సబ్సిడీ బియ్యం పట్టివేత
సబ్సిడీ బియ్యం పట్టివేత
Published Sat, Sep 24 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
– 87.90 క్వింటాళ్ల బియ్యం, నాలుగు ఆటోలు సీజ్
– నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
కల్లూరు (రూరల్): బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ఉలిందకొండ పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు బట్టబయలు చేశారు. వెల్దుర్తి మండలం చెర్లకొత్తూరుకు చెందిన బి. సంజీవరెడ్డి, భాస్కర్‌రెడ్డి కొంతకాలంగా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. నగరం నుంచి బియ్యాన్ని కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు సమీపంలోని తిమ్మారెడ్డి పౌల్ట్రీ షెడ్డుకు చేర్చుతున్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం రావడంతో గురువారం మధ్యాహ్నం షెడ్డుపై దాడి చేసి 178 సంచులలో 87.90 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్న సంజీవరెడ్డితోపాటు, బియ్యాన్ని తరలించే ఆటో డ్రై వర్లు అల్లిపీరా, చాకలి సుధాకర్, కర్నూలుకు చెందిన బోయ తిరుమలేష్‌లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన వ్యాపారి భాస్కర్‌రెడ్డి, ఆటో డ్రై వర్ రామాంజనేయులు పరారయ్యారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement