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితోపాటు సన్నిహితులు మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మజార్ అహ్మద్, ఈషాబాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి నీరజ్‌డాంగికి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు. -
ఇక్కడ మీకేంటి పని?
ఆదోని టౌన్: సాయి డిగ్రీ కళాశాల పోలింగ్ కేం ద్రంలో మాజీ కౌన్సిలర్ లింగారెడ్డితోపాటు కొం దరు టీడీపీ నాయకులు ఉండడంతో గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి భార్య శైలజారెడ్డి... ఇక్కడ మేకేంటి పని... ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చిన ఆమె టీడీపీ నాయకుల గుంపును గమనించారు. ఓటర్ల ను ప్రలోభపెడుతూ... సైకిల్ గుర్తుకు ఓటేయా లని కోరుతున్న విషయాన్ని గమనించిన ఆమె మాజీ కౌన్సిలర్ లింగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలింగ్ బూత్ ఇక్కడ కాదుకదా... ఎందుకొచ్చినట్లు... ఏమి చేస్తున్నారు... ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడున్న పోలీసులు, మీడియా చుట్టుముట్టారు. లింగారెడ్డి ఓటరు కాదు.. ఏజెంటు కాదు... పోలింగ్ బూత్‌లో పనేంటని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ప్రచారం చేస్తు న్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా అ ర్ధగేరి బసన్న గౌడ్ స్కూల్లోనూ పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. డీఎస్పీ వెంకటరాముడుతో మాట్లాడారు. టీడీపీ నాయకులు లోపలకు వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు, -
ఆదోని పై పట్టెవరిది !
సాక్షి, అమరావతి : పూర్వం దక్షిణాది ధాన్యం మార్కెట్‌గా వెలుగొంది.. ఇప్పుడు దుస్తులు, బంగారం మార్కెట్‌కు కేంద్రంగా విరాజిల్లుతున్న ఆదోనికి ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. రెండో ముంబైగా వినుతికెక్కిన ఈ ప్రాంతం 16వ శతాబ్దములో యాదవుల పాలనలో ఉండేది. అప్పుట్లో దీనిపేరు యాదవగిరి. ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో భాగంగా ఉండేది. 1952లో ఏర్పడిన ఆదోని నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఒకసారి వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ), కొంకా మీనాక్షినాయుడు (టీడీపీ) తలపడుతున్నారు. ఇక్కడి ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిస్తూ ప్రతి ఎన్నికలోనూ ఆసక్తి గొలుపుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. తమకు నచ్చిన, ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉండే అభ్యర్థికే ఓట్లు వేసి ఎమ్మెల్యే గిరీని కట్టబెడుతుంటారు. ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు కాలాలపాటు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పనీ చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో పలు శాశ్వత పథకాలు ఆవిష్కారమయ్యాయి. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారనే విశ్వాసం ఓటర్లలో ఉంది. దీంతో ఈసారి ఎన్నికలో సాయిప్రసాద్‌రెడ్డి విజయం నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సైకిల్‌కు ఎదురు గాలి.. టీడీపీ అభ్యర్థి మీనాక్షినాయుడుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదోనికి పూర్వ వైభవాన్ని తెస్తామని చెప్పారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మండగిరి నీటి పథకాల నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్రంలో అత్యంత పురాతనమైన మున్సిపాల్టీల్లో ఒకటైన ఆదోనిలో ఆక్రమణలతో రోడ్లు కుంచించుకుపోయాయి. రోజు, రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. రోడ్లు విస్తరణ చేపడతామని, వైఎస్ఆర్ హయాంలో మంజూరు అయి, మూడింట ఒకవంతు మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 8 గ్రామాలకు మాత్రం సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 32 గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాలువను విస్తరించి తమ గ్రామాలకు కూడా సాగునీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఆ దిశగా ప్రతిపాదనలు ఏవీ లేవు. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. ఎన్నో పథకాలు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి పలు శాశ్వత పథకాలు తెచ్చారు. ఆదోని పట్టణంలో రూ.32 కోట్లతో తాగునీటి పథకం మంజూరు చేయించారు. కుప్పగల్లు వద్ద రూ.8 కోట్లతో రెండు నీటి పథకాలు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పట్టణానికి బైపాస్ రోడ్డు, విక్టోరియా పేట, ఇస్వి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. మున్సిపాల్టీలో 23 మంది కౌన్సిలర్లు, రూరల్‌లో 28 మంది తాజా మాజీ సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలతో పాటు పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఆదోని బహిరంగ సభలో వైఎస్ జగన్
-
పోలీస్ బాసుల పచ్చచొక్కాలు విప్పుతాం : జగన్
సాక్షి, కర్నూలు(ఆదోని) : అధికారంలోకి రాగానే పోలీస్ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఫుట్‌పాత్ వ్యాపారస్తులకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కిందిస్థాయి ఉద్యోగులు, హోంగార్డులకు మెరుగైన జీతాలతో పాటు.. వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలను కోరారు. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి ప్రసాద్‌రెడ్డి , కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ఆదోని సమస్యలను విస్మరించారు.. ‘ఆదోని నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నాలుగు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి. ఐదేళ్లుగా నీళ్లు అడుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్‌ను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టించారు. ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. నాన్నగారి హయాంలో బైపాస్ రోడ్డు గురించి మూడు బిట్లు పూర్తి చేస్తే చంద్రబాబు మిగిలిన ఒక్క బిట్‌ను పట్టించుకోలేదు. ఆదోని రెవిన్యూ డివిజన్లో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. ఉన్న ఎయిడెడ్ కాలేజీలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు చదువులు ఎండమావులుగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్లు 14 మంది. కానీ ఐదుగురు డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. లోలేవల్ కెనాల్ కింద భూములకు సాగునీరు అందడం లేదు. ఈ కెనాల్ పనులను ఆధునీకరించలేదు. మైనార్టీల సమస్యలను పరిష్కరించలేదు. వారికి ప్రార్థన స్థలాలు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మిస్తే.. రెండు జిల్లాలోని 659 గ్రామాలకు తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఐదేళ్లుగా ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్‌ను పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రతి అడుగులో కనిపించేది వంచన, మోసం. సొంతమామకె వెన్నుపోటు పొడిచిన ఆయన.. ప్రజలను మోసం చేయడా? ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక.. రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. రైతుల దగ్గరేమో కేజీ రూ. 1 కూడా కొనరు. కానీ హెరిటేజ్‌లో మాత్రం కేజీ రూ. 23కు అమ్ముతున్నారు. దీన్నిబట్టి దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో చెప్పనవసరం లేదు. దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తే వారితో జత కట్టారు. టమాట, పత్తి పరిస్థితి కూడా ఇదే. ఇటువంటి దారుణమైన స్థితి.. రాష్ట్రంలో ఉంది. ఇంతటి దారుణ పాలనలో నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను. మీ అందరితో మమేకమయ్యాను కాబట్టి .. మీ అందరికి నేనున్నాను.. అని హామీ ఇస్తున్నాను. పుట్‌పాత్ వ్యాపారులకు రూ.10 వేల రుణం.. రాష్ట్రంలో 80 శాతం మందికి తెల్లకార్డులే ఉన్నాయి. అంటే అంతమంది దిగువ మద్యతరగతి కుటుంబాలు, పేదలనే అర్థం. ఖచ్చితమైన ఆదాయం లేక ఎలా బతుకాలో తెలియక జీవనం సాగిస్తున్నారు. వీరిని ఎలా బాగుపర్చాలనే ఆలోచనతోనే నా పాదయాత్ర సాగింది. కొందరి కష్టాలను చూసినప్పుడు గుండె తరక్కుపోయింది. పుట్‌పాత్‌లపై సరుకులు అమ్మకుంటున్న పరిస్థితులు.. తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకోవడం చూశాను. రోడ్డు పక్కనే బండి.. ఆ బండిలో ఓ టీ షాప్.. ఆ టీ షాప్‌లో ఓ అక్క.. కాఫీ, దోసేలు అమ్ముకోవడం చూశాను. వీరంతా పెట్టుబడి కోసం రూ. 4 నుంచి రూ. 5 వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బతుకుతున్న పరిస్థితులను తెలుసుకున్నాను. ఒక రోజు జ్వరం వచ్చి పడుకుంటే ఇళ్లు గడవని పరిస్థితి. రోడ్డు పక్కన పనిచేసుకుంటున్న చిరు వ్యాపారులందరికి చెబుతున్నా.. కులవృత్తి చేసుకున్నా సరే.. నాయి బ్రాహ్మణలైనా సరే.. చెప్పులు కుట్టుకునే వారైనా సరే.. మీ సమస్యలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకుంటే తీరుతాయని తెలిసినా.. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. త్వరలోనే మీ కష్టాలు తీరుతాయని నేను భరోసా ఇస్తున్నాను. అధికారంలోకి రాగానే మీ అందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వాళ్లందరికి 10 వేల రూపాయిలు.. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. ఏ రోజు అవసరమైతే.. ఆ రోజు కార్డు చూపించి డబ్బులు తీసుకునేలా చేస్తాం. అధిక వడ్డీలకు తీసుకొని ఇబ్బంది పడుతున్న మీ అందరికి అండగా ఉంటాం. అందుకే నవరత్నాలు.. పేదవాడి కష్టాలు, రైతుల సమస్యలు, పిల్లలను చదివించలేని పరిస్థితిని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను పాదయాత్రలో స్వయంగా చూశాను. వారందరికి మేలు చేసేలా.. నవరత్నాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇస్తున్నా. 27 శాతం ఐఆర్ ప్రకటిస్తాం. సకాలంలో పీర్సీ కూడా అమలు చేస్తాం. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి సర్వీసులను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతం కావాలని కోరిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ నెరవేరుస్తాం. ప్రతి జిల్లాలోను ప్రభుత్వ పెన్షనర్లుకు ఓ సెల్ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా చేస్తాం. పోలీస్ బాసులకు.. చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలను విప్పుతాం. కిందస్థాయిలో పనిచేస్తున్న హోంగార్డులకు మెరుగైన జీతాలు ఇస్తాం. పోలీసులకు వారానికి ఓ సెలవు ఇస్తాం. దానికోసం పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉద్యోగస్థులందరికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అంగన్వాడీ, ఆశవర్కర్లు, మధ్యాహ్నభోజన పథకంలో పనిచేస్తున్న అక్కాచెల్లమ్మలకు అందరికి చెబుతున్నా.. అందరికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. మీ మనవడు ఇస్తాడని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ధర్మానికి..అధర్మానికి మధ్య ఎన్నికలు
సాక్షి, ఆదోని రూరల్: ధర్మానకి... అధర్మానికి మధ్య త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓటు ఆయుధంతో అక్రమార్కులకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలు విసుగు చెందారని, టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం మండల పరిధిలో ని మేజర్ పంచాయతీ మండగిరిలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్స్ కళా శాల వద్ద నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా పేల్చుతూ ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో జిల్లా కార్యద ర్శి శేషిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హా మీల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు. కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవన్నారు. రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దోపిడీకి పాల్పడ్డారని, జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు పేదల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని అన్ని వర్గాలకు మేలు చేకూరే విధంగా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకాలు ప్రయోజనాలను గుర్తించిన సీఎం చంద్రబాబు కాపీ కొట్టి పింఛన్ పెంచారని, పసుపు– కుంకుమ అంటూ మహిళలను, పెట్టుబడి సాయం అంటూ రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఆదోని అభివృద్ధికి అడ్డుపడ్డారు... తాను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉంటూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే అధికారపార్టీ నాయకులు అడ్డుపడ్డారని ఎమ్మెల్యే సాయి ఆరోపిం చారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి వి రుద్ధంగా ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులను తమ పా ర్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇచ్చారని విమర్శించారు. దీంతో టీడీపీ నాయకులు అధికార బలం చూపుతూ జేబులు నింపేసుకున్నారని ఆరోపించారు. మితిమీరిన అక్రమాల మూలంగానే స్థానికి నేతకు టి క్కెట్ కూడా రావడం లేదని, రాజధానిలో నిరీక్షిస్తున్నా డని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ సలహాదారుడు డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, మండల కన్వీనర్ గురునాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శేషిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కల్లుపోతుల సు రేష్, జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, రామలింగేశ్వర యాదవ్, పట్టణ అధ్యక్షుడు దేవా, పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎస్.నారాయణ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కురువ మహేష్, ముస్లిం మైనార్టీ నాయకు లు సయ్యద్ అహ్మద్, సునార్ అబ్దుల్ ఖాదర్, ఆర్టీసీ రెహ్మాన్, మండగిరి నాయకులు ఉసేనప్ప, ఉలిగప్ప, రవిశంకర్ యాదవ్, అలీదాస్, నర్సింహులు, గిరిజమ్మ, గిడ్డయ్య, దొమ్మరి లక్ష్మన్న, మాధవ్, చిన్న శీను, గాదిలింగ, మహేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. -
అధికార పార్టీ అడ్డదారి!
-
కాటేస్తున్న కల్తీ మద్యం
కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్నే కల్తీ చేస్తున్న వ్యాపారులు అనారోగ్యానికి కొనితెచ్చే మద్యాన్ని వదిలిపెడతారా...? కల్లు నుంచి ఖరీదైన మద్యం వరకు ప్రతి దాన్నీ కల్తీ చేసేసి మద్యం బాబుల నోట్లో పోస్తున్నారు. ఇలా తాగిన మద్యం వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది. మరికొందరి ప్రాణం తీస్తోంది. సమాచారం వస్తే తెలుసుకుని దాడులు చేయడం మినహా తనిఖీల ద్వారా కల్తీ మద్యాన్ని అధికారులు అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. కల్లు నుంచి ఖరీదైన మద్యం దాకా కల్తీ కాదేది కవితకు అనర్హమనేది పాత సామెత. కాదేది కల్తీకి అనర్హమనేది నేటి సామెతగా మారింది. కల్లు, సారా, చీఫ్ లిక్కర్ నుంచి ఖరీదైన మద్యం వరకు కల్తీ చేస్తున్నారు. నెలరోజుల క్రితం కర్నూలు నగర శివారులోని వీకర్‌సెక్షన్ కాలనీ సమీపంలో ఓ ఇంట్లో బ్రాండెడ్ మద్యం ఖాళీ సీసాల్లో కల్తీ మద్యాన్ని తయారు చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బాటిల్ రూ.వెయ్యికి పైగా ఉండే బ్రాండ్లన్నింటినీ అతను రెక్టిఫైడ్ స్పిరిట్‌తో తయారు చేస్తూ పట్టుబడటంతో ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో రంగన్న అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడు బయటి ప్రాంతం నుంచి సీసాలు, మూతలు తీసుకొచ్చి కల్తీమద్యం తయారు చేసి, బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నాడు. కోసిగి ప్రాంతంలోనూ ఆరు నెలల క్రితం పోలీసులు కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఆళ్లగడ్డలో ఓ వ్యక్తి మద్యంలో నీళ్లు కల్తీ చేసి విక్రయిస్తుండగా ఐదు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఇవే కాదు వెలుగులోకి రాని ఉదంతాలు చాలానే ఉన్నాయి. కల్తీ మద్యానికి అవసరమైన రెక్టిఫైడ్ స్పిరిట్‌ను వ్యాపారులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. 2015 లోనూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అమ్మకాలు వెలుగుచూసిన విషయం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల వ్యాపారులు ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. మద్యానికి బానిసవుతున్న యువత మద్యానికి పెద్దలే కాదు యువత కూడా బానిస అవుతోంది. టీనేజీ వయస్సు నుంచే దీనికి అలవాటుపడుతున్నారు. స్నేహితులతో సరదాగా మొదలయ్యే ఈ అలవాటు వారిని బానిసను చేస్తోంది. రోజూ రాత్రి ఇంటికి వస్తున్నారంటే వణికిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మద్యం తాగిన వ్యక్తి ఏ మూడ్‌లో వస్తాడో.. ఏం చేస్తాడోనన్న భయం పలు కుటుంబాల్లో ఉంది. యువత నుంచి వృద్ధుల వరకు మద్యానికి బానిసలుగా మారడంతో అటు ఆర్థికంగా మరోవైపు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. మద్యం వల్ల అనారోగ్య సమస్యలు కాలేయం, పాంక్రియాస్ దెబ్బతింటుంది. కాలేయం దెబ్బతిని లివర్ సిర్రోసిస్ వచ్చి మరణం సంభవిస్తుంది. గుండె పరిమాణం పెరిగి, గుండెపోటు వస్తుంది. జీర్ణకోశవ్యాధులు, అల్సర్ వంటి ఇబ్బందులు వస్తాయి. మెదడులో చురుకుదనం తగ్గుతుంది. మద్యం మత్తులో కుటుంబసభ్యులు, భార్యపై అనుమానం పెరుగుతుంది. ఈ కారణంగా ఆత్మహత్యలు, హత్యలు పెరిగే అవకాశం ఉంది. రోగనిరోధకశక్తి తగ్గిపోయి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. దాంపత్య జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపి, భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కారణం అవుతుంది. మద్యం మత్తులో ఉండటం వల్ల సరిగా కనిపించకపోవడం, వినిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను, మనుషులను గుర్తించలేకపోవడం వంటి సమస్యలు వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. -
అధికార పార్టీ అడ్డదారి!
సాక్షి, ఆదోని రూరల్: ఆడలేక మద్దెల ఓడమన్నట్టు.. ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశాలు పూర్తిగా దూరమవడంతో కుట్రలు, కుతంత్రాలకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. ఏదోవిధంగా మళ్లీ అధికారాన్ని చేపట్టాలనే దురుద్దేశంతో ఓటర్ల తొలగింపునకు పూనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఫారం – 7 ద్వారా ఆన్లైన్లో వైఎస్ఆర్సీపీ నాయకులే దరఖాస్తు చేసినట్లు కుతంత్రాలు చేశారు. ఆదోని పట్టణంలోని రెండు మీసేవా కేంద్రాలు అడ్డాగా టీడీపీ నాయకులు కుట్రలు పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని నియోజకర్గంలో ఇప్పటి వరకు ఫారం–7 దరఖాస్తులు 8,500 దాఖలు అయినట్లు సమాచారం. పట్టణ పరిధిలోని 21వ వార్డులో 229 నుంచి 235 వరకు 7 పోలింగ్ బూత్‌లకు సంబంధించి దాదాపు 400 ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఈ వార్డులో మొత్తం ఓటర్లు 6892మంది ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్ భీమా వెంకటలక్ష్మీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు కుట్రపన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదయ్తుల్లా, చిన్న స్వామి గౌడ్, భీమా, నర్సప్ప, బైచిగేరి రాముడు, చంద్రశేఖర్‌రెడ్డి పేర్ల మీద ఓట్లు తొలగించాలని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేశారు. దీంతో వారు ఏ మాత్రం తమ ప్రమేయమే లేదని, ఎవరు దరఖాస్తు చేశారో తేల్చాని తహసీల్దార్ విశ్వనాథ్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఫారం–7 దరఖాస్తులు వెల్లువెత్తడంతో అధికారులు సైతం అయోమయానికి గురయ్యారు. అదేవిధంగా తమ ప్రమేయం ఏ మాత్రం లేకుండా తాము దరఖాస్తు చేయడమేమిటని వైఎస్ఆర్సీపీ నాయకులు తహసీల్దార్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అప్పటికే అనుమానాలు రావడంతో తహసీల్దార్ ఈ నెల 3న(ఆదివారం) టూటౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 182, 419 అండ్ 66డి ఆఫ్ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పోలీసులు వాస్తవాలేంటో ప్రజల ముందు ఉంచే అవకాశం ఉన్నందున టీడీపీ నాయకులు ఎదురు దాడిని తీవ్రం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి దేశ పౌరుడిగా చెప్పుకోవాలంటే ఓటు హక్కు ఎంతో విలువైంది. నాకు పోలింగ్ బూత్ నంబర్ 229లో ఓటు హక్కు ఉంది. ఓటు హక్కును తొలగించేందుకు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలపై అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలి. –నాగరాజు, ఎస్కేడీ కాలనీ 7వ రోడ్డు ఇది టీడీపీ నాయకుల కుట్రే మా పోలింగ్ స్టేషన్ 232లో నాపేరు, నా ఫొటోతో 23మంది ఓట్లను తొలగించాలని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మా వార్డులో టీడీపీకి మెజారిటీ లేకపోవడంతో కుట్రలు పన్నుతున్నారు. ఏదోవిధంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. –చిన్న స్వామి గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు -
కర్నూల్లో దారుణం.. కన్నకూతురిపై దాడి
సాక్షి, కర్నూల్ : ఆదోనిలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై కత్తితో దాడిచేశాడో తండ్రి. కర్నూలు జిల్లా ఆదోని శంకర్ నగర్‌కు చెందిన అంజలి అనే యువతిపై ఆమె తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు అంటున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
భరించలేననని ఫోన్ చేసి చెప్పింది..
కర్నూలు, ఆదోని టౌన్: ఆదోని పట్టణంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్ ఎస్ఐ రామ్‌నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన బుజ్జమ్మ కూతురు శైలజ అదేవీధిలో నివాసముంటున్న టైలర్ పంపాపతి ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరుకావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలూ నిరాకరించాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి 2017 జూన్ 15న పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే ఆదోనికి వచ్చి బండిమిట్ట వీధిలో ఓ ఇల్లుకు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. వీరికి ఓ బాబు జన్మించాడు. భర్త ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ క్వారీలో పనిచేస్తూ భార్య, కొడుకును పోషిస్తున్నాడు. యథావిధిగా సోమవారం విధులకు వెళ్లాడు. అరగంటకే తాను చనిపోతున్నానని, కొడుకుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలని భార్య శైలజ (24) నుంచి తన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. కంగారు పడి ఇంటి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి అతడూ వెనక్కి వచ్చాడు. వారు వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేధింపులు భరించలేననని ఫోన్ చేసి చెప్పింది.. తన భర్త అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, ఇక కాపురం చేయడం తన వల్ల కాదని ఉదయం ఫోన్ చేసి చెప్పిందని శైలజ తల్లి బుజ్జమ్మ బోరున విలపించింది. తన కూతురిని అల్లుడే హత్య చేసి, ఆత్మ హత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అకృత్యంపై ఆగ్రహజ్వాల
ఆదోని అర్బన్/రూరల్ : అభం.. శుభం.. తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాపై కశ్మీర్లో జరిగిన లైంగిక దాడి, హత్యాకాండపై జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. శనివారం ఆదోనిలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల జనం నల్లబ్యాడ్జీలతో పట్టణంలోని పాత పోస్టాఫీసు నుంచి షరాఫ్ జార్, పీఎన్రోడ్, ఎంఎం రోడ్, కోట్ల కూడలి మీదుగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని అక్కడ బైఠాయించారు. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం మత పెద్దలు అలీఆజ్మీ అల్తాఫ్, ఖాజా అల్తాఫ్ హుసేన్, నాయకులు సౌదీ రవూఫ్, షఫీ, అప్సర్‌బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ఇక్బాల్, ఎజాజ్, సాయిరాం, నీలకంఠప్ప, దిలీప్దోఖా తదితరులు పాల్గొన్నారు. -
‘రైతురథం’ పచ్చ చొక్కాలకే
సాక్షి, ఆదోని: వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్లు ఇచ్చే రైతు రథం పథకం పచ్చచొక్కాలకే పరిమితమైందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకున్నా ట్రాక్టర్లు మంజూరు కావడం లేదన్నారు. ఈ విషయం పలువురు రైతులు తన దృష్టికి తీసుకురావడంతో ఒక్కో ట్రాక్టర్‌పై రూ. లక్ష సబ్సిడీతో నియోజకవర్గంలోని 20 మందికి ఇప్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అలసందగుత్తి గ్రామానికి చెందిన రైతు ఉరుకుందప్పకు ట్రాక్టర్ అందజేశారు. అన్నదాత ఆనందంగా ఉండటం కోసం ఆ సబ్సిడీ మొత్తాన్ని ట్రాక్టర్ కంపెనీకి తానే చెల్లిస్తానన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పార్టీలకతీతంగా రైతు రథం కింద ట్రాక్టర్లు మంజూరు చేయాలని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పార్టీలకతీతం సంక్షేమ పథకాలు మంజూరయ్యాయన్నారు. బాబు పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెద్దయ్య, మాజీ సర్పంచ్ పెద్ద పెద్దయ్య, ఉప సర్పంచ్ బసరకోడు ఈరన్న, పెద్దయ్య, రైతులు పాల్గొన్నారు. -
11మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఆదోని: ఓపక్క అరెస్టులు జరుగుతున్నాక్రికెట్ బెట్టింగ్‌లు ఆగడంలేదు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఆదోనిలోనూ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు సోమవారం రట్టు చేశారు. 11మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.3.65 లక్షల నగదును, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఖైదీ పరారీ
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డుకు చెందిన బోయ వీరేష్(20) అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వీరేష్ 2015లో స్థానిక త్రీ టౌన్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. అప్పట్లో రిమాండ్‌కు ఆదేశించింది. అప్పటి నుంచి ఆదోని సబ్‌జైలులో ఉంటున్నాడు. గురువారం తీర్పు ఉండడంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు. ఆదోని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిరాం కేసు పూర్వపరాలను పరిశీలించి..అతనికి ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. దీంతో వీరేష్‌ను త్రీటౌన్ పోలీసులు భాస్కర్,సురేష్ సబ్ జైలుకు తరలిస్తుండగా.. వారి కళ్లు కప్పి పరారయ్యాడు. ఖైదీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
టీడీపీకి చరమగీతం పాడుదాం
- మూడేళ్లలో ఒక్క అభివృద్ధీ లేదు - రుణమాఫీ పేరుతో మోసం - జన్మభూమి కమిటీలదే పెత్తనం - రాజ్యాంగ విరుద్ధంగా నిధుల కేటాయింపు - నారాయణరెడ్డిది రాజకీయ హత్యే - ఆదోని ప్లీనరీలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆదోని: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీడీపీకి చరమగీతం పాడుదామని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని పట్టణం బాబా గార్డెన్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు పట్టణంలో పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లీనరీలో ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రసంగించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. ఆదోని డివిజన్‌కు పరిశ్రమలు రాలేదని, రోడ్లు వేయలేదని గుర్తు చేశారు. పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని.. అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజలలో కలుగుతోందన్నారు. అధికారం ఉందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజలుఅంతా గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యేలకు కాకుండా రాజ్యంగ విరుద్ధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు నిధులు కేటాయిస్తున్నారని.. జన్మ భూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోసం బట్టబయలు రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను, రైతులు మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా ఏ హామీ నెరవేరకపోవడంతో తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే బాగుపడాలనే దుర్మార్గపు ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీపై పెరుగుతున్న అసంతృప్తి.. చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో విసిగి వేశారి పోయిన ప్రజలు నాటి వైఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే, ప్లీనరీ సమావేశం పరిశీలకుడు బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పింఛన్, రేషన్ కూడా సకాలంలో అందడం లేదన్నారు. టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, మూడోసారి కూడా తామే గెలుస్తామని చెప్పారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, పోలీసు కేసులకు తామెప్పుడు భయపడబోమన్నారు. తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలబడుతామని భరోసానిచ్చారు. చంద్రబాబు పాలనలో కరువు వైఎస్ హయాంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షమైన జీవితం గడిపితే.. చంద్రబాబు హయాంలో వర్షాలు కనుమరుగై కరువు తాండవిస్తోందని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్క ఫోన్ కొడితే తాగునీరు ఇంటికి చేరుతోందని చెపుతున్నారని, అయితే ఆలూరనులో పది రోజులైనా బిందెడు నీరు దొరకని పరిస్థితి ఎందుకు నెలకొందని ఆయన ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వండని ఆందోళన చేసిన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడం... ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక.. నిరుద్యోగులకు కాకుండా తన కుమారుడు నారా లోకేష్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ దౌర్జనాలకు భయపడేది లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరకులపాడు నారాయణరెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేక దారుణంగా హత్య చేయించారన్నారు. చంద్రబాబు సహకారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. -
మహిమాన్వితురాలు..మహాయోగి లక్ష్మమ్మ
- నేడు ఆదోనిలో మహారథోత్సవం ఆదోని: మహాయోగి లక్ష్మమ్మ అవ్వ.. ఓ దళిత మహిళ. తన మహిమలతో సమసమాజం కోసం కృషి చేశారు. అవధూతగా ఆమె లక్షల మంది నీరాజనాలు అందుకుంటున్నారు. కొలిచేవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహిమాన్వితురాలి మహా రథోత్సవం ఆదోని పట్టణంలో గురువారం సాయంత్రం 3 గంటలకు జరగనుంది. గురువారం రోజు తెల్లవారుజాము నుంచే అవ్వ దర్శనం కోసం భక్తులు బారులు తీరనున్నారు. అంతకు ముందు అవ్వ మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అవ్వ బృందావనాన్ని , మూల విరాట్‌కు బెంగళూరు నుంచి తెప్పించిన పూలతో అలంకరిస్తారు. మహా రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని అవ్వ ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. అవ్వ చరిత్ర ఇదీ... మహాయోగిని లక్ష్మమ్మ అవ్వకు ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలం ముసానపల్లె గ్రామానికి చెందిన దళిత దంపతులు మంగమ్మ, బండెప్పల రెండో కుమార్తె చిన్న లక్ష్మమ్మ. ఆమెకు యుక్త వయస్సు రాగానే కర్ణాటకలోని ఇమ్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కారణ జన్మురాలైన లక్ష్మమ్మ సాధారణ మహిళగా జీవనం సాగించలేక పోయింది. సమసమాజ స్థాపనతో పాటు ప్రేమ, దయ, దానం, ధర్మం, ఆధ్యాత్మికతను పాదుగొలిపేందుకు ఆమె నడుం బిగించారు. తాను ఆశించిన సమాజం ఆవిష్కరణ కోసం ఎన్నో మహిళలు ప్రదర్శిస్తూ ఊరూరు తిరిగారు. ఎంతో మందిలో మార్పు తెస్తూ ఆదోనికి చేరారు. తాను సంకల్పించిన సమాజం ఆవిష్కారానికి బీజం పడిందని తెలుసుకున్న మహా సాద్విని 1933 మే నెల16వ తేదీన పరబ్రహ్మతో లీనమయ్యారు. తాము కోరిన కోర్కెలను తీర్చిన అవ్వ ఇకలేరని తెలుసుకున్న లక్షలాది మంది భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె పరబ్రహ్మలోలీనమైన చోటే బృందావనం ఏర్పాటు చేశారు. కారుణ్యమూర్తి అయిన అవ్వ పరబ్రహ్మలో లీనమైన రోజు వైశాఖ బహుళ సప్తమినాడు మహారథోత్సవం నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతో వెండి రథం భక్తుల సహకారంతో ఆలయం నిర్వాహకులు 85 ఏళ్ల క్రితం వెండి రథం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ రథంలోనే ఆవ్వ ఊరేగుతున్నారు. అవ్వ మూల విరాట్, ఉత్సవ విగ్రహంతో పాటు ఆలయంలోని అవ్వ గర్భగుడి, బృందావనానికి కూడా వెండి తొడుగులు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు రాచోటి కుటుంబానికి చెందిన వారు ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. రథోత్సవం అగ్రభాగాన దళితులు అవ్వ రథోత్సవంలో ముసానపల్లికి చెందిన దళితులు అగ్రభాగాన కొనసాగుతారు. దళితులు రథోత్సవంలో అగ్రభాగాన ఉండడం అవ్వ సంకల్పంగా పేర్కొంటారు. దళిత ముత్తయిదువులు కళశాలతో కొనసాగగా.. పురుషులు కాషాయం జెండాలతో నడుస్తారు. ఉదయమే పల్లకోత్సవంతో ముసానపల్లె నుంచి ఊరేగింపుగా వచ్చి ఆలయానికి చేరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముసానపల్లెలో కూడా ఆలయం నిర్మించారు. అక్కడ కూడా మహా యోగిని నిత్య పూజలు అందుకుంటున్నారు. రూ.కోటితో అవ్వ మహాద్వారం ఆదోని పట్టణంలోని ఆలూరు రోడ్డులో రూ.కోటితో అవ్వ మహాద్వారం నిర్మించారు. త్వరలోనే మహా ద్వారానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. పట్టణానికి మహా ద్వారం ఎంతో అందం తెచ్చి పెట్టింది. పట్టణానికి వచ్చే వారికి అవ్వ ఆహ్వానం పలుకుతున్నట్లు ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. అవ్వ సంకల్పం మేరకు సామాజిక కార్యక్రమాలు: అవ్వ సంకల్పం మేరకు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భక్తులు కూడా అవ్వ సన్నిధిలో చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. గురువారం జరిగే మహారథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నీడ కోసం షామియానాలు, దాహార్తి తీర్చేందుకు తాగునీరు ఏర్పాటు చేశాం. జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు. - రాచోటి రామయ్య, అవ్వ ఆలయం వంశపారంపర్య ధర్మకర్త -
నీళ్లడిగితే అక్రమ కేసులా?
► అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా ► ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ఆదోని ఎమ్మెల్యే మండిపాటు ఆదోని టౌన్: ‘ఎండలు మండిపోతున్నాయి. ప్రజలతోపాటు పశువులు దాహంతో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వాలని అధికారులను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు బనాయిస్తారా?’ అంటూ అధికారుల తీరుపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కార్యాలయాల్లో ఫ్యాన్ల కింద కూర్చుంటే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొంతులెండిపోతున్నాయని, గుక్కెడు నీళ్లివ్వాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సహనం కోల్పోయిన ఢణాపురం మహిళలు, సర్పంచు ఈరన్నగౌడ్, నాయకులు వీరయ్య, నర్సింహస్వామి బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం సబబు కాదన్నా రు. అధికారుల తీరుపై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రస్తు తం జిల్లా కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సర్పంచ్ ఈరన్నగౌడు, ఆందోళనకారులు వైఎస్ఆర్సీపీ కావడంతోనే అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను విత్‌డ్రా చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అధికారులు పక్షపాతం వీడకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేషిరెడ్డి పాల్గొన్నారు. -
వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన ఎంపీ.
-
మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతా
–ఎంపీ బుట్టా రేణుక ఆదోని: ఆదోని రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్‌తో బెంచీలు కొనుగోలు చేసి స్టేషన్‌లోని విశ్రాంతి గదిలో ఏర్పాటు చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితో కలిసి వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆçదోని, కర్నూలు, మంత్రాలయం రెల్వే స్టేషన్లలో బెంచీల కోసం రూ.7.73లక్షలు మంజూరు చేశానన్నారు. ఇందులో సగం కుషన్ చైర్లు కాగా మిగిలినవి మెటల్ బెంచీలన్నారు. క్రాంతినగర్ వాసుల వినతి మేరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని, ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చిస్తున్నట్లు తెలిపారు. స్టేషన్లో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు మంజూరు చేస్తామని, ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని డీఆర్ఎం అమితాబ్ ఓఝాకు సూచించారు. అంచనా మేరకు కలెక్షన్్స రాలేదని ఆదోని మీదుగా తిరిగే రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను అధికారులు రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే పునరుద్ధరించి కనీసం ఏడాది పాటు కొనసాగించాలని, అప్పటికీ కలెక్షన్్స రాకపోతే రద్దు విషయమై ఆలోచిద్దామని డీఆర్ఎంకు సూచించారు. రాష్ట్ర రాజధాని విజయవాడకు ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం సీహెచ్ రమేష్, స్టేషన్ మాస్టరు వెంకటేశ్వర్లు, కమర్షియల్ విభాగం సూపర్వైజర్ లక్ష్మయ్య, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, రాముడు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం
- డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు - బుకీ అరెస్ట్, 1.50 లక్షలు స్వాధీనం ఆదోని టౌన్: పట్టణంలో కొంతకాలంగా హైటెక్ స్థాయిలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో బెట్టింగ్ లావాదేవీలు కొనసాగిస్తున్న శివశంకర్ నగర్‌కు చెందిన బోయ తుకారాంను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. బోయ తుకారాం కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.. ఎస్కేడీ కాలనీ మూడవ రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కొంతమంది యువకులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ ఘంటా సుబ్బారావు, ఎస్ఐ రమేష్‌బాబు, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. బెట్టింగ్‌లో గెలుపొందిన నిర్వాహకులకు రహస్యంగా పేమెంట్ చేయడం, బెట్టింగ్ కట్టిన నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి 1,48,560 నగదు, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ వేలకు వేలు గడిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్రికెట్ , మట్కా, పేకాటపై నిఘా పెంచామని, ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా గోపాల్‌రెడ్డి
ఆదోని టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ఆదోనికి చెందిన ఎస్ గోపాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఆదివారం ఆదోనిలో రాజశ్రీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్‌రెడ్డి మాట్లాడారు. మూడేళ్లుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశానన్నారు. పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పదవిని ఇచ్చిందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణమున్నంతవరకు సాయిప్రసాద్‌రెడ్డిని వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. సమావేశంలో కల్లుబావి వార్డు ఇన్చార్జ్ నాయకులు వీరభద్రారెడ్డి, మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. -
చీరకట్టి ..మొక్కు తీర్చి
- సంతెకొడ్లూరులో వింత ఆచారం - భక్తి శ్రద్ధలతో కామప్ప దహనం ఆదోని రూరల్: కొరికలు నెరవేరితే సాధారణంగా కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, జంతుబలి ఇవ్వడం పరిపాటి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఆదోని మండలం సంతెకొడ్లూరు వాసులు ఏడాదిలో ఓ ప్రత్యేక దినాన ఆడవారిగా మారుతారు.. కోరికలు నెరవేర్చిన దేవునికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది బయటి వారికి వింతగా అనిపించినా గ్రామంలో అనాది నుంచి వస్తున్న ఆచారమని కామప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు సాగర్శరణ బసప్ప చెబుతున్నారు. ఏటా రంగోలి(కామప్ప పౌర్ణమి)ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆరాధ్యదైవం రతీమన్మధ స్వామి(కామప్ప)కి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొదటిరోజు ఆదివారం రతీమన్మధులకు పూజా కార్యక్రమాలతో పాటు గుర్రాలు, ఏనుగుల ప్రదర్శనలు చేపట్టారు. రెండో రోజు సోమవారం ఉదయం హరిజనవాడ నుంచి నిప్పును తీసుకొచ్చి గుంతలో వేసి కామప్పను దహనం చే శారు. సాయంత్రం శస్త్రం వేయుట, బొమ్మల ప్రదర్శన, వివిధ వేషధారణలో కామప్ప శవయాత్ర (విమాన్ ప్రదర్శ) తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఎద్దుల సంత నిర్వహణ స్వామివారి రథోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఎడ్ల సంతను నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా అమ్మకానికి ఎడ్లను ఈ సంతకు తీసుకొస్తున్నారు. మూడు రోజులపాటు ఈ సంత జరుగుతోంది. ఇక్కడ ఎడ్లను కొన్నట్లైతే వాటికి అనారోగ్యం రాకుండా ఉండడమే కాకుండా పంట దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని భక్తుల నమ్మకం. -
జీరో’ బంగారు వ్యాపారానికి చెక్
- పోలీసుల అదుపులో ఇద్దరు గుమస్తాలు - 24.10 లక్షలు స్వాధీనం ఆదోని టౌన్: ఆదోని పట్టణంలో జీరో బంగారు వ్యాపారం చేస్తున్న వ్యాపారుల ఆట కట్టించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం మేరకు ఎస్ఐలు బాబు, సునీల్‌కుమార్, హరిప్రసాద్ ఉదయం ఏడు గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బెంగళూరు ట్రైన్ కదిలే సమయంలో హడావుడిగా ఎక్కుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా రూ. 6 లక్షలు బయటపడ్డాయి. విచారించగా ఖాజీపురానికి చెందిన సిరాజ్ అహ్మద్, జంఖాన్ వాడీకి చెందిన అబ్దుల్ ఖాదర్‌గా తేలింది. బంగారు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం 6 లక్షలతో ఇద్దరు వ్యక్తులు ఎలా వెళ్తారని, మిగతా డబ్బు ఎక్కడ దాచారని నిలదీయడంతో చొక్కా దిగువన లోపలి వైపు ప్రత్యేకంగా కుట్టిన జేబులను చూయించారు. జేబుల్లో డబ్బు కట్టలు పేర్చి ఇన్ షర్ట్ చేయడంతో పోలీసులు గుర్తించలేక పోయారు. నిందితులు డబ్బుల కట్టలు ఒక్కక్కటి బయటకు తీశారు. మొత్తం రూ. 24.10 లక్షలు బయటపడ్డాయి. వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ నిమిత్తం డబ్బును ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేసి పూర్తి స్థాయి విచారణ చేపడుతామన్నారు. సమావేశంలో సీఐలు గంటా సుబ్బారావు, రామానాయుడు, చంద్రశేఖర్, ప్రత్యేక బృందం అ«ధికారులు పాల్గొన్నారు. -
క్షణికావేశానికి దంపతులు బలి
- మంటల్లో చిక్కుకున్న భార్యాభర్తలు - చికిత్సపొందుతూ మృతి - ఆదోని పట్టణంలో విషాదం ఆదోని టౌన్ : క్షణికావేశానికి రెండు నిండు జీవితాలు బలయ్యాయి. దంపతులు అమరేష్(28), కళావతి(25) మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని హనుమాన్ నగర్లో శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, మృతుల బంధువులు అందించిన వివరాల మేరకు..పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన అమరేష్‌తో అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల కేంద్రానికి చెందిన కళావతితో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. దాదాపు ఏడాది పాటు ఇరువురి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగింది. స్థానికంగా హోటల్లో పని చేస్తున్న అమరేష్ తాగుడుకు అలవాటు పడడంతో కుటుంబం ఆర్థికంగా దివాలా తీసింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబంలో అలజడి, గొడవలు మొదలయ్యాయి. తాగుడు మానుకోమని భార్య చెప్పినా వినక పోవడంతో తరుచుగా గొడవలు కూడా జరిగేవి. ఈ నేపథ్యంలో ఓ పూట తిని మరో పూట పస్తులతో గడుపుతున్న కళావతి.. తన పరిస్థితిని తల్లిదండ్రులు సరోజమ్మ, చంద్రశేఖరయ్యకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. తాగుడును మాన్పిస్తే అంతా సర్దుకుపోతోందని తల్లిదండ్రులు చెప్పేవారు. అయితే భర్తలో మార్పు తేవడం ఆమెకు అసాధ్యం అయింది. కూతురు పస్తులు చూడలేక తల్లిదండ్రులు ఇటీవలె బియ్యం, కంది పప్పు కొంత నగదు కూడా ఇచ్చి పంపారు. అయితే వాటిని కూడా అమరేష్ మార్కెట్లో అమ్మేసి తాగుడుకు ఖర్చు పెట్టాడు. దీంతో ఆమెలో అసహనం, కోపం, ఆవేశం తీవ్ర స్థాయికి చేరింది. ఈ విషయమై శుక్రవారం ఇరువురు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డట్లు ఇరుగు పొరుగు వారు చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గొడవ తరువాత కొద్దిసేపటికి ఇంట్లో చుట్టుముట్టిన మంటలతో ఇరువురు ఆర్తనాదాలు పెట్టడం చూసి తలుపులు పగులగొట్టి వెంటనే మంటలను ఆర్పేశామని స్థానికులు తెలిపారు. ఇరువురు మంటల్లో ఎలా చిక్కుకున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ రామానాయుడు, ఎస్ఐ మన్యథ విజయ సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇరువురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కళావతి మృతి చెందంగా.. రాత్రి 7.30 గంటల సమయంలో అమరేష్..ఈ లోకాన్ని వీడారు. భర్తే చంపేశాడు తన కూతురు కళావతిని భర్త అమరేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడని తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో రూ. 60వేలు నగదు, 5 తులాలు బంగారం కట్నంగా ఇచ్చామని, చాలా సార్లు బియ్యం, కంది పప్పుతో పాటు ఇతర వంట దినుసులు కూడా పంపామని, అయినా తమ కూతురు లోకం విడిచి వెళ్లిపోయి తమకు తీరని కడుపు కోత మిగిల్చిందని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సీఐ రామానాయుడు తెలిపారు. -
పత్తి ధర మళ్లీ పతనం
- కనిష్టం రూ. 4,100 - గరిష్టం రూ.5,930 - రూ.20 లక్షలు నష్టపోయిన రైతులు ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర మళ్లీ పతనమైంది. మూడు రోజుల్లో క్వింటా ధర రూ.300 వరకు తగ్గింది. గత పక్షం రోజులుగా క్వింటా రూ. 6 వేలకు పైగా పలుకుతూ స్థిరంగా కొనసాగింది. ధర తగ్గు ముఖం పట్టడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. శనివారం వరకు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ వారం ప్రారంభం రోజు సోమవారం యార్డుకు 11,641 క్వింటాళ్లు, మంగళవారం..13,088 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటా ధర కనిష్టం రూ.4,100, గరిష్టం రూ. 5,930 పలికడంతో బుధవారం 6,344 క్విటాళ్లు మాత్రమే తీసుకొచ్చారు. ధర తగ్గడంతో ఒక్క రోజే రైతులు దాదాపు రూ.20 లక్షలు నష్టపోయారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కొంత మేర తగ్గడంతో ఆ ప్రభావం ఆదోని యార్డుపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వేరుశనగ రైతుకు ఊరట ఆదోని మార్కెట్లో వేరుశనగ ధర స్వల్పంగా పెరిగింది. వారం క్రితం క్వింటా కనిష్టం రూ.3,186, గరిష్టం రూ. 5,263 పలుకగా బుధవారం కనిష్టం రూ.3,059, గరిష్టం రూ.5,759 పలికింది. అయితే రైతుల వద్ద దిగుబడులు పెద్దగా లేవు. తమ వద్ద నిల్వలు లేనప్పుడు ధర పెరిగితే తమకేమి ప్రయోజనమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన ధరకు అమ్ముకున్న రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యార్డుకు 841 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. రబీలో సీజన్లో భాగంగా నవంబరులో బోరు బావుల కింద వేరుశనగ సాగు చేసిన రైతులు పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్లో ధర బాగుండడంతో చేతికి అందిన దిగుబడులను వెంటనే మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. కనిపించని పప్పుశనగ ఆదోని మార్కెట్ యార్డులో పప్పు శనగ దిగుబడులు కనిపించడంలేదు. మూడేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాళ్ల పప్పు శనగలు యార్డుకు అమ్మకానికి వచ్చేవి. ఈ ఏడు కూడా డివిజన్లో 20 వేల హెక్టార్లకు పైగా పంట సాగు చేశారు. అయితే నవంబరు నుంచి వాన చినుకు లేకపోవడంతో విత్తనం మొలకెత్తలేదు. మొలకెత్తిన పొలాల్లో మొక్కలు ఎండి పోయాయి. కనీసం విత్తనం ఖర్చు కూడా రైతులకు గిట్టుబాటు కాలేదు. దీంతో యార్డులో ఎక్కడా ఒక్క కిలో కూడా పప్పు శనగ అమ్మకానికి రాలేదు. -
ఆదోని మార్గంలో నాలుగు రైళ్ల దారిమళ్ళింపు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మార్గంలో ప్రయాణించే నాలుగు రైళ్లను గురువారం నుంచి 4 వ తేదీ వరకు దారిమళ్ళించారు. వాడి, రాయచూరు ప్రాంతాల్లో డబుల్ లైన్ పనులు జరుగుతుండడం వల్ల పూణె నుంచి రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నం.16381 ముంబయి కన్యాకుమారి రెండు రోజులు, నం.11013 కుర్ల ఎక్స్‌ప్రెస్ మూడు రోజులు, నం.12164 చెన్నై ఎక్స్‌ప్రెస్ రెండు రోజులు, నం.16382 కన్యాకుమారి ముంబయి ట్రైన్లు పూణె నుంచి మేరేజ్, బళ్లారి, గుంతకల్ మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల మార్పులను గమనించాలని అధికారులు కోరారు. -
లక్ష్మమ్మవ్వ సేవలో భన్వర్‌లాల్
ఆదోని అర్బన్: శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్, ఆయన సతీమణి మణి సోమవారం దర్శించుకున్నారు. దేవాలయం ధర్మకర్త రాచోటి రామయ్య వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం భన్వర్‌లాల్ దంపతులను శాలువా, పూలమాలతో సన్మానించారు. అక్కడి నుంచి వీరు మంత్రాలయం బయలుదేరి వెళ్లారు. -
మాస్‌లీవ్‌పై ట్రాన్స్‌కో ఏఈలు
ఆదోని రూరల్ : ఆదోని డివిజన్ పరిధిలోని 17మండలాల ట్రాన్స్‌కో ఏఈలు, ఏఏఈలు 18మంది శుక్రవారం మాస్ లీవ్ ప్రకటించారు. డీఈ అంజన్ కుమార్ డివిజన్ పరిధిలోని ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలకు సమావేశం నిర్వహించేందుకు పిలిపించారు. తమకు పనిభారం పెరిగిందని, అందువల్ల తమ సమస్యను విన్నవిస్తామని అందుకు సమయం కేటాయించాలని డీఈని కోరగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చేతనైతే పనిచేయండి..లేకపోతే సెలవులో వెళ్లండని ఏఈలపై విరుచుకుపడుతూ చులకనగా వ్యవహరించడంతో డివిజన్లోని 18మంది ఏఈలు మనస్థాపం చెందినట్లు తెలిపారు. దీంతో మూకుమ్మడిగా మాస్ లీవ్ తీసుకొని వెళ్తున్నామని ఏఈలు, ఏఏఈలు సమావేశాన్ని బాయ్‌కట్ చేశారు. డీఈ కార్యాలయ ఆవరణలో సమావేశమై ఆందోళన చేపట్టారు. అనంతరం వారు సమావేశం నిర్వహించి మాస్ లీవ్‌లో వెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌లతో పాటు డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా మండలాల్లో సిబ్బంది ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, లైన్మెన్లు లేకపోవడం వల్ల చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏఈలే చూడాల్సి వస్తోందని, దీంతో పనిభారం పెరిగి డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. డీఈకి విన్నవించుకున్నామంటే ముందుగానే డీఈ కించపరుస్తూ మాట్లాడారని ఏఈలు ఆరోపించారు. కార్యక్రమంలో ఏఈలు మద్దిలేటి, నాగభూషణం, నాగరాజు, చెన్నయ్య, సంతోష్, సురేష్ రెడ్డి, నర్సన్న, మోహన్ రావు, రామాంజినేయులు, నారాయణ స్వామినాయక్, రేఖ, శేఖర్ బాబు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసులో విజిలెన్స్ తనిఖీలు
ఆదోని టౌన్ : ఆదోని హెడ్ పోస్టాఫీసులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు అమరనాథ్, మధుసూదన్ రెడ్డి, డివిజనల్ ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథ్ రికార్డులను పరిశీలించారు. గతనెల 9వ తేది నుంచి 24వ తేదివరకు జరిగిన పెద్దనోట్ల లావాదేవీలపై తనిఖీ చేసినట్లు అమరనాథ్ తెలిపారు. డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, కర్నూలు నర్సింగరావుపేట పోస్టాఫీసుల్లో తనిఖీలు పూర్తయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సీల్డు కవర్లో పంపినట్లు తెలిపారు. -
మోడల్ మార్కెట్‌గా ఆదోని
- మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జున రావు ఆదోని: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు. బుధవారం ఆయన మార్కెట్ యార్డును పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రైతులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి, ఇతర మార్కెట్లలో ధరలు తెలుసుకునేందుకు..ఆరు డిస్ప్లే బోర్డులు, తాగునీటి సౌలభ్యం కోసం ఆరు ఆర్ఓ ప్లాంట్లు, సబ్సిడీ భోజనం మెస్, టాయిలెట్లు , సీసీ కెమెరాలుడిసెంబర్ లోపు ఏర్పాటు చేస్తామని వివరించారు. యార్డుల్లో పదిశాతం పేమెంట్లు మాత్రం నగదు రూపంలో నిర్వహించి మిగిలిన మొత్తానికి చెక్కులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 320 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో 50 యార్డులలో పేమెంట్ సమస్య ఎదురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చిల్లరనోట్ల కొరత కారణంగా నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలో మరో 20 రైతు బజార్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2014–15లో సీసీఐ ద్వారా పత్తికొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వారిలో 92 మంది మార్కెటింగ్ శాఖకు చెందిన వారిగా గుర్తించి ఆర్టికల్ ఆఫ్ చార్జ్‌మెమో జారీ చేçశామని చెప్పారు. దోషులుగా తేలితే అక్రమాలకు సంబంధించిన మొత్తంను రికవరీ చేయడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఏడీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఆదిశేషులు, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, డైరెక్టర్లు రంగస్వామి, యువరాజ్ పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో ఆదోని ఫస్ట్
టౌన్ ప్లానింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి ఆదోని టౌన్: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో రీజియన్‌లో ఆదోని, ప్రొద్దుటూరు ప్రథమ స్థానంలో నిలిచాయని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన సహచర ఉద్యోగులతో కలిసి ఆదోని మున్సిపాలిటీని సందర్శించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్పరి బైపాస్ రోడ్డును పరిశీలించారు. పట్టణంలో పలు వార్డుల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఆస్తులు, కట్టడాలను పరిశీలించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ సెక్షన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 10,346 దరఖాస్తుల్లో 5వేలు పరిష్కారమయ్యాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.496 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. క్రమబద్ధీకరణ చేసుకోని యజమానులు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని త్వరగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఆస్తులపై పన్నులు రెట్టింపు విధించడం లేదా భవంతులు కూల్చివేయడం జరుగుతుందన్నారు. భవంతుల నిర్మాణం, ఇతరత్రా వాటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి 24గంటల్లోగా అనుమతి లభిస్తుందన్నారు. ఆన్లైన్లో మంజూరు మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా భవంతులు నిర్మించుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టీపీఏలు భాస్కర్, జయరామ్, ఆదోని టౌన్‌ప్లానింగ్ అధికారి మహబూబ్ బాషా ఉన్నారు. -
జిల్లాలో ఆదోని మున్సిపాలిటీ బెస్ట్
– ఎమ్మిగనూరు అధ్వానం – కేంద్రకమిటీ ప్రత్యేక బృందం సభ్యుల వెల్లడి ఆదోని టౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆదోని మున్సిపాలిటీ బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కేంద్ర కమిటీ సభ్యుడు విజయ్ తెలిపారు. సామూహిక, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్వహణపై కొన్ని మార్పులు, చేర్పులు జరిగినట్లయితే ఆదోని పరిశుభ్రతలో మంచిఫలితాలు సాధించవచ్చని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర కమిటీ ప్రత్యేక బృందం శుక్రవారం ఆదోనిలో పర్యటించింది. అనంతరం కమిటీ సభ్యుడు విజయ్ విలేకరులతో మాట్లాడారు. భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆరుబయట మలమూత్ర విసర్జన లేకుండా చేయడమే స్వచ్ఛభారత్ లక్ష్యమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నంద్యాల, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కర్నూలు, ఆదోని మున్సిపాలిటీలలో పర్యటించామని చెప్పారు. శనివారం డోన్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే అన్ని మున్సిపాలిటీల కన్న ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఆరుబయట మలమూత్ర విసర్జన ఎక్కువగా ఉందని, శానిటేషన్ సైతం అధ్వానంగా ఉందని చెప్పారు. ఆదోని పట్టణంలో 9ప్రాంతాల్లో పర్యటించామని, అందులో కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ప్రాంతాలు ఉన్నాయని అయితే వాటిని బాగు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ధర తెల్లబోయింది!
– ఆదోని యార్డులో పతనమైన పత్తి ధర ఆదోని: పత్తి ధర ఒక్కసారిగా పతనమైంది. సోమవారం క్వింటా రూ.3,999-రూ.5,150 మధ్య పలకడంతో మోడల్ ధర రూ.4,891లుగా నమోదయింది. గత వారం చివరి రోజుతో పోల్చుకుంటే క్వింటాపై రూ.400 తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక దశలో వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ ఆవేదనకు లోనయ్యారు. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో దూది కండి(356 కిలోలు)పై వెయ్యి రూపాయల దాకా.. పత్తి గింజలు క్వింటాపై రూ.200 పైగా తగ్గడంతో స్థానిక మార్కెట్‌పైనా ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు రోజుల విరామం తర్వాత యార్డుకు 17,577 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. క్వింటాపై రూ.500 పైగా ధర తగ్గడంతో రైతులు దాదాపు రూ.కోటి మేర నష్టపోయారు. దసరాతో ఆనందం ఆవిరి దాదాపు పక్షం రోజుల క్రితం యార్డులో క్వింటా ధర గరిష్టంగా రూ.6,800 వరకు పలికింది. దీంతో దసరా పండుగను రైతులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అయితే అప్పటికి రైతుల చేతికి పత్తి దిగుబడులు పూర్తిగా అందలేదు. ప్రస్తుతం గరిష్టస్థాయిలో పత్తి కోత సాగుతోంది. క్వింటాళ్ల కొద్దీ పత్తి రైతుల ఇళ్లకు చేరుతోంది. ఆర్థిక అవసరం ఉన్న రైతులు వెంటనే అమ్మకానికి యార్డుకు తెస్తున్నారు. అయితే దసరా అనంతరం క్రమేణా పత్తి ధరలు పతనమవుతున్నాయి. దసరా ముందు రోజుతో పోలిస్తే క్వింటాపై దాదాపు రూ.1500 దాకా రైతులు నష్టపోతున్నారు. ధరల పతనంతో దసరా పండుగతోనే తమ ఆనందం ఆవిరవుతూ వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పత్తి ధరలు రూ.5,800 దాకా పలుకుతుండగా.. ఆదోనిలో మాత్రం బాగా తగ్గిపోయిందని, వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని దేవనకొండ మండలానికి చెందిన రైతు బసప్ప ఆరోపించారు. -
ఆదోని యార్డులో రూ.10.5 కోట్ల వ్యాపారం
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడుల వ్యాపారం జరిగింది. దాదాపు రూ.10.55 కోట్ల దిగుబడులు అమ్మకానికి వచ్చినట్లు అంచనా. యార్డు చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయిలో క్రయ, విక్రయాలు జరగడం ఇదే ప్రథమం. అత్యధికంగా పత్తి దిగుబడులు 18,448 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలు రూ.4050– రూ.5670 మధ్య ధర పలికింది. మోడల్ ధర రూ.5419గా రికార్డయింది. ఈ లెక్కన పత్తి వ్యాపారమే రూ.9.9కోట్లకుపైగా సాగినట్లు వ్యాపార వర్గాలు అంచనా. మిగతా వాటి మోడల్ ధరను తీసుకుంటే వేరుశనగ రూ.4492, ఆముదం రూ.2912 పలికింది. మొత్తంగా రూ.10.55 కోట్లు వ్యాపారం జరిగినట్లు యార్డు అధికారులు తెలిపారు. అయితే టెండర్లు ఖరారులో జాప్యం కారణంగా పత్తి తూకాలు సగానికి పైగా శుక్రవారానికి వాయిదా పడ్డాయి. -
కోరలు చాచిన కరువు
– పశ్చిమ ప్రాంతాన్ని కరుణించని వరుణుడు – ఆదోని డివిజన్లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం – పూర్తిగా ఎండిన వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర పంటలు – కర్నూలు డివిజన్‌లోనూ వర్షాలు నామమాత్రమే... కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాను కరువు కమ్మేస్తోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసినా పూర్తి స్థాయిలో ప్రయోజనం లేదు. జిల్లాలో రెండు రోజుల పాటు నమోదైన వర్షంపాతం ఎండుతున్న పంటలను కాపాడలేకపోయింది. ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్లలోని పలు మండలాల్లో ఆగస్టు నెలలో వర్షాలు నామమాత్రంగా పడటంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆదోని డివిజన్లో ఖరీఫ్ పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఆదోని డివిజన్‌పైనే దష్టి సారించింది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లకు చెందిన నోడల్ ఆఫీసర్లు, మండల వ్యవసాయాధికారులను ఆదోని డివిజన్లోని ఆలూరు, ఆస్పరి, హాలహర్వి మండలాలకు తరలించారు. నోడల్ అధికారులు, వ్యవసాయాధికారులు గ్రామాలకు వెళ్లి పంటల పరిస్థితిని పరిశీలించి రెయిన్గన్ల ద్వారా పంటలను ఎంతవరకు కాపాడవచ్చు అనేదానిని అంచనా వేస్తారు. అంతా హడావుడే... ఆదోని డివిజన్లో అన్ని మండలాల్లో దుర్బిక్ష పరిస్థితులు ఏర్పడినా జిల్లా యంత్రాంగం మాత్రం ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, మద్దికెర, హాలహర్వి మండలాలపై దష్టి సారించింది. పలు మండలాల్లో రెయిన్గన్లతో పంటలను తడపడం సాధ్యం కావడం లేదు. ఆదోని డివిజన్లోని ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పంటలకు తీరని నష్టం జరిగింది. ఆదోని రెవెన్యూ డివిజన్‌లోనే వర్షాభావంతో 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్ష ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఊడలు దిగి కాయలు ఏర్పడాల్సిన సమయంలో నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. కొర్ర, మొక్కజొన్న వంటి పంటలకు పొట్ట దశలో వర్షాలు పడకపోవడంతో కంకి బయటకి రాలేదు. 15 రోజుల క్రితం అధికార యంత్రాంగం చొరవ తీసుకుని రెయిన్గన్లతో పంటలకు నీటి తడులు ఇచ్చి ఉంటే కొంత ఉపయోగం లేదు. చివరికి వరుణుడికి కరుణ కలుగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 41 శాతం వర్షపాతం లోటు.. ఖరీఫ్ పంటలకు ఆగస్టు నెల అత్యంత కీలకమైనది. ఈ నెలలోనే వర్షాలు జాడలేకపోవడంతో రైతుల ఆశలు తారుమారయ్యాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ ఉండగా కేవలం 80.1 మిమీ మాత్రమే నమోదైంది. అది కూడా నెల చివరిలో కురిసిన వర్షాలతో ఈ స్థాయికి చేరింది. ఆగస్టు నెలలో వర్షపాతం 41 శాతం లోటు ఏర్పడింది. 45 మండలాల్లో వర్షాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే ఉన్నాయి. ఆదోని డివిజన్లో ఒక్క మండలంలోను సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు. ఆదోని డివిజన్లో ఆగస్టు నెల వర్షపాతం వివరాలు (మి.మీ.లలో) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం సాధారణ నమోదైన లోటు వర్షపాతం వర్షపాతం ( శాతం) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– హŸళగొంద 191 38.8 80 కౌతాళం 137 61.2 55 పెద్దకడుబూరు 144 37.8 74 కోసిగి 117 40.4 65 మంత్రాలయం 134 20.8 84 ఆలూరు 140 15.0 89 హాలహర్వి 76 11.0 86 నందవరం 144 18.4 87 గోనెగండ్ల 167 37.4 78 దేవనకొండ 232 52.6 77 ఆదోని 104 46.4 55 చిప్పగిరి 97 17.2 82 మద్దికెర 84 19.2 77 ఆస్పరి 136 22.2 84 పత్తికొండ 90 13.2 85 తుగ్గలి 95 47.2 50 ఎమ్మిగనూరు 103 56.0 46 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కర్నూలు డివిజన్లో... కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోను వర్షాలు కొంత నిరాశనే మిగిల్చాయి. డోన్, ప్యాపిలి, క్రిష్ణగిరి, సి.బెళగల్, వెల్దుర్తి, గూడూరు మండలాల్లో వర్షాలు తేలికపాటికే పరిమితమయ్యాయి. ఈ మండలాల్లోను పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ మండలాల్లో రెయిన్గన్లను ఉపయోగించి పంటలకు నీటి తడులు ఇచ్చే కార్యక్రమానికి స్వస్తి పలుకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆదోని డివిజన్‌కు మళ్లీ నిరాశే..
60వేల ఎకరాల్లో ఎండిన పంటలు – కర్నూలు, నంద్యాల డివిజన్లలో భారీ వర్షం – బండిఆత్మకూరులో 68.2 మి.మీ., వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే ఆదోని రెవెన్యూ డివిజన్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఆలూరు, ఆస్పరి, ఆదోని, చిప్పగిరి, పత్తికొండ, ఆలూరు, దేవనకొండ, హాలహర్వి తదితర మండలాల్లో వర్షాల్లేక దాదాపు 60వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటలను కాపాడేందుకు రెయిన్గన్లు వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. బండిఆత్మకూరులో అత్యధికంగా 68.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురిసినా 18 మండలాల్లో 5 మి.మీ., లోపే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికం ఆదోని డివిజన్ మండలాలే. 32 మండలాల్లో ఒక మోస్తరు వర్షం.. అంటే 10 మి.మీ., లోపు ఉంది. జిల్లా మొత్తం మీద 14.7 మి.మీ., వర్షపాతం నమోదయింది. కర్నూలు, కల్లూరు మండలాల్లో భారీ వర్షాలు పడటంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ., ఉండగా.. 80.1 మి.మీ., మాత్రమే నమోదు అయింది. వర్షపాతం (మి.మీ.,) బండిఆత్మకూరు – 68.2 బేతంచెర్ల – 55.5 కర్నూలు – 48.2 కల్లూరు – 48.2 మహనంది – 38.6 కొత్తపల్లి – 36.6 నందికోట్కూరు – 36 పగిడ్యాల – 36 ఆత్మకూరు – 33 -
సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి
-
సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి
కర్నూలు : సమయానికి వైద్యం అందక.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి... ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి శివన్న(45) గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అదుపు తప్పి ఆటో ఆయనను ఢీ కొట్టింది. దీంతో శివన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో శివన్న మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆసుపత్రిపై వారు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. -
ఆదోనిలో ఉన్మాది వీరంగం
ఆధోని : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. వీధిలో పోయే వాళ్లందరినీ కత్తితో పొడుస్తానని బెదిరింపులకు దిగాడు. స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు డాక్టర్ల సహాయంతో మత్తుమందు ఇచ్చి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తాను వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన వాడినని, తన పేరు బాలకృష్ణ అని చెప్పినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న లారీ
ఆదోని టౌన్ (కర్నూల్ జిల్లా) : పాఠశాల నుంచి విద్యార్థులతో తిరిగొస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులతో పాటు టీచరు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదోని పట్టణ శివారు ప్రాంతం చెరగుట్ట క్రాస్‌రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదోనిలోని కారుణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాఠశాల అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా చెరగుట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటామ్యాజిక్ లోని విద్యార్థులు చందన, పూర్ణ, అక్షయ, ఉమా మహేష్, టీచర్ షమీంబీ, క్లీనర్ వెంకటేశ్ గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టోరేజ్ ట్యాంకులో పడి విద్యార్థుల గల్లంతు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని బత్తలాపురం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుమలనగర్‌కు చెందిన సాబిర్(13), శివశంకరనగర్‌కు చెందిన జిలాని(14) మరో ముగ్గురు స్నేహితులు శుక్రవారం సాయంత్రం ఈతకొట్టేందుకు వెళ్లారు. సాబిర్, జిలాని ఇద్దరూ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. గట్టున చూస్తున్న మిగిలిన ముగ్గురు పిల్లలు భయంతో పారిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. సాబిర్, జిలాని రాత్రి ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అర్థరాత్రి తరువాత పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ హడావుడి చూసిన మిగిలిన పిల్లలు భయంతో అసలు విషయం చెప్పారు. శనివారం ఉదయం పోలీసులు, కుటుంబసభ్యులు సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు వెళ్లి పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వారి ఆచూకి ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు మున్సిపల్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. -
వేరుశనగ విత్తనాల లోడుతో ఉన్న లారీ మాయం
ఆదోని : కర్నూలు జిల్లా ఆదోనిలో వేరుశనగ విత్తనాల లోడుతో ఉన్న లారీని దొంగలు రాత్రికి రాత్రి మాయం చేశారు. లారీ డ్రైవర్ మహబూబ్ పాషా తన లారీ(ఏపీ21ఎక్స్4226)లో రూ.12.5 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలను సోమవారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డ్‌లో లోడింగ్ చేసుకున్నాడు. ఈ సరుకు వ్యాపారి కె.మల్లికార్జునకు చెందినది. గమ్యానికి తీసుకెళ్లే ముందు మహబూబ్‌పాషా లారీని ఆస్పరి రోడ్డులోని తన ఇంటి ముందు నిలిపి రాత్రికి ఇంట్లో నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. దీనిపై వ్యాపారి కె.మల్లికార్జునకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరూ కలసి ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు. -
4.75 కిలోల బంగారం స్వాధీనం
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని టూటౌన్ పోలీసులు 4.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొద్దుటూరుకు చెందిన బాబా ఫక్రుద్దీన్ స్థానిక మార్కెట్లో విక్రయించేందుకు బంగారాన్ని తీసుకురాగా... సోమవారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు స్వాధీనం చేసుకుని ఫక్రుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 4.46 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా, పన్నులు లేకుండా ఈ బంగారాన్ని విక్రయిస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోని (కర్నూలు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణంలోని దివాకర్ రెడ్డి(55) వాకింగ్‌కు వెళ్లగా తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయిన రాజేంద్రను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. -
జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలూరు రోడ్డులోని వెంకటేశ్వర జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శనివారం సాయంత్రం మంటలు లేచాయి. అక్కడి పనివారు సత్వరమే స్పందించి స్థానికుల సహకారంతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.