opium
-
లైసెన్స్ ఇచ్చి నల్లమందు సాగు చేయిస్తుంటే..చిలుకలు దొంగలిస్తున్నాయ్!
ప్రతి ఏడాది అక్కడ పెద్ద మొత్తంలో నల్లమందును సాగు చేస్తారు. అయితే రైతుల ఉత్పత్తిని అంతా చిలుకలు దొంగలించేస్తున్నాయ్. దీంతో రైతులు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది చిలుకలు పెద్ద మొత్తంలో ఈ నల్లమందును ఎత్తుకుపోతున్నట్లు తెలిపారు రైతులు. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్, నీముచ్, రత్లాం జిల్లాలో నల్లమందు సాగు చేస్తారు. అందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సాగుకు లైసెన్సులు ఇస్తుంది. ఈ పంటను పర్యవేక్షించే బాధ్యతలన్నింటిని బ్యూరో తీసుకుంటుంది. నల్లమందు పంటను జనవరి, మార్చి మధ్యలో సాగు చేస్తారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కూరగాయాల మార్కెట్లలో కూడా విక్రయిస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాటి విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి నల్లమందును కొనుగోలు చేస్తుంది. ఈ నల్లమందును ఉపయోగించి కొన్ని గుండె, రక్తం, నిద్రకు సంబంధించిన మందుల తయారీలో వినయోగిస్తారు. ఇటీవల ఈ చిలుకల దాడి కారణంగా నల్లమందు సాగులో రైతులు ఎక్కువుగా నష్టపోతున్నారు. ఈ విషయంలో పోలీసుల సైతం ఏం చేయలేమని చెప్పడంతో ప్లాస్టిక్ వలలను అమర్చడం ప్రారంభించారు. దీంతో ఆ చిలకలు కూడా నల్లమందు కాయలను అందించుకోవడం సాధ్యం కాక నిలబడి ఉన్న పంటకు నష్టం చేయడం ప్రారంభించాయి. (చదవండి: ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..) -
తాలిబన్లకు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్
భద్రతపై ఎన్ని హామీలు ఇస్తున్న తాలిబన్లపై అఫ్గన్లకు నమ్మకం కలగడం లేదు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలని, అధికారులు ఆఫీసులకు రావాలని తాలిబన్లు భరోసా ఇస్తున్నా.. స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ముగిశాక.. అఫ్గనిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి నెలకొనవచ్చని నిపుణులు అప్పుడే ఓ అంచనాకి వచ్చారు. తుపాకుల పహారా నడుమే అరకోరగా తెరుచుకుంటున్న షాపింగ్సముదాయాలు. బ్యాంకులు బంద్.. ఏటీఎంలలో నిండుకున్న డబ్బులు. చాలావరకు పెట్రోల్ బంక్‌లకు నో స్టాక్ బోర్డులు. మరోవైపు మందుల కొరతతో అఫ్గన్లు అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో తాలిబన్ల కంటపడకుండా బిస్కెట్ ప్యాకెట్ల నుంచి మొదలు.. ప్రతీ నిత్యావసరాలను అడ్డగోలు రేట్లకు అమ్మకుంటున్నారు అక్కడి వ్యాపారులు. గత పదిరోజులుగా అఫ్గనిస్తాన్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఆకలి కేకలు తప్పవా? సెప్టెంబర్ నుంచి అఫ్గనిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం మొదలుకావొచ్చని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పుడ్ ప్రోగ్రాం(WFP) అంచనా వేస్తోంది. బ్రెడ్డు కూడా దొరకని పరిస్థితుల్లో సుమారు కోటిన్నర మంది ఆకలి కోరల్లో కొట్టుమిట్టాడతారని, భారీ ఎత్తున్న సహాయకార్యక్రమాల అవసరం పడొచ్చని యూఎన్ విభాగం అభిప్రాయపడింది. యూఎన్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో అంతర్జాతీయ సమాజం నుంచి మూడో అతిపెద్ద సహాయక కార్యక్రమం అఫ్గనిస్తాన్ గడ్డపై నిర్వహించాల్సి రావొచ్చని చెబుతోంది. డబ్ల్యూహెచ్‌వో నిస్సహాయత! రెడ్‌క్రాస్, డబ్ల్యూహెచ్‌వోలతో పాటు మరికొన్ని ఎన్జీవోలు అఫ్గనిస్తాన్‌లో గత ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్నాయి. నెలన్నర పరిస్థితుల తర్వాత ఈ వారం మొదట్లో సుమారు 500 టన్నుల మందులను దించేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు డబ్ల్యూహెచ్‌వో రీజియనల్ డైరెక్టర్ తెలిపారు. దీనికితోడు కరోనా కేసులు పెరుగుతూ.. నాలుగో వేవ్ దిశగా వెళ్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు క్లియర్ అయితే గనుక.. ఈ సమస్యకు కొంత పరిష్కారం అవ్వొచ్చని భావిస్తున్నారు. నిధులు నిల్ ప్రభుత్వ నిధుల సంగతి!. 2001లో తాలిబన్ల కట్టడి నాటికి అఫ్గన్ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉండేది. అమెరికా-నాటో దళాల మోహరింపు నడుమ తర్వాతి ఇరవై ఏళ్లలో విదేశీ నిధులతోనే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ నడిచింది. ఒకానొక టైంలో అసలు అఫ్గన్ ప్రభుత్వం 70-80 శాతం అంతర్జాతీయ దాతల సహకారం ద్వారా నడిచింది. అందులో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అందించే సాయం ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ సాయం ఆగిపోయింది. బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయ్యాయి. బయటి దేశాల సాయం ఇప్పుడప్పుడే అందే ఛాన్స్ లేదు. ప్రభుత్వ ఏర్పాటునకు తాలిబన్లకు ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. పొరుగు లేదంటే మిత్ర దేశాల సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా.. అందుకు ఇప్పట్లో తగ్గ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో.. అఫ్గన్బండిని లాగడం తాలిబన్లకు కత్తిమీద సాము లాంటిదే. చదవండి: భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: తాలిబన్లు వనరులే దిక్కింకా! తాలిబన్ల ముందున్న మొదటి పని.. ధరలను అదుపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారకుండా చూసుకోవడం. ఉత్పత్తులను దేశంలోకి అనుమతించేలా తక్షణ చర్యలు చేపట్టడం. ఇదంతా రాజకీయ, పాలనాపరమైన, అంతర్గత సంక్షోభ వ్యవహారాలతో సంబంధం లేకుండా జరగాలి. అలాగే వనరులను ప్రధానంగా ఉపయోగించుకుని సంక్షోభం నుంచి ఎంతో కొంత అధిగమించే ప్రయత్నం చేయాలి. అఫ్గన్ నేల ఎంతో విలువైన రాశులకు నిలయం. కాపర్, గోల్డ్, ఆయిల్, సహజ వాయువులు, యురేనియం, బాక్సైట్, కోల్, ఐరన్ ఓరె, లిథియం, క్రోమియం, లెడ్, జింక్, జెమ్‌స్టోన్స్, సల్ఫర్, జిప్సం, మార్బుల్.. తదితరాలు దొరకుతాయి. 1.4 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ సంపద ఇక్కడ నెలవై ఉంది. దీనిని మిలిటరీ ఎక్విప్మెంట్, ఎలక్రా్టనిక్ గూడ్స్ తదితరాల కోసం వేరేదేశాలకు తరలించి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు. తద్వారా కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. కరోనా టైంలోనే అఫ్గన్ ఖనిజ సంపద మీద చాలా దేశాలు ఆసక్తి చూపించాయి. ప్రత్యేకించి చైనా.. అఫ్గన్‌లో భారీ పెట్టుబడుల ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే తాలిబన్ల దురాక్రమణతో ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లాలి. ఇప్పుడు తాలిబన్లతో చర్చలకు సైతం సిద్ధపడుతున్న చైనాను.. భారీ పెట్టుబడులకు ఆహ్వానించాలి. చదవండి: ఐసిస్ కే ఎవరు? భారత్‌కు వాళ్లతో ముప్పా? ఒకప్పుడు తాలిబన్లకు ఓపియం(నల్ల మందు) ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగించుకున్నారు. ఓపియం సాగు, పన్నులు, తరలింపు ద్వారా విపరీతమైన నిధులు సమకూర్చుకున్నారు. కానీ, ఇప్పుడు దానికి దూరంగా ఉంటామని ప్రకటించుకున్నారు. అయితే ఓపియం సాగు ద్వారా 2019లో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు లభించాయి. ట్యాక్సుల ద్వారా నిధులొచ్చాయి. అలాంటి దానిపై నిషేధం.. అఫ్గన్‌ను ఆర్థికంగా కోలుకునే అవకాశం నుంచి దూరం చేస్తుందని కొందరు అమెరికన్ మేధావులు విశ్లేషిస్తున్నారు. కానీ, ఓపియం వర్తకం ద్వారా అంతర్గత, అంతర్జాతీయ సమాజం నుంచి శత్రువుల్ని తయారు చేసుకోవడం తమకు ఇష్టం లేదని ప్రకటించుకుంది తాలిబన్. అంతేకాదు నల్ల మందులో అమెరికాలో 2019లో యాభై వేల మరణాలు సంభవించాయనే విషయాన్ని ప్రధానంగా వినిపిస్తూ.. బ్యాన్ ఆదేశాలకు సిద్ధపడింది తాలిబన్ సంస్థ. వీటికి బదులుగా వనరులతో పాటు పశుపోషణ, డ్రైడ్ ఫ్రూట్స్ వ్యాపారాల్ని సమర్థవంతంగా నడిపించుకోవడం, బయటి ఉత్పత్తులకు అనుమతించడం ద్వారా ఊబి మధ్య నుంచి బయటపడొచ్చు. - సాక్షి వెబ్ డెస్క్ -
ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా!
పలమనేరు (చిత్తూరు జిల్లా): వివిధ మాదకద్రవ్యాల తయారీకి వినియోగించే ఓపీఎం పోపీ (గసగసాలు) సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన మరో ముఠా ఈ అంతర్జాతీయ మాఫియాకు సహకారమందిస్తోంది. అంతేకాకుండా వీటిని స్థానికంగా పండించడానికి రైతులకు విత్తనాలను అందించడం వంటివి చేస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో తాజాగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓపీఎం పోపీ సాగు వివరాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పంటను సాగు చేస్తున్న పలువురు రైతులను అరెస్టు కూడా చేశారు. అయితే పంటను ఎవరు సాగు చేయమన్నారు? ఎవరు కొంటారు? ఎక్కడికి తీసుకెళ్తారనే విషయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రధానంగా దృష్టి సారించింది. సోమవారం ముంబైకి చెందిన భార్యాభర్తలను అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో మత్తు పదార్థాల రవాణా వెనుక బెంగళూరు, ముంబై లింకులతో కూడిన అంతర్జాతీయ మాఫియా, ఉగ్రవాదులు హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోనే రహస్య సాగు.. కర్ణాటకకు ఆనుకుని ఉన్న రాష్ట్ర సరిహద్దు గ్రామాలతోపాటు కోలారు జిల్లాలో రహస్యంగా ఓపీఎం పోపీ సాగు గత పదేళ్ల నుంచే సాగుతోంది. ఈ పంటకు సంబంధించిన ముఠా ఏజెంట్లు కర్ణాటకలోని బెంగళూరు, కోలారు, చింతామణి, శ్రీనివాసపుర, దొడ్డబళ్లాపుర, పావగడ తదితర ప్రాంతాలతోపాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వందలాదిమంది ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు కొద్ది మొత్తం మాత్రమే విదిల్చి.. ఏజెంట్లు కోట్లాది రూపాయలు విలువైన పంటను ఇప్పటికే తరలించినట్లు భావిస్తున్నారు. స్థానికంగా రైతులకు ఈ పంట విత్తనాలను అందిస్తూ.. ఆ తర్వాత పంటను కొనుగోలు చేసే ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకొనే పనిలో అధికారులు ఉన్నారు. ఈ ముఠాను పట్టుకుంటే.. దీని ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మాఫియాను ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లే నిర్వహిస్తున్నారనే అనుమానాలున్నాయి. కాయ నుంచి వస్తున్న జిగురు.. గత టీడీపీ ప్రభుత్వ పాపమే.. ఈ మత్తు పంట సాగవుతోందని తెలిసినా గత టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఏటా పంటల నమోదును రెవెన్యూ శాఖ చేపడుతుందనేది తెలిసిన సంగతే. పదేళ్లుగా ఈ పంట రహస్యంగా సాగవుతున్నప్పుడు గత ప్రభుత్వం ఈ పంటను ఎందుకు నమోదు చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అలాగే వ్యవసాయ శాఖ కూడా నిషేధిత జాబితాలో ఉన్న ఈ పంటను సాగు చేయొద్దని రైతులను హెచ్చరించిన దాఖలాలు లేవు. డ్రగ్స్ తయారీకి వాడే మొక్క బెరడు- కాయలోపల గసగసాలు.. మొక్క నుంచి అంతా లాభమే.. మామూలుగా ఓపీఎం పోపీ మొక్క నుంచి గసగసాలతోపాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తున్నారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు.. దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్, మార్ఫిన్ వంటి మత్తు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయారుచేస్తున్నట్లు గతంలోనే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇళ్లల్లోనే పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారుచేసి.. ఆ ప్యాకెట్లను ఇక్కడి నుంచి ఆటోలు, కార్లు, ప్రైవేటు బస్సుల్లో బెంగళూరుకు పంపుతున్నారు. బొంబాయి క్రిష్ణమ్మ, బల్కర్సింగ్ అరెస్ట్.. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే గసగసాలు (ఓపీఎం పోపీ) సాగు కేసులో సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె ఎస్ఈబీ పోలీసులు ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ (50), ఆమె భర్త బల్కర్ సింగ్(60)లను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్ఈబీ డీఎస్పీ పోతురాజు, సీఐ కేవీఎస్ ఫణీంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మదనపల్లె మండలం మాలేపాడులో నిషేధిత గసగసాల పంటను సాగు చేసిన కత్తివారిపల్లెకు చెందిన బొమ్మరాసి నాగరాజు(45), అతడి మామ అల్లాకుల లక్షుమన్న (60), బావమరిది ఎ.సోమశేఖర్ (26)లను మార్చి 14న పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గసగసాల సాగుకు విత్తనాలను సరఫరా చేసిన చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మిరి వెంకట రమణ అలియాస్ నాగరాజు (50), రేవణ కుమార్ (46)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు అందించిన సమాచారంతో ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ, ఆమె భర్త బల్కర్ సింగ్‌లను తాజాగా అరెస్టు చేశారు. వారిని మదనపల్లె కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా, త్వరలోనే డ్రగ్ మాఫియాలోని ప్రధాన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది జనసేన, టీడీపీ చెట్టాపట్టాల్.. -
రూ.10 లక్షల విలువైన నల్లమందు పట్టివేత
హైదరాబాద్ : పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాన్ని విక్రయించే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పెరిచెర్ల రామరాజు అనే వ్యక్తి 1.8 కేజీల ఓపియం(నల్లమందు)తో గురువారం హైదరాబాద్‌కు వచ్చి బేగంపేటలోని యాత్రి నివాస్ వద్ద తోటకూర శ్రీనివాస్‌ను కలుసుకున్నాడు. నల్లమందును విక్రయించే పథకంలో భాగంగా దాన్ని కొనుగోలు చేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి నుంచి 1.8 కేజీల నల్లమందు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మాదకద్రవ్యం విలువ రూ.10లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే!
ఈటానగర్: ఆలుమగలు పాలు, తేనెలా కలిసుండాలంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆలుమగలు మరో అడుగు ముందుకేసి మత్తుపదార్ధాలు కలిసి సేవిస్తున్నారు. జాయింటుగా నల్లమందు నంజుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తమ భార్యలకు స్వయంగా భర్తలే నల్లమందు అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు సేవిస్తున్నారని, వీరిలో ఎక్కువమందికి పెళ్లై తర్వాత భర్తలే ఈ అలవాటు చేసినట్టు తేలింది. ప్రతి 100 మందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. మత్తుపదార్థాల సేవనంలో మణిపూర్ మహిళలు(28.2 శాతం) ముందున్నారు. మిజోరం(17.4), నాగాలాండ్(14.9), మేఘలయ(12.1), అస్సాం(10.2), సిక్కిం(9.8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డడ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఈ సర్వే నిర్వహించింది. ఈశాన్య భారత్ లోని 8 రాష్ట్రాల్లో సమగ్ర సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి. -
గంజాయి తరలిస్తున్న డీసీఎం స్వాధీనం
మెదక్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలో పోలీసులు 180 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఎక్సైజ్ సీఐ మణెమ్మ, స్థానిక ఎస్సై సూర్య ప్రకాశ్ శుక్రవారం ఉదయం బీబీపేట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పిట్లం నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న డీసీఎంను తనిఖీ చేయగా 180 కిలోల గంజాయితో పట్టుబడింది. లారీని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. (నారాయణ్‌ఖేడ్) -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖపట్టణం(రోలుగుంట): విశాఖపట్టణం జిల్లా రోలుగుంటలో గంజాయి తరిలిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు...రోలుగుంట మండలంలోని బెన్నభూపాల పట్టణం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పోలీసులు అతనిపై దాడి చేసి పట్టుకున్నారు. అతని నుంచి దాదాపు 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
37 కేజీల గంజాయి పట్టివేత
పలాస: ఈస్ట్‌కోస్ట్ రైలులో ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కృష్ణ(18), పల్లు నాయక్(24) ఒడిశాలోని బరంపురం నుంచి 37 కేజీల గంజాయిని గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల గంజాయి రవాణా పెరిగిపోవడంతో నిఘా పెట్టినట్టు రైల్వే రక్షక దళం ఎస్ఐ మునప్ మంగళవారం తెలిపారు. -
320 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ : విశాఖపట్నం జిల్లా రోలుగుంట వద్ద మూడు క్వింటాళ్లకు పైగా గంజాయిని మంగళవారం తెల్లవారు జామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీబీ పట్నం మండలం వడ్డిత గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 320 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆటోను సీజ్ చేశారు. (రోలుగుంట) -
20 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ పరిధిలో 20 కేజీల గంజాయిని పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వెలుగుల వెంకన్న(28) అనే వ్యక్తి 20 కేజీల గంజాయితో కాల్వగట్టుపై నుంచి వెళుతుండగా కొత్తకోట పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. (రావికమతం) -
సికింద్రాబాద్ స్టేషన్లో 90 కేజీల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 90 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన సంతోష్ హెచ్ పాత్రో(24), బల్లు(23)ల బ్యాగులను పోలీసులు స్కానర్లతో తనిఖీ చేస్తుండగా విషయం బయటపడింది. 90 కేజీల గంజాయితో పాటు, వారి వద్ద నుంచి రూ.40 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.