Rs. 10 Lakhs
-
రూ.10 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా స్టిక్కర్లు లేని మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ పట్నం జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి పొట్టు లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 10 లక్షలు విలువ చేసే 147 కేసుల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు లారీ డ్రైవర్, ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పలు షాపులపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి చేపట్టిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.10 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. -
రూ.10 లక్షల విలువైన నల్లమందు పట్టివేత
హైదరాబాద్ : పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాన్ని విక్రయించే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పెరిచెర్ల రామరాజు అనే వ్యక్తి 1.8 కేజీల ఓపియం(నల్లమందు)తో గురువారం హైదరాబాద్‌కు వచ్చి బేగంపేటలోని యాత్రి నివాస్ వద్ద తోటకూర శ్రీనివాస్‌ను కలుసుకున్నాడు. నల్లమందును విక్రయించే పథకంలో భాగంగా దాన్ని కొనుగోలు చేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి నుంచి 1.8 కేజీల నల్లమందు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మాదకద్రవ్యం విలువ రూ.10లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
దొంగలు అరెస్ట్: భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం
తిరుపతి నగరంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నలుగరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురు దొంగలను నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు నలుగరు దొంగలపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు దొంగలను తమదైన శైలిలో విచారిస్తున్నారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
నీ భర్తను నాకిచ్చేయి ...
తన ప్రియుడిని దక్కించుకోవడానికి అతని భార్యతోనే రూ.10 లక్షలకు బేరమాడిన ప్రియురాలి వైనమిది. మదురై తిరుమంగళం సమీపానగల నయనార్పట్టికి చెందిన నాగరాజ్, వినోదిని (23) భార్యాభర్తలు. అయితే తిరుప్పరంగుండ్రం సమీపానగల హార్విపట్టికి చెందిన పేచ్చియమ్మాళ్ అలియాస్ సత్యా (23) మదురై హోంగార్డు విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నాగరాజ్‌కు, పేచ్చియమ్మాళ్తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురూ విడిగా నివశిస్తు కుటుంబం నడిపారు. ఈ విషయం నాగరాజ్ భార్య వినోదినికి తెలిసింది. దీంతో వినోదినికి, పేచ్చియమ్మాళ్కు మధ్య తగాదా ఏర్పడింది. పేచ్చియమ్మాళ్ వినోదినికి రూ.10 లక్షలు అందజేస్తానని, నాగరాజ్‌ను తనకు విడిచిపెట్టాలని కోరింది. ఇందుకు పేచ్చియమ్మాళ్ తండ్రి వానమామలై, తల్లి పాండియమ్మాల్కు కూడా సహకరించారు. అంతేకాకుండా వీరు వినోదిని ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. దీనికి సంబంధించి వినోదిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.