vigilance
-
‘మేడిగడ్డ’లో భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ.. ఈఈ, ఎస్‌ఈలపై క్రిమినల్ చర్యలు! మేడిగడ్డ బరాజ్‌లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అర్హులే. తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్.. మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్‌కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్‌లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌పై ఎస్ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది. మెజర్మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది. నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి. కొంపముంచిన కాఫర్ డ్యామ్! బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్‌పైల్స్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్‌ను ప్రారంభించాక కాంట్రాక్టర్‌కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు. నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు బరాజ్‌లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
తిరుమల క్యూలో ప్రాంక్ వీడియో
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతలోని డొల్లతనం, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా మొబైల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ప్రాంక్ వీడియోని చిత్రీకరించడం.. ఆ తర్వాత దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. తమిళనాడుకు చెందిన ఓ వివాదాస్పద యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ ఇటీవల తన మిత్రులతో కలిసి మొబైల్‌ఫోన్‌తో దర్శన క్యూలోకి ప్రవేశించాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు నటించాడు. వాసన్‌ను చూసిన కంపార్టుమెంటులోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి గేట్లు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకిలేవడంతో టీటీఎఫ్ వాసన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని తన మిత్రులు ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్‌స్ట్రాగాం పేజీలో వాసన్ పోస్ట్‌చేయడంతో తమిళనాడులో ఇది వైరల్ అయింది. దర్శన క్యూల్లో భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై తమిళనాడులో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్‌ను అరెస్టుచేయాలని సామాజిక మాధ్యమాల్లో భక్తులు డిమాండ్ చేస్తున్నారు.విచారణకు టీటీడీ విజిలెన్స్ ఆదేశాలు..ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది. ప్రాంక్ వీడియోలు చిత్రికరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారని టీటీడీ తెలిపింది. కానీ, ఒకరిద్దరు ఆకతాయిల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
గొర్రెల స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తింపు
-
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్‌టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
విజిలెన్స్ ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్)లు, ఇతర అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలి్చంది. నిర్మాణ సమయంలో, తర్వాత చూపిన నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తికాకున్నా ‘వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్’ఇచ్చారని.. కాంట్రాక్టర్‌కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులను కాంట్రాక్టు సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని.. బిల్లుల చెల్లింపులు, ఖాతాల పరిశీలన ద్వారా దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. పని పూర్తికాకున్నా బ్యాంక్ గ్యారంటీల విడుదల బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 2 నుంచి వర్తిస్తుందంటూ అదే ఏడాది నవంబర్ 11న ఈఎన్సీ లేఖ జారీచేశారు. పనులు పూర్తికాకున్నా బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థకు విడుదల చేశారు. సదరు ఈఎన్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో ‘సౌండింగ్ అండ్ ప్రొబింగ్’ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. డ్యామ్ పర్యవేక్షకుడు (ఈఎన్సీ రామగుండం) అవి చేపట్టలేదు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, అన్ని కాంక్రీట్ నిర్మాణాల దృఢత్వంపై పరిశీలన అత్యవసరం. బ్యారేజీ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు జరగలేదు. బ్లాక్–7 పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), ర్యాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్‌ను నిర్దేశిత క్రమపద్ధతిలో నిర్మించలేదని వాటికి సంబంధించిన మెజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలింది. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్వహణ గాలికి వదిలేశారు 2019 జూన్ 19న బ్యారేజీని నాటి సీఎం ప్రారంభించారు. నాటి నుంచి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. నిజానికి తొలుత రూ.1,849.31 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యతలను నిర్మాణ సంస్థకు అప్పగించారు. తర్వాత ఈఎన్సీ సిఫార్సుల ఆధారంగా.. 2016 మార్చి 3న రూ.2,591 కోట్లకు, 2018 మే19న రూ.3,260 కోట్లకు, 2021 సెపె్టంబర్ 6న రూ.4,613 కోట్లకు అంచనాలను పెంచారు. ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించి.. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్ర తా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ నిర్మాణ 2019 సెపె్టంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై సూపరింటెండింగ్ ఇంజనీర్ కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు.. 2021 మార్చి 15న పనులు పూర్తయినట్టు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీచేశారు. కానీ ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి ఉత్తర్వులు జారీచేశారు. బ్యారేజీ వైఫల్యానికి కారణాలివీ.. ♦ బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్ పైల్స్‌ను పాతి నిర్మించిన కాఫర్ డ్యామ్‌ను నిర్మాణం పూర్తయ్యాక తొలగించాలి. కానీ కాఫర్ డ్యామ్‌ను, షీట్‌పైల్స్‌ను ఐదేళ్లు గడిచినా తొలగించలేదు. దీనితో గోదావరి నది సహజ ప్రవాహంపై ప్రభావం పడింది. ♦ బ్యారేజీ పునాది (ర్యాఫ్ట్), దాని కింద భూగర్భంలో ‘కటాఫ్ వాల్స్’ నిర్మాణం సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రాయింగ్స్ ప్రకారం ర్యాఫ్ట్, కటాఫ్ వాల్స్ మధ్య కలయిక (కనెక్షన్)ను చేపట్టలేదని బ్యారేజీకి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ర్యాఫ్ట్ కింద భూగర్భంలో ఎగువన, దిగువన షికెంట్ పైల్స్‌ను వేశారు. ఇందులో సెకండరీ పైల్స్ వేసేప్పుడు.. ప్రైమరీ పైల్స్ దెబ్బతిని పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండవచ్చు. 7వ బ్లాకులోని 16–21 పియర్లకు వ చ్చిన పగుళ్లను పరిశీలిస్తే.. పునాదులు ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతోంది. ♦ బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం కనిపించింది. బ్యారేజీని 2019–20లో ప్రారంభించాక దిగువన కాంక్రీట్ బ్లాకులతో ఏర్పాటు చేసిన అప్రాన్ ఏరియాకు ఎలాంటి తనిఖీలు, నిర్వహణ చేపట్టలేదు. వరదల్లో కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాంక్రీట్ బ్లాకులను పునరుద్ధరించి మరమ్మతులు చేయాలని 2020–2023 మధ్య నీటిపారుదల శాఖ నాలుగు సార్లు కోరినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ♦ 7వ బ్లాకులో 11 నుంచి 22 వరకు పియర్లు ఉండగా.. 18, 19, 20 పియర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పియర్ పునాదుల దాకా భారీగా దెబ్బతిన్నది. ♦ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించారు. -
మేడిగడ్డ: విజిలెన్స్ రిపోర్ట్‌లో సంచలనాలు!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే మేడిగడ్డలో డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ అంచనాకు వచ్చింది. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. 2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయ్యిందన్న విజిలెన్స్.. ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజ్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయి. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్అండ్ టీకి లేఖ రాయగా, ఎల్ అండ్ టీ నుంచి ఎలాంటి స్పందన లేదని విజిలెన్స్ గుర్తించింది. ప్రాజెక్టులకు సంబంధించి చాలా రికార్డులు కూడా మాయమయ్యాయని.. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరగ్గా, త్వరలో పంప్ హౌజ్‌లపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టనుంది. ఇదీ చదవండి: మీ కౌంటర్లో పస లేదు! -
ఫామ్‌హౌస్‌లపై విజిలెన్స్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఫామ్‌హౌస్‌ల ముసుగులో కరెంట్ చౌర్యానికి పాల్పడుతున్న అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, వాటిలోని విద్యుత్ బోర్లు, భారీ నిర్మాణాలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, క్లబ్ హౌస్‌ల్లో విద్యుత్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. వాటికి సరఫరా అవుతున్న కరెంట్‌పై ఆరా తీయడంతోపాటు వ్యవసాయం ముసుగులో కరెంట్ దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు వాటిల్లిన నష్టాలను జరిమానా రూపంలో తిరిగి రాబట్టడమే కాకుండా ఆయా వినియోగదారులకు లోడును బట్టి మీటర్లు కూడా జారీ చేస్తున్నారు. సాగు ముసుగులో వ్యాపారాలు హైదరాబాద్ శివార్లలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వాటి చుట్టూ భారీ ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిలో పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేస్తుండగా, మరికొంత మంది ఫామ్‌హౌస్ పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించి సినిమా షూటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, వీకెండ్ పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. మరికొంతమంది ఏకంగా రిసార్ట్లు, క్లబ్ హౌస్ లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు కల్పించిన ఉచిత విద్యుత్ సదుపాయా న్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమందైతే ఏకంగా బోర్ల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా హోటళ్లు, వసతి గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పంటసా గు ముసుగులో కరెంట్ చౌర్యానికీ పాల్పడుతున్నారు. ఫలి తంగా డిస్కం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే.. గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 61,40,795 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 50,99,190 గృహ, 8,22,821 వాణిజ్య, 36,440 పారిశ్రామిక, 1,82,344 ఇతర (వ్యవసాయ కనెక్షన్లు రంగారెడ్డి జిల్లాలో 1,17,417 ఉండగా, మేడ్చల్‌లో 21,491 వరకు) కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. వేసవిలో ఈ డిమాండ్ 3800 నుంచి 4000 మెగావాట్లు దాటుతోంది. అయితే డిస్కం సరఫరా చేస్తున్న విద్యుత్‌కు, మీటర్ రీడింగ్ నమోదు ద్వారా నెలవారీగా సంస్థకు వస్తున్న బిల్లులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇప్పటికే గృహ, వాణిజ్య కనెక్షన్లపై అంతర్గత తనిఖీలు చేపట్టిన డిస్కం తాజాగా వ్యవసాయ కనెక్షన్లపైనా ఆరా తీస్తోంది. దీంతో అధికారులు సర్కిళ్ల వారీగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నారు. డీఈకి షోకాజ్ నోటీసులు ఇటీవల డిస్కం సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు అంతర్గత నష్టాలపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పరుగెత్తించడంతో పాటు ఆయ న కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందించని ఇంజనీర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గచ్చిబౌలి డీఈ సహా పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల ముసుగులో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో బిల్లుల ఎగవేతకు పాల్పడిన యూనియన్లపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. డిస్కం సరఫరా చేస్తున్న ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఫీడర్లకు సెన్సర్లను ఏర్పాటు చేసే యోచనలో సీఎండీ ఉన్నట్లు సమాచారం. -
AP: కోవిడ్‌పై మరోసారి అప్రమత్తత
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్‌గా ఇప్పటికే రెగ్యులర్‌గా ఫీవర్సర్వేను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సెకండ్ వేవ్ సమయంలోనే ముందస్తు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ చర్యలతో రాష్డ్ర వ్యాప్తంగా 40 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజుకి 60 వేలకి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది. మరోసారి ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ విషయంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్డ్రాలకి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుదాన్ష్ పంత్ సోమవారం లేఖ రాశారు. కేరళలో వెలుగుజూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జెఎన్1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న(సోమవారం) ఒక్కరోజే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. చదవండి: 8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం -
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
అసమ్మతిపై హస్తం ముందుచూపు
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు అనంతరం తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నేపథ్యంలో టికెట్లు ప్రకటించిన తర్వాత ఎలాంటి అసమ్మతి ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పార్టీ దిగ్గజాలను రంగంలోకి దించనుంది. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే తదితరులను ఇందుకోసం ఎంపిక చేసిందని, వీరంతా తొలి జాబితా వెలువడడానికి ముందే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. 8 క్లస్టర్లుగా విభజన.. టికెట్ల ప్రకటన తర్వాత జాగ్రత్తలు తీసుకునేందుకు గాను రాష్ట్రాన్ని ఎనిమిది క్లస్టర్లుగా అధిష్టానం విభజించిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రతి 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక డివిజన్ గా గుర్తించి, ఆయా డివిజన్లలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలతో ఏఐసీసీ దూతలు చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తారని సమాచారం. అభ్యర్థుల ఖరారుకు ఎంపిక చేసుకున్న ప్రాతిపదికలు, సామా జిక సమీకరణలను వారికి ముఖ్య నేతలు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తారని తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గ టికెట్ విషయంలో జరిగిన రచ్చను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే అధిష్టానం ఈ ఏర్పా ట్లు చేస్తోందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
పన్ను ఎగవేసే కంపెనీల్లో విజిలెన్స్ తనిఖీలు చేయొచ్చు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే, పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థలు, కంపెనీల్లో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఉందని తీర్పునిచ్చింది. జీఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలు, వ్యాపార సంస్థల్లో కూడా తనిఖీలు చేసే అధికారం కూడా ఈ విభాగానికి ఉందని తేల్చి చెప్పింది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. తమ కంపెనీలో తనిఖీలు చేసి, అమ్మకాల టర్నోవర్‌ను తగ్గించి చూపినట్లు పేర్కొంటూ విజిలెన్స్ అధికారులు జీఎస్టీ అధికారులకు అలర్ట్ నోట్ పంపడం జీఎస్టీ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలుకు చెందిన సుధాకర్ ట్రేడర్స్ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా సుధాకర్ ట్రేడర్స్ వివరణ కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది. జీఎస్టీ చట్టం ప్రకారం చీఫ్ కమిషనర్ లేదా అతని నుంచి ఆథరైజేషన్ పొందిన అధికారికి మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తెలిపింది. తిరిగి చీఫ్ కమిషనర్ లేదా అతని ఆథరైజేషన్ పొందిన అధికారులు సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకొని, ఆ తరువాత చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సమాచార మార్పిడిలో తప్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలపై విచారణ, దర్యాప్తు చేయడం, ప్రభుత్వ ఆదాయ వనరులకు గండికొట్టే వారిపై చర్యలు తీసుకోవడం తదితర లక్ష్యాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటైందని తెలిపింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపాలిటీలు, జెడ్పీలు విజిలెన్స్ పరిధిలోకి వస్తాయంది. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు రెండు శాఖల మధ్య సమాచార మార్పిడిలో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసింది. అలెర్ట్ నోట్ ఆధారంగా నోటీసులివ్వడం చట్ట విరుద్ధం ఐరన్, స్టీల్ వ్యాపారం చేసే సుధాకర్ ట్రేడర్స్‌లో విజిలెన్స్ అధికారులు 2022 సంవత్సరంలో తనిఖీలు చేశారు. అమ్మకాల టర్నోవర్‌ను తక్కువ చేసి చూపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపారు. దీని ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ట్రేడర్స్‌కు నోటీసులు పంపి, వివరణ కోరారు. దీనిపై సంçÜ్థ యజమాని ఎస్.సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎంవీకే మూర్తి వాదనలు వినిపిస్తూ.. జీఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన డీలర్‌కు చెందిన సంస్థల్లో తనిఖీలు చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు లేదన్నారు. అందువల్ల విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన నోటీసులు చెల్లవన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారి విషయంలో స్పందించే అధికారం విజిలెన్స్‌కు ఉందన్నారు. సుధాకర్ ట్రేడర్స్‌లో స్టాక్‌లో తేడాలున్నాయని, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు గుర్తించామన్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్ నోట్ పంపి, పన్ను ఎగవేతను అడ్డుకోవాలని కోరామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, రిటరŠన్స్లో లోపాలుంటే వాటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసే అధికారం తమకుందన్నారు. -
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్ విజిలెన్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014–19 మధ్య అక్రమ మైనింగ్‌పై 424 కేసులు నమోదవగా, 2019–22 మధ్యలో 643 కేసులు నమోదైనట్లు చెప్పారు. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించినట్లు తెలిపారు. ద్రవిడ విశ్వ విద్యాలయం భూముల్లో 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 2014 నుంచి 2019 వరకు అక్రమ మైనింగ్‌పై కేవలం 38 కేసులు నమోదు చేయగా, 2019 నుంచి 2023 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల 96 కేసులు నమోదయ్యాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు 2014–19 మధ్య కాలంలో బినామీల ద్వారా పెద్ద ఎత్తున లేటరైట్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దానిపైనా చర్యలు తీసుకుని జరిమానా విధించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల మైనింగ్ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. 2018–19 ఆరి్థక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ రూ.1,950 కోట్లు కాగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.4,756 కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గ్రావెల్, రోడ్ మెటల్ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో 41.62 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.12.62 కోట్ల మైనింగ్ ఆదాయం లభించిందని చెప్పారు. 2019–22 వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 65.24 కోట్ల ఆదాయం లభించిందన్నారు. గత ప్రభుత్వం కంటె ఈ ప్రభుత్వంలో మూడేళ్ళలోనే నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
కార్గో పార్శిళ్లపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, గుట్కా, లిక్కర్, ఇతర చట్టవిరుద్దమైన వస్తువుల రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. కార్గో ద్వారా బుక్ చేసే పార్శిళ్లపై నిఘా పెంచాలని ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల, జోన్ల ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అనుమతి లేని లగేజ్ తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే చర్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిధిలోని అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు, పేలుడు పదార్థాలు, చట్టబద్ధంగా నిషేదించబడిన అన్నిరకాల వస్తువులను అనుమతించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కార్గోలో బుక్ చేసే ప్రతి పార్శిల్‌ను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. వినియోగదారుని ఆధార్, అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ అంశాల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, ఓఎస్డీ రవివర్మ, సీటీఎం చంద్రశేఖర్, నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎం త్రినాథ్ పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ) -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా.. కచ్చితంగా దొరికిపోతారు..
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం సైరన్లు పోలీసు, అగ్నిమాపక శాఖ తప్ప మరెవరూ వినియోగించకూడదు. ప్రస్తుతం అనేక మంది తేలికపాటి వాహన చోదకులు వీటిని బిగించుకున్నారు. మోగిస్తే తప్ప ఈ ఉల్లంఘన విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. మరి ఇలాంటి వారికి చెక్ చెప్పడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు విజిలెన్స్ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది, కెమెరాల కంటికి కనిపించని ఉల్లంఘనలకు సైతం ఆస్కారం ఇవ్వద్దంటూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఈ బృందాలకు రూపమిస్తున్నారు. ప్రస్తుతం విధి విధానాల రూపకల్పన, సభ్యుల ఎంపిక దశలో ఉన్న ఈ టీమ్స్ త్వరలో క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించనున్నాయి. ఇలాంటి విధులకు వినియోగం.. ► ఈ విజిలెన్స్ బృందాలను ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్ని రకాలైన ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి రంగంలోకి దింపుతున్నారు. సైరన్ల వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లు, మల్టీ టోన్డ్ హారన్లు, ఎయిర్ హారన్ల వినియోగం, అనధికారికమైన బుగ్గ కార్లు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర ఉల్లంఘనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►వీటిలో కొన్ని ఉల్లంఘనల్ని చౌరస్తాలు దాటేసిన తర్వాత, లేదా వాహనచోదకులు వినియోగించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ కారణంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఈ వాహనచోదకులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉల్లంఘనుల కారణంగా ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ఈ విషయం గమనించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్‌కు రూపమిస్తున్నారు. మొత్తం 48 మంది కానిస్టేబుళ్లు.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ప్రాథమికంగా జోన్‌కు రెండేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్‌కు ప్రత్యేక వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. పని ఒత్తిడికి తావు లేకుండా రెండు షిఫ్టుల్లో వినియోగించడానికి మొత్తం 48 మందిని ఎంపిక చేస్తున్నారు. వీరికి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండే ఈ బృందాల పని తీరును స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించనున్నారు. స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉంటాయి. వీరిని వెంబడించి, అడ్డుకోవడానికి ఈ టీమ్స్ ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రమాద హేవుతుగానూ మారుతుంది. టీటీఐలో ప్రత్యేక శిక్షణ.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్ కారణంగా ఎలాంటి అపశ్రుతులు, వాహన చోదకులతో పాటు ఉల్లంఘనులకూ ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో (టీటీఐ) వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా ఉల్లంఘనులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చెక్ చెప్పాలి? వారితో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న, నడుస్తున్న వారికి ఎలాంటి హాని లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలు ఈ శిక్షణలో వారికి నేర్పుతున్నారు. ఈ విజిలెన్స్ టీమ్స్‌ను ప్రథమ చికిత్స, సీపీఆర్ తదితరాల్లోనూ నిష్ణాతులను చేయాలని నిర్ణయించారు. కేవలం ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికే కాకుండా వర్షాలు, నిరసనలతో పాటు ఇతర కారణాల వల్ల హఠాత్తుగా తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ క్లియరెన్స్ కోసమూ వినియోగిస్తారు. (క్లిక్ చేయండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ) -
అవినీతిపరులను వదిలిపెట్టొద్దు
న్యూఢిల్లీ: అవినీతిని అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అవినీతి వ్యతిరేక సంస్థలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నీతిమాలిన వ్యవహారాలను నియంత్రించేటప్పుడు స్వార్థపరులు దర్యాప్తు సంస్థలకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తుంటారని, సవాళ్లు ఎదురైనా ఆత్మరక్షణలో పడిపోవద్దని చెప్పారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా వారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అవినీతిపరులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టొద్దని సీవీసీతోపాటు ఇతర సంస్థలకు, అధికారులకు సూచించారు. అక్రమార్కులు రాజకీయంగా, సామాజికంగా రక్షణ పొందకుండా చూడాల్సిన బాధ్యత సీవీసీలాంటి సంస్థలపై ఉందన్నారు. ప్రతి అవినీతిపరుడిని జవాబుదారీగా మార్చడం సమాజం విధి అని చెప్పారు. అలాంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పుడు పనులకు పాల్పడినవారు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రముఖులుగా చెలామణి అవుతూ యథేచ్ఛగా తిరుగుతున్నారని, జనం సైతం వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని, మన సమాజానికి ఇలాంటి పరిణామం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఆ జాడ్యాలను వదిలిస్తున్నాం.. సీవీసీ లాంటి సంస్థలు దేశ సంక్షేమానికి పాటుపడుతున్నాయని, నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెప్పారు. మనం రాజకీయ అజెండాతో పనిచేయడం లేదని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని ఉద్బోధించారు. అవినీతి వ్యతిరేక సంస్థలు తమ ఆడిటింగ్, ఇన్స్పెక్షన్లను టెక్నాలజీ సాయంతో ఆధునీకరించుకోవాలని సూచించారు. అవినీతిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నీ అవినీతిపై యుద్ధం చేయాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతిని సహించలేని పరిపాలనా వ్యవస్థ కావాలన్నారు. ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్న తనపైనా ఎన్నోసార్లు బురద చల్లారని, దూషించారని తెలిపారు. నిజాయతీ, నిర్భీతిగా పనిచేస్తే ప్రజలు మన వెంటే మద్దతుగా నిలుస్తారని వివరించారు. బ్రిటిషర్ల పాలనలో ఆరంభమైన అవినీతి, దోపిడీ, వనరులపై గుత్తాధిపత్యం వంటి జాడ్యాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయని, గత ఎనిమిదేళ్లుగా సంస్కరణల ద్వారా వాటిని వదిలిస్తున్నామని, పాలనలో పారదర్శకతను ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఫిర్యాదుల స్థితిగతులపై పోర్టల్ సీవీసీ ఆధ్వర్యంలో నూతన ‘కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. అవినీతిపై తాము ఇచ్చిన ఫిర్యాదుల స్థితిగతులను ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘ఎథిక్స్, గుడ్ ప్రాక్టీసెస్: కంపైలేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ ప్రివెంటివ్ విజిలెన్స్’ అనే అంశంపై పుస్తకాలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ‘అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతం’ అనే అంశంపై సీవీసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు అవార్డులు అందజేశారు. -
దీపావళి దందా.. ప్రతి ఏడాది ఇంతే!
సాక్షి, చెన్నై: దీపావళి వేళ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో 46 ప్రభుత్వ విభాగాలపై విజిలెన్స్ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. వివరాలు.. దీపావళి వస్తోందంటే చాలు కొన్ని శాఖల్లో చందాలు, మామూళ్ల పేరిట జరిగే దందా తారస్థాయిని చేరుతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పరిశ్రమలు, రవాణా, రహదారులు, అటవీ, వాణిజ్యం, అగ్నిమాపకం, పర్యావరణం, పౌర సరఫరాలు. ఎక్సైజ్, వ్యవసాయం విభాగాల్లో వసూళ్లు జోరందుకున్నాయి. ఈ సమాచారంతో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారుల శుక్ర, శనివారం ఆయా కార్యాలయాల్లో దాడులు చేపట్టారు. రూ. రెండు కోట్ల మేరకు నగదు లభ్యం సోదాల్లో అత్యధికంగా తిరువారూర్ డివిజన్ ఇంజినీరింగ్ గెస్టుహౌస్‌లో రూ. 75 లక్షలు పట్టుబడింది. అలాగే, నామక్కల్ రహదారుల శాఖ కార్యాలయంలో రూ. 8.77 లక్షలు, విరుదానగర్ గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో రూ. 12.53 లక్షలు, కళ్లకురిచ్చి వ్యవసాయ కార్యాలయంలో రూ.4.26 లక్షలు, తిరునల్వేలి రహదారుల విభాగంలో రూ.3.55 లక్షలు, కృష్ణగిరి చెక్ పోస్టులో రూ. 2.20 లక్షల, తిరువణ్ణామలై బీడీఓ కార్యాలయంలో రూ. 1.31 లక్షలు, నాగపట్నం బీడీఓ కార్యాలయంలో రూ.1.19 లక్షలు, తిరుపత్తూరు ఎక్స్‌జ్ కార్యాలయంలో రూ. 1.01 లక్షలు పట్టుబడ్డాయి. మదురై, శివగంగై, కోవై, కరూర్, సేలం, పుదుకోట్టై, ధర్మపురి, చెంగల్పట్టు తదితర జిల్లాలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డెల్టా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపిన సోదాలలో రూ. 78 లక్షలు పట్టుబడింది. చదవండి: అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండు సార్లు పారిపోయి.. -
ఇదేం కక్కుర్తి! రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందు..
తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ముందు సెయ్యారు జిల్లా రిజిస్ట్రార్ సస్పెన్సన్‌కు గురయ్యారు. వివరాలు.. తిరువణ్ణామలైలోని సెయ్యా రు జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం నియంత్రణలో సెయ్యారు, ఆరణి, వెంబాక్కం, తెల్లారు సహా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్‌గా సంపత్ పని చేస్తున్నారు. శనివారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ శుక్రవారం సస్పెన్సన్‌కు గురయ్యారు. ఆరణి సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సమయంలో భూమిని ప్రభుత్వం నిర్ణయించిన విలువ కన్నా తక్కువ విలువ కట్టి రిజిస్ట్రర్ చేయడంతో విజిలెన్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో రిటైర్డ్ అయ్యే ఒకరోజు ముందు అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి.. -
అబార్షన్లను నియంత్రిస్తేనే ఆడ పుట్టుక
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో బర్త్ రేషియో (జననాల రేటు) చూస్తే అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. కొన్ని జిల్లాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య రేషియో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గడిచిన ఏడాది డిసెంబర్ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో శుభపరిణామం.. మొత్తం 13 జిల్లాల్లో గతేడాది సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలున్నది ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే. ఈ జిల్లాలో గడచిన రెండేళ్లలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. అన్నిజిల్లాల కంటే అనంతపురం జిల్లాలో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉన్నట్టు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. రమారమి ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు లెక్క. కర్నూలు జిల్లాలోనూ కేవలం 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అమ్మాయి అనగానే అబార్షన్ చేయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలు రాష్ట్రంలో పీసీ పీ అండ్ డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యులు (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని చెప్పారు. కొంతమంది గైనకాలజిస్ట్లు, రేడియాలజిస్ట్‌లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి. అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. -
పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్.. అక్రమంగా..
రాయగడ(భువనేశ్వర్): ఉపాధ్యాయుడు శిశిర్‌కుమార్ సిమోలి విజిలెన్స్ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లపై శనివారం ఆకస్మిక దాడులు చేపట్టిన అధికారులు పలు విలువైన దస్తావేజులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జిల్లాలోని కాశీపూర్ సమితి, దొరగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు సంబంధించి, కాశీపూర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో విజిలెన్స్ డీఎస్పీలు సుశాంత్‌కుమార్ బిశ్వాల్, అనంతప్రసాద్ మల్లిక్, కళావతి భాగ్‌ల నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. తొలుత దొరగుడ(కాశీపూర్ సమితి)లోని ఇంట్లో తనిఖీలు చేపట్టిన సిబ్బంది రూ.2.88 లక్షల నగదు, 1 ఇన్నోవా కారు, మరొక బొలెరొ కారు, 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండంతస్తుల భవనాలు రెండు, మూడంతస్తుల భవనం ఒకటికి సంబంధించిన దస్తావేజులు, రాయగడ స్టేట్ బ్యాంక్‌లో జమ చేసిన రూ.21.68 లక్షలకు సంబంధించి, బ్యాంక్ పాస్‌పుస్తకాలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. -
కానిస్టేబుల్ ఇంట్లో విజిలెన్స్ దాడి.. ఆస్తులు చూసి నోరెళ్లబెట్టిన అధికారులు
బరంపురం(భువనేశ్వర్): అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో కానిస్టేబుల్ సురేంద్ర ప్రధాన్ ఇళ్లల్లో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 3 వేర్వేరు ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టిన అధికారులు దాదాపు రూ.2.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. పలు విలువైన దస్త్రాలు, బ్యాంక్ పాస్‌పుస్తకాలు, చెక్‌బుక్‌లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాం జిల్లా, బంజనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్ర ప్రధాన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, అవన్నీ అక్రమంగా సంపాదించినవేనన్న సమాచారం మేరకు కటక్ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై, దాడులు చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం జరిగిన అధికారుల దాడుల్లో కానిస్టేబుల్‌కి బరంపురంలోని లుచ్చాపడలో 3 అంతస్తుల భవనం, నిమ్మఖండి గ్రామంలో మరో 3 అంతస్తుల భవనం, గురింటి గ్రామంలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు నిర్ధారించారు. కానిస్టేబుల్ బంధువుల ఇళ్లల్లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్పీ త్రిలోచన్ స్వంయి తెలిపారు. చదవండి: Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. శ్రేయా ఘోషల్ క్లోజ్ ఫ్రెండ్ కూడా! -
కెనరా బ్యాంక్ సర్కిల్లో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం
-
అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా?
భువనేశ్వర్: అంగన్వాడీ కార్యకర్త అక్రమాస్తుల సంపాదన వ్యవహారాన్ని విజిలెన్స్ సిబ్బంది మంగళవారం బట్టబయలు చేశారు. పలుచోట్ల ఒకేసారి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని కొరొడొకొంటా అంగన్వాడీ కేంద్రం కార్యకర్త కబితా మఠాన్ రూ.4 కోట్లు పైబడి విలువైన ఆస్తులను ఆర్జించినట్లు విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ఖుర్దా, కేంద్రాపడా, జగత్సింఘ్పూర్ జిల్లాల్లో ఒకేసారి ఉదయం సోదాలు చేపట్టిన అధికారులు అక్రమాస్తుల చిట్టాని వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు అంగన్వాడీ కార్యకర్త ఆస్తుల గుట్టు రట్టు చేయడంలో 6 బృందాలు పాల్గొనగా, వీరిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను కబితా మఠాన్ ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. భవనాల్లో భువనేశ్వర్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. అలాగే జగత్సింఘ్పూర్ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి సమగ్ర విలువ రూ.4 కోట్లు పైబడి ఉంటుందని అధికార వర్గాల సమాచారం. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపం ఊరకనే పోదంటారు పెద్దలు. అది రాజకీయాల్లో అయితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అక్షర సత్యమైంది. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరించిన ఈయన అవినీతి గుట్టు రట్టవుతోంది. ఐదేళ్ల ఏలుబడిలో సాగించిన అక్రమాల పుట్ట విజిలెన్స్ చేతికి చిక్కింది. విజిలెన్స్ విచారణలో వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. నీరు–చెట్టు, బ్రాందీషాపులు, ధాన్యం కొనుగోలులో హమాలీల ముసుగు, లే అవుట్ల అనుమతులు, ప్రభుత్వ సబ్సిడీ రుణాలలో ముందస్తు కమీషన్ల కక్కుర్తి...ఇలా ఒకటేంటి.. విజిలెన్స్ విచారణలో ఎన్నింటిలోనో అవినీతి దర్శనమిస్తున్నట్లు భోగట్టా. విచారణాంశాల్లో కొన్ని.. ►నీరు–చెట్టు పథకంలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి గ్రావెల్, మట్టిని తెగనమ్మేసిన విషయం విజిలెన్స్ విచారణలో ప్రా«థమికంగా తేలిందని సమాచారం. గ్రావెల్‌ను లేఔట్లకు, మట్టిని ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, రాయవరం మండలం సోమేశ్వరం, రాయవరం, అనపర్తి మండలం పొలమూరుతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో ఇటుకబట్టీలకు అమ్మేశారని నిర్థారణకు వచ్చారు. చెరువులలో అపరిమితమైన లోతు తవ్వేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ►నీరు–చెట్టు ద్వారా 2016నుంచి 2018 వరకూ సుమారు రూ.3 కోట్లతో 51 పనులు చేపట్టారు. ఇందుకు 10 రెట్లు అంటే సుమారు రూ.30 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారని సమాచారం. బిక్కవోలు మండలం లింగాల చెరువు పనుల్లో భారీగానే సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ►రంగంపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, వడిశలేరు, సింగంపల్లి గ్రామాల్లో అవినీతి చోటు చేసుకుందని గుర్తించారు. రంగాపురంలో అచ్చన్న చెరువు, తమ్మలపల్లిలో రాళ్ల కండ్రిగ చెరువుల తవ్వకాల్లో దోచుకున్నారని నిఘా విభాగం ఆధారాలు సేకరించింది. ►మాజీ ఎమ్మెల్యే బ్రాందీ షాపులనూ విడిచిపెట్ట లేదు. మందుబాబులపై ఎన్.ఆర్.టాక్సు పేరుతో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా యజమానులు వసూలుకు తలుపులు బార్లా తెరిచారు. 40 షాపుల నుంచి కమీషన్లు కొట్టేశారనే అంశంపై విజిలెన్స్ లోతుగా విచారిస్తోంది. ఏటా రూ.80 లక్షలు వసూలు చేసిన వైనంపై ఆరా తీస్తోంది.. రామవరం, పొలమూరులకు చెందిన ముఖ్య అనుచరులు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారని సమాచారం. ►ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలులో హమాలీల పేరుతో రూ. లక్షలు కాజేశారు. ఈ మొత్తాన్ని మధ్యవర్తుల ద్వారా వెనకేసుకున్నారని తేలింది. కొమరిపాలెంలో జరిగిన కొనుగోలులో 10 శాతం కమీషన్ రూపంలో వెనకేసుకున్నారు. సొసైటీ ప్రతినిధి రెండు విడతల్లో రూ.20 లక్షలు అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ముఖ్య అనుచరుడి ద్వారా కమీషన్‌గా రాబట్టడంపై విజిలెన్స్ దృష్టి సారించింది. ►అనధికార లేఔట్లు, ల్యాండ్ కన్వర్షన్‌కు అనుమతులు మంజూరు చేయాలంటే ముందుగా లేఔట్ యజమాని ఎకరాకు రూ.2 లక్షలు ముట్టజెప్సాలిందే. అనపర్తికి చెందిన సత్తి వెంకటరామారెడ్డి ల్యాండ్ కన్వర్షన్ కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఎస్డీఆర్ ద్వారా ఎకరాకు రూ.2 లక్షలు వంతున వసూలు చేశారు. ఊలపల్లిలో రెండెకరాల లేఔట్ అనుమతికి జి.మామిడాడకు చెందిన సూర్యనారాయణరెడ్డి దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని టిఎస్సార్ అనే ముఖ్య అనుచరుడు మధ్యవర్తిత్వం వహించారు. చివరకు రూ.5 లక్షలు చేతిలో పడ్డాకనే అనుమతించినట్టు విజిలెన్స్ గుర్తించింది. ►బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన రామారెడ్డి 2017లో వరికోత మెషీన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.2.50 లక్షలు ఇస్తేనే మెషీన్ మంజూరవుతుందని టీడీపీ నాయకుడు విజయభాస్కరరెడ్డి బేరం పెట్టారు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.2.50 లక్షలు ముట్టజెప్పినా కోత మెషీన్ మంజూరు కాలేదు. సరికదా ఇప్పటికీ ఆ సొమ్ము తిరిగి చెల్లించకపోవడం గమనార్హం. ఇలాంటి బాగోతాలన్నీ విజిలెన్స్ నిశిత పరిశీలనలో తేలాల్సి ఉంది. విచారణ జరుగుతోంది ఫిర్యాదులపై మా టీమ్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా క్షేత్ర స్థాయిలో విచారించారు. బిక్కవోలు, అనపర్తి మండలాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. విచారణ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. ఒక డీఎస్పీ, ఇద్దరు ఇనస్పెక్టర్లు, ముగ్గురు వివిధ విభాగాల అధికారులు, మొత్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం వేగవంతంగా విచారిస్తోంది – విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ ఇవీ చదవండి: తాలిబన్ల ‘కే’ తలనొప్పి కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు -
సింహాచలం భూములపై విజిలెన్స్ విచారణ
సింహాచలం (పెందుర్తి): సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి చెందిన భూములను టీడీపీ హయాంలో రికార్డుల నుంచి తొలగించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ఆలయ ఈవో కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి ఆధ్వర్యంలో డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ తిరుపతిరావు భూముల రికార్డులను పరిశీలించారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై దేవదాయ శాఖ నియమించిన కమిటీ దర్యాప్తు నిర్వహించి, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. అప్పట్లో ఆస్తుల రికార్డుల నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో సింహాచలం దేవస్థానం పేరిట ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో భూముల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగారు. మాన్సాస్ భూములపైనా ఈ విభాగం విచారణ చేయనుంది. మూడు నెలల్లోగా నివేదిక సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల అవకతవకలపై పూర్తి విచారణ జరిపి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. ప్రాథమికంగా వివిధ రికార్డులను పరిశీలించామని, కొన్ని రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. అవకతవకలు జరిగిన భూములను స్వయంగా పరిశీలిస్తామన్నారు. -
ఏపీ: అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: అనకాపల్లి ప్రాంతంలో బడా కంపెనీలు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం విరుచుకుపడింది. రాష్ట్రంలోని అన్ని విజిలెన్స్ బృందాలు అక్కడకు చేరుకుని మూడురోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో నవయుగ కన్స్ట్రక్షన్స్, మధుకాన్, వాణి గ్రానైట్స్ కంపెనీల అరాచకాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 15 రోడ్ మెటల్ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అందులో 10 నవయుగ కంపెనీవే. అనకాపల్లి మండలం ఊడేరు సర్వే నంబరు 211లో నవయుగ కంపెనీకి 10 క్వారీలున్నాయి. వీటికి సంబంధించి 35 హెక్టార్లలో తవ్వకాలు జరుపుతున్నారు. 2 జెయింట్ క్రషర్స్‌తో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్నారని అధికారులు గుర్తించారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ తవ్వకానికి రాయల్టీ కట్టారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారో లెక్కిస్తున్నారు. రాయల్టీ కట్టిన దానికంటె ఎక్కువగా పెద్దస్థాయిలో తవ్వినట్లు తేలింది. ఈ క్వారీల్లో ఇంకా అనేక ఉల్లంఘనలను నిర్ధారించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీకి అనకాపల్లి మండలం మార్టూరులో సర్వే నంబర్ 1లో ఉన్న 3 క్వారీల్లో అక్రమాలు గుర్తించారు. ఈ క్వారీల్లో 50 అడుగుల లోతువరకు నీళ్లు ఉండడంతో ఎంత మెటల్ తవ్వారో కొలవడం ఇబ్బందికరంగా మారింది. అనుమతి లేకుండా చాలాలోతు నుంచి పేలుళ్లు జరిపి తవ్వకాలు జరపడంతో భారీగోతులు ఏర్పడ్డాయి. ఇలాంటిచోట ఎంత మెటల్ తవ్వారో లెక్కించడానికి బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ ప్రాసెస్ స్టేషన్ (ఈపీఎస్) పరికరంతో తవ్వకాలను కొలుస్తారు. డీజీపీఎస్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. కానీ మధుకాన్ క్వారీల్లో వాటితో కొలతలు వేయడానికి వీల్లేని స్థాయిలో తవ్వకాలు జరపడంతో సముద్రంలో ఇసుక డ్రెడ్జింగ్ సమయంలో ఉపయోగించే బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం సర్వే నంబరు 109లో వాణి గ్రానైట్స్ తనకున్న రెండు క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ 15 క్వారీల్లో డ్రోన్ సర్వే కూడా చేయనున్నారు. మొత్తం 25 క్వారీలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మొదట ఈ 15 క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. 2, 3 రోజుల్లో వీటిలో తనిఖీలు పూర్తిచేసి అక్రమాలను రికార్డు చేసి జరిమానా విధించనున్నారు. ఉల్లంఘనలు మరీ శృతిమించితే అనుమతుల రద్దుకు సిఫారసు చేసే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. అధికారుల సహాయ నిరాకరణ వైఎస్సార్ కడప–చిత్తూరు, కర్నూలు–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు–గుంటూరు, కృష్ణా–తూర్పు–పశ్చిమగోదావరి,విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మైనింగ్ విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వాటికి నేతృత్వం వహించిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వారం, పదిరోజులు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తనిఖీలు ఆపేందుకు ఆయా కంపెనీలు స్థానిక రాజకీయ నాయకుల నుంచి విజిలెన్స్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. స్థానిక మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం. ఫైళ్లు ఇవ్వకపోవడంతోపాటు విజిలెన్స్ బృందాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలిసింది. అక్రమార్కులను వదలం గనుల్లో అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరపాలి. ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఉత్తరాంధ్రలో మైనింగ్ తవ్వకాలు చాలాచోట్ల ఇష్టారీతిన జరుగుతున్నాయి. విజిలెన్స్ బృందాల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమార్కులు అందరినీ బయటకులాగి చర్యలు తీసుకుంటాం. – వి.జి.వెంకటరెడ్డి, మైనింగ్ డైరెక్టర్ -
మూడో వేవ్‌పై అప్రమత్తత అవసరం
నాగార్జునసాగర్/ మిర్యాలగూడ/ నకిరేకల్: కరోనా మూడో వేవ్‌పై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్‌లలో నిర్వహించిన సమావేశాల్లో వైద్య సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో టెస్టింగ్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధానంగా వివాçహాలు, జాతరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులపైనా నజర్ ► ఆదివారం జిల్లాల్లో పర్యటించిన ఉన్నత స్థాయి బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా ఫీవర్ సర్వేకు సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ అంశాలివీ.. ► నాలుగో విడత ఫీవర్ సర్వేను పటిష్టంగా నిర్వహించాలి. విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని కొనసాగించాలి. ► కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్ కిట్లు అందించాలి. ►కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలి. వారు అంతకుముందు మూడు నాలుగు రోజుల్లో ఎవరిని కలిశారో గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయాలి. ►సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా వైరస్ సోకకుండా గట్టి నిఘా పెంచాలి. మండల, జిల్లా స్థాయి బృందాలు ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ►జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. ప్రతి పీహెచ్సీలో మందులను అందుబాటులో ఉంచాలి. ►రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్, అంటువ్యాధులు, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే జబ్బులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ►జిల్లా వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల పర్యవేక్షకులు, సర్వే అధికారులు రోజూ సమస్యలపై విశ్లేషించుకొని చర్యలు చేపట్టాలి. ► పీహెచ్‌సీల వారీగా వైద్యాధికారులు ఫీవర్ సర్వేలో తప్పక పాల్గొనాలి. ముఖ్యంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. ► వైద్యాధికారులు, డాక్టర్లు విధుల్లో తప్పక ఉండాలి. సెలవులు పెట్టకూడదు. -
అక్రమ లే అవుట్లపై విజిలెన్స్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతుల్లేకుండా వెలుస్తున్న లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డివిజన్, జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా నగరాలు, పట్టణాలకు చుట్టుపక్కల గ్రామ పంచాయతీల పరిధిలోను, మండల కేంద్రాలు, హైవేల పక్కన గ్రామాల్లోను కొందరు వ్యాపారులు అక్రమ లే అవుట్లు వేశారు. వీటివల్ల ఆయా పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతుండడంతో పాటు ఈ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్నవారు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనుమతుల్లేని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తుండడంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్టు ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోను లే అవుట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం జగన్మోహన్రెడ్డి అనుమతితో అనధికారిక లే అవుట్ల క్రమబద్దీకరణకు ఎల్ఆర్ఎస్ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చాలాచోట్ల పంచాయతీలు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నాయని, లే అవుట్లకు అనుమతుల సందర్భంగా వస్తున్న ఫీజులో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులతో మాట్లాడి రావాల్సిన డెవలప్మెంట్ ఫీజులను పంచాయతీరాజ్‌శాఖ వసూలు చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్ల నియంత్రణకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ప్రత్యేకంగా విజిలెన్స్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఈవోపీఆర్డీతో సహా ముగ్గురితో, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవో, డీపీవో, జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారితో కూడిన విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. 2015 నాటికే 6,098 అక్రమ లే అవుట్లు.. 2015 నాటికే గ్రామీణ ప్రాంతాల్లో 6,098 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. తర్వాత కొత్తగా వెలిసిన వాటితో కలిపి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయన్నది విజిలెన్స్ బృందాలు గుర్తిస్తాయని చెప్పారు. ఈ అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారానే గ్రామ పంచాయతీలకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పాల్గొన్నారు. విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే లే అవుట్లపై విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా అధికారులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. డివిజన్, జిల్లా స్థాయి బృందాలు ఇప్పటికే ఉన్న అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట పంచాయతీల్లో అక్రమ లే అవుట్లు ఏర్పాటు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ లే అవుట్లు గుర్తించినచోట ఆ విషయాన్ని స్థానిక ప్రజలందరికీ తెలిసేలా గ్రామంలో దండోరా వేయించాలని సూచించారు. ప్రతినెలా విజిలెన్స్ బృందాలు సమావేశం కావాలని నిర్దేశించారు. -
విజిలెన్స్ ఫైళ్లు మార్చేస్తున్నారు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అవకతవకలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటున్న పలువురిని కాపాడేందుకు ఆరోగ్యశాఖ విజిలెన్స్ సిబ్బంది యత్నిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫైళ్లను ఆధారాలు లేకుండా చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖలోని ఆయుష్ విభాగంలో కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారు. వీరికి సంబంధించిన ఫైళ్లు సచివాలయంలోని ఆరోగ్యశాఖ విజిలెన్స్ విభాగం పరిధిలో విచారణలో ఉన్నాయి. అవినీతికి పాల్పడిన కొంతమందికి సంబంధించి కేసులు లోకాయుక్తలోనూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో విచారణ పూర్తయితే గానీ పదోన్నతులు, బదిలీలు ఇవ్వడం కుదరదు. ఇలాంటి నిబంధనలను తోసిరాజని, వారికి సంబంధించిన ఆధారాలను పక్కన పెట్టి విచారణను తొక్కి పెట్టేందుకు యత్నిస్తున్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేకుండా ఉండేందుకు ఫైళ్లను మార్చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది విచారణ ఎదుర్కొంటున్న వారితో కుమ్మక్కై ఇలా చేస్తున్నట్టు తెలిసింది. ఒక దశలో థర్డ్ పార్టీతో (విభాగంతో సంబంధం లేని వ్యక్తులతో) విచారణ చేయాలని సదరు అధికారులపై ఆదేశాలివ్వగా.. ఇప్పుడు అది అవసరమే లేదని రాస్తున్నారు. ఆరోగ్యశాఖ విజిలెన్స్ అధికారులు.. ఆయుష్ అధికారులతో బేరసారాలు సాగించారని, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం తదితర విషయాల్లో అవినీతికి పాల్పడిన వారిపై కచ్చితమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. -
నీరు–చెట్టు.. అక్రమాల కనికట్టు
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే టీడీపీ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో కొన్నింటిని పరిశీలిస్తే చాలు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలి్చంది. తమకొచ్చిన ఫిర్యాదుల మేరకు శాంపిల్‌గా కొన్నింటిపై విచారణ చేపట్టగా తీగలాగితే డొంక కదిలినట్టు పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 427.24 కోట్లతో 5696 పనులు చేపట్టగా ఇందులో సగానికి పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నీరు చెట్టు పనులు ఎంత నాసిరకంగా జరిగాయో ప్రజలందరికీ తెలిసిందే. ఎవరెంత గోల పెట్టినా నాడు పట్టించుకోలేదు. ఇప్పుడా పాపాలు విజిలెన్స్ విచారణలో వెలుగు చూశాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నీరు చెట్టు పనులు పచ్చనేతలకు కల్పతరువుగా మారాయి. వారికి నచ్చినంత అంచనాలు రూపొందించుకుని, వాటికి నిధు లు మంజూరు చేయించుకుని, నామినేషన్ పద్ధతిలో పనులు కొట్టేసి వందల కోట్లు దిగమింగారు. గ్రామ స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రి వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. దోచిన సొమ్ముతో బహుళ అంతస్థుల భవనాలు, ఎకరాల కొద్దీ భూములు, కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సంపాదించారు. చెరువులో మట్టి తవ్వకాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పన చెల్లించాల్సిన బిల్లులకు క్యూబిక్ మీటర్‌కు రూ.82.80 చెల్లించారు. తవ్విన మట్టిని అమ్ముకుని కోట్లాది రూపాయలు మింగేశారు. ఆ విక్రయించిన మట్టిని నీరు చెట్టు పనుల కింద తవ్వినట్టు బిల్లులు చేసుకున్నారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్ డ్యామ్‌లు, స్లూయిజ్‌లు... ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. నాసిరకం పనులు చేపట్టడంతో చేసిన పనులు కొన్నాళ్లకే వర్షాలకు కొట్టుకుపోయాయి. గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్నిచోట్ల పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రితో మరికొన్నిచోట్ల పనులు చేసి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే చేసినట్టు చూపించారు. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక టీడీపీ హయాంలో జరిగిన నీరు చెట్టు అక్రమాలపై పక్కా ఆధారాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక తయారు చేశారు. ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో ఉదాహరణతో సహా చూపించారు. అంకెలతో సహా అవినీతి లెక్క తేల్చారు. వీటిన్నింటిపైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. విశేషమేమిటంటే ఒకపక్క విజిలెన్స్ విచారణలో నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని తేలగా అదే సమయంలో ఆ పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడైతే గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇస్తావా? లేదా? అన్నట్టుగా బెదిరింపులకు సైతం దిగినట్టు సమాచారం. టెక్కలి మండలం తిర్లంగి సమీపంలోని కొత్త చెరువు జిల్లాలో జరిగిన నీరు చెట్టు అక్రమాలివి... •ఉన్న చెరువు గట్లను బలపడేటట్టు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. ఈ విధంగా 25 పనులకు రూ.59.08 లక్షలు అధికంగా ఖర్చు చేశారు. •చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా ఉన్న దాని కంటే అ«ధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. ఈ లెక్కన రూ.12.52 లక్షలు స్వాహా చేశారు. •తవ్విన మట్టి శ్మశానం, ఇళ్లు వంటి అవసరాలకు కాకుండా ప్రైవేటు రోడ్లకు వేసుకున్నారు. ఈ తరహాలో చూపించిన 8 పనుల ద్వారా రూ.53.21 లక్షలు అక్రమంగా కొట్టేశారు. •చెరువు మధ్యలో రోడ్డు వేసి ఒక పని కింద రూ.2.14 లక్షలు మింగేశారు. •వర్షాకాలంలో పాడయ్యే తారురోడ్డు బండకి మట్టిని వేశారు. దీనికింద రూ.7.11 లక్షలు తినేశారు. •ఒక పనికి ఒక అంచనా రూపొందించి, దానికి అదనంగా నిర్మాణం పేరుతో రూ.లక్షా 60 వేలు నొక్కేశారు. యంత్రాలతో చేసే పనిని మనుషులతో చేసినట్టు చూపించి 14 పనులకు గాను రూ.7.61 లక్షలు వెనకేసుకున్నారు. •పనుల్లో డిజైన్లు డ్రాయింగ్ లేకుండా పనిచేసి రూ.76.23 లక్షలు తినేశారు. •నాలుగు పనులకు తక్కువ పనిచేసి ఎక్కువ నమోదు చేసి రూ.లక్షా 15 వేలు స్వాహా చేశారు. సర్పలెస్ వియ్యర్కు చెందిన 2 పనులకు కొలతలు తక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.2.62 లక్షలు దుర్వినియోగం చేశారు. •మట్టిగట్టు వేయడానికి 5 మీటర్ల దగ్గర్లో మట్టిని తవ్వేసి రూ.3.53 లక్షలు దిగమింగారు. •పనుల టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు. •తవ్విని మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మింగేశారు. •రూ.5 లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేషన్ ద్వారా చేపట్టాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ.50 లక్షల వరకు నామినేషన్ పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేశారు. •నిబంధనల ప్రకారం 50 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాల కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు చేసి నిధులు దుర్వినియోగపరిచారు. •గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్ లేకుండా చెక్ డ్యామ్‌లను నిర్మించారు. •నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. -
బయట పడనున్న టీడీపీ నేతల బండారం
అరసవల్లి: ‘‘ఊరూరా సీసీరోడ్లు వేశాం... అభివృద్ధి చేసి చూపించాం...’’ అని ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు, గ్రామ పంచాయతీల నిధుల సంయుక్త వినియోగంతో వేసిన ‘చంద్రన్న బాట’ల నాణ్యతా ప్రమాణాల పని పట్టేందుకు ఓ వైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జిల్లాలో ఇంజినీరింగ్ అధికారులతోపాటు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టీడీపీ నేతల బండారం బయట పడనుంది. చంద్రన్న బాటలిలా.... జిల్లాలో చంద్రన్న బాటల నిర్మాణంలో భాగంగా 100 నుంచి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో 90 శాతం ఉపా«ధి నిధులు, 10 శాతం పంచాయతీ నిధులతో కలిపి సీపీ రోడ్లు వేశారు. జనాభా 2,001–4,999 మధ్య ఉన్న పంచాయతీల్లో 70 శాతం ఉపాధి నిధులు, 30 శాతం పంచాయతీ నిధులు, 5 వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సగం ఉపాధి నిధులు, మిగిలిన సగం పంచాయతీ నిధులతో సీసీరోడ్లు నిర్మించారు. ఈ క్రమంలో 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లాలో 1,460 కిలోమీటర్ల మేర సీసీరోడ్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 2018 అక్టోబర్ 1 నుంచి 2019 మే 31వ తేదీ వరకు రూ.132 కోట్లుతో 350 కిలోమీటర్లు మేర సీసీరోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం కాజీపేట, కిల్లిపాలెం, చాపురం తదితర పంచాయతీల్లో రోడ్లపై రోడ్లు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీటి లెక్కలు తేల్చాలని నిర్ణయించారు. బిల్లులు చెల్లింపులపైనా విజిలెన్స్...! జిల్లాలో గత ఐదేళ్లలో 1,460 కిలోమీటర్ల సీసీరోడ్లలో దాదాపుగా టీడీపీ నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు పేరిట ఇష్టానుసారంగా సీసీరోడ్లు నిర్మించి లక్షలాది రూపాయలు బొక్కేశారు. ఇక్కడ నాణ్యతను అప్పటి అధికారులు పక్కనపెట్టి ఇస్టానుసారంగా క్లియరెన్స్ ఇచ్చి బిల్లులు చెల్లించారని తెలుస్తోంది. ఇందులో ఇంకా బిల్లులు చెల్లించాల్సిన పనుల విషయంలోనైనా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం జీవో 271 ప్రకారం నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నూటికి నూరు శాతం పనులన్నీ పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉంది. తనిఖీల్లో భాగంగా ప్రతి రోడ్డుకు కోర్ కటింగ్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేసిన తర్వాత నాణ్యతను గుర్తించాల్సి ఉంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుల్లో వీటి నిర్మాణాలు మరింత దూకుడుగా సాగిన విషయం తెలిసిందే.. శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో రోడ్లుపై రోడ్లు వేసి మరీ బిల్లులు పెట్టేశారనే సమాచారం అ«ధికారుల వద్ద ఉంది. దీనిపై విజిలెన్స్ రంగంలోకి దిగడంతో త్వరలో బండారం బయటపడనుంది. రూ.132 కోట్ల పనులపై 10 బృందాల తనిఖీలు.. జిల్లాలో ఉపాధి నిధులు, పంచాయతీ నిధులను సంయుక్తంగా వినియోగించి నిర్మించిన చంద్రన్న బాట సీసీరోడ్లలో అవినీతి అక్రమాల లెక్క పనిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పడ్డారు. ఐదారు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల క్వాలిటీ కంట్రోల్ అధికారులంతా మొత్తం 10 బృందాలుగా తనిఖీలు చేపడుతున్నాయి. డ్వామా పీడీ ఆధ్వర్యంలో ఈ బృందాలు ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్ల నాణ్యతను పరీక్షిస్తున్నాయి. ఈప్రక్రియ అంతా త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చంద్రన్న బాట సీసీరోడ్ల నాణ్యతను పరీక్షించేందుకు ముందుగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులకు ఆయా రోడ్లకు సంబంధించిన రికార్డులు సమర్పించాం. రెండు దఫాలుగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఉన్నతా««ధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ఎస్ రామమోహన్‌రావు, పీఆర్ ఎస్ఈ, శ్రీకాకుళం -
జేసీ ట్రావెల్స్ బాగోతం
-
జైలుకు లంచగొండి ఐఏఎస్ అధికారి
భువనేశ్వర్: విధి నిర్వహణలో ఉంటుండగానే అవినీతికి పాల్పడి విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన ఐఏఎస్ అధికారి విజయకేతన్ ఉపాధ్యాయ్ ఇప్పుడు కటకటాలపాలయ్యారు. గతేడాది డిసెంబరు 30వ తేదీన లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు ఆయన చిక్కారు. ఈ క్రమంలో ఆయనకు విధించిన రిమాండ్ ప్రస్తుతం ముగియడంతో స్థానిక ఝరపడా జైలుకు ఆయనను ఆదివారం తరలించారు. 2009వ సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి విజయకేతన్ ఉపాధ్యాయ్. రాష్ట్ర ఉద్యాన విభాగం డైరెక్టర్ హోదాలో ఓ బిల్లు పాస్ చేసేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసి, దానిని తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. నా సర్కారు కార్యాచరణలో భాగంగా ప్రజాభిప్రాయం మార్గదర్శకంతో చైతన్యవంతమైన ప్రజలు ఆయన అవినీతి చర్యలపై విజిలెన్స్ వర్గాలకు రహస్య సమాచారం అందజేశారు. నిందిత అధికారి ఇల్లు, కార్యాలయం, సొంత ఊరు, అత్తవారి తరఫు ఇల్లు ఇతరేతర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి, అనుబంధ వివరాలను సేకరించారు. -
పోలవరంపై 3 బృందాలు
సాక్షి, అమరావతి: పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులపై విచారణకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్లు దోచుకున్న ప్రజాధనాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి తిరిగి వసూలు చేయనుంది. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. తొలుత పోలవరం పనులపై విచారణ చేసిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చింది. లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం డీజీ (డైరెక్టర్ జనరల్) రాజేంద్రనాథ్‌రెడ్డి పోలవరం పనులపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఈ మూడు బృందాలు వేర్వేరుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నాయి. పనులను పర్యవేక్షించిన అధికారులు రాతపూర్వకంగా ఇచ్చే వివరణలో సూత్రధారుల పేర్లను వెల్లడిస్తే ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది. విజిలెన్స్ విభాగం శరవేగంగా కదులుతుండటంతో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లలో కలకలం రేగుతోంది. ఎస్ఈలకు విజిలెన్స్ లేఖలు... - పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల అంచనా వ్యయం 2010–11, 2004–05 ధరల ప్రకారం ఎంత? ఏ ప్యాకేజీల పనులను ఏ కాంట్రాక్టర్లకు ఎంత ధరకు అప్పగించారు. 2015–16 ధరలను వర్తింపజేసిన తర్వాత అంచనా వ్యయం ఎంత పెరిగింది? వాటికి సంబంధించిన ఎస్టిమేట్ కాపీలను తక్షణమే అప్పగించాలంటూ పోలవరం సీఈ సుధాకర్‌బాబుతోపాటు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనులను పర్యవేక్షించే ఎస్ఈలకు విజిలెన్స్ విభాగం లేఖలు రాసింది. - టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎంత పరిమాణం పనులు చేశారు? ఎంత బిల్లులు చెల్లించారు? 60 సీ నిబంధన కింద ఎంత పరిమాణం పనులు తొలగించారు? కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఆ పనుల విలువ ఎంత? నామినేషన్‌పై కొత్త కాంట్రాక్టర్లకు ఎంత విలువకు అప్పగించారు? వాటికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. - ఈపీసీ కాంట్రాక్టు ఒప్పందం రద్దు చేసుకోకుండా ఎల్ఎస్–ఓపెన్ పద్ధతిలో పనులు అప్పగిస్తూ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల పత్రాలను ఇవ్వాలని కోరారు. - స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్, మొబిలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపు, వసూలుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని కోరారు. - పూడికతీత, డీ వాటరింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో ఎక్కడకెక్కడ పనులు చేశారు? ఎంత బిల్లులు చెల్లించారు? అన్న వివరాలు ఇవ్వాలని కోరారు. పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల ఎస్ఈల నుంచి ఈ రికార్డులను స్వాధీనం చేసుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చనున్నారు. పనుల నాణ్యతను పరిశీలించనున్నారు. పనులను పర్యవేక్షించిన అధికారులతో రాతపూర్వకంగా వివరణ తీసుకుని విజిలెన్స్ విభాగం సమగ్ర నివేదికను డీజీకి సమర్పిస్తుంది. విజిలెన్స్ డీజీ వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నారు. -
‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో అవినీతి జలగలు రాజ్యమేలుతున్నాయి. పేదల వైద్యం కోసం ఏర్పాటైన దీన్ని కూడా అవినీతికి కంచుకోటగా మార్చారు. బయటి దళారులతో కుమ్మక్కై వారితో అక్రమాలు చేయిస్తూ సొమ్ము గడిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ దందా జరుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదులు అందాయి. వీటిపై సంబంధిత విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతుండగా, వరంగల్ జిల్లాలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.వాటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఈ దందాలో పాల్గొన్న ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సహా మరో ముగ్గురు టీం లీడర్లపై వేటు వేశారు. దీన్ని తొలగించుకునేందుకు వారు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు ఆరోగ్యశ్రీ అధికారులు తిరిగి వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఇతర జిల్లాల్లో జరుగుతున్న దందాపైనా విజిలెన్స్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. లాగిన్, పాస్వర్డ్ దొంగిలించి మరీ... ఆరోగ్యశ్రీని అమలుచేసేందుకు జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్, మేనేజర్లు ఉంటారు. వారి కింద టీం లీడర్లు ఉంటారు. వారి పరిధిలో ప్రతీ నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు విధులు నిర్వహిస్తారు. వీళ్లు నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లే రోగుల శస్త్రచికిత్సలకు ఆన్లైన్లో అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రుల బిల్లులు తయారు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆన్లైన్లో పంపడం వారి విధుల్లో కీలకమైనవి. దీన్నే జిల్లాస్థాయిలోని ఆరోగ్యశ్రీలోని కొందరు ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా బిల్లులు పాస్ చేయించినందుకు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి మామూళ్లు తీసుకుంటారు. ఎవరైనా ఇవ్వకుంటే కొర్రీలు వేస్తారు. లేకుంటే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రతీ నెట్వర్క్ ఆసుపత్రి వారికి నెలవారీగా రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఆరోగ్యశ్రీ రోగుల నుంచి బిల్లులకు చెల్లించాల్సిన పన్నుల సొమ్మును వసూలు చేస్తున్నారు. మరోవైపు బయటి దళారులతో కుమ్మక్కై వారికి ఆరోగ్యశ్రీ అంతర్గత వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ వివరాలు అందజేస్తారు. వారు ఆ బిల్లుల వివరాలు, అవి ఆమోదం పొందాయో గుర్తిస్తారు. ఆ ప్రకారం ముందే ఆసుపత్రి యాజమాన్యం వద్దకు వెళ్లి మేం ఇంత సొమ్ము ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పిస్తామంటూ బేరసారాలు ఆడతారు. లేకుంటే కొర్రీలు పెడతామని బెదిరిస్తారు. దీంతో యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పుతాయి. తీగలాగితే డొంక కదిలిందిలా...! గత నెల ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులను ఫోన్లలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హరీశ్ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందిన రోగుల జాబితాను తస్కరించి వారి నుంచి బిల్లులపై వేసే పన్నుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు హరీశ్ అంగీకరించాడు. వరంగల్ కేంద్రంగా జరుగుతున్న ఈ రాకెట్‌ను విజిలెన్స్ సిబ్బంది బట్టబయలు చేశారు. ఓ నలుగురు ఉద్యోగులు ఆరోగ్యశ్రీ వెబ్సైట్ లాగిన్ సమాచారాన్ని హరీశ్‌తో పాటు ఇతర వ్యక్తులకు ఇచ్చి రోగుల వివరాలను సేకరించి, డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఆరోగ్యశ్రీ వెబ్సైట్లలో ప్రభుత్వ చెల్లింపుల వివరాలను తెలుసుకుని ఆయా ఆసుపత్రులకు వెళ్లి తామిచ్చిన నివేదికల వల్లే వారికి ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు ఆయ్యాయని, అందుకు కమీషన్ చెల్లించాలని ఒత్తిళ్లు చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. -
కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ దాడి
హైదరాబాద్: నగంరలో కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సిద్ధిపేట్ జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఎస్కే ఖాదర్ ఈ కల్తీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 45 కేజీల బరువు గల మూడు బ్యాగ్‌ల కల్తీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్లవి-12, గోఖుల్, కృష్ణ-10 పేరు గల 25 ప్యాకెట్ల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. వీటి మొత్తం విలువ భారీగా ఉండవచ్చునని చెప్పారు. ఈ కల్తీ విత్తనాలు కర్నూలు నుంచి గుంటూరు మీదుగా నగరానికి వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్ డీలర్ల వద్దనే కొనాలని సూచించారు. -
పార్కులూ వదలట్లే!
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఏడు దుకాణాలు, ఒక డెయిరీ పార్లర్ ఉన్నాయి. వీటిని చూసిన వారెవరైనా అవి లేఅవుట్ స్థలమో లేక పార్కునో కబ్జా చేసి కట్టినవంటే నమ్మలేరు. కానీ అవి ఆక్రమించిన స్థలంలో కట్టినవేనని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం తనిఖీల్లో తేలింది. ఇవేకాదు.. నగరవ్యాప్తంగా ఎన్నెన్నో లేఅవుట్లలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలు దురాక్రమణకు గురయ్యాయి. వాటిలో దుకాణాలు, నివాసాలు సైతం వెలిశాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే నగరంలో లేఅవుట్లలోని పార్కులు, ఖాళీస్థలాలను వదలకుండా దొరికినంతా ఆక్రమించేశారు. ఇలాంటి స్థలాల్లో కొందరు ఇళ్లుఇంకొందరు దుకాణాలు నిర్మించుకోగా.. మరికొందరు ప్రహరీలు నిర్మించి చిన్న గుడిసెలో, ఏసీ షీట్లతో గదులో వేశారు. కొన్ని చోట్ల అయితే ప్రార్థనా మందిరాలు సైతం కట్టేశారు. అయితే బల్దియా అధికారులు కాలనీల్లోని పార్కులు, ఓపెన్‌స్పేస్‌ల లెక్క తేల్చేందుకు నడుం బిగించింది. నమూనాగా సర్కిల్‌కు ఓ పార్కు/ఓపెన్ స్పేస్ చొప్పున లెక్కించగా.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో కబ్జాల పాలైనవి 20 వేల గజాలకు పైగా ఉన్నట్టు తేలింది. ఎంత లేదన్నా ఈ స్థలం విలువ కనిష్టంగా రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక గ్రేటర్ వ్యాప్తంగా అన్ని పార్కుల లెక్కా తీస్తే ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు కబ్జా పాలయ్యాయో చెప్పలేం. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కబ్జాల పాలైనవి కొన్నయితే, రౌడీయిజంతో పరుల పాలైనవి ఇంకొన్ని. ఇతరత్రా మార్గాల్లో ప్రైవేట్ పరమైనవి కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సర్వేలో కబ్జాపాలైనట్లు గుర్తించిన స్థలాల్లో తొలిదశలో ఒక్కో సర్కిల్లో ఒక్కో పార్కు/ఓపెన్ స్థలంలోని కబ్జాలను తొలగించి, తగిన రక్షణ ఏర్పాట్లు చేసి మున్ముందు కబ్జా కాకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఈవీడీఎం విభాగం నిర్ణయించింది. ఇందుకు ఆయా పార్కులను తగిన విధంగా అభివృద్ధి చేయడంతో పాటు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి తెలిపారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో ఆయా లేఅవుట్లలోని ఒక్కో ఖాళీ స్థలం లేదా పార్కును పరిగణనలోకి తీసుకుంటే ఉండాల్సిన మొత్తం స్థలం 47,902 చదరపు గజాలు కాగా, వాటిలో 20 వేల చదరపు గజాలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని, భద్రత కల్పించే చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. కబ్జాకు గురైన పార్కులు,ఖాళీ ప్రదేశాలు ఇలా.. ఏఎస్రావు నగర్‌లోని న్యూఫ్లోరా హోటల్ సమీపంలో, ఉప్పల్ సర్కిల్లో కాకతీయ కాలనీ, హయత్‌నగర్‌లో జైపురికాలనీ, ఎల్బీనగర్లో అగ్రికల్చర్ కాలనీ, సరూర్‌నగర్‌లో జైస్వాల్ కాలనీ, మలక్‌పేట సర్కిల్లో సెయింట్ డోమ్నిక్స్ స్కూల్ పక్కన, సంతోష్‌నగర్‌లో సింగరేణి కాలనీ, చాంద్రాయణగుట్టలో రాజన్నబౌలి దగ్గర, ఫలక్‌నుమాలో బహదూర్‌పురా హౌసింగ్‌బోర్డు కాలనీ, రాజేంద్రనగర్ సర్కిల్లో గోల్డెన్ హైట్స్ కాలనీ, మెహదీపట్నంలో ఏజీఎస్ ఆఫీస్ కో–ఆపరేటివ్ సొసైటీ, కార్వాన్లో సాలార్జంగ్ కాలనీ, కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, గోషామహల్ సర్కిల్లో మహేశ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో ప్రశాసన్‌నగర్, అంబర్‌పేట సర్కిల్లో పటేల్‌నగర్, మల్కాజిగిరిలో దుర్గానగర్, బేగంపేటలో సింధికాలనీ, యూసుఫ్‌గూడలో మధురానగర్ ఎఫ్ బ్లాక్, శేరిలింగంపల్లి సర్కిల్లో నల్లగండ్ల, చందానగర్‌లో భవానీపురం కాలనీ, ఆర్సీపురం, పటాన్చెరు సర్కిల్లో సింఫనీకాలనీ, మూసాపేట సర్కిల్లో కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కూకట్‌పల్లిలో ఆదిత్యానగర్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్‌రెడ్డి కాలనీ, గాజులరామారంలో మిథిలానగర్, అల్వాల్ సర్కిల్లో తిరుమల ఎన్క్లేవ్ ప్రాంతాలు ఉన్నట్లు విజిలెన్స్ సర్వేల్లో గుర్తించారు. 30 సర్కిళ్లలో వెరసి దాదాపు వంద ఆక్రమణలు జరిగాయి. -
హోటల్‌పై విజిలెన్స్ దాడి
శ్రీకాకుళం ,లావేరు: మండలంలోని సుభద్రాపురం గ్రామంలో ఓ హోటల్‌పై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. 8 గ్యాస్ సిలిండర్లను (ఇంటి అవసరాలకు వినియోగించేవి) సీజ్ చేసి, హోటల్ యజమాని వెంకటరమణపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్ఐ కిరణ్‌కుమార్, ఆర్ఐ ఆర్.శ్రీనివాసరావు, వీఆర్వో జగదీష్ హోటల్లో తనిఖీలు చేపట్టారు. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ ఎస్ఐ కిరణ్‌కుమార్ ఆర్ఐ శ్రీనివాసరావుకు అప్పగించారు. -
నిఘా.. నిద్ర నటిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేయి తడిపితే చాలు.. హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి డివిజన్‌పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదే బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారిని ఫోన్లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్‌లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్‌రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది. రిపోర్టులేవి..? ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పాలన గాడి తప్పినట్టేనా? ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు. -
కల్తీపై విజిలెన్స్ కొరడా
ఒంగోలు: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆహార పదార్థాల తనిఖీ విభాగం, తూనికలు కొలతల శాఖ అధికారులు నగరంలో గురువారం సంయుక్తంగా పలు బేకరీలు, షాపులపై కొరడా ఝులిపించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పదార్థాల తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సామూహికంగా దాడులు నిర్వహించారు. నగరంలోని కావేరి గ్రాండ్ హోటల్లో చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ శాంపిల్స్ సేకరించారు. స్థానిక పాత మార్కెట్ సెంటర్లోని హిందూస్థాన్ హోటల్లో మటన్ కర్రీ శాంపిల్ తీశారు. స్థానిక పద్మాలయ బేకరీలో రంగురంగుల కేకులు, పలు రకాల వస్తువులను గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ బీటీ నాయక్ మాట్లాడుతూ అదనపు ఎస్పీ రజని, డీఎస్పీ అంకమ్మరావుల ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులతో కలిపి సంయుక్తంగా రెండు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మటన్, చికెన్లకు సంబంధించి నిల్వ ఉన్న పదార్థాలా కాదా అనేది ల్యాబ్‌కు పంపి నిర్థారణ చేస్తామని వివరించారు. పద్మాలయ బేకరీలో కేకులు, దిల్‌పసంద్‌లు శాంపిల్స్ తీసుకున్నామన్నారు. కేకులపై చాక్లెట్ కలర్ క్రీమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని, తాము సీజ్ చేసిన ఆరు డబ్బాలు పది నెలల గడువు మీరాయన్నారు. మరో వైపు బ్రెడ్లకు సంబంధించి ప్యాకింగ్ నిబంధనలు పాటించడం లేదని, ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ నంబర్ కూడా ప్యాకింగ్‌లపై ఉండటం లేదన్నారు. పలు కూల్డ్రింకు బాటిళ్లు కూడా గడువు మీరి ఉన్నాయన్నారు. ప్రధానంగా అధిక మోతాదులో రంగు కలిగిన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని, వ్యాపారులు మాత్రం నిల్వ ఉన్న పదార్థాలు విక్రయించడంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అధిక రంగులు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము గుర్తించిన ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ విభాగం జిల్లా అధికారి వీర్రాజు నేతృత్వంలో సీజ్ చేసి ల్యాబ్‌కు పంపుతామని, ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ బీటీ నాయక్, టీఎక్స్ అజయ్‌కుమార్, ఎస్ఐ వెంకట్రావు, హెడ్‌కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శివకుమార్, నరసయ్య, తహసీల్దార్ శామ్యూల్‌పాల్, తూనికలు, కొలతల శాఖ అధికారి అనీల్, ఆహారపదార్థాల తనిఖీ అధికారి వీర్రాజు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో విజిలెన్స్
సాక్షి విశాఖపట్నం , నెట్వర్క్: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల పనితీరు, ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బృందాలు అనంతగిరి, గొలుగొండ, నర్సీపట్నం, రావికమతం, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, దేవరాపల్లి పీహెచ్‌సీల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నదీ లేనిదీ పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలు ఎలా అందిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ల్యాబ్, మందుల గదులను పరిశీలించారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిలెన్స్ అధికారిణి పైల రేవతి ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.ప్రమీలను పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలపై ఆరా తీశారు. నిత్యం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న ఆస్పత్రి పరిసరాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారి రేవతి సూచించారు. గొలుగొండలో విజిలెన్స్ అధికారి సత్యకుమార్ వైద్యాధికారి పద్మప్రియను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతగిరిలో సీఐ మల్లికార్జున్ నేతృత్వంలోని అధికారులు వైద్యాధికారి షాహినాబేగంతో మాట్లాడి పూర్తిస్థాయిలో మందులున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. డీఎస్పీ పీఎం నాయుడుతో కూడిన బృందం రావికమతం పీహెచ్సీలో తనిఖీలు చేపట్టింది. సరఫరా అయిన మందులు, వాటిలో కాలం చెల్లినవి ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా సగం మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదని గుర్తించారు. రాంబిల్లి, అచ్యుతాపురం పీహెచ్‌సీలను విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు తనిఖీ చేశారు. అంతకు ముందు విజిలెన్స్ అధికారి సత్యవతి రికార్డులు పరిశీలించారు. ముందుగా తయారుచేసుకున్న చెక్‌లిస్ట్ ప్రకారం వివిధ అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలు, వసతిగృహాల్లో నెలవారీ వైద్య శిబిరాలు నిర్వహించిందీ లేనిదీ తెలుసుకున్నారు. డెంగ్యూ, విష జ్వరాలప్పుడు గ్రామాల్లో చేపట్టిన వైద్యశిబిరాల్లో వినియోగించిన మందుల వివరాలు అడిగారు. ఆస్పత్రి కోసం కొనుగోలు చేసిన పరికరాలను ఆమె పరిశీలించారు. నర్సీపట్నం మండలం వేములపూడి పీహెచ్సీలో విజిలెన్స్ జియాలజిస్ట్ బైరాగినాయుడు తనిఖీలు చేపట్టారు. మందులు, స్టాక్ రిజిస్టర్‌ను సరి చూశారు. ఎంత మంది సిబ్బంది, ఎక్కడెక్కడ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నదీ వైద్యాధికారి ఎ.సౌమ్యను అడిగి తెలుసుకున్నారు. వివిధ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందని వైనాన్ని తెలుసుకున్నారు. అన్ని వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
హోటళ్లు, బేకరీలపై విజి‘లెన్స్’
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కలిసి హోటళ్లు, బేకరీలు, జ్యూస్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల ఎంఆర్పీ ఉల్లంఘన, అపరిశుభ్ర వాతావరణం, ఆహారంలో నాణ్యత లోపం, కాలం చెల్లిన వస్తువుల వినియోగాన్ని గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ కె.సి వెంకటయ్య ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు వి.సుధాకర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులు ఆర్టీసీ ఆవరణలోని ఓంసాయి హోటల్లో తనిఖీలు చేపట్టారు. నాసిరకం ఆహార పదార్థాల విక్రయం, హోటల్ కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండడాన్ని గుర్తించారు. పెరుగు దుర్ఘందం వెదజల్లుతుండడంతో వాటి శాంపిల్స్‌ను సేకరించారు. హోటల్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హోటల్ లీజ్‌ను రద్దు చేయాలని సూచించారు. పెరుగు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా హోటల్‌పై కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అదే క్రమంలో బస్టాండ్ ఆవరణలోని ఓ ఫ్రూట్‌జ్యూస్ షాపులో తనిఖీలు చేశారు. ఎంఆర్పీ ఉల్లంఘన, కాలం చెల్లిన 10 మ్యాంగో జ్యూస్ ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేసి దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బస్టాండ్ ఆవరణలోని పలు దుకాణాల్లో ఎంఆర్పీ ఉల్లంఘన, కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తున్నా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విజిలెన్స్ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. సాయంత్రం మాగుంట లేఅవుట్లోని జోష్ బేకరీలో విజిలెన్స్, ఫుడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ నాసిరకంగా ఉండడంతో ఐస్‌క్రీం శ్యాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నారు. కాలం చెల్లిన ఆరు పాల ప్యాకెట్లు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. తీరు మారని హోటల్ నిర్వాహకుడు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని హోటల్‌పై ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసి అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అయినా నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికే అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండడం విజిలెన్స్ తనిఖీల్లో మరోమారు తేటతెల్లమైంది. కిచెన్‌లోని పలు ప్రాంతాల్లో పాచి పెద్దఎత్తున పేరుకుపోయి ఉండడం, పాత్రలు సరిగా శుభ్రం చేయకుండా ఉండడం, చెత్తాచెదారాలను అక్కడే వేసి ఉండడంతో ఈగలు ముసిరి ఉండడాన్ని అధికారులు గుర్తించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
విజిలెన్స్ తనిఖీలు.. పెట్రోల్ బంక్ సీజ్
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: పోలవరం మండలం కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. బంక్‌లో నాణ్యతా ప్రమాణాలు, రికార్డు, స్టాకు, వసతులను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బి.అచ్యుతరావు ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగిందన్నారు. బంక్‌లో పెట్రోల్ 138 లీటర్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. 6ఎ కేసు నమోదు చేసి బంక్ సీజ్ చేయడం జరిగిందన్నారు. బంక్‌లో పెట్రోల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందన్నారు. బంక్‌లపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. కొలతల ప్రకారం డీజిల్, పెట్రోల్ పరిశీలించామన్నారు. పెట్రోల్‌లో కల్తీ ఉన్నాయా లేదా అనేది పరిశీలించడం కోసం శాంపిల్స్ కూడా సేకరించామన్నారు. రికార్డులు కూడా సక్రమంగా లేవని తెలిపారు. బంక్‌లో భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిపారు. బంక్‌లో మెయింటెనెన్స్, కండీషన్స్ అన్ని పరిశీలించామన్నారు. జేసీ కోర్టుకు కేసు తీసుకువెళతామని అప్పటివరకు బంక్ సీజ్ చేయడం జరుగుతుందన్నారు. బంక్‌ను ఏఎస్‌ఓకు అప్పగించినట్టు తెలిపారు. ఈ తనిఖీలో ఏజీ జి.జయప్రసాద్, ఏఎస్ఓ పి.భాస్కరరావు, పోలవరం సీఎస్‌డీటీ షేక్ సలీమ్, హెచ్‌సీ వెంకటేశ్వరరావు వీఆర్ఓ ఎ.సాయికృష్ణ పాల్గొన్నారు. -
మొండి బకాయిలపై కొరడా..!
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించిన బకాయిల వసూళ్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. విజిలెన్స్ సీఐ నాగరాజు ఆయా షాపింగ్ కాంప్లెక్స్‌ల గదుల్లో ఉన్నవారిని పిలిపించి విచారణ చేశారు. షాపు యజమానులతోపాటు ఆర్ఓ మునికృష్ణారెడ్డి, సంబంధిత మున్సిపల్ సిబ్బందిని విచారించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎస్బీఐ షాపింగ్ కాంప్లెక్స్, వసంతపేట షాపింగ్ కాంప్లెక్స్, టీబీ కాంప్లెక్స్, కోనేటి కాలువ వీధి కాంప్లెక్స్, మార్కెట్ కాంప్లెక్స్, శివాలయం వీధి కాంప్లెక్స్‌ల్లో మొత్తం 215 షాపింగ్ గదులు ఉన్నాయి. వీటిలో 61 వాటికి సంబంధించి ఏళ్లతరబడి బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం రూ.2.32 కోట్లుగా అధికారులు గుర్తించారు. విజిలెన్స్ సీఐ వెంట హెడ్‌కానిస్టేబుల్ హరి, సిబ్బంది ఉన్నారు. అన్ని గదులు ఖాళీనే.. ఎస్బీఐ కాంప్లెక్స్ పరిధిలో 19 గదులను, వసంతపేట కూరగాయల మార్కెట్ పరిధిలోని కాంప్లెక్స్‌లో 22 గదులను రూ.కోట్లు వెచ్చించి మున్సిపాలిటీ నిర్మించింది. వీటి నిర్మాణం తర్వాత రాజకీయ కారణాల వల్ల మూడేళ్ల పాటు ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. ఎట్టకేలకు 2015 జనవరి 15న వీటికి వేలం పాట నిర్వహించారు. ఎస్బీఐ కాంప్లెక్స్‌లో 13, వసంతపేట షాపింగ్ కాంప్లెక్స్‌లో 11 గదులకు వేలం నిర్వహించారు. ఈ ప్రకారం షాపుల యజమానులు బకాయిలు ఉన్నట్లు ప్రతి నెలా మున్సిపల్ అధికారులు రికార్డులో రాసుకుంటున్నారు. వాస్తవానికి ఎస్బీఐ కాంప్లెక్స్‌లో ఒకటి, వసంతపేట కాంప్లెక్స్‌లో నాలుగు గదులను నడుపుతున్నారు. అయితే విద్యుత్ మీటర్లు, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో లీజుకు తీసుకున్న గదులను కూడా కొంతమంది వినియోగించడం లేదు. ఈ రెండు కాంప్లెక్స్‌లకు సంబంధించే రూ.65 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం. గదిని వినియోగంచలేదు ఎస్బీఐ కాంప్లెక్స్‌లో తనది 9వ గది. విద్యుత్ మీటర్ లేని కారణంగా తాను ఇంకా గదిని వినియోగించలేదు. ఇక్కడ మాత్రం బకాయి ఉన్నట్లు రాశారు. నా పేరు మీద రూ.3,57,500 బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.– జాఫర్ బాషా, దుకాణదారుడు -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు
విజయనగరం,చీపురుపల్లి: పట్టణ శివారు రావివలస రోడ్లో గల సాయిలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ (రైస్‌మిల్లు)తో పాటు అదే రైస్‌మిల్లుకు ప్రజాపంపిణీ బియ్యం (పీడీఎస్) సరఫరా చేస్తున్న ఆటోపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజాపంపిణీ బియ్యం ఆ మిల్లులో ఉన్నాయన్న అనుమానంతో దాడులు చేపట్టగా.. వారు ఊహించిన విధంగా వందల క్వింటాల బియ్యం పట్టుబడ్డాయి. దీంతో పాటు రికార్డులు పరిశీలించగా అందులో ఉన్న లెక్కలకు, మిల్లులో ఉన్న స్టాకు సంబంధం లేకపోవడంతో దాదాపు రూ.40 లక్షలు విలువైన స్టాకు సీజ్ చేసి మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 30వై 2405 ఆటోలో పది బస్తాల పీడీఎస్ బియ్యం తరలిపోతున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చీపురుపల్లి – లావేరు రోడ్డులో కనకమహాలక్ష్మి ఆలయం వద్ద పట్టుకున్నారు. బియ్యాన్ని సాయిలక్ష్మి ట్రేడింగ్ కంపెనీకి తరలిస్తున్నట్లు చీపురుపల్లి మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన కిల్లంశెట్టి గణపతిరావు తెలిపారు. దీంతో విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది సాయిలక్ష్మి రైస్‌మిల్లుపై దాడి చేపట్టారు. అదే సమయంలో రైస్ మిల్లులో అన్లోడింగ్ జరుగుతున్న 19.5 క్వింటాళ్ల (39 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకున్నారు. అంతేకాకుండా రైస్ మిల్లులో 25.5 క్వింటాళ్ల (51 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యం నిల్వలు కూడా గుర్తించారు. అలాగే రైస్‌మిల్లు రికార్డుల్లో బియ్యం 1237 క్వింటాళ్లు... బ్రోకెన్ రైస్ 48.05 క్వింటాళ్లు.. బ్రౌన్ రైస్ 23.05 క్వింటాళ్లు ఉన్నట్లు రాసి ఉండగా నిల్వ ఉన్న స్టాకులో తేడాలున్నట్లు నిర్ధారించారు. దీంతో సుమారు 40 లక్షల రూపాయల విలువైన స్టాక్‌ను సీజ్ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్పీ హరికృష్ణ తెలిపారు. భారీ స్థాయిలో అక్రమ రవాణా.... ప్రజాపంపిణీ బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ హరికృష్ణ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్ చేపట్టి అనంతరం సన్నబియ్యంగా మార్కెట్‌కు తరలిస్తున్నారని చెప్పారు. చీపురుపల్లి కేంద్రంగా ఈ దందా ఎక్కువగా కొనసాగుతోందన్నారు. బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా రవాణాశాఖాధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో డీఎస్పీ భార్గవనాయుడు, సీఐలు చంద్ర, కృష్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథ్, సీఎస్‌డీటీ బి.ఈశ్వరరావు, వీఆర్ఓ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
లంచాల కోసం.. ఏకంగా కార్యాలయం!
వేలూరు (తమిళనాడు): లంచాలు వసూలు చేసేందుకు ఏకంగా కార్యాలయాన్నే నడపడంతో పాటు 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఓ అధికారి. విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు సత్‌వచ్చారిలో టౌన్‌ప్లానింగ్ జోన్ అసి స్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో సుబ్రమణియన్ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతిలేని ఇళ్ల స్థలాలు, పరిశ్రమలకు అనుమతులిస్తూ ఉంటాడు. అక్కడి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం కార్యాలయంలో విజిలెన్స్ డీఎస్పీ శరవణకుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారిలోని వివేకానందనగర్‌లో సుబ్రమణియన్.. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఓ రిటైర్డ్ అధికారిని నియమించుకున్నాడు. ఆయన కింద 37మంది సిబ్బందిని నియమించి లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో రూ.3 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకుని, సుబ్రమణియన్‌ను అరెస్ట్ చేశారు. -
వైద్యశాఖపై విజి‘లెన్స్’
ఆదాయపు పన్ను మినహాయింపునకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి గృహరుణాలు పొందినట్లు కొందరు ఉద్యోగులు సమర్పించిన తప్పుడు అఫిడవిట్లపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంఅండ్‌హెచ్‌ఓ) పరిధిలో పనిచేసే ఉద్యోగులతో పాటు, మలేరియా విభాగం, సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 50 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు తేల్చారు. ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ గుట్టు రట్టయిందని సమాచారం. లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఉద్యోగులు చేసిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రుణాలు తీసుకున్నామంటూ గుట్టుగా సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలేనని నిర్థారించారు. ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. మరింత మంది ఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా మలేరియా విభాగంలో ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ బాగోతం బహిర్గతమైంది. ఆదాయపు పన్ను మినహాయింపునకు తప్పుడు పత్రాలు సమర్పించిన గుట్టు బయటకు పొక్కింది. కొందరు ఉద్యోగులు తప్పుడు పత్రాలతో పన్ను మినహాయింపు పొందుతున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు, విజిలెన్స్‌కు లేఖలు రాశారు. దీంతో ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చింది. విచారణ కోసం వచ్చిన ఉద్యోగులు తామే కాదు... మరింత మంది అలా తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొనడంతో ఆ జాబితా రోజు రోజుకు చాంతాడులా పెరుగుతూ వచ్చింది. మలేరియాతో పాటు, డీఎం అండ్ హెచ్ఓ పరిధిలోని సిబ్బంది, విజయవాడ ప్రభుత్వాస్పత్రి, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలల్లోని పలువురు ఉద్యోగులు ఇలాంటి తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చాయి. ఏటా అంతే.... వైద్య ఆరోగ్యశాఖలో నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకూ జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆదాయపు పన్ను పరిధిలోకి రావడంతో పన్ను నుంచి మినహాయింపు కోసం దొడ్డిదారులు వెతికారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు పొందినట్లు అఫడవిట్లు సృష్టించి ఒక్కో ఉద్యోగి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ పన్ను రాయితీ పొందినట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల వివరాల సేకరణ... వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల నాలుగేళ్ల ఆదాయపు పన్ను వివరాలు తమకు తెలియపర్చాలంటూ విజిలెన్స్ విభాగం ఆయా శాఖల అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరింది. అందులో భాగంగా 2013–14, 2014–15, 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల డేటా ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రి, డెంటల్ కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ డీఎస్పీ విజయపాల్, మరలా మంగళవారం రానున్నట్లు సమాచారం. అప్పటికి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారని తెలిసింది. మలేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తప్పుడు పత్రాలు సమర్పించిన ఉద్యోగులను ఇప్పటికే గుర్తించారు. దీంతో పలువురు ఉద్యోగులు రికవరీ పొందిన మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించేసినట్లు తెలిసింది. ఈ విషయమై విజిలెన్స్ అధికారులను వివరణ కోరగా, విచారణలో ఉన్నందున వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
విజిలెన్స్ అధికారులమంటూ కాంగ్రెస్ నాయకుల హల్చల్
పులివెందుల : పులివెందులలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చార్లెస్‌తోపాటు పులివెందులకు చెందిన ఆ పార్టీ నాయకులు విజిలెన్స్ అధికారులమంటూ పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం పట్టణంలోని వినాయకుడి విగ్రహం వద్ద హోటల్లో విజిలెన్స్ అధికారులమంటూ కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు పాల్పడుతుండటంతో.. హోటల్ యజమాని వారితో వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు నెలలుగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలోని హోటళ్ల యజమానులు, వ్యాపారస్తులతో కలసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చార్లెస్‌తోపాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కల్తీ పాలపై విజిలెన్స్ కొరడా
అనంతపురం సెంట్రల్: కల్తీ పాల తయారీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. కల్తీ పాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్న అనంతపురంలోని కమలానగర్లో గల కుమార్ ఏజెన్సీపై బుధవారం దాడులు నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం ఏడావులపర్తిలో కల్తీ పాల తయారీని గుట్టురట్టు చేసిన విషయం విదితమే. కల్తీపాలదారుడైన లక్ష్మీపతీకి నకిలీ పాల తయారీలో ఉపయోగించే మురళి మిల్క్ పౌడర్‌ను కమలానగర్‌లోని కుమార్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. తూనికలు, కొలతలశాఖ, ఆహార కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వివిధ రకాలైన పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీం తయారీకి సంబంధించిన ముడి పద్దార్థాలను బిల్లులేవీ లేకుండా విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు గోపాలకృష్ణ అధికారుల విచారణలో ఒప్పకున్నాడు. దీంతో సదరు సరుకును సీజ్ చేసి ల్యాబ్‌కు పంపారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు మహబూబ్‌బాషా, విశ్వనాథచౌదరి, డీసీటీఓ జిలాన్‌బాషా, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య, తూనికలు, కొలతలశాఖ సీఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులను వండుతున్నారు!
అందమైన ప్యాకింగ్.. ఆకట్టుకునే ప్రచారం.. ఇవే ఇప్పుడు వ్యాపార రహస్యాలు.ఆ వస్తువులోని నాణ్యత.. తయారీ ప్రాంతంలో పాటిస్తున్న ప్రమాణాలు ఇవేవీ కనిపించకపోవడంతో ప్రజలు బోల్తా పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలో విజిలెన్స్ అధికారులుఓ ఆయిల్ ట్రేడర్ దుకాణంలో తనిఖీ నిర్వహించగా బొద్దింకలుకలగలిసి వంటనూనె గుట్టు రట్టయింది. రూ.10లక్షల విలువ చేసే సరుకును అధికారులు సీజ్ చేశారు. అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వంటనూనె తయారీదారుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో, బొద్దింకల అవశేషాలతో కూడిన నూనె తయారు చేసి, ప్రజలకు అంటగడుతున్నాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకెళితే... విజయకుమార్ అనే వ్యాపారి పాతూరులోని తిలక్‌రోడ్డులో వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండానే రైతుల నుంచి వేరుశనగ కొనుగోలు చేసి, స్వయంగా నూనె తయారు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి యంత్రాలను శుభ్రం చేయకుండా అలానే వినియోగిస్తున్నాడు. అపరిశుభ్రతతో ఆ పరిసర ప్రాంతం కంపు కొడుతోంది. బొద్దింకలు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. తయారు చేసిన వేరుశనగ నూనెలో బొద్దింకలు పడి మృతిచెందాయి. అయినా నిర్వాహకుడు వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. డబ్బు యావలో పడి ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించాడు. దుకాణం సీజ్ : వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ దుకాణంపై సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు హానికలిగించే రీతిలో ఆయిల్ తయారీ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్ఐ రామకృష్ణయ్య గుర్తించారు. దీంతో దాదాపు రూ. 10లక్షలు విలువజేసే వేరుశనగనూనె, పామాయిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు దుకాణాన్ని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బెదిరింపుల కేసులో విలేకరి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : డబ్బు ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు చెప్పి దాడులు చేయిస్తానని బెదిరించిన సంఘటనలో ప్రొద్దుటూరులోని అమృతానగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌రఫి అనే ఒక పత్రికా (సాక్షి కాదు) విలేకరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి గురువారం సాయంత్రం స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రఫి ఒక పత్రికా విలేకరిగానేగాక ఏపీ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతను ఈ నెల 24న వసంతపేటకు చెందిన దొంతు ఓబులేసు కుమార్ అనే కిరాణా వ్యాపారి ఇంటికి వెళ్లాడు. తాను ఏపీ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడినని చెప్పి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండు చేసి రూ. 500 తీసుకున్నాడు. మిగతా డబ్బు రేపటిలోగా ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి దాడులు చేయిస్తానని బెదిరించాడు. మిగిలిన డబ్బు ఇవ్వకపోవడంతో పలు మార్లు ఓబులేసుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో దుకాణయజమాని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రఫిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్ఐ ఎంఏ ఖాన్ అతన్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. బెదిరింపులకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను కూడా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు. -
ఆదాయానికి మించి ఆస్తులు
జయపురం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో అండ్‌బీ విభాగ ఎస్డీఓను జయపురం విజిలెన్స్ విభాగ అధికారులు శుక్రవారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివిధ ప్రాంతాలలో గల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి లక్షలాది రూపాయల ఆస్తులను కనుగొన్నారు. జయపురం విజిలెన్స్ విభాగ అధికా రులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ఆర్అండ్బీ కార్యాలయంలో ఎస్‌డీఓగా పనిచేస్తున్న హిమాంశు శేఖర మండల్ ఉమ్మరకోట్ నుంచి ఓఆర్‌టీసీ బస్సులో ఆయన స్వగ్రామం బరంపురం వెళ్తుండగా జయపురం విజిలెన్స్ అధికార బృందం జయపురంలో మాటు వేసి ఆయనను బస్సులోనుంచి దింపి జయపురంలో గల విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి తీసుకుపోయారు. కార్యాలయంలో ఆయనను తనిఖీ చేసి రూ.లక్షా 28 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో ఆయనకు గల ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ దాడులలో ఉమ్మరకోట్‌లో గల ఆయన నివాస గృహంలో రూ.30,800, ఎస్బీఐ పాస్ బుక్ లభించగా..భువనేశ్వర్‌లోని సుందరపదలో ఒక ఇల్లు, బరంపురంలోని కొడాసింగ్ ప్రాంతంలో నిర్మాణంలో గల ఒక భవనం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వాటితో పాటు విలువైన అనేక వస్తువులు కనుగొన్నట్లు విజిలెన్స్ ఎస్పీ హరేకృష్ణ బెహరా వెల్లడించారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి కోరు ్టకు తరలించినట్లు వెల్లడించా రు. ఈ దాడిలో విజిలెన్స్ జయపురం డీఎస్పీ హేనరీ కులు, ఇన్స్పెక్టర్లు శరత్ చంద్ర సాహు, బి.రుద్రయ్య, ఏఎస్ విశ్వరంజన్ బెహరా, సీతాంశు పట్నాయక్ నవరంగ్‌పూర్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దీనబంధు బెహరా పాల్గొన్నారు. -
అంతా గప్‌చుప్..!
పుష్కర పనుల్లో అవినీతి రాజ్యమేలింది.. ప్రభుత్వ అండతో దోచుకున్నారు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు.. కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో డొల్లతనం బయటపడింది.. నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది.. తాజాగా ఏసీబీ అధికారులు తనిఖీల చేపట్టారు.. కాని కథ అడ్డం తిరిగింది.. జిల్లా మంత్రి రంగంలోకి దిగారు.. తనిఖీలు నిలిచిపోయినట్లు సమాచారం. అమరావతిబ్యూరో/పటమట: పుష్కరాల సందర్భంగా ఘాట్ల నిర్మాణంలో అవినీతిని బట్టబయ్యాలు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. సుమారు 220 పనులపై వెచ్చించిన రూ.200 కోట్లు పనులపై ఆరా తీశారు. ఈ నెల 15 నుంచి 31 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు, పుష్కర ఘాట్లు పరిశీలించి బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. తొలిరోజు హడావిడి చేసిన అధికారులు పటమట, సత్యనారాయణపురంలోని పలు రోడ్లు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. కార్పొరేషన్‌లోని ఇంజినీరింగ్ సెక్షన్‌లోని ఆయా పనులకు సంబంధించి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కథ అడ్డం తిరిగింది.. పుష్కార పనుల్లో ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. తాజాగా ఏసీబీ అధికారులు దాడికి దిగారు. దీంతో కాంట్రాక్టుర్లు, అధికారులు కంగుతిన్నారు. రాజకీయ నిర్ణయాలతో అధికారులను ఇబ్బంది పెడతారా అంటూ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు.. అభివృద్ధి చేసినందుకు తాము చేసిన పనులపైనే విచారణ చేపట్టడం తమను అవమానించినట్లేననని కార్పొరేటర్లు ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న జిల్లా మంత్రికి మొరపెట్టుకున్నారు. అంతే సదరు మంత్రి చక్రం తిప్పినట్లు సమాచారం. పుష్కర పనులపై ఏసీబీ విచారణ అర్థంతరంగా నిలిచిపోయినట్లు సమాచారం. అంచనాలతో సంబంధం లేకుండా పనులు ♦ పటమటలోని భద్రయ్యనగర్‌లో 400 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు అంచనాలుంటే అంతే విస్త్రీర్ణం ఉన్న రోడ్డును సత్యనారాయణపురంలో రోడ్డుకు రూ.75 లక్షలు ఖర్చు పెంచారు. ♦ బీఆర్పీరోడ్డు, పశ్చిమ రైల్వే స్టేషన్ సమీపంలోని కాళేశ్వరరావు మార్కెట్ వరకు రోడ్డు వేయటానికి రూ.1.56 కోట్లు అంచనాలు వేయగా దీన్ని రూ.1.46 కోట్లకు కాంట్రాక్టర్ దక్కించుకుని తూతూ మంత్రంగా రోడ్డు వేయటంతో అదే ఏడాది వర్షాలకు అదికాస్త కొట్టుకుపోయింది. ♦ జీఎస్‌రాజు రోడ్డు నిర్మాణానికి 9.96కోట్లు అంచనాలు వేయగా దీన్ని రూ.9.17 కోట్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. ఆరునెలల్లోనే రోడ్లు దెబ్బతిన్నాయని ఫిర్యాదు వచ్చాయి. ♦ పటమట పంటకాలువ రోడ్డు, రైతు బజారు, హైస్కూలు రోడ్డు నిర్మాణానికి రూ. 8.86 కోట్లుతో నిర్మించగా అక్కడ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌కు ఉండగా మరమ్మతులకు గురైనా పట్టించుకోవటంలేదు. నామినేషన్ పద్ధతిలోనే.. సాధారణంగా అభివృద్ధి పనులు చేసేందుకు ఈ– ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. అయితే 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాలు పనులకు ఆరు నెలల ముందు మాత్రమే టెండర్లు పిలవటం, అదీ నామినేషన్ ప్రాతిపదికన కేటాయింపులు జరగటంతో ఆయా పనులు అవినీతితో మునిగిపోయాయి. పుష్కర పనులకు సంబంధించి దాదాపు 80 శాతం పనులు ఆరునెలల కాలంలోనే కేటాయింపులు జరిగాయని అధికారులే చెబుతున్నారు.. ఈ విధానాకికి అప్పట్లో ఇక్కడ పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి సహకారం కూడా ఉండటంతో పనులన్నీ కౌన్సిల్ తీర్మానం జరగకుండా కేటాయింపులు జరిగాయని ప్రధాన ఆరోపణ. పర్సంటేజ్‌లో తేడాలొచ్చాయనా... కార్పొరేషన్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారులు ప్రతి పనికి పర్సంటేజ్ని ఆశించటం సహజం. ఈ నేపథ్యంలో పబ్లిక్‌వర్క్స్ విభాగంలోని ఓ అధికారి ఇప్పటి వరకు ఇచ్చే పర్సంటేజ్ చాలటంలేదని తనకు పర్సంటేజ్ పెంచాలని పేచీ పెట్టడంతో ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు బట్టబయలయ్యాయని విశ్వసనీయ సమాచారం. -
తెర వెనక ఎవరు..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వేర్లను వదిలేసి పైపై కొమ్మలను కొడుతుండడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. దాడులు జరుగుతున్న సందర్భాల్లో ప్రధాన వ్యక్తులను పక్కకు తప్పిస్తుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతూనే ఉంది. దీంతో పేదలకు ప్రభుత్వం అందించే రూపాయికి కిలోబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గ్రహించి అక్రమ రవాణా చేస్తున్నవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వరుస దాడులు చేయడంతోపాటు పీడీ యాక్టు సైతం ప్రయోగిస్తోంది. అయితే.. ఎన్ని సార్లు దాడులు జరిగినా, తిరిగి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా వ్యవహరించే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా సజావుగా సాగినంత వరకు వీరే అన్ని తామై వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఏదైనా తేడా వచ్చి దాడులు జరిగి బియ్యంతో పట్టుబడిన సందర్భాల్లో నేర్పుగా పక్కకు తప్పుకుని కింది స్థాయి వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఫలితంగా బియ్యం అక్రమ రవాణా కొంత కాలం మందగించినా ... మళ్లీ తిరిగి జోరుగా సాగుతోంది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక లారీ లోడు బియ్యం వరంగల్ నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం. కేసుల్లో ఉండరు తొర్రూరు, జనగామ ఏరియాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ట్రాలీల ద్వారా వరంగల్‌లో ఉన్న ప్రధాన కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. లారీకి సరిపడా లోడు రాగానే.. వెంటనే వరంగల్ నుంచి తరలిస్తున్నారు. ఈ తరహాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పక్కా సమాచారం లభించడంతో మంగళవారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట శివారు సింగారం క్రాస్ సమీపంలో 500 క్వింటాళ్ల నిల్వ చేసిన బియ్యాన్ని స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్సు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు వ్యక్తి ఎక్కడ.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో కొబ్బరికాయల వ్యాపారం చేసి... ప్రస్తుతం బియ్యం అక్రమ రవాణాలో కీలక వ్యక్తిగా మారాడు. ఇతను సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అనేక సార్లు స్థానికంగా ఉన్న పోలీసులు, విజిలెన్సు సిబ్బందికి అందించినా ఫలితం లేకుండా పోయింది. లోకల్ స్థాయిలో పోలీసు సిబ్బందితో ఉన్న పరిచయాల కారణంగా ఎప్పటికప్పుడు సేఫ్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పక్కా ఆధారాలతో సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. దీనికి సంబంధించి కనీసం స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నారు. మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తామంటూ మిల్లును లీజుకు తీసుకుని, బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మార్చినట్లు ఇప్పటికే తేలింది. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు, అతనికి అండదండలు అందిస్తున్న వారు ఎవరు అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 మంది వ్యాపారులపై కేసు నమోదు మామునూరు: ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామ శివారు సింగారం గ్రామ ప్రధాన రహదారిలోని ఓ పాత రైస్ మిల్లు గోదాంలో ప్రజల నుంచి భారీగా సేకరించి అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ బియ్యం పట్టుబడింది. వరంగల్ మండల డిప్యూటీ తహసీల్దార్ దురిశెట్టి శ్రీధర్ ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం 11 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ సమీపంలోని సింగారం రహదారిలో ఓ పాత రైసు మిల్లు గోదాములో పలు ప్రాంతాలకు చెందిన బియ్యం వ్యాపారులు మాలగాని రమేష్, దొడ్డ శ్రీనివాస్, పులిశేరి శ్రీను, పస్తం మహేందర్, సిరిగి సంపత్, పస్తం నరేందర్, తూర్పాటి కుమారస్వామి, చిదురాల నవీన్, వెంకన్న, ఇమ్మడి సోమ నర్సయ్య, సందీప్ మొత్తం 11 మంది ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరందరూ నగర శివార్లల్లోని పాత బడ్డ భవనాలు, గోదాంలను ఎంచుకుని ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని భారీగా నిల్వ చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 425.22 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 22.17 క్వింటాళ్ల నూకలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.10,79,519 రూపాయలు ఉంటుందని అంచనా. వీటితోపాటు బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 ట్రాలీ ఆటోలను సైతం సీజ్ చేసి స్టేషన్లో ఆప్పగించారు. -
మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు
హాలియా (నాగార్జునసాగర్) : హాలియా మార్కెట్ యార్డులో మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులోని వాణిజ్య సముదాయం గోడౌన్లలో కొంతమంది ట్రేడర్లు సుమారు రెండు వేల బస్తాల కందులు అక్రమ నిల్వలు ఉంచారనే ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కేసీ ప్రమీల, విజిలెన్స్ ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యాపారులు కర్ణాటక గుల్భార్గా ప్రాంతం నుంచి కందులు కొనుగోలు చేసి మార్కెట్ యార్డులోని గోడౌన్లలో నిల్వ ఉంచారు. యార్డులో మొత్తం 13 దుకాణాలు ఉండగా 8 దుకాణాల్లో తనిఖీ చేయగా మూడు దుకాణాల్లో కందులు నిల్వలు బిల్లులు, స్టాక్ రిజిష్టర్లు తనిఖీ చేశారు. కాగా మిగిలిన దుకాణాల వ్యాపారులు స్థానికంగా లేకపోవడంతో బుధవారం తనిఖీలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు దుకాణాలకు సీల్ వేశారు. వ్యాపారులు అక్కడ రైతుల వద్ద కొనుగోలు చేశారా? లేక మధ్యవర్తి వద్దనా అన్న పూర్తి వివరాలు బుధవారం తేలే అవకాశం ఉంది. తనిఖీల్లో మార్కెట్ కార్యదర్శి శ్రీనాథరాజు రెవెన్యూ కార్యదర్శి శ్యాం పలువురు అధికారులు ఉన్నారు. మార్కెట్లో త్వరలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు నిల్వ చేసిన కందులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
చిల్లర దేవుళ్లకు.. వెయ్యి కోట్ల ‘మామూళ్లు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఎన్నో రకాల సేవలు అవసరం. అవన్నీ జనానికి ఉచితంగానే అందాలి. కానీ ఇలా మామూలుగా అందాల్సిన సేవలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మామూళ్లు’గా మారాయి. ప్రతి సేవకూ తృణమో, పణమో సమర్పించక తప్పదు కదా అన్న భావన కూడా స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఏటా ఇలాంటి చిన్న చిన్న ‘చిల్లర’లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఒక్కో శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది జేబుల్లోకి ఏటా వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు ఏసీబీ, విజిలెన్స్ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్ చేసే ‘ముడుపులు’వేరే. అవన్నీ లెక్కగడితే వేల కోట్ల రూపాయలకు చేరుతాయని అంచనా. ‘చిల్లర’లంచాల్లో రెవెన్యూ టాప్ అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. అదే క్రమంలో చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది. కలెక్టరేట్లలోనూ.. రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ‘మామూళ్లు’కోట్లకు చేరిపోయాయి. ఒక్కో జిల్లా కలెక్టరేట్లో సగటున రోజూ రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు చదివింపులు జరుగుతున్నాయని.. ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది. రవాణా శాఖలో ఏటా రూ.220 కోట్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు రకాల సేవలు అందించే రవాణా శాఖలో లంచాల పర్వం ఎక్కువగానే ఉంది. ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండకుండా అప్పటికప్పుడే పని పూర్తికావాలంటూ వాహనదారులు మామూళ్లు చెల్లిస్తున్నారని.. ఇలా రోజూ సుమారు రూ. 60 లక్షల మేర లంచంగా సమర్పించుకుంటున్నారని ఏసీబీ, విజిలెన్స్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్ ఆఫీసులలో ఒక్కో యూనిట్లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది. రిజిస్ట్రేషన్‌లో ‘మామూలే’! స్థలం అమ్మినా, కొన్నా, బదిలీ చేసినా.. ఇలా 14 రకాల సేవలు అందించే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలోనూ చిన్న చిన్న ముడుపులు మామూలైపోయాయి. రాష్ట్రంలో 22 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లోని 22 కార్యాలయాల్లో ఒక్కో దానిలో నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (మొత్తంగా 66 లక్షలు).. 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్కోదానిలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ( మొత్తంగా రూ.1.56 కోట్లు) చిల్లర లంచాలు జమవుతున్నాయి. మొత్తంగా జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్‌లో నెలకు రూ.15 కోట్లు.. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాలకు వేల కోట్ల రూపాయలు వచ్చిచేరుతున్నట్టే.. అధికారులు, సిబ్బంది జేబుల్లోకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన అధ్యయనం మేరకు.. ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర ‘మామూళ్లు’అందుతున్నాయి. జీఎస్టీతో తగ్గిన ‘వాణిజ్య’జోరు వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. జీఎస్టీ రాకముందు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారుల నుంచి రోజు వారీ చెల్లింపులు భారీగానే ఉండేవి. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెల వారీగా మాత్రమే చదివింపులు వస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ‘చిన్న మొత్తాలు’వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది. వీటిలో నెలవారీ వసూళ్లు..! సమయం, సందర్భాన్ని బట్టి ప్రజలు ఉపయోగించుకునే విభాగాల్లో.. రోజు లెక్కన కాకుండా నెలవారీగా ‘చదివింపులు’జరుగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలకు నెలవారీగా చిన్న లంచాలు అందుతున్నాయి. వీటిల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా... జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ శాఖలు అనుమతులను బట్టి మూడో స్థానంలో ఉన్నాయి. తూనికలు కొలతలు, పోలీసుశాఖ నాలుగో స్థానంలో ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ‘చదివింపులు’ ⇒ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ విభాగాల్లో అనుమతుల అవసరాలు, సందర్భాన్ని బట్టి ‘చిల్లర లంచం’సమర్పణలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో కలిపి ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిన్న మొత్తాలు’అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయి. ⇒ పోలీసు శాఖలోనూ జిల్లాల్లో నెలవారీ మామూళ్ల లెక్క కోట్లు దాటుతోంది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల పరిధిలో 740 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రాంత పోలీస్స్టేషన్లలో రూ.5 లక్షల వరకు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు ఏసీబీ అధ్యయనంలో గుర్తించింది. ఈ లెక్కన మొత్తంగా ఏటా రూ.180 కోట్ల మేర చిల్లర చెల్లింపులు ఉంటున్నట్టు తేల్చింది. ⇒ తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలిలకు కేసుల వారీగా చెల్లింపులు ఉంటున్నట్టు ఏసీబీ అధ్యయనంలో తేల్చింది. ఈ రెండు విభాగాల్లో ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిల్లర’చెల్లింపులు ఉంటున్నట్టు అంచనా వేసింది. -
విద్యుత్ బకాయిలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ తెగల(ఎస్టీలు)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలజల్లు కురిపించారు. ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలతో పాటు వారిపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. డొమెస్టిక్ కేటగిరీలో ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కూలంకషంగా చర్చించి, బకాయిలన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఎస్టీల్లోని అన్ని తెగలు, జాతులు సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎస్టీ ప్రజాప్రతినిధులే పూర్తి సమన్వయంతో ఎస్టీ తెగలు, జాతుల మధ్య ఐక్యత సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.125కే విద్యుత్ కనెక్షన్.. రూ.70 కోట్లకు పైగా ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను రద్దు చేయాలని, ఇందులో రూ.40 కోట్లను ప్రభుత్వం తరఫున విద్యుత్ సంస్థలకు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగతా రూ.30 కోట్లను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.125 మాత్రమే దరఖాస్తు ఫీజు తీసుకుని కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఇంటికి సర్వీస్ వైరు, ఇంటిలోపల వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని, 50 యూనిట్ల లోపు వినియోగించే వారి నుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టీ వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా, 8,734 గ్రామాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో పాటు ఎస్టీ వ్యవసాయదారులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని పీసీసీఎఫ్ ఝాను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రోడ్లు.. ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని, దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీల పిల్లలకు ఎంతో మేలు కలుగుతోందని, ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఆదివాసీలకు ఎక్కువ అవకాశాలు రావడానికి వీలుగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకొస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలను ఎస్టీలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు. ఇందుకోసం పథకాలు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, మహేశ్‌దత్ ఎక్కా, ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో కమిటీలు - అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు కచ్చితంగా రహదారి సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. - విద్య, స్వయంఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాంనాయక్ నేతృత్వంలో కమిటీని నియమించారు. - విద్యుత్‌కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
ఆర్టీసీలో అవినీతి ని‘రంజన్లు’!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఏర్పాటు చేసే మంచి నీటి కుండలనూ వదల్లేదు అవినీతి అధికారులు. ఆర్టీసీ సిబ్బందికి ఎండల్లో చల్లటి నీ రు అందించేందుకు రంజన్ (భారీ నీటి కూజా)లు కొన్నామంటూ దొంగ బిల్లులు సృష్టించి నిధులు కాజేశారు. ఇక ఆర్టీసీ శిక్షణ కేంద్రాలు, బస్ డిపోలు, బస్టాండ్ల వద్ద మట్టి పోయించామంటూ మరికొందరు అధికారులు బిల్లులతో డబ్బులు స్వాహా చేశారు. కండక్టర్లు పది రూపాయల లెక్క సరిగా చూపకుంటే విధుల్లోంచి తొలగించిన దాఖలాలు ఆర్టీసీలో సాధారణం. కానీ దొంగ బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజానాకు కన్నం పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా, పైపెచ్చు వారికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైన వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఇంటి దొంగలను పట్టించిన విజిలెన్స్ ఇటీవల ఆర్టీసీ విజిలెన్స్ విభాగం కొందరు ఇంటి దొంగల గుట్టు విప్పింది. తప్పుడు బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజా నాకు కన్నంపెట్టిన వారి వివరాలు సేకరించింది. అలా ఎంత మొత్తం వారి పరమైందో లెక్కలతో సహా బస్‌భవన్‌కు నివేదిక సమర్పించింది. కానీ అందులో పేర్లు నమోదైన అధికారులపై చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారు. పలు జిల్లాల్లో ఈ తంతు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో కొందరి పేర్లు డిపో మేనేజర్ల పదోన్నతుల జాబితాలో ఉం డటంతో వారి గురించి బయటకు పొక్కకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్‌కు చెందిన ఓ అధికారి రంజన్లు కొన్నట్టు, అక్కడి ఆర్టీసీ శిక్షణ కళాశాల ప్రాంగణంలో మట్టి పోయించినట్టు బిల్లులు సృష్టించి డబ్బులు తీసుకున్నారు. దీనిపై విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లటంతో విచారణ జరిపిన అధికారులు అవి తప్పుడు బిల్లులని, వాటిలో చూపినట్టుగా రంజన్లు కొనలేదని, మట్టి పోయించలేదని తేల్చారు. రికవరీ మొత్తాన్ని వదల్లేదు.. చిన్నచిన్న ప్రమాదాల్లో బస్సులు డ్యామేజ్ అయితే విచారణ జరిపి డ్రైవర్ల తప్పిదం ఉంటే వారి నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేయటం సహజం. అలా డ్రైవర్ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టకుండా ఓ అధికారి స్వాహా చేశారు. కానీ ఆ అధికారిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు అడ్డుపడ్డారు. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు అసలే ఆర్టీసీ విజిలెన్సు దాదాపు నిర్వీర్యమైంది. పర్యవేక్షించే వారు లేక కేవలం కమీషన్లు దండుకోవటం మినహా చేసేదేమీ లేదంటూ ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లాల్లోని కొందరు అధికారులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసి నివేదికలు సమర్పిస్తే ఉన్నతాధికారులు వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. విజిలెన్సు కేసుల్లో దొరికిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తే ఇక వారు డిపోలను దివాళా తీయిస్తారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అస్మదీయులకు అందలం కండక్టర్ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు.. సొంత ఖజానాకు కన్నం పెట్టే అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్లు, మట్టి పేర దొంగ బిల్లులతో డబ్బులు కాజేసిన వారు, అద్దె బస్సుల నిర్వాహకులతో కుమ్మక్కయిన అధికారులపై చర్యలు తీసుకోక పోగా.. అందులో కొందరికి డిపో మేనేజర్లుగా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో హైదరాబాద్ బస్టాండ్లలోని దుకాణాల అద్దెలు వసూలు చేసి ఖజానాకు చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వారి విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. రూ.కోట్లలో నిధులు స్వాహా చేసిన కేసులో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న విశ్రాంత ఉద్యోగులపై చర్యలు తీసుకుని, బాధ్యులైన అసలు అధికారులు వదిలిపెట్టారు. -
ఆర్టీసీలో కాల్నాగు
కాల్‌నాగులు ఆర్టీసీ కార్మికులనూ వదలలేదు. తోటి కార్మికుడే యముడయ్యాడు.కార్మికులను పీల్చిపిప్పిచేస్తున్నాడు. అతడి బారిన పడిన వారిని అన్ని రకాలుగా వేధించాడు. చివరికి యూనియన్ నేతలు కల్పించుకుని విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్మణి ఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి,అమరావతి బ్యూరో: ఆర్టీసీలో ఓ ఉద్యోగి వడ్డీ వ్యాపారి అవతారమెత్తాడు.. తోటి ఉద్యోగుల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులిచ్చాడు. అసలు మించి వడ్డీలే అధికంగా వసూలు చేశాడు. అప్పులు ఇచ్చే సమయంలో ఉద్యోగి భార్య పేరుతో ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోటు రాయించుకునే వాడు.. సకాలంలో అప్పు చెల్లించకపోతే మహిళలపై కోర్టులో కేసు వేసి వారిని మానసికంగా వేధింపులు గురిచేశాడు. అతడి ఆగడాలు శ్రుతిమించడంతో యూనియన్ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అతడి రాజకీయ పలుకబడితో చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఐదేళ్లుగా వ్యాపారం.. విజయవాడ పీఎన్బీఎస్ బస్టాండ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఐదేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే బస్టాండ్‌లో పనిచేసే ఉమామహేశ్వరరావుకు రెండేళ్ల కిందట రూ.2 లక్షల రూ.4 వంతున వడ్డీతో అప్పు ఇచ్చాడు. ప్రతినెలా వడ్డీ తీసుకునే వాడు.. రెండేళ్లకే వడ్డీ రూపంలో అసలు తీసుకొన్నాడు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల వడ్డీ చెల్లింపులో ఆలస్యం కావడంతో అసలుతో పాటు వడ్డీ చెల్లించాలనీ వేధించడం మొదలుపెట్టాడు. కొంత సమయం ఇస్తే పూర్తిగా చెల్లిస్తానని ఉమామహేశ్వరరావు వేడుకున్నా అతని మనస్సు కరగలేదు. వెంటనే ఉమామహేశ్వరరావు భార్య పేరుతో తీసుకున్న ఖాళీ చెక్కులు ప్రామిసరి నోటును కోర్టులో దాఖలు చేశాడు. బాధితుడి భార్య కూడా ఓ చిరుద్యోగి కా>వడంతో వారు కోర్టు వరకు వెళ్లొద్దని కొంత టైం ఇస్తే అసలు వడ్డీ చెల్లిస్తామని వేడుకున్నా ఫలితం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోయి ఆర్టీసీలో యూనియన్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి కాల్‌మనీ తరహాలో వేధించడం వాస్తవమేనని అతడిపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. అధికార పార్టీ నేత ఒత్తిడితో.. ఆర్టీసీలో కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. గతంలో విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఉద్యోగులు కూడా వడ్డీల పేరుతో వేధింపులకు గురిచేయడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేస్తున్నారు. విజిలెస్స్ అధికారులు నివేదిక ఇచ్చినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడిలే కారణమని పలువురు యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ సెక్యూరిటీ గార్డు బినామీల పేరుతో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని విచారించి డిస్మిస్ చేసిన అధికారులు ఈ ఉద్యోగి విషయంలో వెనుకంజ వేయడంపై అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని వారు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకున్నాం ఆర్టీసీ కార్మికులను వడ్డీల పేరుతో వేధిస్తున్న కార్మికుడిపై విచారణ చేపట్టాం. ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఇంక్రిమెంట్ కట్ చేశాం.– రామారావు, ఆర్ఎం -
‘మిడ్‌మానేరు’ పరిహారంలో మళ్లీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు ప్రాజెక్టుకింద నిర్వాసితులకు పరిహార మదింపులో మళ్లీ అక్రమాల పర్వం మొదలైంది. అడ్డగోలు అంచనాలతో ముంపు గృహాలకు ఇష్టారీతిన పరిహారం లెక్కగట్టి కోట్ల రూపాయలు దండుకునేందుకు అక్రమార్కులు తెరతీశారు. వీరికి అధికారుల నుంచి సహకారం అందుతుండటంతో కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఇదే ప్రాజెక్టు కింద పరిహారంలో భారీ అక్రమాలు జరగడంతో 24 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. గతం మాదిరే అక్రమాలు.. పూర్వ కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో 2006లో మిడ్‌మానేరు ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. తర్వాత ఈ ఏడాది 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబం ధించి 2009 చివర్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. అనంతరం కొత్త రాష్ట్రంలో ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరపగా, అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఇందులో కొడిముంజ గ్రామంలో గృహాలకు పరిహారాన్ని మొదట రూ.6.10 కోట్లతో అంచనా వేయగా, తర్వాత దాన్ని రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాభాష్‌పల్లిలో రూ.5.32 కోట్ల మేర పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. ఈ రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ అవకతవకల్లో మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను విజిలెన్స్ విభాగం గుర్తించింది. అదే గ్రామంలో మరోసారి.. కాగా తాజాగా శాభాష్‌పల్లిలో మరోసారి అక్రమాలు వెలుగుచూశాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే, 2008లో వాటికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా రూ.4.85 కోట్లకు పెంచారు. 1–26 ఇంటినంబర్ ఉన్న గృహానికి 2008లో రూ.60వేల పరిహారాన్ని ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని రూ.65 లక్షలకు పెంచారు. 1–17 ఇంటినంబర్ ఉన్న మరో గృహానికి గత అంచనా రూ.7.36 లక్షలుగా ఉండగా, దాన్ని ఏకంగా రూ.1.20 కోట్లకు పెంచారు. అలాగే 1–29 నంబర్‌తో ఉన్న మరో గృహ పరిహారాన్ని రూ.1.74 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచేశారు. ఇలా చాలా గృహాలకు సంబంధించి అడ్డగోలుగా పరిహార మొత్తాలను పెంచినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. లెక్కల్లో మాయ.. గృహ నిర్మాణ కాలాన్ని నిర్ధారిం చడం, గృహాల్లో వాడిన కలప విలువ, భూమి విలువలను లెక్కించడంలో ఆర్ అండ్‌బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్ర మాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపి స్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక నీటి పారుదల శాఖ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ నుంచి సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం. -
వారపు సంతపై విజిలెన్స్
శ్రీకాకుళం ,సీతంపేట: సీతంపేట వారపు సంతలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆ శాఖ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో డీఎస్పీ బర్ల ప్రసాద్, భద్రతా ఇన్స్పెక్టర్లతో కూడిన బృందం విస్తృతంగా సోదాలు చేసింది. నకిలీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఆరుగురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తిరుగుతున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ సురేష్‌బాబు మాట్లాడుతూ.. కల్తీ కందిపప్పు, శనగపప్పు వంటి వాటికి రంగులు వేసి అసలైన వాటిలా చేసి గిరిజనులకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. వీటిని తీసుకుంటే కేన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. వాడేసిన టీ పొడిని మళ్లీ ప్యాక్ చేసి ఒరిజనల్ టీ పొడిగా విక్రయిస్తున్నారని తెలిపారు. ఖరీదైన కుంకుమ పువ్వు పేరు చెప్పి కలర్‌వేసిన పొట్టును అమ్ముతున్నారన్నారు. గసగసాల పేరుతో రాజనాల అనే చిరుధాన్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. ఇటువంటి వస్తువులతో పట్టుబడిన శిల్లా యోగేశ్వరరావు, ఐపీ సింహాచలం, కందుల దుర్గారావు, శిల్లారాము, కొత్తకోట దుర్గారావుపై కేసులు నమోదు చేసి.. వస్తువులను సీజ్ చేశామని వెల్లడించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కోర్టులో దాఖలు పరుస్తామని తెలిపారు. గిరిజనులు ఇటువంటి నాసిరకం ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇకపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నాసిరకం సరుకులు అమ్మితే ఎంతటివారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సతీష్‌కుమార్, చంద్ర, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎస్.ఈశ్వరి, కూర్మనాయకులు, అసిస్టెంట్ రిజిస్టార్ సూర్యత్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
చెప్పినట్లు చేస్తే కేసులుండవ్..
-
వదల బొమ్మాళీ... వదల
►సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్ విభాగాల్లో ఫెవికాల్ వీరులు ►స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హోదా మారినా అక్కడే తిష్ట ►డిప్యుటేషన్ పేరుతో మాతృసంస్థకు డుమ్మా కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలనా విభాగంలో అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. పోలీసు శాఖ నుంచి సీఐడీ ఇంటెలిజెన్స్, ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్ విభాగాలకు డిప్యుటేషన్‌పై వెళ్లినవారు ఆఫీసర్లయితే రెండేళ్లు, సిబ్బంది అయితే మూడేళ్లకు పైబడి పని చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే కొంతమంది పోలీసు సిబ్బంది మాతృ సంస్థకు డుమ్మా కొట్టి ఏళ్ల తరబడి లూప్‌లైన్లలో కొనసాగుతున్నారు. లాంగ్ స్టాండింగ్ ఉద్యోగుల జాబితాను డీపీఓ సిబ్బంది బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఫెవికాల్ వీరుల నుంచి ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బంది 15 ఏళ్లుగా లూప్ లైన్లలోనే కొనసాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. సీఐడీ విభాగంలో ఆరుగురు కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేసేటప్పుడు కొందరిపై అనేక ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్‌పై సీఐడీ విభాగానికి బదిలీ చేయించుకుని అక్కడే కొనసాగుతున్నారు. అధికారుల నివాస గృహాల నిర్మాణ పనుల్లో సహాయకులుగా పనిచేస్తూ ఆఫీసుకు కూడా ఎగనామం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. శాంతిభద్రతల విభాగంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సిబ్బంది లూప్‌లైన్ విభాగాలకు వెళ్తే కొంత విశ్రాంతి ఉంటుందన్న ఉద్దేశంతో డిప్యుటేషన్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. అయితే ఫెవికాల్ వీరుల కారణంగా స్టేషన్లో పనిచేస్తున్న వారికి అవకాశం రావడం లేదని మదన పడుతున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది నిబంధనలు తుంగలో తొక్కడంతో తమకు అన్యాయం జరుగుతున్నదని స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అధికారుల సేవలో.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సిన బాధ్యత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఉంది. అక్కడ కూడా ఇద్దరు కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి ఉన్నతాధికారుల సేవల్లో తరిస్తున్నారు. పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ రద్దు అయిందని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో మాత్రం కానిస్టేబుళ్లు అధికారుల సేవల్లో మునిగి తేలుతున్నారు. అవినీతి అక్రమాలపై నిఘా వేసి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడాల్సిన కొంతమంది అధికారులు కానిస్టేబుళ్లను వ్యక్తిగతంగా మామూళ్ల వసూలుకు వినియోగించుకుంటున్నట్లు సమాచా రం. కల్లూరు ఎస్టేట్ పారిశ్రామిక వాడగా అభి వృ ద్ధి చెందుతున్న నేపథ్యంలో నాపరాళ్లు, ఆయిల్ పరిశ్రమలు, మా ర్బుల్ పరిశ్రమల నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసే విషయంలో కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. కార్యాలయానికి డుమ్మా కొట్టి ఉన్నతాధికారుల సేవల్లో కానిస్టేబుళ్లు తరిస్తున్నట్లు ఆ విభాగంలో చర్చ జరుగుతోంది. నేతలతో సన్నిహితం.. నివేదికలు తారుమారు ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఐదుగురు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులతో పాటు ఫ్యాక్షన్ హత్యలు, మత కలహాలు వంటి ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ఇటు ఉన్నతాధికారులకు.. అటు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. అయితే కొంతమంది సిబ్బంది విధులను తూతూమంత్రంగా నిర్వహిస్తూ అధికారుల వ్యక్తిగత పనుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలను వెలికితీసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే కొంతమంది అధికార పార్టీ నాయకులతో ఉన్న సన్నిహితంతో తప్పుడు నివేదికలు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మిగనూరులో గృహనిర్మాణాలకు సంబంధించి ఒక అధి కారిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ముడుపులు దండుకుని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ప్రచారం ఉంది. హోదా మారినా అక్కడే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు పోలీసు శాఖకు రెండు కళ్లు లాంటివి. అయితే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కూడా కొంతమంది ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రఘురామయ్య, ఉమాపతి, రాజన్న, కాశయ్య, రంగయ్య, విజయమోహన్‌రెడ్డి తదితరులు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందినప్పటికీ హెడ్ కానిస్టేబుళ్ల విధులు నిర్వహిస్తూ అక్కడే కొనసాగుతున్నారు. హోదా మారినా అక్కడే పోస్టింగ్ పొంది విధులు నిర్వహిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఏపీ ట్రాన్స్‌కోలో కూడా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ ఐదేళ్లకు పైబడి అక్కడే విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల సేవలో తరలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అంతా గోప్యం: కొన్నేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారి సీనియారిటీ జాబితాను డీపీఓ సిబ్బంది బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. స్టేషన్లలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు విధులు నిర్వహిస్తున్న వారికి అవకాశమివ్వకుండా ఏళ్ల తరబడి వివిధ లూప్‌లైన్లలో సుమారు 50 మందికి పైగా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గోపీనాథ్ జట్టీ అయినా దృష్టి సారించి జిల్లా పోలీసు కార్యాలయంలో పరిపాలన గాడిలో పెట్టాలని సిబ్బంది కోరుకుంటున్నారు. -
బీటెక్ వైద్యం
కర్నూలు, ఆదోనిలో నకిలీ ఆసుపత్రులు – ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో రోగులకు చికిత్స – విజిలెన్స్ విచారణలో బట్టబయలు కర్నూలు(హాస్పిటల్): చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగలించుకున్నారు. ఎంబీబీఎస్‌తో పాటు స్పెషాలిటీ కోర్సులనూ జతచేసి కర్నూలు, ఆదోని నగర నడిబొడ్డులో దర్జాగా వైద్యం చేస్తున్నారు. వీరిచ్చే మామూళ్లకు ఆశపడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులూ ఆసుపత్రికి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. తాజాగా సదరు ఆసుపత్రి ఒకచోట నుంచి మరోచోటికి మార్పు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి ఏకకాలంలో కర్నూలు, ఆదోనిలోని ఆసుపత్రులపై దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ గతంలో హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చే డబ్బు చూసి ఆశ మొదలైంది. తాను కూడా ఏదైనా ఒక ఆసుపత్రి పెట్టి డబ్బు సంపాదించాలని అప్పుడే అతని మెదడులో బీజం పడింది. ఈ మేరకు కర్నూలుకు వచ్చి స్థానిక బిర్లాకాంపౌండ్లో సంక్షేమ భవన్ ఎదురుగా జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. వైద్య ఆరోగ్యశాఖలో మామూళ్లు ఇచ్చి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను డాక్టర్ నాగేంద్రప్రసాద్ అని, తన భార్య జ్యోతి ఎంబీబీఎస్, డీసీహెచ్ అని పేర్కొన్నాడు. అయితే ఆయన భార్య జ్యోతి కేవలం ఇంటర్ మీడియట్ మాత్రమే చదువుకుంది. వీరిద్దరూ కలిసి బిర్లా కాంపౌండ్ వద్ద రెండేళ్ల పాటు ఆసుపత్రి నడిపారు. దాంతో పాటు కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా, ఆదోని పట్టణంలోనూ విజయగౌరి హాస్పిటల్ పేరుతో ఆసుపత్రులు ప్రారంభించారు. కొత్తబస్టాండ్ వద్ద డాక్టర్‌గా తన బావమరిది రఘును నియమించాడు. అతనిని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్, ఎండీగా పరిచేయం చేశాడు. ఈ మేరకు విజిటింగ్కార్డులు ముద్రించాడు. బిర్లాగడ్డ వద్ద ఆసుపత్రి దివాళా తీయడంతో దానిని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న విజయగౌరి హాస్పిటల్‌కు మార్చాడు. నాగేంద్రప్రసాద్, ఆయన భార్య జ్యోతి ఇద్దరూ ఆదోనిలో బిజీ ప్రాక్టీషినర్లుగా మారారు. కర్నూలులో మాత్రం రాఘవేంద్ర డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. జిల్లాలో కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై, వారి ద్వారా తమ ఆసుపత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు. ఒక రోగిని ఆసుపత్రికి ఆర్ఎంపీ తీసుకొస్తే అతనికి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. రెక్కీ నిర్వహించి దాడులు చేసిన విజిలెన్స్ జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో పాటు విజయగౌరి హాస్పిటల్‌పై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం కర్నూలులో హోంగార్డు శ్రీకాంత్, తిప్పయ్యలు కలిసి విజయగౌరి హాస్పిటల్‌కు వెళ్లారు. శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని చెప్పడంతో ముందుగా రూ.150 కట్టి ఓపీ తీసుకోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత 5 నిమిషాలు కూర్చోబెట్టారు. ఒక నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్‌గా ఉందని చెప్పింది. అక్కడ రోగులు ఎవ్వరూ లేకపోయినా పావుగంట సేపు కూర్చోబెట్టి శ్రీకాంత్‌ను రాఘవేంద్ర అలియాస్ రఘు వద్దకు పంపించారు. శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు. అలాగే తిప్పయ్యనూ పరీక్షించాడు. ఇతనికి కడుపునొప్పి ఉందనగానే స్కానింగ్‌తో పాటు రక్తపరీక్షలు చేయాలని చెప్పాడు. అయితే తాము డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో ఇద్దరికీ మందులు రాసిచ్చి పంపించారు. అలాగే ఆదోనిలోనూ నాగేంద్రప్రసాద్ వద్దకు హోంగార్డు నాగరాజు వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయి, కడుపునొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు. హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులో రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివకోటి బాబూరావు, సీఐ రామక్రిష్ణాచారి, ఏఈ భాస్కరరెడ్డి, సిబ్బంది, ఆదోనిలో సీఐ జగన్మోహన్రెడ్డి ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం కర్నూలు, ఆదోనిలలోని ఆసుపత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప మున్సిపల్, ఫైర్, పోలీస్ అనుమతులు ఏవీ లేవు. అయినా అల్ట్రాసౌండ్స్కానింగ్ మిషన్‌తో పాటు ఎక్స్‌రే, డయోగ్నోస్టిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఏమీ చేయకున్నా అన్ని పరీక్షలు చేసినట్లు వారికి వారే నివేదికలు ఇచ్చేసి వచ్చిన రోగులకు నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్, విటమిన్స్ మందులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.నరసింహులు విచారణలో తేలింది. మెడికల్‌షాపు సైతం నరేంద్ర పేరుపైనే ఉంది. అయితే కొత్తబస్టాండ్ వద్ద ఉన్న షాపునకు అనుమతులు లేవు. దీంతో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్/విజయగౌరి హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో 26 నకిలీ ఆసుపత్రుల జాబితా ఉంది నగరంలో మరో 26 ఆసుపత్రులు సైతం ఇదే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా, నకిలీ వైద్యులతో నిర్వహిస్తున్నట్లు మా వద్ద జాబితా ఉంది. సదరు ఆసుపత్రులపైనా దాడులు నిర్వహిస్తాం. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో కొన్ని ఆసుపత్రులు తీసుకున్న అనుమతులపైనా విచారణ చేయనున్నాం. సదరు ఆసుపత్రులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నాం. – డాక్టర్ వై.నరసింహులు, డీఎంహెచ్ఓ -
తొమ్మిది గ్రానైట్ లారీల పట్టివేత
కర్నూలు: పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాయల్టీతో పాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు మొత్తం 9 లారీలను పట్టుకొని కర్నూలు జిల్లా శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన సుబ్బరావు, నాయుడుతో పాటు మరికొంతమంది కొంత కాలంగా లారీల్లో గ్రానైట్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రికి చెందిన అధికార పార్టీ నేత అండదండలతో యథేచ్ఛగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఏపీ 02 టీబీ 0477, ఏపీ 02 టీఈ 2799, ఏపీ 02 టీసీ 0495, ఏపీ 02 టీబీ 9855, ఏపీ 02 టీఈ 2277, ఏపీ 02 టీఈ 2268, ఏపీ 02 టీఈ 2727, ఏపీ 02 టీబీ 6228 నెంబర్లు గల లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్ గ్రానైట్ తరలిస్తుండగా కాపుకాసి వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందులో నాలుగు వాహనాలు పూర్తిగా బిల్లులు లేకుండా వెళ్తుండగా.. మరో ఐదు వాహనాలు మూడు మీటర్లకు మాత్రమే బిల్లు చెల్లించి, మిగితా గ్రానైట్‌ను జీరో పైన తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయట పడింది. ఒక్కొక్క లారీలో 15 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. అందులో ఏడు వాహన యజమానుల నుంచి రూ.7 లక్షలు వాణిజ్య పన్ను, రాయల్టీతో పాటు అపరాధ రుసుము వసూలు చేసి శుక్రవారం సాయంత్రం ఏడు వాహనాలను వదిలేశారు. మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి తక్కువ మొత్తం అపరాధ రుసుము చెల్లించి వాహనాలను తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కూడా ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. జొన్నగిరి, ఆస్పరి, డోన్, కృష్ణగిరి ప్రాంతాల నుంచి తాడిపత్రికి భారీ ఎత్తున గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్, గ్రానైట్ అక్రమ రవాణా తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు వెల్లడించారు. -
కమీషను దుకాణం!
- పని ఏదయినా ఆయనకు ముట్టజెప్పుకోవాల్సిందే.. - మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు - ఆలస్యం చేస్తే.. విజిలెన్స్ దాడులు - స్వయంగా పురమాయిస్తున్న ఎమ్మెల్యే - ఇప్పటికే ఒకరిపై విచారణ మొదలు - ఇదేం పద్ధతి అంటూ కాంట్రాక్టర్ల గగ్గోలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీరు ఏదయినా కాంట్రాక్టు పని చేస్తున్నారా? అయితే, కచ్చితంగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేను కలవాలంటూ సంబంధిత అధికారి నుంచి సమాచారం వస్తుంది? ఆ వెంటనే కలిసి కమీషన్ మాట్లాడుకోవాల్సిందే! లేనిపక్షంలో గతంలో మీరు చేసిన పనులపై వెంటనే విచారణ చేయాలంటూ విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు పోవడం.. వెనువెంటనే విజిలెన్స్ విచారణ ప్రారంభం కావడం చకాచకా జరిగిపోతాయి. అధికార పార్టీలో చేరిన సదరు ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్న తీరుకు కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా బెదిరింపులకు దిగడం ఏమిటని వాపోతున్నారు. ఈ దందాకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోడదూకిన సదరు ఎమ్మెల్యే వైఖరి వివాదాస్పదంగా మారింది. ఇంకా పూర్తిగా వర్క్ ఆర్డర్ కూడా చేతికి రాకూండానే ఎమ్మెల్యేను కలవండంటూ వర్తమానం రావడం కాంట్రాక్టర్లకు మింగుడుపడటం లేదు. కొన్ని పనుల్లో పెద్దగా మిగిలేది ఏమీ ఉండదని.. అప్పటికే తక్కువ ధరకు కోట్ చేసి పనులు దక్కించుకున్న తర్వాత ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తే పనులు నాసిరకంగా తప్ప నాణ్యతతో చేసే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఇలా ఓ కాంట్రాక్టర్ నాలుగు రోజులైనా ఎమ్మెల్యేను కలవకపోవడంతో విజిలెన్స్ అధికారులు సదరు కాంట్రాక్టర్ చేస్తున్న పనులపై విచారణ ప్రారంభించడం షురూ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులే మధ్యవర్తులు జిల్లాలో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలే చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో చేస్తున్న కార్యక్రమాలే అధికం. అందులోనూ వస్తున్న కొద్దిపాటి నిధులపై ఈ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కమీషన్ల పర్వానికి తెరలేపడం విమర్శల పాలవుతోంది. ఉన్న కొద్దిపాటి పనులను దక్కించుకునేందుకు తక్కువ ధరలనే కోట్ చేయాల్సి వస్తోందనేది కాంట్రాక్టర్ల అభిప్రాయం. దీనికితోడు ఇప్పుడు కమీషన్ ఇస్తే పనుల నాణ్యత ఏ విధంగా ఉంటుందని వాపోతున్నారు. పని పూర్తయ్యే సందర్భంలో అంతో ఇంతో అధికార పార్టీ నేతలకు ఇవ్వడం పరిపాటేనని.. అయితే, కనీసం వర్క్ ఆర్డర్ చేతికి అందకముందే తనను కలిసి కమీషన్ మాట్లాడుకోవాలనడం గతంలో ఎన్నడూ చూడలేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీనికితోడు ఇప్పుడు సంబంధిత శాఖ అధికారులే ఎమ్మెల్యేను కలిసి రాకపోతే పని కూడా ప్రారంభించలేరని చెబుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని కొద్ది మంది కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇదేం విచారణ...! వాస్తవానికి నిర్దిష్టంగా ఏవైనా పనులపై ఫిర్యాదు వస్తే విజిలెన్స్ అధికారులు విచారణ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే, తాజాగా ఒక కాంట్రాక్టర్‌పై జరుగుతున్న విచారణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా మూడు రోజుల క్రితం ఎమ్మెల్యేను కలవాలంటూ ఒక అధికారి చెప్పడం.. కలవకపోవడంతో నాలుగో రోజే విజిలెన్స్ విచారణ ప్రారంభం కావడం యాధృచ్ఛికం మాత్రం కాదనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం మరో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేను వెళ్లి కలవాలని.. లేనిపక్షంలో విజిలెన్స్ విచారణ ప్రారంభమవుతుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, విజిలెన్స్ అధికారులు మాత్రం సాధారణ విధుల్లో భాగంగానే విచారణ చేస్తున్నామని.. ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లేవీ లేవని పేర్కొనడం గమనార్హం. -
నకిలీ విత్తనాలపై తనిఖీలు ముమ్మరం
కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసేందుకు ఒక వైపు విజిలెన్స్ అధికారులు, మరోవైపు వ్యవసాయాధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తెల్లబంగారం... విత్తు కలవరం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపధ్యంలో అధికారులు స్పందించారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు.. కర్నూలు నగరంలోని నవత, ఎస్ఆర్ఎంటీ తదితర ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించారు. కోడుమూరు తదితర ప్రాంతల్లోనూ తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా చేసిన రూ.5లక్షల విలువ చేసే నాలుగు క్వింటాళ్ల నకిలీ బీటీ విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి స్వాధీనం చేసుకున్నారు. మే నెల 26న కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని పోలీసు కాలనీ నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. నంద్యాలలో రూ.34 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడటం సంచలనం రేపింది. పత్తిలో 95 శాతం బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నకిలీ విత్తనాలు ఇప్పటికే తరలివెల్లినట్లు సమాచారం. నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్ నంద్యాలఅర్బన్: స్థానిక విజయ డెయిరీ సమీపంలోని వెంకటేశ్వర సీడ్స్ విత్తన కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ బీటీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. జిల్లా విజిలెన్స్ అధికారి బాబురావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ జగన్మోహన్రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. సీడ్ ప్రాసెసింగ్‌కు అనుమతులు లేకుండా సీడ్ కంట్రోల్ నిబంధనలు అతిక్రమించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.11.76లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. అయితే బండిఆత్మకూరుకు చెందిన రైతు కావేరి బీటీ పత్తి విత్తనాలను సీడ్ విత్తనాల ప్రాసెసింగ్‌కు ఇక్కడ నిల్వ ఉంచినట్లు వెంకటేశ్వర సీడ్స్ యజమాని విజిలెన్స్ అధికారులకు వివరించారు. రైతుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో సంచుల్లో ఉంచిన సీడ్ మొత్తాన్ని సీజ్ చేసి టెక్కె మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలించారు. సీడ్ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీరి వెంట ఏఓ అయూబ్‌బాషా, విజిలెన్స్ సిబ్బంది మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
నివాసాల మధ్య నకిలీ బాగోతం
బీటీ పత్తి విత్తనాల గుట్టురట్టు - విజిలెన్స్ అధికారుల మూకుమ్మడి దాడులు - కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో రూ.55 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం - 3వేలు ప్యాకెట్లు, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 3వేల కిలోల విత్తనాలు సీజ్ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. బిటీ పత్తి విత్తనాలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతి ఉండగా.. అదే అడ్రస్‌తో కర్నూలులో విత్తన ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. గురువారం విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కర్నూలులో గుట్టుగా సాగుతున్న నకిలీ విత్తనాల రాకెట్‌ను రట్టు చేశారు. ఏకంగా రూ.55 లక్షలకు పైగా నకిలీ బీటీ పత్తి విత్తనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో నకిలీ విత్తనాలకు అడ్డా కర్నూలు అనే విషయం మరోసారి నిరూపితమైంది. ‘సాక్షి’లో గత బుధవారం నకిలీ విత్తనాలపై ‘తెల్ల బంగారం.. విత్తు కలవరం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి బాబురావుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో విజిలెన్ ఏడీఏ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణాచారి, జగన్మోహన్, కానిస్టేబుళ్లు శేఖర్, శివరాముడు, గౌడులు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీపై నిఘా వేశారు. పోలీసు కాలనీలోని డోర్ నెం.77/180–7–1–3 ఇంటిలో బీటీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. నివాస ప్రాంతాల మధ్య భారీ ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ సాగుతుండటం చూసి అధికారులే విస్తుపోయారు. ఇండిగో క్రాప్ కేర్ సీడ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో అనుమతి ఉంది. బీటీ విత్తన ప్యాకెట్లను గుజరాత్లో తయారు చేసినట్లు ఉంది. కానీ ప్యాకెట్లు మాత్రం కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కర్నూలు ఆదిత్యనగర్‌లో కార్యాలయం ఉన్నట్లు చూపినా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడం గమనార్హం. లీడర్, బీజీ, రుద్ర పేర్లతో ప్యాకెట్ల తయారీ లీడర్–99, బీజీ–2, రుద్ర–118, బీజీ–2 పేరుతో 3వేల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఖాళీ ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. వీటిపై గుజరాత్లో ప్యాకెట్లు తయారు చేసినట్లు, కంపెనీ తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు ఉంది. 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.800లుగా ముద్రించారు. ప్యాకెట్లు తయారు చేసినవి 3వేలు ఉండగా.. 7,500 ప్యాకెట్ల తయారీకి అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటి విలువను విజిలెన్స్ అధికారులు రూ.55లక్షలుగా చెబుతున్నా.. ముద్రించిన ధర ప్రకారం రూ.84లక్షలు ఉంటుందని తెలుస్తోంది. వ్యవసాయాధికారులకు నకిలీ విత్తనాలు అప్పగింత విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బీటీ విత్తన ప్యాకెట్లు, బస్తాల్లో ఉన్న విత్తనాలను కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డికి అప్పగించారు. నకిలీ విత్తనాలు ఉన్న ఇంటిని కూడా సీజ్ చేశారు. సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ విశ్వనా«ద్ తదితరులు పరిశీలించారు. -
డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి
కర్నూలు(అర్బన్): డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై విచారణ, రికవరీలను వేగవంతం చేయడం, డ్వామా ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల పరిశీలన తదితర అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు. -
పెంచు.. పంచు!
కార్పొరేషన్ పనులపై విజిలెన్స్! – పుష్కర పనులపై కూడా.. – నేరుగా ఫిర్యాదు చేసిన చిన్న కాంట్రాక్టర్లు - అంచనా విలువ భారీగా పెంపు - అన్నింటా కమీషన్ల వ్యవహారం – త్వరలో విచారణ షురూ సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై విజిలెన్స్ కన్నుపడింది. గత ఏడాది కాలంగా చేపడుతున్న మొత్తం పనుల నాణ్యతతో పాటు టెండర్ల వ్యవహారంపైనా విజిలెన్స్ దృష్టి సారించనుంది. ఈ మేరకు కార్పొరేషన్లో జరుగుతున్న టెండర్ల బాగోతంపై చిన్న కాంట్రాక్టర్లు ఫిర్యాదు నేపథ్యంలో విజిలెన్స్ కన్నుపడినట్టు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అంచనా విలువను కోటి రూపాయల కంటే అదనంగా పెంచి చూపించడం ద్వారా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా చూస్తున్నారని ఈ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు పేర్కొన్నట్టు తెలిసింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన పనులపైనా అనేక ఫిర్యాదులు అందినట్టు సమాచారం. అంతేకాకుండా పెద్ద కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి టెండర్ విలువ కంటే అదనంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరలను కోట్ చేస్తున్నారని వివరించారు. తద్వారా 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే కోట్ కావాల్సిన టెండర్లు కాస్తా అధిక ధరతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వీరు కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ టెండర్ల బాగోతంపై విజిలెన్స్ విచారణ ప్రారంభించనున్నట్టు తెలిసింది. పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే.. కార్పొరేషన్లో వాస్తవ పనుల విలువ కంటే అధిక ధరను పెంచేస్తున్నారని.. తద్వారా పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే దక్కేలా చూస్తున్నారని ప్రధాన ఫిర్యాదు. వాస్తవానికి రూ.90 లక్షల విలువైన పనుల అంచనా వ్యయాన్ని కూడా కోటి రూపాయలకంటే అదనంగా పెంచి టెండర్లను పిలిచారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. తద్వారా కేవలం ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే బరిలో నిలుస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య అధికార పార్టీ నేత రింగు ఏర్పడేలా చేసి అధిక ధరకు టెండర్లను దాఖలు చేయిస్తున్నారు. తద్వారా కమీషన్ రూపంలో 10 శాతం మేరకు నొక్కేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా చిన్న కాంట్రాక్టర్లకు పెద్దగా పనులు లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులు చేయకుండా అధికార పార్టీ నేతలకు చెందిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు. ఫలితంగా నాణ్యత నగుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా జరుగుతున్న మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను చిన్న కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. ఇందుకోసం ఎక్కడెక్కడ అంచనా విలువలను రూ.80 లక్షలు–రూ.90 లక్షల విలువైన పనులను కోటి రూపాయలకు దాటించారనే సమాచారాన్ని కూడా విజిలెన్స్ అధికారులో చేతిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానాకు 20 శాతం నష్టం కర్నూలు కార్పొరేషన్లో జరిగే పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టు సంస్థల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో భాగంగా ఒక్కో కాంట్రాక్టు పనికి 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే టెండర్లు వేస్తున్నారు. అయితే, అంచనా విలువను కోటి రూపాయలకుపైగా పెంచడంతో చిన్న కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనే అర్హతను కోల్పోతున్నారు. తద్వారా కేవలం నలుగురైదుగురు ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు కాస్తా అధిక ధరకు టెండర్లను దక్కించుకుంటున్నారు. ఈ విధంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరను కోట్ చేస్తున్నారు. ఫలితంగా 10 నుంచి 15 శాతం తక్కువకే దక్కాల్సిన పనులు కాస్తా 5–10 శాతం అధిక ధరకు టెండర్లను కార్పొరేషన్ అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా 15 నుంచి 20 శాతం వరకూ కర్నూలు కార్పొరేషన్ ఆదాయాన్ని కోల్పోతుందని తమ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు వాపోయినట్టు తెలిసింది. ఈ విధంగా వందల కోట్ల పనుల్లో కార్పొరేషన్‌కు కూడా కోట్లలోనే గండిపడుతోందని వివరించారు. దీంతో విజిలెన్స్ అధికారుల విచారణ షురూ కానున్నట్టు సమాచారం. -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?
జరిమానాతో లారీలను వదిలిపెట్టిన విజిలెన్స్ అధికారులు ప్యాపిలి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అక్రమార్జనకు తెరతీశారు. అయితే అధికారులు తరచూ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా చివరకు అధికారపార్టీ నేతలదే పైచేయి అవుతోంది. మండల కేంద్రం ప్యాపిలి వద్ద ఇటీవల విజిలెన్స్ అధికారులు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని చివరకు జరిమానాతో వాటిని వదిలేయడం చర్చనీయాంశమైంది. కర్నూలు వైపు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా గ్రానైట్ ఖనిజాన్ని తరలిస్తున్న ఏపీ 02ఎక్స్ 6277, ఏపీ 02 టీఏ 6255 నంబర్లు గల లారీలను ఈ నెల 14న కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్యాపిలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలను ప్యాపిలి పోలీస్‌స్టేషన్ అప్పగించిన అధికారులపై తాడిపత్రికి చెందిన అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం ప్యాపిలికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న లారీలపై ఫెనాల్టీ వేసి వదిలేశారు. అయితే ఈ లారీలు ఎవరి పేరుతో ఉన్నాయన్న విషయం, ఫెనాల్టి ఎంత వేశారన్న వివరాలు తెలియరాలేదు. -
రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
చిల్లకూరు: చీరల మాటున తరలిస్తున్న రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లను నెల్లూరు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది మంగళవారం బూదనం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి కలకత్తా వెళుతున్న ఓ కంటైనర్‌ను నిలిపి తనిఖీలు చేపట్టారు. అందులో చీరల మూటలు కన్పించాయి. వదిలేయాలనుకుంటున్న సమయంలో గుట్కా వాసన గుప్పుమంది. దీంతో వాహనంలోకి ఎక్కి చీరల మూటలను పక్కకు తొలగించి చూడగా భారీస్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు దర్శనమిచ్చాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకొని నెల్లూరులోని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. కంటైనర్‌లో 50కిలోల వంతున 50బస్తాల గుట్కాను గుర్తించారు. వాటివిలువ బ హిరంగ మార్కెట్లో సుమారు రూ. 62.50లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలాఉండగా ఓవర్‌లోడ్, బిల్లులు లేకుండా వెళుతున్న సిలికా, బొగ్గు, రోడ్ మెటల్, టాక్స్ ఎగవేసిన 12లారీలను పట్టుకొని రూ.1,32,500 జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి చెప్పారు. మైనింగ్ రవాణాకు సంబంధించిన లారీలను జరిమానా విధించేందుకు సంబంధిత అ«ధికారులకు అప్పగించామని చెప్పారు. అక్రమాలపై ప్రజలు నేరుగా తమకు సమాచారం అందిస్తే తగిన రీతిలో స్పందిస్తామన్నారు. మంగళవారం నాటి దాడుల్లో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు కట్టా శ్రీనివాసరావు, ఆంజనేయరెడ్డి, డీసీటీవో రవికుమార్, విష్ణు, ఏజీ రాము, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మొత్తం వేటగాళ్లు ఏడుగురు
మహదేవపూర్ దుప్పుల వేట ఘటన సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుప్పుల వేటకు సంబంధించి మొత్తం ఏడుగురు వేటగాళ్లు ఉన్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన వ్యక్తులకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో వేటాడ టం అలవాటని, వీరికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం అక్బర్‌ఖాన్ పనని మహదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ జంతువుల ను వేటాడే అలవాటున్న మహదేవపూర్‌కు చెందిన అక్బర్‌ఖాన్ హైదరాబాద్, కరీంనగర్, మహదేవపూర్‌లకు చెందిన ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా మొజిన్, గట్టయ్య, మహమ్మద్ ఖలీమ్, మహమ్మద్ అస్రార్ ఖురేషీలను వేటకు ఆహ్వానించాడు. వీరితో పాటు సత్యనారాయణ అలియాస్ షికారి సత్తన్న, అతని బంధువులు కార్లలో మహదేవ పూర్ చేరుకున్నారు. అక్కడ మద్యం తాగి అందరూ కలసి కారులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు పలిమెల ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది టాటా ఇండికాను ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మహదేవపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ వాహనాన్ని ఆపగా దానిలో ఉన్నవారు ఫారెస్టు సిబ్బందిని బెదిరించి ఆ ప్రదేశం వదిలి వెళ్లిపోయారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. ఈ కేసులో నిందితులైన నలువాల సత్యనారాయణ, మహమ్మద్ ఖలీమ్, అస్రార్ ఖురేషీలను ఇప్పటికీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. మంత్రుల ఒత్తిడి మాపై లేదు: విజిలెన్స్ మహాదేవపూర్: ‘దుప్పుల వేట ఘటనలో కేసు మాఫీ చేయాలంటూ మంత్రులెవ్వరూ మాపై ఒత్తిడి తేలేదు. వేటగాళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అటవీశాఖ విజి లెన్స్ అడిషినల్ పీసీసీఎఫ్వో స్వర్గం శ్రీనివాస్ స్పష్టం చేశారు. వన్యప్రాణుల వేటకు సంబం ధించి వాస్తవాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌కు వచ్చారు. ఈ కేసులో విచార ణ వేగవంతం చేశామని చెప్పారు. పోలీసుల సహకారంతో ఇప్పటికే ముగ్గురు వేటగాళ్లను పట్టుకున్నామని, త్వరలోనే మిగతావారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. అనంతరం నిందితుల ఇళ్లు, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనా బాను ఇంటితోపాటు టీఆర్ఎస్ కార్యాలయం లో ఆయన సోదాలు నిర్వహించారు. వేటగాళ్లు ఉపయోగించిన ఇండికా కారును పరిశీలిం చారు. అంబట్‌పల్లిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. -
ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారుల దాడులు
- 70 కేసులు నమోదు - రూ.3.55 లక్షల జరిమానా ఉయ్యాలవాడ: అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులపై బుధవారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 70 కేసులు నమోదు చేసి, రూ. 3.55 లక్షలు జరిమానా విధించినట్లు స్థానిక ఏఈ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు విజిలెన్స్ డీఈ ఉమాపతి ఆధ్వర్యంలో ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఏఈలు, సిబ్బందితో కలిసి మండలంలోని అల్లూరు, మాయలూరు, ఉయ్యాలవాడ, సుద్దమల్ల, రూపనగుడి, కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదుర్తి గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు కలిగి వున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఏఈ స్పష్టం చేశారు. -
విజిలెన్స్ అధికారుల దాడి
- 123.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - ప్రముఖ వ్యాపారి హస్తం ఉన్నట్లు సమాచారం కర్నూలు (అగ్రికల్చర్): డీలర్ల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని వ్యాపారి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి ప్రతినెల వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి బాబురావు ఆదేశాల మేరకు కల్లూరు శ్రీనివాసనగర్‌లోని జంగాల కొట్టాల దగ్గర ఉన్న రేకుల షెడ్‌ను తనిఖీ చేశారు. అందులో బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన 300 బస్తాల బియ్యాన్ని ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి, విజిలెన్స్ ఎన్స్‌ఫోర్‌మెంట్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, విజిలెన్స్ కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, ఈశ్వరరెడ్డి, మునిస్వామి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 123.60 క్వింటాళ్ల బియ్యం విలువ రూ.3 లక్షలు ఉంటుందని విజిలెన్స్ తహసీల్దారు తెలిపారు. ప్రజాపంపిణీలో జరుగుతున్న అక్రమాలను అదుపు చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఉన్నా అక్రమాలకు అడ్డకట్ట పడటం లేదు. ప్రతి నెల డీలర్లు 10 నుంచి 25 క్వింటాళ్ల వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తునే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. బియ్యం వ్యాపారీ చరణ్ సూత్రధారి: విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం ప్రముఖ బియ్యం వ్యాపారి చరణ్‌కు చెందినవిగా విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడికి వెళ్లినపుడు షెడ్ వద్ద కాపలాగా ఎరుకలి వీరన్న అనే వ్యక్తి ఉన్నారు. బియ్యం గురించి వీరన్నను ప్రశ్నించగా చరణ్ అనే వ్యాపారికి చెందిన ఈ బియ్యానికి కాపలాగా ఉన్నట్లు తెలిపారు. చరణ్ చెప్పిన వారికి డబ్బులు చెల్లిసు్తంటానని పేర్కొన్నారు. డీలర్ల నుంచి చరణ్ బియ్యం కొనుగోలు చేసి స్థానికంగా ఉండే రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక బళ్లారి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడని సమాచారం. కర్నూలు నగరంలోనే డీలర్ల నుంచి ప్రతి నెల దాదాపు 2500 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు డీలర్లతో పాటు గ్రామీణ ప్రాంత డీలర్ల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న బియ్యంపై విజిలెన్స్ అధికారులు కల్లూరు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పంచానామా చేయించారు. అనంతరం ఒక లారీ ద్వారా ఏ క్యాంపులోని సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. వ్యాపారి చరణ్, ఎరుకలి వీరన్నపై కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపుతున్నట్లుగా విజిలెన్స్ ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి తెలిపారు. -
రోడ్ల నిర్మాణాలు లేవు..చెక్‌డ్యాంల నాణ్యత లేదు
విజిలెన్స్ అధికారి తనిఖీల్లో తేలిన నిజాలు త్వరలో పూర్తి స్థాయి తనిఖీలు చేపడతామన్న అధికారి దుత్తలూరు(ఉదయగిరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపి నిధులు కాజేశారు. కొన్ని రోడ్లు సగం మాత్రమే వేసి పూర్తి నిధులు దోచేశారు. నూతన చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతులు నాసిరకంగా ఉన్నాయి. ఇదీ శనివారం జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులురెడ్డి తనిఖీల్లో వెల్లడైన నిజాలు. దుత్తలూరు మండలంలో జరిగిన అవినీతిపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రాగా స్పందించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం తనిఖీలు చేపట్టారు. బోడవారిపల్లిలో కొన్ని పనులను తనిఖీ చేయగా మూడు రోడ్లు నిర్మించుకుండానే లక్షల రూపాయలు కాజేసినట్లు వెల్లడైంది. ఎస్సీ కాలనీ నుండి ఎర్రయ్యబావి వరకు రోడ్డు నిర్మించినట్లు కాగితాలలో చూపించి ఐడీ నెం.0126 మీద రూ.87481 నిధులు కాజేశారు. అలాగే అప్పసముద్రం మెయిన్ రోడ్డు నుంచి ఎర్రవాగు చేల వరకు రోడ్డు నిర్మించకుండానే రూ.86278 మెటీరియల్ బిల్లు డ్రా చేశారు. ఇలాగే మరికొన్ని పనులను పరిశీలించగా ఇదేస్థాయిలో అక్రమాలు జరగడంతో ఎందుకు ఈ విధంగా చేశారని సస్పెండైన ఈసీ వెంకటేశ్వరరెడ్డి, టీఏ సుబ్రహ్మణ్యంలను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సమాధానం కరువైంది. చెక్‌డ్యాంల మరమ్మతులు నాసిరకంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు అందుబాటులో ఉంచకపోవడంతో ఆయన విచారణకు సహకరిస్తారా లేదా కేసులు నమోదు చేయమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే తనిఖీ కోసం ఒక్క అధికారి మాత్రమే రావడంతో తనిఖీలు నామమాత్రంగా జరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను సంప్రదించకుండానే తనిఖీలు చేయడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం, బోడవారిపల్లిలో కొన్ని చెక్‌డ్యాంలు లొకేషన్ చేంజ్ పేరుతో వేరే చోట నిర్మించామని ఈసీ తెలపడంతో ఆ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పరిశీలించిన పనుల వివరాలను డ్వామా పీడీకి అందజేస్తామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఉపాధిహామీలో జరిగిన ప్రతి పనిని వచ్చే మంగళ, బుధ వారాల్లో రెండు తనిఖీ బృందాలు తనిఖీ జరుపుతాయన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కాగా మంగళవారం నాటికి తాము పరిశీలించడానికి అనుకూలంగా రికార్డులన్నీ పూర్తిస్థాయిలో ఉంచాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో పిచ్చిబాబు తదితరులు ఉన్నారు. -
గుట్కా స్థావరాలపై విజిలెన్స్ దాడులు
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ కర్నూలు / కల్లూరు (రూరల్) : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం.. కర్నూలు మార్కెట్ యార్డులోని ఓ ఫ్యాన్సీ స్టోర్‌పై దాడులు చేశారు. అలాగే ఎన్టీఆర్ బిల్డింగ్‌లోని గోడౌన్లపై కూడా దాడులు జరిపారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా బాక్సులను కిరాణం అంగళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిరజ్ సరిజి 80 బాక్సులు, ఆర్ఆర్ గుట్కా ప్యాకెట్లు 34, వావి గుట్కా ప్యాకెట్లు 37, హిందుస్థాన్ ఖైనీ 11 బాక్సులు, బ్లూ టొబాకో 10 ప్యాకెట్లు, ఖైనీ టొబాకో 21 ప్యాకెట్లు, హన్స్ టొబాకో 3 ప్యాకెట్లు మొత్తం రూ.5.40 లక్షల విలువ చేసే టొబాకో ఉత్పత్తులను సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారి కె. శంకర్‌కు అప్పగించారు. ప్రధాన సూత్రధారి వెంకటేష్ పరారయ్యాడు. దాడుల్లో ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు నాగభూషణ్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
డీవీఎంసీ సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్
కర్నూలు(అర్బన్): జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీఎంసీ సభ్యులుగా నియమితులయ్యేందుకు గతంలో జిల్లా నలుమూలల నుంచి 91 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్..పోలీసులతో విచారణ చేయించగా 24 మంది దరఖాస్తుదారులు కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో వారి దరఖాస్తులను మినహాయించి మిగిలిన 67 మందిని ఎంపిక చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను చైర్మన్‌గా కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్ కుమార్, సీపీఓ డీ ఆనంద్‌నాయక్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ డీ హుసేన్‌సాహెబ్, ఎస్ఎస్పీ స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డిని నియమించారు. ఈ కమిటీ ఫిబ్రవరి మొదటి వారంలోగా సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.