హైదరాబాద్ : పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాన్ని విక్రయించే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పెరిచెర్ల రామరాజు అనే వ్యక్తి 1.8 కేజీల ఓపియం(నల్లమందు)తో గురువారం హైదరాబాద్కు వచ్చి బేగంపేటలోని యాత్రి నివాస్ వద్ద తోటకూర శ్రీనివాస్‌ను కలుసుకున్నాడు. నల్లమందును విక్రయించే పథకంలో భాగంగా దాన్ని కొనుగోలు చేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి నుంచి 1.8 కేజీల నల్లమందు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మాదకద్రవ్యం విలువ రూ.10లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రూ.10 లక్షల విలువైన నల్లమందు పట్టివేత
Published Fri, May 15 2015 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement