ricemill
-
రామారైస్‌మిల్‌పై విజిలెన్స్ దాడి
–148 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం డోన్ టౌన్ : మండలపరిధిలోని ఉడుములపాడు గ్రామం సమీపంలోని రామారైస్‌మిల్‌పై జిల్లా విజిలెన్స్ అధికారులు అదివారం దాడులు నిర్వహించారు. 148 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం గతంలోనే డోన్ రెవెన్యూ అధికారి సీజ్ చేసి జగదూర్తి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి అప్పగిస్తూ లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారని రైస్‌మిల్ యజమాని గోపాల్ చెప్పుకొచ్చారు. ప్రతాప్‌రెడ్డి ఇక్కడేందుకు ఆ బియ్యాన్ని ఎందుకు నిల్వ చేశారని అధికారులు ప్రశ్నించగాS రైస్‌మిల్ యజమాని సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పట్టుబడిన బియ్యాన్ని సీజ్‌చేసి డోన్ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్ ఎస్ఐ సుబ్బారావు,స్పెషల్ తహసీల్దార్ రామకష్ణారావు తదితరులు ఈదాడుల్లో పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులో పేలిన బాయిలర్
– ఇళ్ల గోడలు ధ్వంసం –ఉలికిపడిన కాలనీవాసులు మిర్యాలగూడ అర్బన్ ప్రమాద వశాత్తు రైస్‌మిల్లులో బాయిలర్ పేలడంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని హనుమాన్‌పేటలో గల ఏకశిల పార్బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హునామన్ పేటలో గల ఏకశిల పార్బాయిల్డ్ రైస్‌మిల్లులోని బాయిలర్ రాత్రి 8:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో నాలుగు గదుల వెడల్పుతో ఉన్న బాయిలర్ మెత్తం ధ్వంసమైంది. పేలుడు శబ్దానికి ఇనుప ముక్కలు, రేకు ముక్కలు, ఇటుక పెల్లలు ఎగిరి ఇళ్లపై పడ్డాయి. దీంతో కాలనీవాసులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు శబ్దానికి పలు ఇళ్లలో టీవీలు పేలిపోయాయి. తేరుకున్న కాలనీ వాసులు రైస్‌మిల్లు వైపుకు వచ్చి చూడగా రైస్‌మిల్లు గోడలు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో మిల్లులో పని చేసే కార్మికులు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైయింది. గతంలోనూ.. కాగా బాయిలర్‌లో బూడిద పేరుక పోవడంతోనే బాయిలర్ పేలిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. రైస్‌మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ రైస్‌మిల్లులో గతంలోనూ ఇదే మాదిరిగా ప్రమాదం జరిగిందని అప్పుడుకూడా ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
దొంగతనానికి పోయి.. ప్రాణాలో కోల్పోయాడు
నిజామాబాద్(వర్ని): రైస్‌మిల్‌లోకి దొంగతనం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు కిటికీలో నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా..అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతిచెందిన సంఘటన వర్ని మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వర్ని మండలం సేవాలాల్‌తాండాకు చెందిన యువకుడు శ్రీనివాస్ తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మండల కేంద్రంలోని ఓరైస్‌మిల్‌లోకి దొంగతనానికి వెళ్లాడు. ఓవైపు నుంచి వెళ్లాల్సి ఉండగా..తాగిన మైకంలో మరోవైపు ఉన్న కిటికీలో నుంచి దూరేందుకు యత్నించాడు. అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం అటు నుంచి వెళ్లిన కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికిచేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.