విద్యుత్ ఏఈపై విజిలెన్స్ విచారణ | vigilance enquiry on electric EI | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఏఈపై విజిలెన్స్ విచారణ

Published Thu, Jun 9 2016 9:03 PM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

vigilance enquiry on electric EI

ఎర్రుపాలెం: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల విద్యుత్ ఏఈ రవీంద్రబాబును విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు తమ నుంచి రూ.1.70 లక్షలు వసూలు చేశారంటూ మండలంలోని భీమవరం, పొరుగునే ఉన్న ఏపీ కృష్ణా జిల్లా కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుంచి ఏఈ రవీంద్రబాబుపై హైదరాబాద్‌లోని ఆ శాఖ సీఎండీకి వారం క్రితం ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు విచారణ నిమిత్తం విజిలెన్స్ సీఐ జనార్దన్‌రెడ్డిని పంపారు. ఆయన గురువారం సాయంత్రం ఏఈ కార్యాలయంలోనే విచారణ ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement