
విశాఖపట్నం: నగర పరిధిలోని మద్యం లారీ బోల్తా పడడంతో జనం ఇదే అదనుగా మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. శనివారం ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ ఒకటి మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment