తొర్రూరు : మండలంలోని చిన్నవంగర గ్రామ చెరువులో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను విజిలెన్స్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ గోపికృష్ణ మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా జరుగుతున్న చెరువుల పూడికతీత, మత్తడి, కట్టలు, తూముల మరమ్మతులు వంటి పనుల తీరును పరిశీలించినట్లు చెప్పారు.
ఆయా చెరువుల పనులపై నివేదికను ప్రభుత్వానికి అందించి, పనుల్లో నాణ్యతాలోపం ఉన్నట్లైతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మడిపెల్లి చెరువులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ మట్టిని తరలించుకుతున్నారని, వారికి సంబంధించిన ట్రాక్టర్లు, డోజర్, జేసీబీలను సీజ్ చేసి, సంబంధిత డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.