కేసు రాస్తున్న విజిలెన్స్ అధికారులు
–148 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం
డోన్ టౌన్ : మండలపరిధిలోని ఉడుములపాడు గ్రామం సమీపంలోని రామారైస్‌మిల్‌పై జిల్లా విజిలెన్స్ అధికారులు అదివారం దాడులు నిర్వహించారు. 148 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం గతంలోనే డోన్ రెవెన్యూ అధికారి సీజ్ చేసి జగదూర్తి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి అప్పగిస్తూ లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారని రైస్‌మిల్ యజమాని గోపాల్ చెప్పుకొచ్చారు. ప్రతాప్‌రెడ్డి ఇక్కడేందుకు ఆ బియ్యాన్ని ఎందుకు నిల్వ చేశారని అధికారులు ప్రశ్నించగాS రైస్‌మిల్ యజమాని సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పట్టుబడిన బియ్యాన్ని సీజ్‌చేసి డోన్ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్ ఎస్‌ఐ సుబ్బారావు,స్పెషల్ తహసీల్దార్ రామకష్ణారావు తదితరులు ఈదాడుల్లో పాల్గొన్నారు.