స్వాధీనం చేసుకున్న కిరోసిన్‌ను డ్రమ్ములను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
గోడౌన్లపై విజి‘లెన్స్’
Published Sat, Dec 17 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
– 41 క్వింటాళ్ల బియ్యం,
800 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
– ఇద్దరిపై కేసు నమోదు
డోన్ టౌన్ : పట్టణ శివారులోని గోడౌన్‌లపై జిల్లా విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన కిరోసిన్, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కంభాలపాడు చౌరస్తా వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గల గోడౌన్ పై శుక్రవారం అర్ధరాత్రి దాడులు జరిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 800 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యుల లక్ష్మీనారాయణ గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అలాగే మండల పరిధిలోని కొత్తపల్లె గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక గోడౌన్‌పై దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 41క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని..షేక్ ఇస్మాయిల్ బాషాపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కిరోసిన్‌ను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ రామకృష్ణాచారి, విజిలెన్స్ తహసీల్దార్ రామకృష్ణ, సిబ్బంది ఉమా మహేశ్వర్, నాగభూషణం, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement