గుట్కా స్థావరాలపై విజిలెన్స్ దాడులు
గుట్కా స్థావరాలపై విజిలెన్స్ దాడులు
Published Tue, Jan 31 2017 11:05 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
కర్నూలు / కల్లూరు (రూరల్) : విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం.. కర్నూలు మార్కెట్ యార్డులోని ఓ ఫ్యాన్సీ స్టోర్‌పై దాడులు చేశారు. అలాగే ఎన్‌టీఆర్ బిల్డింగ్‌లోని గోడౌన్‌లపై కూడా దాడులు జరిపారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా బాక్సులను కిరాణం అంగళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5.40 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిరజ్ సరిజి 80 బాక్సులు, ఆర్‌ఆర్ గుట్కా ప్యాకెట్లు 34, వావి గుట్కా ప్యాకెట్లు 37, హిందుస్థాన్ ఖైనీ 11 బాక్సులు, బ్లూ టొబాకో 10 ప్యాకెట్లు, ఖైనీ టొబాకో 21 ప్యాకెట్లు, హన్స్ టొబాకో 3 ప్యాకెట్లు మొత్తం రూ.5.40 లక్షల విలువ చేసే టొబాకో ఉత్పత్తులను సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారి కె. శంకర్‌కు అప్పగించారు. ప్రధాన సూత్రధారి వెంకటేష్ పరారయ్యాడు. దాడుల్లో ఎస్‌ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు నాగభూషణ్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement