రూ.10 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
Published Thu, Dec 24 2015 2:35 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా స్టిక్కర్లు లేని మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ పట్నం జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి పొట్టు లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 10 లక్షలు విలువ చేసే 147 కేసుల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు లారీ డ్రైవర్, ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement