పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది.
రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment