పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పలు షాపులపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పలు షాపులపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి చేపట్టిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.10 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి.