భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే! | Majority of women drug users introduced to opium by husbands | Sakshi
Sakshi News home page

భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే!

Published Fri, Apr 3 2015 2:40 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే! - Sakshi

భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే!

ఈటానగర్: ఆలుమగలు పాలు, తేనెలా కలిసుండాలంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆలుమగలు మరో అడుగు ముందుకేసి మత్తుపదార్ధాలు కలిసి సేవిస్తున్నారు. జాయింటుగా నల్లమందు నంజుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తమ భార్యలకు స్వయంగా భర్తలే నల్లమందు అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది.

ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు సేవిస్తున్నారని, వీరిలో ఎక్కువమందికి పెళ్లై తర్వాత భర్తలే ఈ అలవాటు చేసినట్టు తేలింది. ప్రతి 100 మందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది.

మత్తుపదార్థాల సేవనంలో మణిపూర్ మహిళలు(28.2 శాతం) ముందున్నారు. మిజోరం(17.4), నాగాలాండ్(14.9), మేఘలయ(12.1), అస్సాం(10.2), సిక్కిం(9.8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డడ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఈ సర్వే నిర్వహించింది. ఈశాన్య భారత్ లోని 8 రాష్ట్రాల్లో సమగ్ర సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement