విజిలెన్స్‌కు చిక్కిన రేషన్ దొంగలు
రేషన్ గోధుమలు, బియ్యం పట్టివేత
ఇద్దరిపై క్రిమినల్ కేసు
సిరిసిల్ల టౌన్ : రేషన్ బియ్యం, సబ్సిడీ గోధుమలు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న ఇద ్దరు విజి‘లెన్స్’కు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం పట్టణంలో ఆకస్మిక దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. రీజనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ ఎసై రాజేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లకు చెందిన వంగరి గోపి, నగునూరి శ్రీకాంత్ అక్రమంగా రేషన్ బియ్యం, గోధుమలు కొని వాటిని బ్లాక్‌మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముకుంటారు. ఈవిషయంపై స్థానికులు రీజనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అధికారి వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చారు.
ఆయన ఆదేశాల మేరకు ఎస్సై రాజేశం తన సిబ్బందితో నిందితుల దుకాణాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వంగరి గోపి వద్ద 12 క్వింటాళ్ల బియ్యం, 30 క్వింటాళ్ల గోధుమలు, శ్రీకాంత్ వద్ద 10 క్వింటాళ్ల బియ్యం, 30 క్వింటాళ్ల గోధుమలు దొరికాయి. ఈ సరుకులను ఇద్దరూ ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌తోపాటు విజిలెన్స్ కానిస్టేబుళ్లు రవీందర్, రాజయ్య ఉన్నారు.