Gutka Trading
-
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
టీడీపీ నాయకుడే గుట్కా కింగ్!
ఒంగోలు: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు సాగిస్తున్న టీడీపీ నాయకుడి ఉదంతాన్ని ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ఒంగోలు అన్నవరప్పాడు సెబ్ కార్యాలయంలో బుధవారం ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రరావు వివరాలు చెప్పారు. స్థానిక కమ్మపాలెం వాసి ముల్లూరి వెంకట నాగశివ చరణ్ కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. స్థానిక ఎస్ఈబీ అధికారులు కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 27,375 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించగా స్థానిక బృందావన్ నగర్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో ఉంచిన గుట్కా నిల్వల సమాచారాన్ని ఇచ్చాడు. అతని సహాయంతో సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి ఇంట్లో తనిఖీ చేయగా 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గుట్లపల్లి శ్రీమన్నారాయణ అలియాస్ చిన్నా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రీమన్నారాయణ స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు. ఇతను మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అనుచరుడిగా పేరుంది. దాడిలో 2,66,931 గుట్కా ప్యాకెట్లను సీజ్‌చేశారు. వాటి విలువ రూ.3,43,224గా ఉంటుందని అంచనా. -
బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి
చెన్నె: దుకాణంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాడని సమాచారం రాగా పోలీసులు దాడి చేసి దుకాణ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పొగాకు ఉత్పత్తులతో పాటు అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పొగాకు ఉత్పత్తులు ఎవరూ సరఫరా చేస్తారనే వివరాలు తెలుసుకునేందుకు అతడి ఫోన్ పోలీసులు పరిశీలించగా దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి తన మిత్రులకు పంచుకున్న పాపాత్ముడు అతడు. ఆ విధంగా మొత్తం 50 వీడియోలు ఉండడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అతడిని వెంటనే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. (చదవండి: ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక) టీపీ చత్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెరుమాల్ (40) ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. పొగాకు ఉత్పత్తుల విక్రయంపై సమాచారం రాగా శనివారం దుకాణంపై దాడులు చేయగా ఆ బాలికలపై దురాఘాతం వెలుగులోకి వచ్చింది. దుకాణంలో ఆడుకోవడానికి వచ్చిన బాలికలను, దుకాణంలో బాకీ పెట్టిన మహిళల కుమార్తెలపై పెరుమాల్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియోలు తీయించుకున్నాడు. అలా మొత్తం 50 వీడియోలు ఉన్నాయి. విచారణ చేపట్టగా ఆరు నెలల నుంచి బాలికలపై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. అతడికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు సహకరించారు. తమ కూతుళ్లను కూడా అతడికి బలి పెట్టారు. తమ కూతుళ్లను అతడి వద్దకు పంపించడం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. వారిద్దరూ కూడా అతడితో సంబంధం కొనసాగిస్తున్నారు. తమ కూతుళ్లపై ఆ విధంగా చేయడంతో ఆ మహిళలు దుకాణం నుంచి సామగ్రి, సరుకులు ఉచితంగా తీసుకెళ్తున్నారని డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. ఇక మిగతా ముగ్గురు బాలికలు దుకాణంలోకి ఆడుకునేందుకు రాగా వారిని అతడు చెరబట్టాడు. ఆ ఫోన్ చూడకుండా ఉండి ఉంటే ఇంత ఘోర విషయాలు తెలియకపోయేవి అని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం బాలికలను చైల్డ్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద పెరుమాల్‌ను, అతడికి సహకరించిన ఇద్దరు తల్లులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి -
గుట్కా స్థావరంపై ఎస్ఈబీ దాడులు
నెల్లూరు (క్రైమ్): నెల్లూరులో గుట్కా స్థావరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) కృష్ణకిశోర్‌రెడ్డి దాడుల వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. హరనాథపురం నాగసాయి దేవాలయం సమీపంలో ఉంటున్న సీహెచ్ రాజశేఖర్ అలియాస్ శేఖర్ బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాలను నెల్లూరుకు దిగుమతి చేసుకునేవాడు. అనంతరం తన సహాయకుడైన స్టోన్‌హౌస్ పేటకు చెందిన టి.ప్రసాద్ ద్వారా ఆటోలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. ఈ వ్యవహారంపై ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మికి సమాచారం అందింది. ఆమె ఆదేశాల మేరకు శనివారం ఎస్ఈబీ నెల్లూరు–1 ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్ తన సిబ్బందితో కలిసి ముత్తుకూరు రోడ్డులోని ఆకుతోట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గుట్కా వ్యాపారి రాజశేఖర్ సహాయకుడు ప్రసాద్ ఆటోలో గుట్కాలు తరలిస్తుండగా ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నెల్లూరు రూరల్ మండలం వడ్డిపాలెంలో గుట్కాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోదాము వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్స్పెక్టర్ గోదాముపై దాడి చేసి నిషేధిత గుట్కా, ఖైనీలను, ఆటోను స్వాధీనం చేసుకుని రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ బహిరంగ మార్కెట్లో రూ.25 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ఆటోను తదుపరి విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కె.పి.కిశోర్, ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎ.శ్రీరాములు, డి.వెంకటేశ్వర్లును ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి అభినందించారు. -
‘మంత్రులు తలసాని, గంగులకు గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు తింటున్న రాష్ట్ర మంత్రులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించి గుట్కా తింటున్న బ్యాచ్‌తో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. గుట్కా తింటూ అడ్డంగా దొరికి పోయిన మంత్రులను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సొగాకు, గుట్కాను నిషేధించారని, మరి అవి మంత్రులకు ఎలా దొరికాయో తెలియజేయాలని ధ్వజమెత్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ వెంటనే గుట్కా తిన్న మంత్రులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎవరూ చూడకుండా రహస్యంగా చేతుల్లో ఏదో పదార్థాన్ని పంచుకుంటూ చాటుగా తినడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది గుట్కా అని సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులు గుట్కా తింటున్నారని ఆ వీడియోను దాసోజు శ్రవణ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. -
గుట్టుగా గుట్కా స్మగ్లింగ్
-
మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా..
సాక్షి, తానూరు(నిర్మల్): జిల్లా సరిహద్దుల్లో నిషేధిత గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోంది. లాక్డౌన్ సాకు చూపి కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు అక్రమార్కులు. సరికొత్త ఎత్తుగడలతో పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. అంతకుముందు గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి, చిరు వ్యాపారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సంబంధిత వ్యాపారి సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేస్తే చాలు సరుకును నేరుగా దుకా ణాల వద్దకే బైక్‌లపై చేరవేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ... నిషేధిత గుట్కా, ఇతరత్రా నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేసే అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా తమ పంథా మార్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినా పట్టుబడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. గతంలో హైదరా బాద్, నిజామాబాద్ నుంచి గుట్కా తెప్పించేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పోలీసులు తనిఖీలు అధికమయ్యాయి. దీంతో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిర్మల్, భైంసాతోపాటు గ్రామీణ మండలాలకు చెందిన వారు కూడా ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సరిహద్దు ప్రాంతాలైన తానూరు, ముధోల్, కుభీర్, కుంటాల, సారంగపూర్, బాసర మండలాల మీదుగా నిషేధిత గుట్కా రవాణా సాగుతోంది. రవాణా ఇలా.. నిషేధిత గుట్కా అర్ధరాత్రి సమయంలో మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తా నూరు, ముధోల్, బాసర, కుభీర్, కుంటాల, సారంగాపూర్ మండలాల మీదుగా గుట్టుచప్పుడు కాకుండా తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాహనం బయలుదేరిన వెంటనే వాట్సప్ మెసేజ్ ద్వారా స్థానిక వ్యాపారులకు సమాచారం అందిస్తారు. ఏ గుట్కా ఎన్ని బస్తాలు.. ఎక్కడ దించాలో అప్పుడే సమాచారం ఇస్తారు. ప్రణాళిక ప్రకారమే వాహనం నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత వ్యాపారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి సరుకు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత రోజు గ్రామాల వారీగా ద్విచక్ర వాహనాలతోపాటు ట్రాలీ ఆటోల ద్వారా చిరువ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ పేరుతో దోపిడీ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి గుట్కా సరఫరా నిలిచిపోయింది. చిరువ్యాపారుల వద్ద కూ డా పూర్తిగా నిల్వలు అడుగంటాయి. దీంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్రకు చెందిన వ్యాపారుల సా యంతో గుట్కా దిగుమతి చేసుకుంటున్నారు. గ్రా మాల్లో గుట్కా కొరత ఉండటంతో వ్యసనపరులకు లాక్డౌన్ పేరు చెప్పి భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో అంబర్ ప్యాకెట్ రూ.180కి లభించగా.. ప్రస్తుతం రూ.నాలుగు వందల వరకు విక్రయిస్తున్నారు. అలాగే సాగర్, తోట వంటి గుట్కా ప్యాకెట్ల ధరలనూ అమాంతం పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిహద్దులో కొనసాగుతున్న నిషేధిత గుట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నిషేధిత గుట్కా అక్రమంగా సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి రాలేదు. గతంలో తానూరు, ముధోల్‌లో దాడులు నిర్వహించి, గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నాం. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – అజయ్‌బాబు, సీఐ, ముధోల్ ఇటీవల పట్టుబడిన ఘటనలు.. ► ఐదు నెలల క్రితం ఎల్వత్ గ్రామానికి చెంది న వ్యాపారి కిరాణా షాపులకు గుట్కా ప్యాకె ట్లు సరఫరా చేస్తుండగా పోలీసులు సింగన్‌గాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ► మూడు నెలల క్రితం ఎల్వి గ్రామంలో ఓ వ్యాపారి బైక్‌పై వెళ్లి దుకాణాలకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా తానూరు పోలీసులు పట్టుకున్నారు. ► రెండు నెలల క్రితం భైంసా నుంచి తానూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను హిప్నెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. -
గుట్కా స్కాం కేసులో మాజీ మంత్రి పేరు?
సాక్షి, చెన్నై: గుట్కా స్కాం కేసులో ఈడీ తన చార్జ్‌షీట్‌ను చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీవీ రమణతో పాటు పలువురి పేర్లు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గుట్కా విక్రయాలకు లంచం వ్యవహారం గతంలో పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో లభించిన ఓ డైరీ గుట్కా గుట్టు ను వెలుగులోకి తెచ్చింది. సీబీసీఐడీ విచారించినా, కేసు అడుగైనా ముందుకు సాగని దృష్ట్యా, చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ రంగంలోకి దిగి దిగగానే, దాడులు హోరెత్తాయి. అప్పటి డీజీపీ, మాజీ కమిషనర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఆరోగ్యమంత్రి అంటూ లిస్టు చాంతాడు అంతగా మారింది. మాజీ మంత్రి బీవీ రమణ, ప్రస్తుతం ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ల వద్ద విచారణ సాగించిన సీబీఐ, పోలీసు బాసులపై ఆచితూచి స్పందించే రీతిలో అడుగులు వేసింది. తొలుత సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ సమయంలో విచారణకు కరోనా అడ్డుగా మారింది. ఓ వైపు సీబీఐ మళ్లీ ఫైల్ దుమ్ము దులిపిన నేపథ్యంలో ఈడీ తన చార్జ్ïÙట్ను మంగళవారం సాయంత్రం చెన్నై జిల్లా సెషన్స్ కోర్టులో దాఖలు చేసి ఉండడం గమనార్హం. ఎన్నికల వేళ చార్జ్‌షీట్ కలవరం... గుట్కా స్కాంలో ఈడీ విచారణ చార్జ్‌షీట్ అన్నాడీఎంకేను కలవరంలో పడేసింది. ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని ప్రతి పక్షాలు అస్త్రంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ చార్జ్‌లో 2013 –2016 మధ్య రూ.639 కోట్ల మేరకు అక్రమ గుట్కా వ్యవహారాలు సాగినట్టు తేల్చారు. అలాగే, చార్జ్‌షీట్‌లో మాజీ మంత్రి రమణ పేరు చేర్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సహాయకుల పేర్లు సైతం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో గుట్కా విక్రయదారులు మాధవరావు, శ్రీనివాసరావు, ఉమాశంకర్ గుప్తాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని ఆస్తుల వివరాలు, రూ. 246 కోట్ల మేరకు చేసిన ఆస్తుల అటాచ్ వివరాలను చార్జ్ షీట్లో పొందు పరిచారు. -
యథేచ్ఛగా గుట్కా దందా
కామారెడ్డి క్రైం: ఉమ్మడి జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. లాభాలు దండిగా ఉండటంతో అక్రమార్కులు ఈ దందాను వీడటం లేదు. పోలీసుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో అడ్డదారిలో గుట్కా సరఫరా యథేచ్చగా సాగుతుందనే విమర్శలున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో పలు చోట్ల టాస్‌్కఫోర్సు అధికారులు లక్షల విలువైన గుట్కా, ఇతర నిషేధిత వస్తువుల నిల్వలను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో గుట్కాను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. కానీ చుట్టు పక్కల రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో జిల్లాలోని కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి మెదక్, నిజామాబాద్, నిర్మల్, బాన్సువాడ లాంటి పట్టణాలకు గుట్కా సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి కామారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాలకు సరఫరా జరుగుతున్నట్లు గతంలో గుట్కా పట్టుబడిన ఘటనల్లో వెల్లడైంది. మెదక్, నిజామాబాద్‌లకు చెందిన కొందరు బడా వ్యాపారులు ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాలవ్యాన్లు, ఆటోలు ఇతర వస్తువుల సరఫరా రూపంలో ఎవరికీ తెలియకుండా ఉండేలా గుట్కా రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పోలీసుల నిఘా అంతంతే.. జిల్లాలో గుట్కా సరఫరా, విక్రయాలు జరుగుతున్నా పోలీసులు నిఘా అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి కిరాణం, పాన్‌షాప్‌లలో విచ్చలవిడిగా గు ట్కా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో పలుసార్లు పోలీసులు దాడులు నిర్వహించి గుట్కా ను స్వా«దీనం చేసుకున్నప్పటికీ ఆయా కేసుల్లో ప్రధాన నిందితులు తమ పలుకుబడితో, రాజకీయ ప్రమేయంతో తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుశాఖ నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. మామూళ్ల మత్తులో యంత్రాంగం.. నిషేధిత గుట్కా, ఇతర పొగాకు పదార్థాలకు అలవాటు పడి ఎందరో యువత తమ విలువైన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. గుట్కా అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గుట్కా వ్యాపారంపై ఇటీవల కొందరు బడాబాబులు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్దమొత్తంలో గుట్కా వ్యాపారం చేసే వ్యాపారులు పోలీసు, ఇతర శాఖల్లోని ప్రధాన అధికారులకు మాముళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే కొందరు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఉమ్మడి జిల్లాలో గుట్కా వ్యాపారాన్ని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
బీదర్ నుంచి వస్తున్న ‘రాణి’
సాక్షి, సిటీబ్యూరో: ‘రాణి’ బ్రాండ్ గుట్కాను వక్కల ముసుగులో కర్ణాటకలోని బీదర్ నుంచి నగరానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు సిటీలో దొరికిన నిషేధిత పొగాకు ఉత్పత్తులన్నీ పాన్ మసాలా, తంబాకు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నవే కాగా.. తొలిసారిగా పూర్తి గుట్కాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి గురువారం తన కార్యాలయంలో కొత్వాల్ అంజనీకుమార్ విలేకరులకు తెలిపిన వివరాలు ప్రకారం... (చదవండి: కూకట్‌పల్లిలో దారుణం) ► నగరానికి చెందిన అన్నదమ్ములు మహ్మద్ హసనుద్దీన్, మహ్మద్ మజారుద్దీన్, మహ్మద్ ఆరీఫ్ వ్యవస్థీకృత గుట్కా దందా ప్రారంభించారు. తమకు సహకరించడానికి అక్తర్, యాసీన్, మక్బూల్, దస్తగిరి, మీర్జా ఫజీ హుస్సేన్ బేగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ► అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో ఈ ముఠాలో కొందరు గోదాముల ఇన్‌చార్జ్‌లుగా, మరికొందరు ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. బీదర్‌కు చెందిన రిజ్వాన్ ఈ ముఠాకు హోల్‌సేల్‌గా రాణి బ్రాండ్ గుట్కాను సరఫరా చేస్తున్నారు. ► వక్కల పేరుతో డీసీఎం వ్యాన్లలో బీదర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గుట్కా వివిధ గోదాములకు చేరుతోంది. అక్కడ నుంచి దీన్ని చిన్న చిన్న వాహనాల్లో పాన్‌షాపులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మొత్తం ట్రాన్స్పోర్ట్, కొరియర్ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాలకు వెళ్తోంది. ► పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి బీదర్ నుంచి సిటీలో గుట్కా దిగిన తర్వాత ఒకే గోదాములో ఉంచట్లేదు. నిత్యం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇటీవలే బహదూర్‌పుర పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఓ గోదాము అద్దెకు తీసుకుంది. ► ఈ వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ► మీర్జా, దస్తగిరిలను అరెస్టు చేసి వీరి నుంచి వాహనంతో పాటు రూ.63,96,000 విలువైన 31 బ్యాగుల్లో ఉన్న 639600 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ► నగరంలో ఉన్న కొరియర్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఇలాంటి నిషేధిత ఉత్పత్తుల్ని రవాణా చేయవద్దని, అలా చేస్తే వారి పైనా కేసులు పెడతామని కొత్వాల్ అంజనీకుమార్ హెచ్చరించారు. ► ఈ కార్యక్రమంలో నగర కొత్వాల్ సిటీలోని గస్తీ వాహనాల సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు పంపిణీ చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్న వీరే పోలీసు విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. (చదవండి: 300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు) -
సచిన్ జోషిపై ‘గుట్కా’ కేసు
శంషాబాద్(హైదరాబాద్): ప్రముఖ వ్యాపారవేత్త, సినీ హీరో అయిన సచిన్ జోషిపై హైదరా బాద్‌లో మరో ‘గుట్కా’ కేసు నమోదైంది. ట్రేడ్‌మార్క్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాన్ మసాలా తయారు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సచిన్‌తోపాటు ఆయన తండ్రి, గోవా పాన్ మసాలా కంపెనీ యజమాని జేఎం జోషిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గగన్‌పహాడ్‌లో వారు నిర్వహి స్తున్న గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై దాడులు చేసి రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకును స్వాధీనం చేసుకు న్నారు. అలాగే కంపెనీని సీజ్ చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం జేఎం జోషి, సచిన్ జోషిలు గగన్ పహాడ్‌లో గోల్డెన్ ఫింగర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్ కంపెనీకి చెందిన మాణిక్ చంద్ పాన్ మసాలాను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే ఆ ట్రేడ్‌మార్క్ తమదని, దాన్ని అతిక్రమించి సచిన్, ఆయన తండ్రి వాడు తూ వ్యాపారం చేస్తున్నారంటూ సురేశ్ రావు అనే వ్యక్తి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్ నేతృత్వంలోని బృందం గగన్‌పహడ్‌లోని గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీపై గురువారం దాడులు చేసింది. 60 బ్యాగుల మానిక్ చంద్ పాన్ మసాలా, వెయ్యి బ్యాగుల గోవా పాన్ మసాలా, 60 బ్యాగుల వజిర్ పాన్ మసాలాతోపాటు మడిసరుకు, ప్యాకింగ్ కవర్లు, మిక్సర్ యంత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ట్రేడ్‌మార్క్ యజమానులు ఎవరనే దానిపై చెన్నైలోని ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో బహదూర్‌పుర పోలీసు స్టేషన్లో సచిన్ జోషిపై ఓ కేసు నమోదైంది. ఈ కేసులో అతను నాలుగో నిందితుడిగా ఉన్నాడు. ఎన్వోసీ జారీ చేస్తే నాలుగు రోజుల క్రితం ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ముంబై వెళ్లిపోయాడు. -
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ('గుట్టు'కా దందా!) కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. (గుట్టుగా.. బెంగళూరు టు నెల్లూరు) ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ('చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు') -
గుట్కా డాన్ కామేశ్వరరావు అరెస్టు
సాక్షి, గుంటూరు: పాన్ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను ఇటీవల గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే గుట్కా వ్యాపారి కామేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక ధ్రువపత్రాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామేశ్వరరావు, ఆయన అనుచరుల కాల్ డేటా ఆధారంగా, వీరితో ఎవరెవరికి సంబంధాలున్నాయనే దానే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కేంద్రంగా గత కొద్ది రోజులుగా భారీస్థాయిలో నిషేధిత గుట్కాల వ్యాపారం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్‌లోని పలు ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాల్ని తీసుకువచ్చి ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుండటంతో పాటు, ఈ గోడౌన్లలో సైతం నిసేధిత గుట్కాలు తయారీ చేశారు. తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. చూసీచూడనట్టు వదిలేశారా? తమ పరిధిలో గుట్కా దందా కొనసాగుతున్పటికీ మామూళ్ల మత్తులో కొందరు సీఐలు, డీఎస్పీలు చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న దర్యాప్తులో ఈ మామూళ్ల వ్యవహారం బయటపడేనా అనే చర్చ పోలీస్ శాఖలో నడుస్తోంది. గుట్కా కామేశ్వరరావు, ఆయన అనుచరుల అరెస్టుతో ఇప్పటికే కొందరు పోలీస్ సిబ్బంది, అధికారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగలకు మల్లే మారింది. పోలీస్ సిబ్బంది, అధికారులు గుట్కా దందా నడుస్తున్న వ్యవహారం తెలిసీ చూసి చూడనట్టు వదిలేశారా? నెలవారీ మామూళ్లు వసూళ్లు చేశారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగించి అసాంఘిక కార్యకలాపాలకు సహరించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటే పోలీస్ శాఖలో సైతం ప్రక్షాళన చేసినట్టవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమేయం ఉంటే చర్యలు నిషేధిత గుట్కాల తయారీ, సరఫరా కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతున్నాం. దర్యాప్తులో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. కామేశ్వరరావుపై పీడీ యాక్డు విధించడానికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా కలెక్టర్‌కు పంపాం. ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు ముప్పు కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. పీడీ యాక్డు ప్రయోగించడంతో పాటు, జిల్లా బహిష్కరణ వంటి చర్యలకు వెనుకాడం. – ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ -
గుట్కా డాన్‌పై పీడీ యాక్ట్..
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్‌పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మనోహర్‌పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్‌ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్‌పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్‌పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్‌కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'
సాక్షి, నెల్లూరు(క్రైమ్): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్‌సభ్యులను అరెస్ట్ చేసినా మూలాల్లోకి వెళ్లకపోవడంతో అతని వ్యవహారం బయటకు పొక్కలేదు. అదేక్రమంలో కొందరు పోలీసుల అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్నచందాన వ్యాపారం సాగింది. అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనమ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన అంజిబాబు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లకిందట కటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఓ గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా చేరారు. తనకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఏపీలోని పలు జిల్లాలకు విస్తరింపజేశాడు. వ్యాపారంలో చురుకుగా ఉన్న వారితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను వారికి సరఫరా చేసేవాడు. వారు వాటిని రిటైల్ వ్యాపారులకు విక్రయించేవారు. చెన్నైలో పోలీసుల దాడులు అధికమవడంతో పాటు వివిధ కారణాతో ఆయన తన మకాంను బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకు మార్చాడు. అక్కడ ఉంటూ ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.20కోట్ల మేర గుట్కాలను గ్యాంగ్‌కు సరఫరాచేసి వారి ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తూ అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగారు. కొంతకాలంగా గంజాయిని సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ గుట్కా విక్రయాలను, అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని సిబ్బంది డాన్‌తో పాటు అతని గ్యాంగ్ కదలికలపై దృష్టిసారించారు. శనివారం నేలటూరులో అంజిబాబుతో పాటు, గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.1.32కోట్లు విలువచేసే గుట్కాలు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని రహస్యప్రాంతానికి తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది. అందుకు గాను సదరు పోలీసులకు నెలవారీ నజరానాలు ముట్టచెబుతున్నామని పేర్కొనట్లు తెలిసింది. ఈ విషయం ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి వెళ్లడంతో లోతైన దర్యాప్తు చేయాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆదిశగా టాస్క్ఫోర్సు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పేర్లను సైతం ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. పరారీలో మరికొందరు గ్యాంగ్‌లో మరో 18మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. డాన్‌ను టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న గ్యాంగ్‌లోని సభ్యులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల్లో కొందరు గతంలో పోలీసులకు చిక్కిజైలుపాలై ఉన్నారు. వ్యాపారుల్లో వణుకు... పోలీసుల దాడుల నేపథ్యంలో జిల్లాలో గుట్కా, ఖైనీ విక్రయ వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది. మొత్తంమీద ఆరేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గుట్కాడాన్, అతని గ్యాంగ్‌లోని సభ్యులను అరెస్ట్ చేయడంతో కొంతకాలం ఈ అక్రమవిక్రయాలు, రవాణాకు అడ్డుకట్టపడనుంది. గ్యాంగ్‌లోని మిగిలిన సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. -
ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్‌సెల్‌లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్‌కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్‌లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్‌సెల్‌గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు. నిత్యం దందా.. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు. కొందరికీ మామూళ్ల తంతు.. గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్‌హెచ్‌ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కచ్కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. మండలాల్లో గోదాములు నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్‌కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
గట్టుగా గుట్కా దందా !
సాక్షి, కరీంనగర్ :జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండల కేంద్రానికి చెందిన షంషొద్దీన్ గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో అక్టోబర్ 28న ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు ఇంటిపై దాడి చేశారు. రూ.64,645 విలువైన గుట్కా సంచులను పట్టుకున్నారు. గుట్కా విక్రేతల గురించి పక్కా సమాచారం అందితేనే వారిపై పోలీసులు దాడి చేసి పట్టుకోగలుగుతున్నారు.కేశవపట్నం మండలంలో గుట్కా దందా సాగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్, తిరుపతిలను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. రూ.1.50లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. మారుమూల పల్లెల్లోని ఏ కిరాణ దుకాణంలో అడిగినా.. పట్టణాల్లోని ఏ పాన్‌షాపులో సైగ చేసినా నిషేధిత గుట్కా ప్యాకెట్ క్షణాల్లో చేతిలో పడుతోంది. కాస్త తెలిసినవారైతే చాలు.. అసలు ధరకు రెట్టింపు ధరలతో గుట్కాలు విక్రయిస్తూ కొనుగోలుదారుల జేబులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. రాష్ట్ర ఎల్లలు దాటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా దందా సాగిస్తున్న తీరు పోలీస్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం, రాజకీయ అండదండలతో ఈ దందా మూడు అంబార్లు(పొగాకు ప్యాకెట్), ఆరు గుట్కాలతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో గుట్కా కింగ్‌లుగా పేరుపడ్డ ఇద్దరు వ్యక్తులు కేంద్రంగా ఈ దందా కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఏజెంట్ల రూపంలో విస్తరించింది. ఎక్కడ గుట్కా నిల్వలు కనుగొన్నా... వాటికి సంబంధించిన మూలాలు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనే కనిపిస్తుండడం గమనార్హం. ఈ అక్రమ దందా ద్వారా గుట్కా కింగ్‌లుగా పేరున్న వ్యక్తులు కోట్లకు పడగలెత్తారు. వీరిలో ఒకరు ఇటీవలే జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఏకంగా అధికార పార్టీ జెడ్పీటీసీగా గెలిచి సత్తా చాటాడు. రామగుండం కమిషనరేట్ ‘గుట్కాకింగ్’లే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా యథేచ్ఛగానే గుట్కా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కా, ఖైనీ, అంబర్(పొగాకు) వంటి ప్యాకేజ్డ్ పొగాకుతో కూడిన పాన్‌మసాలాల విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకున్న గుట్కాకింగ్లు అక్రమ వ్యాపారం ద్వారా రూ.కోట్లు గడిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో అక్రమంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరిఖనిలో ‘కింగ్’గా పిలవబడే వ్యక్తితోపాటు అతని సోదరుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ప్రాంతాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కేశవపట్నం నుంచి ధర్మారం దాకా దందా సాగిస్తున్నారు. పోలీసులతో కూడా మంచి సంబంధాలే నిర్వహిస్తారనే పేరుంది. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న దందా జగిత్యాల, మానకొండూరు, కరీంనగర్, కాల్వ శ్రీరాంపూర్ మొదలుకొని మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గత మూడేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాతో సదరు గుట్కా అక్రమ రవాణాదారుడు రాజకీయంగా ఎదిగిపోయాడు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని ఓ మండలం నుంచి అధికార పార్టీ జెడ్పీటీసీగా కూడా ఎన్నికయ్యాడు. అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యే కావాలనేది అతని కోరిక. జెడ్పీటీసీ కాకముందు అతనిని అరెస్టు చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసే పరిస్థితి. ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడంతో అతని అనుచరులు, సోదరుడి ద్వారా దందా నడిపిస్తున్నాడని సమాచారం. కరీంనగర్ గంజిలో శ్రీనివాస్ అనే ఓ గుట్కా వ్యాపారి గతంలో పెద్ద ఎత్తున దందా సాగించాడు. రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల సరుకు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో విక్రయించేవాడు. అతడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన తరువాత దందా నుంచి వైదొలిగి, వరంగల్ వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేసినవాళ్లే ఇప్పుడు కరీంనగర్ గుట్కా రాకెట్‌ను సాగిస్తున్నారు. బీదర్ నుంచే ఎందుకంటే.. జిల్లాకు పొగాకు పొట్లాలు(అంబార్), గుట్కా ప్రధానంగా కర్నాటక, తెలంగాణ సరిహద్దుల్లోని బీదర్ నుంచే సరఫరా సాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో పొగాకు వినియోగంపై నిషేధం లేదు. ఈ మార్గంలో చెక్‌పోస్టులు పెద్దగా లేకపోవడం, రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోనే ఉండడంతో రవాణా సులువు కావడంతో అక్కడి నుంచే ఎక్కువగా సరఫరా అవుతోంది. ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే ధర కంటే బీదర్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులకు ఇక్కడి నుంచి తీసుకువస్తే మరింత ఎక్కువ గిట్టుబాటవుతోంది. అక్కడ బస్తాల చొప్పున అంబార్, గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలోని రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. అనుమానం రాకుండా ఇళ్లలోనే బస్తాలను భద్రపర్చి తక్కువ మొత్తంలో ఆటోలు, కార్లు, బైక్‌ల్లో జిల్లాలోని నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. 200 గుట్కా ప్యాకెట్ల చొప్పున ఉండే ఒక్కో బస్తాకు రూ.12వేల నుంచి రూ.15 వేలకు బీదర్‌లో కొనుగోలు చేసి రైళ్లు, కార్ల ద్వారా జిల్లాకు తీసుకొచ్చాక ఒక్కో బస్తాను రూ.20 నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. కార్లలో పదుల సంఖ్యలో సంచులను తరలిస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. సులువుగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ అందులోంచి కొంత మొత్తాన్ని స్థానికంగా పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమర్పించడంతోనే వారు మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా సమాచారం అందితేనే దాడులు నిర్వహించి అక్రమ వ్యాపారులను పోలీసులు పట్టుకుంటున్నారు. కొందరిని కేసులు నమోదు చేయకుండానే విడిచిపెడుతుండడంతో వారు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుపడిన అక్రమార్కులకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. తెలిసినా గప్‌చుప్ జిల్లాలో గత కొద్దికాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటోంది. ఉన్నతాధికారులకు విషయాన్ని పొక్కనీయకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో నడుస్తున్న గుట్కా దందాలో కిందిస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా కార్లు, ఆటోలు, బైకుల ద్వారా పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా దందా సాగించేందుకు అక్రమార్కులు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నారు. ప్యాసెంజర్ ఆటోలు, కార్లలో గుట్కా సంచులను తరలిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలకు పంపిణీ చేసేందుకు బైక్‌లను వినియోగిస్తున్నా రు. పట్టపగలే ఈ దందా సాగుతున్నా నిఘా మాత్రం కరువైంది. జిల్లాకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల నుంచే గుట్కా సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీదర్ కేంద్రంగా ఎక్కువ పొగాకు, గుట్కా ప్యాకెట్లు జిల్లాకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి జిల్లాకు గుట్కా చేరుకుంటోంది. అక్కడి నుంచి కార్లు, ఆటోలు, బైక్‌లు, అశోక్ లైలాండ్, అప్పి ఆటోల్లో పట్టపగలే ఎల్లలు దాటిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం.. జిల్లాలోని అక్రమ వ్యాపారాలపై పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
గుట్కా డొంక కదిలేనా?
సాక్షి, ఒంగోలు : గుట్కా రాకెట్ కేసులో తీగ లాగుతున్న పోలీసులు ఆ డొంక కదిల్చే ప్రయత్నంలో కొంత వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మేదరమెట్ల, నెల్లూరు నగరాల్లో గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు పాత్రదారులపై కేసులు నమోదు చేసి సూత్రధారులను తప్పించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా మాఫియా నోరు విప్పితే వారికి అండగా నిలిచి భారీ మొత్తంలో మామూళ్లు పుచ్చుకున్న ఇంటి దొంగల పాత్ర బయటపడుతుందనే ఆందోళనతో ముగ్గురు టీడీపీ నేతలను కేసు నుంచి బయట పడేసేందుకు ఓ అధికారి పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు నుంచి ఎన్నికల సమయం వరకూ అక్కడ పనిచేసిన ఓ ఎస్సై సదరు పోలీస్ అధికారికి దగ్గరి బంధువు కావడంతో వీరి బాగోతం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మేదరమెట్ల గ్రామంలో గుట్కా మాఫియా సూత్రధారుల గురించి ప్రస్తావిస్తే నలుగురు టీడీపీ నేతల పేర్లను చెప్పేస్తున్నారు. అయినప్పటికీ ఇంటి దొంగల గుట్టు బయట పడుతుందేమోననే భయంతో పోలీసులు మాత్రం వారి జోలికి వెళ్లడం లేదు. కేసు విచారణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న పోలీసులు ఇంటి దొంగలను రక్షంచేందుకు మాత్రం విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు పోలీసుల అండదండలు... కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ఓ పొగాకు గోడౌన్లో మూడేళ్లుగా నడుస్తున్న గుట్కా మాఫియా గుట్టును రట్టుచేసిన పోలీసులు కేంద్రం నిర్వాహకుడైన నెల్లూరుకు చెందిన బలగాని ప్రసాద్‌తో పాటు గోడౌన్ యజమాని హనుమంతరావు (బుల్లబ్బాయ్)పై కేసు నమోదు చేశారు. హనుమంతరావును అరెస్ట్ చేసిన పోలీసులు ప్రసాద్ కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తీగ లాగుతూ వెళ్లిన పోలీసులకు నెల్లూరు నగరంలో మరో గుట్కా తయారీ కేంద్రం కంటబడింది. నిందితుడు ప్రసాద్ మాత్రం పరారీలో ఉన్నాడు. అసలు నిందితుడు దొరికితే సూత్రధారులైన టీడీపీ నేతలు, అండగా నిలిచిన పోలీస్ అధికారుల పాత్ర బయట పడే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్‌తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు మరి కొందరు పోలీస్ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటైనట్లు సమాచారం. అప్పట్లో నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ వ్యాపారాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి దొంగలను రక్షించేందుకే... గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3 కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులకు తీగ లాగేకొద్దీ గతంలో కొందరు ఖాకీలు చేసిన పాపాలు బయటపడుతూ వచ్చాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ అందరికీ నెలవారీ మామూళ్లు ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. విచారణ అధికారులు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పాన్‌షాప్‌తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్‌గా..!
సాక్షి, నెల్లూరు : అతని జీవితం పాన్‌షాప్‌తో ప్రారంభమైంది. క్రమంగా గుట్కా డాన్‌గా ఎదిగాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి రూ.కోట్లు సంపాదించాడు. ప్రకాశం జిల్లా మేదరమిట్లలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా అక్కడి పోలీసులు ఇటీవల దాడి చేశారు. రూ.3 కోట్లు విలువచేసే తయారీ మెషిన్లు, ఖైనీ, గుట్కాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గుట్కా డాన్ కోసం రెండు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు బాలాజీనగర్ మసీద్ సెంటర్ ప్రాంతానికి చెందిన బి.ప్రసాద్ కొన్నేళ్ల క్రితం ట్రంకురోడ్డులోని ఓ కేఫ్ వద్ద పాన్‌షాప్ నిర్వహించేవాడు. గుట్కాలు, ఖైనీలు విక్రయించేవాడు. అనంతరం స్నేహితుల సహకారంతో జనార్దన్‌రెడ్డికాలనీలో, వెంకటాచలంలో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి వివిధ కంపెనీలకు చెందిన గుట్కా, ఖైనీలు పెద్దఎత్తున తయారుచేసి విక్రయించాడు. 2015లో వెంకటాచలం పోలీసులు బ్రిక్స్ మాటున గుట్కాతయారీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గుట్కా తయారీ కేంద్రంపై దాడిచేశారు. పరికరాలు, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులు అధికమైన నేపథ్యంలో ప్రసాద్ కొంతకాలం వ్యాపారానికి దూరంగా ఉన్నాడు. అనంతరం తన మకాంను ప్రకాశం జిల్లాకు మార్చాడు. మేదరమిట్లలో తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన పొగాకు గోదామును అద్దెకు తీసుకుని అందులో గుట్కా, ఖైనీ తయారీ పరికరాలను ఏర్పాటు చేశాడు. పెద్దఎత్తున గుట్కా, ఖైనీలను తయారుచేసి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. పక్కా సమాచారంతో.. గతేడాది జనవరిలో ప్రసాద్ అతని స్నేహితులు నెల్లూరు బారాషహీద్ దర్గా సమీపంలో నిషేధిత గుట్కా, ఖైనీలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో చిన్నబజారు పోలీసుస్టేషన్ ఎస్సై కరిముల్లా నిందితులపై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన ప్రసాద్, మరో ఇద్దరు పరారీ కాగా శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4 లక్షలు విలువచేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రంగా చక్రం తిప్పసాగారు. ఇటీవల ఆ జిల్లాలో పోలీసుల నిఘా పెరగడంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 24వ తేదీన ప్రకాశం జిల్లా అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్, మేదరమిట్ల ఎస్సై బాలకృష్ణలు తమ సిబ్బందితో కలిసి తయారీ కేంద్రంపై దాడులు చేసేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారవడంతో పోలీసులు గోదాము షట్టర్ తాళాలను పగులగొట్టారు. రూ.3 కోట్ల విలువచేసే తయారీ పరికరాలు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. గోదాము యజమాని హనుమంతరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అల్లీపురంలోనూ.. నిందితుడు ప్రసాద్ నెల్లూరు రూరల్ మండల పరిధిలోని అల్లీపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో హనుమంతరావు వెల్లడించాడు. దీంతో అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్ తన సిబ్బందితో కలిసి రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. రూరల్ పోలీసుల సహకారంతో అల్లీపురంలోని తయారీ కేంద్రాన్ని çతనిఖీ చేశారు. అక్కడ గుట్కా, ఖైనీలకు సంబంధించిన ఎలాంటి పదార్థాలు లభ్యం కాలేదని తెలిసింది. స్వాస్ పేరిట పాన్‌మసాలా (మౌత్ రీఫ్రెషనర్) ప్యాకెట్లు, అందులో వినియోగించి కిస్మిస్, జీడిపప్పు, సోంప్ పదార్థాలు, తయారీ పరికరాన్ని గుర్తించారు. దీంతో çపోలీసులు వాటి శాంపిల్స్‌ను తీసుకున్నారు. సదరు గోదాముకు రూరల్ పోలీసులు తాళాలు వేశారు. గోదాము యజమాని నుంచి ప్రసాద్ వివరాలు సేకరించారు. పాన్‌షాపు నుంచి గుట్కాడాన్గా ఎదిగిన ప్రసాద్ కోసం ప్రకాశం జిల్లా పోలీసులుతోపాటు నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. -
తమ్ముళ్లే సూత్రధారులు..!
అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు అధికారం కోల్పోయినా తీరు మార్చుకోవడం లేదు. సహజ వనరులను కొల్లగొట్టడం, సంపదను దోచుకోవడంతో ఆగక ప్రజారోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా తయారీ కేంద్రాన్ని శుక్రవారం పోలీసులు మేదరమెట్లలో గుర్తించిన విషయం తెలిసిందే. అయితే గుట్కా మాఫియాను నడుపుతున్నది మాత్రం టీడీపీ నేతలే అనేది స్పష్టమవుతోంది. గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన బలగాని ప్రసాద్ కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులేననే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారుల అండదండలతో స్థానిక టీడీపీ నేత హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులకు పెద్ద మొత్తంలో నెలవారీ మామూళ్లు ఇస్తూ తమ పని చక్కబెట్టుకుంటున్నారు. గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలు తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నాలకు తెరతీశారు. సాక్షి, ఒంగోలు : కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు కలిసి గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక పరమైన అంశాలను చూసుకుంటూ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు నెల్లూరు జిల్లకు చెందిన బలగాని ప్రసాద్ అనే వ్యక్తిని నియమించారు. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు ఎస్బీ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సమాచారం. నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్‌తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పని చేసిన ఎస్బీ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్కా తయారీ కేంద్రం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన టీడీపీ నేతలు గ్రామాల్లో పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించడమే కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేకు చందాలు కూడా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నుంచి తప్పించాలంటూ భారీ ఆఫర్లు.. గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే తాను బలగాని ప్రసాద్‌కు గోడౌన్‌ను లీజకు ఇచ్చానేతప్ప తనకేమీ సంబంధం లేదని టీడీపీ నేత హనుమంతరావు తప్పించుకునే యత్నం చేస్తున్నాడు. బలగాని ప్రసాద్ ఒక్కడే గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లుగా చూపి తమ పేర్లు తొలగించాలంటూ టీడీపీ నేతలు ఓ పోలీసు అధికారికి భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో విచారణ అధికారులకు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు సదరు పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా విచారణ జరిగితే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతో గతంలో గుట్కా మాఫియాకు అండదండలు అందించిన పోలీసు అధికారులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్పీ గ్రామంలో రహస్య విచారణ జరిపితే కళ్లు చెదిరే వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గం.. : అశోక్ వర్థన్, అద్దంకి సీఐ గుట్కా తయారీ కేంద్రం కేసు విషయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. ఇప్పటికే గోడౌన్ యజమాని హనుమంతరావును అరెస్టు చేశాం. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులో ముందుకు వెళ్తాం. గోడౌన్ యజమాని అరెస్ట్... కోర్టుకు తరలింపు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రానికి అద్దెకు ఇచ్చిన గోడౌన్ యజమాని పోకూరు హనుమంతరావును శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం వెలుగు చూసిన నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు అయిన సందర్భంగా గోడాన్ యజమానిపై 420, 468, 174,328,188,466,471,120బీ, 272 మరియు 59 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్సై తెలిపారు. -
క్షణాల్లో గుట్కా మాయం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని సరస్వతినగర్‌లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కా పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమైంది. సుమారు రూ.5లక్షల విలువచేసే గుట్కాను ఓ మహిళ సరస్వతినగర్‌లో ఒక ఆస్పత్రి పక్కన రేకులషెడ్డులో దాచిపెట్టింది. కొన్ని నెలలుగా ఇక్కడి నుండి గుట్కాను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ కోడలు తన అత్త గుట్కాను తరలిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మంగళవారం గుట్కాను పట్టుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లారు. పోలీసులు వెళ్లేలోపలే అక్కడి నుండి గుట్కా మాయమైంది. పోలీ సులు వెళ్లాక అక్క గుట్కా లేకపోవడంతో అవాక్కయ్యారు. సంబంధిత శాఖ నుండే సమాచారం లీక్ అయి నట్లు తెలిసింది. గుట్కా నిర్వహిస్తున్న మహిళ కోడలు పక్కా సమాచారం ఆధారాలతో పోలీసులకు సమర్పించగా పోలీసులు దానిని పట్టుకోలేకపోయారు. పోలీసులు దాడిచేస్తున్న సమాచారం తెలియడం సదరు మహిళ గుట్కాను మాయంచేసింది. ప్రస్తుతం గుట్కా మాయం కావడంపై రహస్యం గా విచారణ చేస్తున్నారు. -
గుట్కా@ బీదర్ టు హుజూరాబాద్
సాక్షి, హుజూరాబాద్ : గుట్కా ప్రాణాంతకమైంది.. ప్రాణాలను హరించే గుట్కా అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి నిషేధిక గుట్కా దందాను హుజూరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిక గుట్కాలను కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి హుజూరాబాద్‌కు తెచ్చి ఇక్కడి నుంచి పరిసర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాణాంతకమైన గుట్కా అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంతో పోలీసులు గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న గుట్కా దందాను అడ్డుకునేందుకు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తుండగా, రూ.లక్షల్లో గుట్కాలు పట్టుబడుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగని గుట్కా అమ్మకాలు.. గత కొన్నేళ్లుగా గుట్కా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా గుట్కా దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాడుల్లో తరచూ పట్టుబడుతున్నా.. అక్రమార్కులు మాత్రం గుట్కా అమ్మకాలను దర్జాగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే గుట్కాలు తినడానికి అలవాటు పడి ఎంతో మంది యువకులు, వృద్ధులు క్యాన్సర్ వ్యాధి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏడాది క్రితం కూడా గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో జీపులో తరలిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా రూ.లక్ష విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరికాయి. నివాస గృహాల్లో నిల్వలు.. హుజూరాబాద్ కేంద్రంగా గుట్కా అమ్మకాల విక్రయాలు కొనసాగుతుండగా, నివాస గృహాలనే కేంద్రాలుగా ఏర్పరుచుకొని కొందరు అక్రమార్కులు భారీగా నిల్వలను ఉంచుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మరింత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గానికి హుజూరాబాద్ పట్టణం కేంద్రం కావడంతో ఆయా మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న గుట్కా విక్రయదారులు గ్రామాల నుంచి వచ్చే కిరాణ కొట్టు దుకాణాదారులకు అంటగడుతూ జేబులు నింపుకుంటూ సొమ్ము చేసుకొంటుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే వారు కొన్ని పాన్ షాపుల్లో, కిరాణ దుకాణాల్లో గుట్టుగా విక్రయిస్తున్న గుట్కాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సరదాగా మొదలై.. వ్యసనంగా మారి ప్రాణాంతకమైన గుట్కాకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే వ్యసనంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడిని తట్టుకునేందుకు వారు సరదాగా గుట్కా, అంబర్‌కు అలవాటు పడుతూ వ్యసనంగా మారి వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అయితే నిరక్షరాస్యులతో పాటుగా, పలువురు విద్యావంతులు కూడా అంబర్, గుట్కా వ్యసనంగా మారి వ్యాధుల బారినపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు ధనార్జనే ద్వేయంగా గుట్కా అమ్మకాలను నిర్వహిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు సమాచారం. -
గుట్కాపై నిషేధమేది?
బేల(ఆదిలాబాద్): గుట్కా, ప్లాస్టిక్‌లపై నిషేధం ఉన్నా ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పాన్‌షాపులలో మరింత విరివిగా లభిస్తున్నాయి. ఓ వైపు గుట్కా దందా జోరుగా కొనసాగుతుండగా, మరోవైపు ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా మారింది. కాగా పాన్‌షాపులలో ఈ నిషేధత తంబాకులు, పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి నలిచి కర్రా పూడిలను(గుట్కా పొట్లాలు) మరీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ గుట్కా తయారీ జిల్లా కేంద్రంతోపాటు ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, గాదిగూడ, తదితర మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. వీటిపై అధికారుల తనిఖీలు అంతంతే ఉండడంతో గుట్కా, ప్లాస్టిక్‌ల నిషేధం ఏమాత్రం అమలు కావడం లేదు. గుట్కా, ప్లాస్టిక్ విరివిగా లభ్యం ‘గుట్కా నమలడం కేన్సర్‌కు కారకం’..అని సినిమా థియేటర్లలో, అక్కడక్కడా ప్రచార మాధ్యమాల్లో, వాల్‌పోస్టర్లలో చూస్తుంటాం, చదువుతుంటాం. దీంతో పాటు ‘ప్లాస్టిక్‌తో పర్యవరణానికి ముప్పు’ అని సైతం చూస్తుంటాం. అయినా నిషేధిత గుట్కా, ప్లాస్టిక్లు కలిసి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా..నిషేధిత ఈగల్, మాజా, బాబా, రత్నా, 160, తదితర తంబాకులను పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి సాధారణ మిమన్‌ల ద్వారా నలిచి నలిచి కర్రా పూడిలను తయారు చేస్తున్నారు. ఈ గుట్కా తయారీకి కరెంటు మిషన్లను సైతం యథేచ్ఛగా వినియోగిస్తుండటంతో గుట్కా, ప్లాస్టిక్లు దందా మరింత జోరుగా సాగుతోంది. మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్‌లుగా గుట్కా దందా.. మార్కెట్లో విమల్, సాగర్, నజర్, ఆర్ఎండీ, వంటి గుట్కాలు సాధారణంగా లభిస్తున్నాయి. ప్టాస్టిక్ ప్యాకింగ్‌తో ఉన్న అంబర్ తంబాకును ప్రత్యేకంగా ఫ్రీజ్‌లలో కూలింగ్ చేసి, రెండింతలతో మరి విక్రయిస్తున్నారు. ఇంతేకాకుండా నిషేధిత కర్రా పూడిలను ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా తయారు చేసిన కర్రాలను ముందుగా వయసు పైబడ్డవారు, వయోజనులు, యువకులు తినేవారు. గత ఒకట్రెండు ఏళ్ల నుంచి మహిళలతోపాటు బడీడు పిల్లలు సైతం తినడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా తింటుండంతో ‘మూడు ప్యాకెట్లు..ఆరు కాటన్లు’గా ఈ గుట్కా దందా రోజు లక్షల్లో కొనసాగుతోంది. ఈ గుట్కాతో ప్రతీరోజు చిన్న పాన్‌షాపులలో ఆరేడు వేలు పైబడి గిరాకైతే, పెద్ద పాన్‌షాపులలో రూ.35వేలకు పైబడి దాటుతోంది. ఈ గుట్కాకు అలవాటు పడ్డవారు దాన్ని మానలేక ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని మరి నములుతున్నారు. వీళ్ల అలవాటును పసిగట్టిన కొందరు మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ నిల్వలు ఉంచి, అవసరాన్ని బట్టి పాన్‌షాపులకు సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవగాహన లోపం.. రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా అలవాటు పడ్డవారు మానలేకపోతున్నారు. ఇక్కడి ప్రజల్లో అవగాహన లేకపోవడం, గుట్కాతో కలిగే దుష్పరిణామాలను మామూలుగానే తీసుకుంటూ నమిలేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం గుళ్ల అవుతోంది. గుట్కా నమిలే వాళ్ల వద్ధ పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. బహిరంగా ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడంతో అపరిశుభ్రత నెలకొంటోంది. దీంతో తోటి వారు ఇబ్బందులు పడుతున్నారు. గుట్కా నమిలితే కాలేయం, నోటి కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, పోలీసులు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిషేధించినా గుట్కా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘గుట్కా’ గుట్టుపై గుజరాత్‌కు సమాచారం!
సాక్షి, సిటీబ్యూరో: పాన్ మసాలా పేరుతో నిషేధిత ‘గుట్కా’ దందా చేస్తున్న ముఠా సూత్రధారి అవల అభిషేక్ వ్యవహారాన్ని నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతడు గుజరాత్ కేంద్రంగా సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు తెలపాలని నిర్ణయించారు. మరోపక్క ఫ్రాంచైజీల పేరుతో ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది హైదరాబాద్‌కు క్యూ కడుతుండటంతో అభిషేక్ ఆర్థిక లావాదేవీల పైనా పోలీసు విభాగం కన్నేసింది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన అవల అభిషేక్ 2015లో బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా ఉత్పత్తి చేసే సంస్థను ఏర్పాటు చేశాడు. గత ఏడాది దీనిపై దాడి చేసిన బీబీ నగర్ పోలీసు అవినాష్‌తో పాటు అతడి తండ్రి ఏవీ సురేష్, మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో అతను తన అడ్డాను గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్కోట్లకు మార్చి అక్కడ యూనిట్స్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనూ గుట్కాపై నిషేధం విధించడంతో అభిషేక్ తన యూనిట్స్‌లో గుట్కాను అదే రూపంలో ఉత్పత్తి చేయలేదు. పోలీసుల కన్నుగప్పేందుకు ‘7 ఎంసీ టుబాకో’ పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాల’ పేరిట మరోటి తయారు చేస్తున్నాడు. ఈ రెంటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో సోమవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. గుజరాత్ పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను వారి దృష్టికి తీసుకువెళ్ళాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఇందుకుగాను అక్కడి పోలీసులకు లేఖ రాయనున్నారు. తద్వారా గుజరాత్లో ఉన్న అభిషేక్‌కు చెందిన యూనిట్స్‌ను సీజ్ చేయించాలని, దీంతో అతడి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అవినాష్ ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు గోపాలపురం పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారే సంబంధిత అధికారుల ద్వారా లేఖ రాసే అవకాశం ఉంది. అవినాష్ ఓ పక్క నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే మరోపక్క అనేక మందిని మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాల’ ఉత్పత్తులకు సంబధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. పాన్ మసాలాల విక్రయంపై నిషేధం లేకపోవడంతో ఎవరి వారు వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా, కోల్‌కతా, ఢిల్లీ తదితర నగరాలకు చెందిన పలువురు అతడిని సంప్రదించారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో రూ.లక్షలు, రూ.కోట్లలో వసూలు చేసి మోసం చేశాడు. దీనిపై ఇప్పటికే ముషీరాబాద్, ఏపీలోని విశాఖపట్నం ప్రాంతాల్లో ఇతడిపై కేసులు నమోదు కాగా మంగళవారం బీహార్‌లోని పట్నా, ఢిల్లీలకు చెందిన దీలీప్ చౌదరి, మోహన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అభిషేక్ తమ నుంచి దాదాపు రూ.3.5 కోట్ల మేర తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిన్నింటితో పాటు అభిషేక్ మాణిక్‌చంద్ పేరును వినియోగించడం అక్రమమని భావిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు. సైదాబాద్‌లో ఇల్లు, బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు కార్యాలయాలు నిర్వహిస్తున్న అభిషేక్ వద్ద దాదాపు 15 మంది పని చేస్తున్నారు. దీంతో ఇతను ప్రతి నెలా అద్దెలు, జీతభత్యాలు, ఇతర ఖర్చులకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోపక్క నగరం కేంద్రంగా అభిషేక్ నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నుంచి సేకరించారు. దీని ప్రకారం అందులో అభిషేక్‌తో పాటు మరో మహిళ సైతం డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. -
గుట్కా ఫ్రమ్ గుజరాత్!
గుజరాత్లో ఏర్పాటు చేసిన యూనిట్స్‌లో వేర్వేరు ఉత్పత్తులుగా గుట్కా తయారు చేసి.. రైళ్లలో హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ప్రధాన సూత్రధారి అవల అభిషేక్ సహా నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.4 కోట్ల విలువైన నిషే ధిత ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్న ట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించా రు. సమావేశంలో డీసీపీ పి.రాధాకిషన్ రావు పాల్గొన్నారు. –సాక్షి, హైదరాబాద్ ఇక్కడ చిక్కడంతో.. సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్.. 2008 నుంచి బేగంబజార్ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్‌మసాలా వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా ఉన్నాడు. 2015లో సెవెన్‌హిల్స్ మార్కెట్ ప్రాంతంలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేశాడు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్‌చంద్’పేరుతో పాన్ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించాడు. మాణిక్‌చంద్ పేరును వినియోగించడంపై పోలీసులు లోతుగా ఆరాతీశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో గతేడాది బీబీనగర్ పోలీసులు యూనిట్‌పై దాడి జరిపి కేసు నమోదు చేసి అభిషేక్, అతడి తండ్రి ఏవీ సురేశ్ తదితరులను అరెస్టు చేశారు. దీంతో అభిషేక్ తన దందాను గుజరాత్‌కు మార్చాడు. అక్కడ ఉన్న తన ఏజెంట్ శైలేష్ జైన్ ద్వారా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో యూనిట్లు ఏర్పాటు చేశాడు. రైల్వేస్టేషన్ నుంచే సరఫరా పోలీసుల కన్నుకప్పేందుకు గుజరాత్లో ‘7 ఎంసీ టొబాకో’పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’పేరిట మరొకటి తయారు చేస్తున్నాడు. ఈ రెండింటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి అహ్మదాబాద్ నుంచి రైల్వేలో వివిధ రకాల పేర్లతో సికింద్రాబాద్‌కు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన ఉత్పత్తులను హైదరాబాద్‌లో నిల్వ చేసేందుకు గోడౌన్ నిర్వహించట్లేదు. రైల్వేస్టేషన్లో ఉండే ఏజెంట్లు షబ్బీర్ మొయినుద్దీన్, సయ్యద్ జబ్బార్ అహ్మద్‌లు ఈ ఉత్పత్తులను తీసుకుని అభిషేక్ ఆదేశాల ప్రకారం నేరుగా డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సయ్యద్ మహ్మద్‌కు చెందిన వాహనం వాడుతున్నారు. షబ్బీర్, జబ్బార్‌లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీల నుంచి వచ్చే పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటూ గోషామహల్‌కు చెందిన తబ్రేజ్, బేగంబజార్ వాసి మనీష్‌లకు సరఫరా చేసి అమ్మిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా సాగుతున్న ఈ దందాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్ రావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, పి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వల పన్నారు. గోపాలపురం ప్రాంతంలో రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషిద్ధ ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో అభిషేక్, షబ్బీర్, జబీర్, మొహ్మద్‌లను అరెస్టు చేశారు. ఫ్రాంచైజీల పేరుతో మోసం కాగా, నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే అనేక మందిని అభిషేక్ మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’ఉత్పత్తులకు సంబంధిం చిన ఫ్రాంచైజీలు, డిస్ట్రి బ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజె న్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేక మంది అభిషేక్‌ను సంప్రదిం చారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వారితో అక్కడ దుకా ణాలు ఏర్పాటు చేయించి ముందు కొంత సరుకు సరఫరా చేసి తర్వాత అదీ వెనక్కు తీసుకున్నాడు. నగదు ఇచ్చేయాలని అడిగిన వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ముషీరాబాద్, ఏపీలోని విశాఖ పట్నంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి.