
పోస్టాఫీసులో విజిలెన్స్ తనిఖీలు
ఆదోని టౌన్ : ఆదోని హెడ్ పోస్టాఫీసులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు అమరనాథ్, మధుసూదన్ రెడ్డి, డివిజనల్ ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథ్ రికార్డులను పరిశీలించారు. గతనెల 9వ తేది నుంచి 24వ తేదివరకు జరిగిన పెద్దనోట్ల లావాదేవీలపై తనిఖీ చేసినట్లు అమరనాథ్ తెలిపారు. డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, కర్నూలు నర్సింగరావుపేట పోస్టాఫీసుల్లో తనిఖీలు పూర్తయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సీల్డు కవర్‌లో పంపినట్లు తెలిపారు.