భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
Published Tue, Dec 29 2015 1:57 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు మంగళవారం పెద్ద మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఖాదర్ కిరాణా దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష విలువ చేసే గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement