Andaman Nicobar islands
-
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్‌ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్‌లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్‌షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్‌షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో మైనింగ్‌ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్‌ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్‌గా ఎదగడమే లక్ష్యం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్‌ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
అండమాన్‌లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
చరిత్రను చెరగనివ్వని ద్వీపాలు!
అండమాన్, నికోబార్ ద్వీపవాసులు ‘పునరుద్ధరణ’ను ఆశ్రయించకుండా, చరిత్రను తిరగ రాసుకోవాలని ఉరకలెత్తకుండా తమ గాయపడిన గతాన్నే వాస్తవ వర్తమానంగానూ స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, స్వాతంత్య్ర సమర యోధులు తమ పోరాట ఫలితాలకు ప్రతీకాత్మకమైన ఆ ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించారు.ఎందుకంటే చరిత్రలో రెక్కల కూల్చివేతా ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే... దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాల్లో తమది కూడా ఒకటిగా ఉండేలా చేసింది. కానీ, మితిమీరిన జాతీయవాదంతో ఇప్పుడు అభివృద్ధి కన్నా పేర్ల మార్పుపై దృష్టి పెట్టడం విషాదం.దేశభక్తి గురించి లేదా ‘భిన్నత్వంలోఏకత్వం’ అనే రాజ్యాంగ భావన గురించి దేశం మొత్తంలో ఎలాంటి పాఠాలూ, ప్రబోధాలూ అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అవి... అండమాన్, నికోబార్ దీవులే. ఆ దీవుల జనాభాలో ఎక్కువ భాగం (సుమారు ఐదు లక్షల మంది) బ్రిటిష్ వారు ఖైదు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం కలిగి ఉన్నవారే. ఆ తర్వాతి స్థానంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, నెగ్రిటో జరావాస్, ఒంగెస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ (బయటి ప్రపంచంతో సంబంధం లేని చివరి రక్షిత తెగ) లేదాషాంపెన్, నికోబారీస్ వంటి మంగోలాయిడ్ తెగలకు చెందిన స్థానిక తెగల సభ్యులు ఉన్నారు.‘భారతదేశ భావన’కు ఆధారభూతమైన ఈ సుదూర కేంద్రం నేడు భారతదేశంలోని అనేక వైవిధ్యాల అధివాస్తవిక సమ్మేళనం. స్వాతంత్య్ర పోరాటం, ‘కాలా పానీ’ అపఖ్యాతి (కఠిన శిక్షల విధింపు, సెల్యులార్ జైలు మొదలైనవి) బెంగాల్, పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ నుండి ఖైదీలను ఎక్కువగా ఇక్కడికి రప్పించాయి. వారిలో చాలామంది జాతీయ నిర్మాణంలో గుర్తింపునకు, ప్రశంసలకు నోచు కోకుండా మిగిలిపోయారు. వారి గర్వించదగిన వారసుల కోసం మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా విచిత్రమైన ‘హిందూ స్థానీ’ మాండలికాన్ని ఉపయోగించడం ద్వారా మత సామరస్య భావం నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. బెంగాలీలు, తమిళులు, పూర్వాంచలీలు, పంజాబీలు... భారత ప్రధాన భూభాగాన్ని కబళి స్తున్న విషపూరితమైన విభజన, రాజకీయ ‘విభజన’ విధానాలచెంప చెళ్లుమనిపిస్తూ ఇక్కడ తమ బతుకు తాము జీవిస్తున్నారు. దూరంగా (చెన్నై లేదా కోల్‌కతా నుండి 1,200 కి.మీ), ప్రధాన భూభాగంలో సాగుతున్న ‘దారుణమైన’ రాజకీయాలు అంటకుండా ఉండటం అనేది ఈ దీవులు ఆదర్శవంతమైన ‘మినీ–ఇండియా’ను తలపించేందుకు దోహదపడింది. నిజానికి ‘మేము–వారు’ అనే ఆధిపత్య ధోరణి మతాలు లేదా జాతుల మధ్య కాదు... సామూహిక ‘ద్వీపవాసులు వర్సెస్ ప్రధాన భూభాగవాసుల మధ్య కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన భూభాగ స్థులను దోపిడీదారులుగా చూస్తారు. ప్రధాన భూభాగంలోని సాధా రణ అవగాహన కంటే ద్వీపాలలో చరిత్రపై అభిప్రాయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు జపనీయులతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన మూడేళ్ల పొత్తు గురించి ఇక్కడ మిశ్రమ భావాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు బ్రిటిష్ వారిని మించిన క్రూరత్వంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి.ఈ శాంతియుత ద్వీపవాసులు పునరుద్ధరణ వాదాన్ని ఆశ్రయించలేదు. లేదా చరిత్రను తిరగరాయలేదు. సంక్లిష్టమైన, గాయపడిన చరిత్రనే తమ వాస్తవ గుర్తింపుగా స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధులు తమ బాధను సూచించే ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఎందు కంటే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కూడా సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాలలో వారు ఒకటిగా ఉండేలా చూసింది.2006లో ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, గవర్నర్‌గా నియ మితుడనయ్యాను. 2004 డిసెంబర్ నాటి ఘోరమైన సునామీ కార ణంగా నష్టపోయిన ద్వీపాలలో ఉపశమనం, పునరావాసం నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన సామాజిక ఆర్థిక విధ్వంసాల నుండి మనం కోలుకున్న ప్పుడు, సమాజం కలిసి ఉండే విధానం వల్ల నేనెంతో ఉపకారంపొందాను. ఒక మాజీ పోరాట యోధుడిగా, నేను సామాజిక అనుకూ లత, శాశ్వతమైన దేశభక్తి, ఇంకా లేహ్ ప్రాంతంలోని సుదూర సరి హద్దు ప్రాంతాలు, కశ్మీర్ ఎతై ్తన ప్రాంతాలు లేదా లోతట్టు ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకమైన ఒక పెద్ద జాతీయ ప్రయోజనాన్ని చూశాను. తక్కిన ‘భారతదేశం’లో ఇది కనిపించలేదు. చాలా సాధించినా, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ ద్వీపాల వ్యూహాత్మక స్థానం (మలక్కా జలసంధి వద్ద చైనీస్ ‘చౌక్ పాయింట్’ మినహా) – అలాగే హానికి లేదా దాడికి గురయ్యే గిరిజనులకురక్షణగా ఉన్న భౌగోళిక స్థితి, వీటితో పాటుగా... సహజమైన గ్రీన్ కవర్ అభివృద్ధి కోసం గోవా, కేరళ మార్గాల్లో సాంప్రదాయికతకు తలుపులు ‘తెరవడం’పై కొన్ని పరిమితులు అవసరం. ప్రైవేట్ అభివృద్ధి లేనప్పుడు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. మౌలిక సదుపా యాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కొరత కూడా ఒక సవాలు. అయినప్పటికీ ఈ భారతదేశ ‘షైనింగ్ ఔట్ పోస్ట్’ దాని ప్రత్యేక మార్గాలకు, చరిత్రకు కట్టుబడి ఉంది.ప్రధాన భూభాగపు గాలులు, స్వచ్ఛమైన సహజ ద్వీపాలకు చేరు కోవడానికి ఎంతో కాలం పట్టదు. జాతీయవాదాన్ని ప్రోత్సహించ డానికి ప్రముఖ స్థలాల పేర్లను మార్చడం అటువంటి దిగ్విషయా లలో ఒకటి. హ్యావ్లాక్, నీల్, రాస్ దీవులకు వరుసగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. ద్వీపాలు టూరిజంపై ఎక్కువగా ఆధారపడటం, పర్యాటక ‘బ్రాండ్’ లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లను మార్చటం తగదని మార్కెటింగ్ జ్ఞానం సలహా ఇస్తుంది. అన్నింటికంటే, వాడుకకు చెందిన స్థిరత్వం, నామకరణపు క్లుప్తత, దీర్ఘకాల గుర్తింపును నిర్మించడం అనేది సాధారణ భావన. అయినప్పటికీ, స్థానికులు కోరుకున్నందున పేర్లు మార్చడం జరగలేదు, కానీ మితి మీరిన జాతీయవాదం ఫార్ములా కారణంగా వీటి పేర్లు మార్చారు. ఈ పేరు మార్పు వెనుక చోదకశక్తిగా ఉన్నవారు నేతాజీ మనవడుచంద్ర కుమార్ బోస్. అయితే దిగ్గజ స్వాతంత్య్ర యోధుడి భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ నుండి తనకు మద్దతు లభించ లేదంటూ తర్వాత ఆయన పాలకవ్యవస్థ నుండి వైదొలిగారు.తరువాత, జనావాసాలు లేని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మార్చారు. భారతదేశపు అర్హులైన వారసులకు నివాళి గనక, ఆచరణాత్మక చిక్కులు కూడా లేవు గనక ఈ పేర్ల మార్పును అంగీకరించడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, ఇంకా చాలా అంశాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవులకు సరికొత్త జాతీయవాద ఔన్నత్య ‘వైభవం’ సంప్రా ప్తించింది. రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు ఇటీవల ‘శ్రీ విజయపురం’ అని పేరు పెట్టారు. ఇది ‘వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయ డానికి’ జరిగిందంటున్నారు. ఆర్చిబాల్డ్ బ్లెయిర్ (ఈయన పేరునే పోర్ట్ బ్లెయిర్‌కు పెట్టారు) బొంబాయి మెరై¯Œ లో సాపేక్షంగా అసంగ తమైన నావికా సర్వేయర్ అని పట్టించుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అతని గురించి తీవ్రమైన దూషణలతో నిండిపోయింది. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చడం గురించి కొంతమంది ద్వీప వాసులకు చేసిన కాల్స్ ఉదాసీనత, ఉద్రేకాలతో మిశ్రమ స్పందనను రేకెత్తించాయి. ద్వీపవాసులకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కసరత్తులు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. ఇది తప్పు కాదు కానీ ప్రత్యేకించి దేశంలోని మిగిలిన ప్రజలకు గౌరవప్రదమైన దేశభక్తి (అత్యంత తీవ్రమైన జాతీయవాదం కాదు), కలుపుగోలుతనం, లౌకికవాదం గురించి ఒకటి లేదా రెండు విష యాలు చెప్పVýæలవారికి ఇది ఉన్మాద రాజకీయాల పునరావృతమే. పేర్లు మార్పు సరే... అర్థవంతమైన అభివృద్ధి మాటేమిటి? అది జరిగే సూచనలు కనిపించటం లేదు. - వ్యాసకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్- భోపిందర్ సింగ్ -
పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…— Amit Shah (@AmitShah) September 13, 2024 Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl— All India Radio News (@airnewsalerts) September 13, 2024 ఇది కూడా చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. -
అండమాన్- నికోబార్‌లో ఓటర్లెందరు? ఏ పార్టీకి కంచుకోట?
అండమాన్- నికోబార్ దీవులలోని ఓటర్ల సంఖ్యను ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 52 శాతం పురుషులు, 48 శాతం మహిళలు. అండమాన్- నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లాన్ తెలిపిన వివరాల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల 5300 మంది ఓటర్లు మొదటిసారి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు . 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 6 శాతం మేరకు పెరిగింది. ఏప్రిల్ 19న అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బిష్ణు పద్ రేకు ఎన్డిఏ కూటమి టికెట్ ఇవ్వగా, ఇండియా కూటమి నుంచి కుల్దీప్ రాయ్ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎంపీ కుల్దీప్. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద్ రే ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ విశాల్ జాలీకి టిక్కెట్ కేటాయించింది. నాడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుల్దీప్కు 95,308 ఓట్లు రాగా, విశాల్‌కు 93,901 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అండమాన్ నికోబార్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 1967లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ గణేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా చేరారు. ఆయన 1971లో కూడా గెలిచారు. 1977 నుంచి 1999 వరకు కాంగ్రెస్‌కు చెందిన మనోరంజన్ భక్త్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999లో బీజేపీకి చెందిన బిష్ణు పద్ రే తొలిసారిగా ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2004లో మనోరంజన్ భక్త్ తిరిగి గెలిచారు. బిష్ణు పద్ రే 2009, 2014లో ఎంపీగా ఉన్నారు. కులదీప్ రాయ్ శర్మ 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
Andaman Islands Earthquake: అండమాన్‌లో భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN — ANI (@ANI) January 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS). ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్‌లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్‌లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు. An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm — ANI (@ANI) August 2, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? -
అండమాన్‌ను కుదిపేసిన భూకంపం
ఢిల్లీ: అండమాన్ నికోబార్‌ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్‌తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 2 #earthquakes in the Indian Ocean, magnitude 6.1 Andaman Is, & mag 5.9 southwest Indian Ridge nearer to Africa. @rrichcord @LaytenHolland pic.twitter.com/1W2Vk7blFs — Cecilia Sykala (@CeciliaSykala) July 28, 2023 -
గవ్వలు కావు.. లోహ విహంగాలు ఆగే చోటిది (ఫొటోలు)
-
అండమాన్ లేదా దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం ఈజీ?
భారతదేశానికి చెందినవారు విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా దుబాయ్ లేదా అండమాన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అటు అండమాన్ లేదా ఇటు దుబాయ్ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడికైనా ప్రయాణమవుదామనుకుంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అయితే అండమన్ చూసివద్దామనే ఆలోచనను ప్రస్తావించగానే.. చాలామంది అక్కడకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో చక్కగా దుబాయ్ వెళ్లివచ్చేయవచ్చని చెబుతారు. మరికొందరు మాత్రం దుబాయ్ వెళ్లడం చాలా చౌక అని కూడా అంటుంటారు. దీంతో ఈ మాటలు విన్నవారు కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అండమాన్ వెళ్లాలో లేక దుబాయ్ వెళ్లాలో తెలియక తికమకపడతారు. ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ మీ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబయ్ లేదా అండమాన్‌కు సంబంధించిన టూర్ ప్యాకేజీకి ఎంతఖర్చవుతుందో బేరీజు వేసేందుకు మేక్ మైక్ ట్రిప్‌లో సమాచారం ఇలా ఉంది. దుబాయ్ వెళ్లేందుకు ఒక వ్యక్తికి సుమారు రూ. 31 వేలు అవుతుంది. ఈ ప్యాకేజీలో ఆరు రోజుల ప్లాన్ ఉంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, మరినా యాచ్ టూర్ మొదలైనవి కలిసే ఉన్నాయి. 6 రోజుల అనంతరం ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు వరకూ అయ్యే ఖర్చు దీనిలో కలిపే ఉంటుంది. హోటల్ అద్దె కూడా దీనిలో భాగమయ్యే ఉంటుంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్లు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతాయి. అంటే రెండు వైపుల ఫ్లయిట్ ప్రయాణ ఖర్చులు చూసుకుంటే మొత్తంగా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతాయి. అంటే ప్యాకేజీ, ప్రయాణ ఖర్చులు కలుపుకుని చూసుకుంటే ఒక్కో వ్యక్తి దుబాయ్ వెళ్లి రావడానికి రూ. 60 వేలు అవుతుంది. అండమాన్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబాయ్ గురించిన సమాచారం తెలుసుకున్న తరువాత ఇప్పుడు అండమాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకుందాం. రాబోయే ఆగస్టులో అండమాన్ వెళ్లాలనుకుంటే ఒక్కో వ్యక్తికి రూ. 42 వేలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హెవ్లాక్, నీల్ ఐల్యాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు చొప్పున బస చేయవచ్చు. ఈ ట్రిప్ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, ఫెరీ మొదలైన ఛార్జీలు కలిపే ఉంటాయి. అయితే అండమాన్ వెళ్లేందుకు ఫ్లయిట్ ఛార్జీ విడిగా ఉంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రూ. 30 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అండమమాన్ వెళ్లి వచ్చేందుకు రూ. 75 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కంపేరిజన్ను అనుసరించి చూస్తే.. అండమాన్ వెళ్లడం అనేది దుబాయ్ వెళ్లేందుకన్నా ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఇది సీజన్‌తో పాటు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అక్కడ ఉపయోగించుకునే లగ్జరీ సదుపాయాలు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
గురువారంకల్లా భీకర మోచా తుపానుగా అల్పపీడనం.. భారీ వర్షాలు
పోర్ట్ బ్లెయిర్/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంబంధిత వివరాలను భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ‘అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది గురువారంకల్లా భీకర మోచా తుపానుగా మారి ఆ దీవుల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. తర్వాత బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 13న కాస్తంత బలహీనపడి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యావూక్ప్యూ పట్టణాల మధ్య తుపాను తీరం దాటనుంది. మే 14న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లకపోవడం శ్రేయస్కరం’ అని కోల్‌కతా రీజియన్ డైరెక్టర్ జీకే దాస్ చెప్పారు. అత్యవసర నిర్వహణ కేంద్రాల ద్వారా నిరంతరం పరిస్థితిని అంచనావేస్తూ తీరప్రాంతవాసులను అప్రమత్తం చేస్తామన్నారు. -
చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భారత్ భారీ ప్లాన్..
సాక్షి, అమరావతి: సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడుతున్న అనివార్యతకు ఇది ముగింపు పలకనుంది. దేశ భద్రత ప్రయోజనాలకు కీలక స్థావరంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నికోబార్ దీవుల్లోని ‘గలాటియా బే’ వద్ద అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర మార్గానికి సమీపంలో నిర్మించనున్న ఈ పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలకం కానుంది. అందుకు సన్నాహకంగా 2020లోనే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్, నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్‌కు చెన్నై నుంచి సముద్రగర్భంలో 2,312 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మాణానికి రూ.41వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ట్రాన్షిప్మెంట్ పోర్టు లేక ఆర్థిక భారం అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ భారత్‌కు అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. తూర్పు తీరం, పశ్చిమ తీరంలోని పోర్టుల్లో బెర్త్‌ల వద్ద గరిష్ట లోతు 8 మీటర్ల నుంచి 12 మీటర్లే ఉంది. దీంతో గరిష్టంగా 75 వేల టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన కంటైనర్ నౌకలే ఈ పోర్టులకు వస్తున్నాయి. అంతర్జాతీయ లాజిస్టిక్స్ వ్యాపార ప్రమాణాల మేరకు 1.65 లక్షల టన్నుల నుంచి 1.80 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కంటైనర్ నౌకల్లో సరుకు రవాణా జరుగుతోంది. అంత పెద్ద కంటైనర్లతో కూడిన నౌకలు రావాలంటే పోర్టుల్లోని బెర్త్‌ల వద్ద లోతు 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండాలి. అటువంటి పోర్టు లేకపోవడంతో వివిధ దేశాల నుంచి వస్తున్న భారీ షిప్‌లను భారత్‌కు సమీపంలో ఉన్న సింగపూర్, కొలంబో, క్లంగ్ (మలేషియా), దుబాయిలోని అంతర్జాతీయ షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ 75వేల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న కంటైనర్లలోకి మార్చి భారత్‌లోని పోర్టులకు రప్పించాల్సి వస్తోంది. భారత్ నుంచి 75 వేల టన్నులకు మించిన కార్గో రవాణా చేయాలంటే తొలుత చిన్న కంటైనర్లలో సమీప దేశాల్లోని అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ నుంచి భారీ కంటైనర్ ద్వారా గమ్యస్థానాలకు చేర్చాల్సి వస్తోంది. అందుకోసం హ్యాండ్లింగ్ చార్జీల కింద ఒక్కో కంటైనర్ యూనిట్ కోసం 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్ మొత్తం కార్గో రవాణాలో 25 శాతం నాలుగు విదేశీ ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. అందులో 40 శాతం కొలంబో పోర్టు ద్వారానే సాగుతుండటం గమనార్హం. దీంతో భారత్ ఏటా రూ.5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. చైనా గుప్పిట్లో కొలంబో పోర్టు కొలంబో పోర్టుపై చైనా ఆధిపత్యం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. శ్రీలంక ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా చేసుకుని చైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చింది. కొలంబో పోర్టు పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకు ప్రతిగా కొలంబో పోర్టుపై చైనా నియంత్రణను అంగీకరించింది. ఒత్తిడికి లొంగి చైనా యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో లంగరు వేసేందుకు శ్రీలంక సమ్మతించింది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలంబో పోర్టుపై ఆధారపడటం భారత్ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని రక్షణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా కీలకం.. గలాటియా బే - వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణతోపాటు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలక వాటా కోసం నికోబార్‌లో ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మించాలని భారత్ నిర్ణయించింది. అందుకే అటు హిందూ మహాసముద్రం ఇటు పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉన్న నికోబార్ దీవిలోని ‘గలాటియా బే’ వ్యూహాత్మక ప్రదేశంగా ఎంపిక చేసింది. - గలాటియా బే ఉంది అంటే గంటకంటే తక్కువ సమయంలో ఆ పోర్టుకు చేరుకోవచ్చు. దీంతో సింగపూర్, కొలంబో, క్లంగ్ పోర్టుల కంటే నికోబార్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశాలున్నాయి. - గలాటియా బే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మలక్కా జలసంధి ముఖద్వారానికి సమీపంలో ఉంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రాలను అనుసంధానించే మలక్కా జల సంధి ద్వారా ఏటా లక్ష నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ప్రపంచంలో మొత్తం జల రవాణాలో 25 శాతం ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. - ఆస్ట్రేలియా, జపాన్, కొరియా సముద్ర మార్గంలో గలాటియా బే నోడల్ కేంద్రంగా ఉండటంతో ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అనువైందని కేంద్ర ప్రభుత్వ జియోటెక్నికల్ నివేదిక–2016 పేర్కొంది. - అంతర్జాతీయ కార్గో రవాణాలో అగ్రస్థానంలో ఉన్న సింగపూర్, దుబాయి ట్రాన్షిప్మెంట్ పోర్టులకు దీటుగా నికోబార్‌లో నిర్మించే పోర్టు అభివృద్ధి చెందుతుంది. - బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో భారత్ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా నిలుస్తుంది. - అక్కడ నిర్మించే పోర్టు బెర్త్‌ల వద్ద 18 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు ఉండేలా నిర్మించేందుకు అవకాశం ఉంది. ఆ దీవి వద్ద సముద్ర అడుగు భాగం పూర్తిగా గట్టి రాయితో ఉంది. దీంతో పెద్దగా డ్రెడ్జింగ్ (ఇసుక మేటలు తీయడం) చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా నిర్వహణ వ్యయం తగ్గుతుంది. -
అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు
అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహిత పేర్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పైగా జనవరి 23న పరాక్రమ దివాస్‌గా పాటించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమునాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. మోదీ 2018లో ఈ దీవులను సందర్శించి వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నేతాజీ స్మృతిని పురస్కరించుకుని అక్కడ ఉన్న రాస్ ఐలాండ్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. అలాగే నీల్ ఐస్లాండ్, హావ్లాక్ ఐస్లాండ్ వరుసగా నీల్ ద్వీప్, హావ్లాక్ ద్వీప్గా మారాయి. దేశంలో నిజ జీవితంలోని హిరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికే ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ స్ఫూర్తితోనే మందుకు వెళ్తూ.. ద్వీప సమూహంలోని 21 పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన దేశవీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
వాతావరణంలో వేగంగా మార్పులు...త్వరలోనే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్ దీవులతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలి పింది. కానీ వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రత అనుభూతి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నల్లగొండలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని ప్రకటించింది. -
గుడ్‌న్యూస్ చెప్పిన భారత వాతావరణశాఖ
-
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Forecast In Telangana.. దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/6NpNiMmPYG — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇక, రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. pic.twitter.com/iR01cGDsAS — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇది కూడా చదవండి: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు -
అండమాన్‌కు చలో చలో
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్‌కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్ చేరుకునేవారు. ఫుల్ డిమాండ్‌తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్ స్వింగ్‌లో షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం బయలుదేరి.. 450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్‌లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్‌బెల్ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఇందులో ఉండటం విశేషం. అండమాన్ నికోబార్‌లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్ ఏజెంట్స్ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ పూర్తి చేశారు. 5న ఫుల్ప్యాక్తో ప్రయాణం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్‌బెల్ బే షిప్ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్‌బెల్ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్‌కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్ విక్రయించేశారు. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్బెల్షిప్ని నడుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ నేపథ్యంలో మరో షిప్ రెడీ..! క్యాంప్‌బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్‌ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్‌కు ఎంవీ స్వరాజ్ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్‌యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్ షిప్‌ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం చాలా చౌక అండమాన్‌కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్‌గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్‌కు జనరల్ టికెట్ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్‌కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంచి ప్రారంభం దక్కింది కోవిడ్ తర్వాత అండమాన్‌కు పాసింజర్ షిప్ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్‌కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్‌లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు చైర్మన్ (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్ప పీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే ‘జలకన్య’. ఆంగ్లంలో అయితే మెరమైడ్ (Meramaid). అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట. ఆసక్తిగొలుపుతున్న ఈ మొక్క వివరాలు తెలుసుకోండి. 2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఫెక్లీ బస్త్ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు. -
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు : ‘అండమాన్ జీవితం’
అండమాన్ జైలు జీవిత నరకం అనుభవించిన మహా వీరులలో ప్రతివాది భయంకరాచార్యుల వారు ప్రముఖులు. వీరి పేరు అసలు వేంకటాచార్యులు. ప్రతివాది భయంకర అనేది వీరి బిరుదనామం. వంశ పారంపర్య సంబంధి కావచ్చు. అండమాన్ జీవితం అని తెలుగులోనూ, ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని ఇంగ్లిష్‌లోనూ వీరు తమ జైలు జీవితానుభవాలు రాశారు. భారత స్వాతంత్య్ర ఫలసిద్ధి అమృతోత్సవం జరుపుకుంటున్న శుభవేళ ఇటువంటి పుస్తకాలు మళ్ళీ ముద్రించాలి. ఈ పుస్తకాన్ని కాకినాడ శ్రీరామ బాలభక్త సమాజం లైబ్రరీ నుంచి నేను సంపాదించగలిగాను. కాకినాడ పురవీధిలో ఇంగ్లిష్ వారి క్లబ్బు నుంచి వస్తూనో పోతూనో ఒక ఇంగ్లిష్ సార్జంట్ కనబడగా, కోపల్లె కృష్ణారావు అనే పన్నెండేళ్ల బాలుడు ‘వందేమాతరం’ అని కౌమారోత్సుకతతో నినదించినట్లూ, దీనికి కోపించి ఆ ఇంగ్లిష్ సార్జంట్ బాలుణ్ణి కొరడాతో చితకబాదినట్లూ ప్రతివాద భయంకరాచారి గారి కథనం. పరాభవ దుఃఖ తీవ్రోద్విగ్నతలో భయంకరాచారి ప్రభృతులు బాంబులు తయారుచేసే పనిలో నిమగ్నం కాగా, సర్కారు వారు అది తెలిసి ఆచార్యుల వారిని అండమాన్ పంపించినట్లు ఐతిహ్యం! అండమాన్ సెల్యులర్ కారాగారంలో ఆచార్యుల వారు కఠిన శిక్షననుభవిస్తుండగా, అక్కడి అరాచకాలను ఆ జైలు అధికారి అయిన మేజర్ క్రూక్స్‌కు ఫిర్యాదు చేసినట్లూ, ఈ క్రూక్స్‌ను జైళ్ల పరిస్థితుల విచారణసంఘం వారు సంజాయిషీ కోరగా ఆయన అండమాన్‌లో ఉన్నది జైలు కాదు, ప్యారడైజ్ అనాలి అని సమాధానించాడుట. దీనితో భయంకరాచార్యుల వారు క్రూక్స్‌ను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని పుస్తకం రాశారు. అది రహస్యంగా ఇండియా చేరింది. అండమాన్ జైలు బీభత్సాలు బట్టబయలైనాయి. ఆచార్యుల వారి అండమాన్ జీవితం జప్తుకు, నిషేధానికి గురి అయింది. అండమాన్ సెల్యూలర్ జైలుకు పత్రికలు కూడా రానిచ్చేది కాదట బ్రిటిష్ ప్రభుత్వం. ఖైదీలు ఆందోళన చేయగా సత్యాగ్రహ వార్తలపై తారు పూసి, ఆ పత్రికలను ఖైదీలను చదవనిచ్చేవారని ఆచార్యుల వారు తమ జైలు జీవిత స్వాత్మకథలో రాశారు. ఇదీ క్రూక్స్ ప్యారడైజ్, అండమాన్ జీవిత రచనల నేపథ్యం. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
-
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. - సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము -
మంచివాళ్లే... కానీ మీద ఉమ్మేస్తారు!
అండమాన్ ప్రజలు అబద్ధం చెప్పరు, మోసం చేయరు. మన వస్తువులను ఎక్కడైనా మర్చిపోయినా కూడా వాటిని తీసుకోరు, తమది కాని వస్తువు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ స్థానికులు అంటే బ్రిటిష్ కాలంలో అండమాన్ జైలు నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగుల కుటుంబాలే. అలా స్థిరపడిన వారిలో బెంగాలీలు, తమిళులు, తెలుగు వాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు. పాన్ దో జార్వాన్ అనే ఆటవిక తెగల వాళ్లు వర్షం వస్తే బయటకు రారు. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్ అలవాటైంది. వెళ్లిన వారందరినీ ‘పాన్ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే. వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. వాహనంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేసి వాహనం ఎదురుగా నిలబడతారు. ఫొటో తీసిన వాళ్ల ముఖాన కోపంగా ఉమ్మేస్తారు. గోనె దుస్తులు సెల్యూలార్ జైల్ దగ్గరకు వెళ్తే మనకు తెలియ కుండానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్న మన జాతీయ నాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు జైల్లో గోనెసంచులతో కుట్టిన దుస్తులను ధరించారని తెలిసినప్పుడు మనసు పిండేసినట్లవుతుంది. లేజర్ షో బ్యాక్‌గ్రౌండ్ ఆడియోలో జైలు అధికారి సావర్కర్ సెల్‌కు రావడం, గద్దించి ప్రశ్నించడం, సావర్కర్ వంటి వీరులు సమాధానం చెప్పడం ఉంటుంది. ఇక్కడి పోర్ట్ హాల్లో జాతీయపోరాట యోధులను ఉరితీసేవాళ్లు. విచారణ కాలంలో కూడా ఇక్కడే జైల్లో ఉంచేవారు. చూడాల్సిందే అండమాన్ తీరంలో ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు, శంఖువులు ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవగ్గా దొరుకుతాయి, ముఖ్యంగా లిక్కర్ సగం ధరకే వస్తుంది. -
డిజిటల్ అండమాన్
న్యూఢిల్లీ: భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు 2,312 కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెకండ్‌కి 2200 జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్ట యిందని ప్రధాని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్షిప్మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యా యన్నారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే శాశ్వత వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని ప్రధాని అన్నారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్న అస్సాం, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
-
హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు
సాక్షి, చెన్నై: చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మధ్య సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మరో 7 ద్వీపాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ అందించేలా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ఆవిష్కరించారు. ఓఎఫ్‌సీతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని మోదీ తెలిపారు. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీపం వరకు ఈ సేవ ప్రారంభమైందన్నారు. అంతులేని అవకాశాలతో నిండిన ఈ ఆవిష్కారంపై అండమాన్ అండ్ నికోబార్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అండమాన్ వాసులకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన, నమ్మదగిన మొబైల్, ల్యాండ్‌లైన్ టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా డిజిటల్ ఇండియా ఫలాలు అందుతాయన్నారు. టూరిజం, బ్యాంకింగ్, షాపింగ్, టెలి మెడిసిన్, టెలీ విద్యలాంటి వసతులు సులువుగా అందుతాయన్నారు. అలాగే అనుకున్న సమయానికి 2300 కిలోమీటర్ల దూరం సముద్రం లోపల కేబుల్ వేయడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా టూరిజం మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అక్కడి వారికి నేడు చాలా ప్రత్యేకమైన రోజు అని స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుందంటూ సోమవారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో 2018 డిసెంబర్ 30న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. Inauguration of the submarine Optical Fibre Cable in Andaman and Nicobar Islands ensures: High-speed broadband connectivity. Fast and reliable mobile and landline telecom services. Big boost to the local economy. Delivery of e-governance, telemedicine and tele-education. — Narendra Modi (@narendramodi) August 10, 2020 -
అండమాన్‌లో ఆర్తనాదాలు
కాశీబుగ్గ: అండమాన్ నికోబర్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామాలకు వెళ్లలేక కుటుంబాలకు దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ తమ అగచాట్లను వాట్సాప్ ద్వారా వీడియో, చిత్రాలు పంపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత తొందరగా తెలుగు వాళ్లను రప్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలంలో రెండు వేల మంది మత్స్యకారులతోపాటు పర్యాటకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకున్నారు. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్) అండమాన్ నికోబర్ దీవిలో చిక్కుకున్న మత్స్యకారులు జిల్లాలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక వేట సాగక తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఫిషింగ్ జెట్టీల బోట్లపై పడుకుని కాలం గడుపుతున్నారు. రెండు నెలలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండమాన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఆకలి బాధలతో అలమటిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడంతో అండమాన్ నుంచి వైజాగ్‌కు ఓడ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అండమాన్‌లో ఒక్క కరోనా వైరస్ రోగి లేరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం) ఓడలపై తలదాచుకుంటున్న మత్స్యకారులు -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
జూన్ 5న నైరుతి రుతుపవనాల రాక
సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
16 నాటికి అండమాన్‌కు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సాధారణం కన్నా సుమారు ఆరు రోజుల ముందే, మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను చేరుకుంటాయని బుధవారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను మే 20వ తేదీ వరకు చేరుకుంటాయి. ఆ తరువాత కేరళ చేరుకునేందుకు వాటికి 10, 11 రోజులు పడుతుంది. అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. కేరళకు రుతుపవనాలు చేరుకునే కచ్చితమైన సమయాన్ని వారం రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించే అవకాశముంది. (తెల్లరంగు దుస్తులు ధరించండి) మే 15 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై, ఆ మర్నాడు సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలో ప్రవేశించనున్నాయంది. ఈ సంవత్సరం నుంచి రుతుపవనాల ప్రారంభం, ముగింపునకు సంబంధించిన వివరాలను 1960–2019 డేటా ఆధారంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1901–1940 మధ్య డేటా ఆధారంగా ఆ వివరాలను ప్రకటించేవారు. -
వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 16న తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం ఒక బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 16 నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐయమ్‌డీ ట్వీట్లను కోట్ చేస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీని గురించి హెచ్చరించింది. దీనితో పాటు మే 15, 16 తేదీలలో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పం నుంచి ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐయమ్‌డీ తెలిపింది. అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది. మే 15న 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడొచ్చని, మే 16న ఈ ప్రాంతంలోనే 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐయమ్‌డీ పేర్కొంది. #CYCLONE ALERT Formation of a Low Pressure area over southeast #BayOfBengal and adjoining south #AndamanSea and its likely intensification into a #CyclonicStorm by 16th May, evening. Source :: @IMDWeather — NDMA India (@ndmaindia) May 13, 2020 -
16న అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 16న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెల 18న అండమాన్‌లోకి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంటే ఈసారి రెండ్రోజులు ముందుగానే అండమాన్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు జూన్ 8న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కేరళకు, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణశాఖ ఒకట్రెండు రోజుల్లో బులెటిన్ విడుదల చేసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 13న అల్పపీడనం...: ఇదిలావుంటే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తుకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: వైరస్‌పై యుద్ధం.. ఇలా చేద్దాం) -
అక్కడ కరోనా బాధితులంతా కోలుకున్నారు
అండమాన్ నికోబర్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ మహమ్మరి కారణంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో సైతం కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగించినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం కరోనా సోకిన వారంతా కోలుకున్నారు. మొత్తం 11 మందికి కోవిడ్ సోకగా ఇప్పడు వారంతా కోలుకున్నారని అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కరోనా కట్టడికి అక్కడి అధికారులు తీసుకున్న చర్యలను అంతా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 11 out of 11 positive cases recovered: Chetan Sanghi, Chief Secretary, Andaman and Nicobar Islands#COVID19 pic.twitter.com/XJccIpllKT — ANI (@ANI) April 16, 2020 -
అండమాన్‌లో టూరిజం బంద్..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమై వైరస్ నిరోధానికి పలు చర్యలు చేపడుతున్నాయి. కరోనాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించగా పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ విద్యా, వాణిజ్య సంస్థలు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించాయి. ఇక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అండమాన్ నికోబార్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 17 నుంచి 26 వరకూ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పదిరోజులు అండమాన్ దీవులను సందర్శించే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని పర్యాటకులను కోరింది. చదవండి : నితిన్ పెళ్లి వాయిదా -
అండమాన్‌లో 'కసాయి కూతురు'
కర్ణాటక, కృష్ణరాజపురం: ప్రేమకు అడ్డుచెప్పిందనే కారణంగా తల్లిని హత్య చేసి ప్రియునితో పారిపోయిన ఘటనలో నిందితురాలు అమృతను బుధవారం కేఆర్ పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అండమాన్ దీవుల్లో దొరకడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి నిర్మలతో పాటు తమ్ముడు హరీశ్‌పై కత్తితో పొడిచిన అమృత అదేరోజు ప్రియుడు శ్రీధర్‌రావుతో పరారైంది. ఈ ఘటనలో తల్లి నిర్మల మృతి చెందగా తమ్ముడు హరీశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టి అమృత ప్రియునితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌కు పారిపోయినట్లు గుర్తించారు. వారి సెల్ఫోన్ల లొకేషన్ల ఆధారంగా గుర్తించారు. బుధవారం పోర్ట్‌బ్లెయిర్ చేరుకున్న పోలీసులు బృందం ఇద్దరిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. -
అండమాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
జకార్త: భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఇండోనేషియా భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవులనూ తాకింది. గురువారం అర్థరాత్రి నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
‘అండమాన్‌లో అమ్మాయిలు..’
‘అండమాన్‌లో అమ్మాయిలు..’ ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా..కానే కాదు. నగరానికి చెందిన8 మంది తెలుగమ్మాయిలు గతనెల చివరి వారంలో అండమాన్ దీవుల్లో విహారయాత్రకు ఎవరి సహాయం లేకుండా వెళ్లొచ్చారు. కేవలం అమ్మాయిలు మాత్రమే ఎవరికి వారు సోలోగా ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించి అక్కడి అందాలను ఆస్వాదించారు. వీరిలో లాయర్లు, ఆర్కిటెక్చర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. మామూలుగా టీనేజ్ అమ్మాయిలు, విద్యార్థినులు కుటుంబ సభ్యులు లేదా కళాశాలల సిబ్బంది తోడ్పాటుతోనే టూర్స్ వెళ్తుంటారు. ‘కానీ మేం మాత్రం అందుకు మినహాయింపు’ అంటూ వివరించారు వై.తేజశ్రీరెడ్డి. ఎనిమిది మంది గ్రూపులో ఒకరైన తేజశ్రీరెడ్డి తమ అండమాన్ టూర్ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రకృతి చాలా అందమైనది...ఉరుకుల పరుగుల జీవితంలో చాలా వరకూ ప్రకృతి అందాలను చూసే ఓపిక..తీరిక లేకుండా పోయింది. విదేశాల్లో ప్రజలు సంవత్సరంలో 3 నెలలు విహారయాత్రలకు కేటాయిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అండమాన్ దీవులు మనకు చాలా దగ్గరలోని అందమైన ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. ఇండియాకు దక్షిణ దిశగా చివరిభాగంలో ఉంటుంది. బంగాళాఖాతం సముద్రంలో ఇండియాకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ అతిపెద్ద కోస్తా తీరం కలిగి ఉంది. విమానంలో అయితే పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లాలి. సముద్రమార్గంగా చెన్నై, కోల్‌కతా నుంచి వెళ్లొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ బీచ్‌ల నిలయం అండమాన్–నికోబార్ దీవులు. అండమాన్ అంటే ఓ పెద్ద జైలు అంటారు. జైలుతో పాటు ప్రకృతి అందాలతో కూడిన చోటు కూడా. చాలా తక్కువ ఖర్చులో విమానంలో వెళ్లి అక్కడి అందాలను చూసి రావొచ్చు. పోర్ట్‌బ్లెయిర్ టుహేవ్లాక్ ఐల్యాండ్‌కు.. మేమంతా నగరవాసులమే. నాతోపాటు మా ఫ్రెండ్స్ తరుణిరెడ్డి, అఖిల, పూజిత, రవళి, సాహిత్య, అనీష, రిథి అందరం కలిసి సరదాగా టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాలని అండమాన్‌ను ఎంచుకున్నాం. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో బయలుదేరాం. అయితే మేము వెళ్ళిన రోజు మా బ్యాచ్‌లో రవళి బర్త్‌డే. ఫ్లయిట్లో కెప్టెన్ నుంచి విషెష్ చెప్పించాలని అనుకున్నాం. మా విమానం కెప్టెన్‌ను అడిగితే కుదరలేదు. అయితే అందులోని స్టాఫ్ గుర్తించి ప్లేట్లో బ్రెడ్‌తో కేక్‌ను తయారుచేసి బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. చాలా సరదాగా విమానంలో బర్త్‌డే జరిగింది. మాకు బాగా గుర్తుండిపోయే సంఘటన. అలా పోర్ట్బ్లెయిర్లో దిగి అక్కడి నుంచి హేవ్‌లాక్ ఐలాండ్‌కు పడవలో వెళ్లాం. స్కూబా డైవ్... ఎలిఫెంట్ బీచ్ మా టూర్లో మరిచిపోలేని అనుభూతి స్కూబా డైవ్. బ్యాచ్‌మేట్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. స్కూబాలో సముద్రపు చేపలు, జంతువులు చాలా మధురానుభూతిని అందించాయి. అక్కడి నుంచి పడవలో ఎలిఫెంట్ బీచ్, రాధానగర్ బీచ్‌లను చూశాం. రాధానగర్ బీచ్ చాలా అందమైనది. మనం చూసే బీచ్‌లకు చాలా భిన్నంగా అండమాన్ బీచ్‌లు ఉంటాయి. అక్కడే పారాసైక్లింగ్, బనానా రైడ్, జెట్స్కై, స్టార్క్స్ ఆటలు ఆడాం. అందమైన బీచ్‌లు.. హావ్లాక్, రాధానగర్ బీచ్‌లు చాలా సుందరంగా.. క్లీన్‌గా ఉన్నాయి. వాటిని చూస్తే అద్భుతం అన్పించింది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అలలు కూడా పెద్దగా ఉండవు. అక్కడ తినే ఫుడ్ కూడా బీచ్‌లోకి అనుమతించరు. దగ్గరలో కొన్ని దుకాణాలు ఉంటాయి. అక్కడే ఏమైనా తిని బీచ్‌లోకి వెళ్లాలి. మేము హావ్‌లాక్‌లో నైట్ సింఫనీ అనే రెస్టారెంట్లో డిన్నర్ చేశాం. మా బ్యాచ్ సీఫుడ్, వెరైటీ ఐటమ్స్ బాగా లాగించారు. ఐస్లాండ్ రిసార్ట్‌లో రాత్రికి బసచేశాం. కయాకింగ్ ఓ అనుభూతి రాత్రి సముద్రంలో కయాకింగ్ ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రాత్రి ఇద్దరు ఉండే చిన్నపాటి పడవలో సముద్రంలో మనమే తెప్పల ద్వారా నడుపుకుంటూ వెళ్లాలి. కొద్దిదూరం వెళ్ళాక చిన్నపాటి పడవలను వరుసగా పేర్చి పడుకోవచ్చు. అక్కడ నీటిని తడిమితే సముద్రంలోని ఫంగస్ జీవులు వెళుతురు అందిస్తాయి. ఆకాశంలో స్టార్స్, సముద్రంలో స్టార్స్ మద్యలో మనం. చాలా మధురానుభూతి కలిగించే ప్రదేశం. అక్కడే ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ 20 నిమిషాలు ఉన్నాం. ఇక చివరిరోజు కాలాపతర్ బీచ్‌కు వెళ్లాం. అక్కడ సమ్‌థింగ్ డిఫరెంట్ అనే రెస్టారెంట్ ఉంది. నిజంగానే సమ్‌థింగ్ ఢిఫరెంట్‌గా పుడ్ ఉంది. బాగా ఎంజాయ్ చేశాం. అక్కడి నుంచి పడవలో పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లాం. అండమాన్ జైలును చూసే సమయం లేకుండా పోయింది. అదొక్కడే మా విహారయాత్రలో వెలితి. కానీ మళ్లీ అండమాన్‌కు మరోసారి వెళ్లాలని మా గ్యాంగ్ తీర్మానించింది...అంటూ తమ టూర్ విశేషాలను ఉత్సాహంగా వివరించారు లా గ్రాడ్యుయేట్ అయిన తేజశ్రీరెడ్డి. -
అండమాన్ నికోబార్‌లో భూకంపం
పోర్ట్ బ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్ కచ్ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. -
అండమాన్‌లో భూకంపం
పోర్ట్ బ్లేయర్ : అండన్‌మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా మంగళవారం.. నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది. రెండు రోజుల్లో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
అండమాన్‌లోకి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలలోకి శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణశాఖ ఈనెల 18, 19 తేదీల్లో ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం సరిగ్గా అనుకున్న సమయానికి అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లోకి రావడంతో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని, దీనికి నాలుగు రోజులు అటుఇటు తేదీల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు తెలంగాణలో వడగాడ్పులు కొనసాగే అవకాశముంది. రాగల మూడు రోజులు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 44, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండలలో 42, భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
అక్కడ ఒక్కరూ ఓటెయ్యలేదు!
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘం మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే, అండమాన్ నికోబార్‌లో కూడా అతి పురాతన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లలో ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదట. మంగోలాయిడ్ తెగకు చెందిన వీరు నాగరికులతో కలవడానికి బిడియపడతారు. అడవుల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడరు. అడవుల్లో దొరికేవే తిని బతుకుతుంటారు. బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరిని తప్ప ఇతరులెవరినీ వారు దగ్గరకి రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డులు జారీ చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఇద్దరంటే ఇద్దరు (75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ) మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువ మందిని రప్పించడం కోసం అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహించారు. దానికి దాదాపు 35 మంది షొంపెన్లు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దాంతో అధికారులకు ఉత్సాహం కలిగింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. ‘శిబిరాలకు వచ్చిన వాళ్లను చూసి సంతోషించాం. షొంపెన్ భాష తెలిసిన ఒక నికోబార్ జాతీయుడి సహాయంతో వాళ్లకు ఎన్నికల గురించి ఓటు’ గురించి అవగాహన కల్పించాం. వాళ్ల కోసం వారు నివసించే గుడిసెల్లాంటి పోలింగ్ కేంద్రాలనే ఏర్పాటు చేశాం. కొత్తగా ఉంటే రావడానికి భయపడతారని ఈ పని చేశాం. అయినా కూడా ఒక్కరూ ఓటు వేయడానికి రాలేదు’ అన్నారు కాంప్‌బెల్ బే అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా. కాగా, ఇక్కడి ఓంగే, గ్రేట్ అండమాన్ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి 51 మంది ఓంగేలు, 26 మంది గ్రేట్ అండమానీస్ ఓటు వేశారు. -
అండమాన్‌లో భూకంపం
పోర్టుబ్లేయర్ : అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో బుధవారం ఉదయం 1.51 గంటలో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అండమాన్ ద్వీపంలో 10 కిలోమీటర్ల లోతున ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. దీంతోపాటు చెన్నై, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు. Earthquake of Magnitude:4.5, Occurred on:13-02-2019, 01:51:30 IST, Lat:13.9 N & Long: 91.4 E, Depth: 10 Km, Region:Andaman Islands Region pic.twitter.com/6zwWyfE7DC — India Met. Dept. (@Indiametdept) February 12, 2019 అయితే ఈ నెల 10న ఇండియా-మయన్మార్ సరిహద్దులో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడా భూకంపం సంభంవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.2గా నమోదయ్యింది. -
అండమాన్ దీవుల పేర్లు మార్పు
పోర్టుబ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నికోబార్ దీవుల్లోని మూడు దీవులకు కొత్త పేర్లను పెట్లారు. ద రోస్ ఐలాండ్ దీవికి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్గా, ద నెయిల్ ఐలాండ్‌కి షాహీద్ ద్వీప్, హావ్లాక్ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్గా పేర్లను ప్రకటించారు. అండమాన్ దీవులకు నేతాజీ శుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా 75 రూపాయల నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ.. చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి, నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
కంట్లో నుంచి రక్త కన్నీరు
పోర్ట్‌బ్లెయిర్ : సాధారణంగా మనషులు ఏడిస్తే కంట్లో నుంచి కన్నీళ్లు రావటం సహజం కానీ అండమాన్ నికోబార్ దీవికి చెందిన 22 ఏళ్ల యువకుడికి మాత్రం ఏడిస్తే రక్త కన్నీళ్లు వస్తాయి. మామూలుగా కంటినుంచి రక్తం కారే పరిస్థితిని ‘హీమోలాక్రియా’ అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు ఏడ్చినపుడు రక్తం కారటం జరుగుతుంటుంది. కానీ ఆ యువకుడిలో హీమోలాక్రియా లక్షణాలు కనిపించకపోవటం విశేషం. తరుచుగా ఇలా కంటినుంచి రక్తం కారుతుండటంతో అతడు ‘అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ వైద్యులను సంప్రదించాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్ జేమ్స్ అతనిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు, ఆరోగ్య సమస్యలు లేవని గుర్తించాడు. 30శాతం మందికి ఇలా కారణం తెలియకుండా కంటినుంచి రక్తం కారుతుందని ఆయన తెలిపాడు. కంటిలో సమస్యలు, తలకు గాయాలు, ముక్కునుంచి రక్తం కారటం, రక్త సంబంధమైన వ్యాధులు వంటి సందర్భాలలో కంటినుంచి రక్తం కారే అవకాశం ఉందని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది. కారణం ఏదైనది బయటకు తెలియనప్పటికి అంతర్గతంగా ఉన్న సమస్యల వల్లే ఇలా అవుతుందని ప్రచురించింది. -
ఇక ఇప్పుడు దీవుల వంతు
న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో పలు చారిత్రక నగరాలు పేర్లు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ఆధ్యుడిగా నిలిచారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే యోగి యూపీలోని ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ మూడు దీవుల పేర్లను మార్చేందుకు సిద్ధమైంది బీజేపీ ప్రభుత్వం. రోస్ ఐల్యాండ్, నేయిల్ ఐల్యాండ్, హ్యావ్లాక్ ఐలాండ్ పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐల్యాండ్, షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ ఐల్యాండ్‌లుగా మార్చనున్నట్లు తెలిసింది. పోర్ట్ బ్లెయర్ పర్యటన సందర్భంగా ఈ నెల 30న మోదీ ఈ కొత్త పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలన్ని పూర్తయ్యాయన్నారు అధికారులు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 30 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఈ మూడు అండమాన్, నికోబార్ దీవుల పేర్లను మార్చేందుకు నిర్ణయించింది. అయితే అండమాన్ దీవుల్లోకెల్లా పెద్దది.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హ్యావ్‌లక్ దీవి పేరును మార్చలనే డిమాండ్ 2017 నుంచే ఉంది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా డిసెంబర్ 30 (1943) అండమాన్ దీవులకు చేరుకున్న నేతాజీ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్‌కు షాహీద్‌గానూ, నికోబార్‌కు స్వరాజ్‌గానూ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. -
సెంటినలీస్లతో మమేకమైన మధుబాల!
గాలి, నీరు, చెట్టు, పుట్ట ఇవే వారికి జీవితం, ఆరాధ్యం. అంతకు మించిన కాంక్రీటు జంగిల్‌కి సంబంధించిన భవబంధాలేవీ వారు కోరుకోరు. వారే అండమాన్‌లోని సెంటినలీస్ తెగకు చెందిన ఆదివాసీలు. దాదాపు 60,000 సంవత్సరాలుగా ఆ తెగ అక్కడ మనుగడ సాగిస్తోంది. తమదైన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తోన్న వారిని దూరం నుంచి చూడటమే తప్ప వారి దగ్గరకు వెళ్ళడం అసాధ్యం. 2004 తరువాత ప్రభుత్వం కూడా ఆదివాసీలున్న ప్రాంతానికి ఇతరులు వెళ్ళడాన్ని నిషేధించింది. వారి కళ్లుగప్పి వారి దరిదాపుల్లోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ బతికిబట్టకట్టలేదు. ఇటీవలే జాన్ అలెన్ చౌ అనే క్రిస్టియన్ అమెరికన్ మిషనరీ యువకుడు వారి సామ్రాజ్యంలోకి చొరబడి వారి బాణాల దెబ్బలకు చనిపోయిన సంగతి తెలిసిందే. సెంటినలీస్‌ను దగ్గరి నుంచి కూడా చూడటానికి జంకుతున్న వేళ, వారితో స్నేహ కరచాలనాన్ని అందుకొని మమేకమైన ఏకైక సామాజిక శాస్త్ర పరిశోధకురాలు మధుమాల ఛటోపాధ్యాయ. అరుదైన ఆదివాసీ తెగ సెంటినలీస్‌ని 1999లో తొలిసారిగా కలిసిన మధుమాల ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. జాన్ అల్లెన్ చౌ మరణరహస్యాన్ని కూడా ఆమె ఛేదించే ప్రయత్నం చేశారు. ముందు హెచ్చరికలు.. తరువాతే దాడి.. దశాబ్దాలుగా బాహ్యప్రపంచాన్ని వెలివేస్తూ అండమాన్ అటవీ ప్రాంతంలో తమదైన చిన్ని ప్రపంచంలో నివసిస్తున్న సెంటినలీస్ చాలా బలంగా ఉంటారు. ఒక్క మధ్య వయస్కుడు బలీయమైన ఐదుగురు యువకులను సైతం అవలీలగా మట్టికరిపించగలడు. నిజానికి సెంటినలీస్ తమంతట తామే దాడికి దిగరని తెలిపారు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళితేనే వారు దాడికి దిగుతారంటారు మధుమాల. పరిశోధనలో భాగంగా నెలల తరబడి సెంటినలీస్‌తో గడిపిన మధుమాల ఒకరోజు అక్కడి నుంచి బయటి ప్రపంచానికి ప్రయాణమయ్యారు. కాసేపట్లో వర్షం కురుస్తుందని, వెళ్ళొద్దని వాళ్ళు వారించారు. అప్పటిదాకా కాసిన మండుటెండ మాయమై వర్షం రావడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. వాళ్ళెంతగా ప్రకృతిలో లీనమై ఉంటారనడానికి మధుమాల చెప్పిన ఉదాహరణ ఇది. సెంటినలీస్ అంతిమసంస్కారాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. మృతుల పోలిక ఉన్న చెక్కబొమ్మను చేసి, దాని పక్కనే వారికిష్టమైన ఆహారాన్ని, నీటిని పెడతారు. 1999లో సెంటినలీస్‌ని కలిసినప్పుడు మధుమాలను ‘‘మిలాలే, మిలాలే’’ అని పిలిచేవారు. మిలాలే అంటే వారి భాషలో మిత్రులని అర్థం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతరత్రా సందర్భాల్లో సెంటినలీస్‌కు అలవాటైన కొందరినే ప్రభుత్వం అక్కడికి పంపిస్తుంది. -
స్త్రీలోక సంచారం
భారతదేశంలోని యువ నగర మహిళ చుట్టూ తిరిగే ఓ కొత్త కామెడీ డ్రామా సిరీస్‌ను త్వరలోనే ప్రసారం చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఆ కొత్త ఒరిజినల్ సిరీస్ తొలి సీజన్లో 10 ఎపిసోడ్లు ఉంటాయి. నలుగురు స్నేహితురాళ్ల వర్క్‌లైఫ్, కెరీర్లో ఎదగాలన్న ఆశ, ఆశయం, ఆందోళన వీటన్నిటితో కామెడీగా, రొమాంటిక్‌గా అల్లిన ఈ కథను వెబ్ సిరీస్‌గా ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ నిర్మించబోతోంది. డైరెక్షన్ అనూ మీనన్. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ను చూడొచ్చు. అండమాన్‌లోని ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ఆదివాసీలు అత్యంత ప్రమాదకరమైనవారని; తమను కలిసేందుకు, తమను కలుపుకునేందుకు ప్రయత్నించేవారెవరైనా ప్రాణాలు వదిలేసుకోవలసిందేనని.. గత నెలలో ఒక అమెరికన్‌ని వారు చంపిన ఘటనతో మరోసారి రుజువైంది. భారత ప్రభుత్వం కూడా ఏళ్లుగా వారినలా ఏకాంతంగా వదిలేసింది. వారి నివాస ప్రాంతానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించింది. అయితే సెంటినెల్ తెగవారు మరీ అంత భయంకరమైనవారా! కానే కాదనీ, మధుమలా ఛటోపాధ్యాయ అనే మహిళ వారిలో కలిసిపోయి, వారి పిల్లాపాపల్తో కూడా గడిపిందని తాజాగా కొన్ని వార్తాకథనాలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా మధుమాల ఓ సెంటినెల్ పిల్లవాడిని ఎత్తుకుని ఉన్న ఫొటో కూడా ఒకటి బయటికి వచ్చింది. మధుమాల ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సీనియర్ పరిశోధన అధికారి.సెంటినెల్స్‌ను కలిసిన తొలి మహిళా ఆంత్రోపాలజిస్ట్‌గా ఆమె 1991 జనవరి 4న ఓ పెద్ద రికార్డునే సాధించారు కానీ, అది మరుగున పడిపోయింది. మానవజీవన అధ్యయనవేత్త, పరిశోధకురాలు అయిన మధుమాల.. ఆ దుస్సాహస ఘటనను తన వృత్తితో భాగం మాత్రమే అనుకున్నారు తప్ప, దానికి ప్రత్యేకతను ఇవ్వలేదు. -
తెల్లని కిరీటం ధరించిన వృద్ధుడే.. ఆ తెగ నాయకుడేమో!?
ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. వాళ్లు గాల్లోకి చేతులు లేపారంటే హాని చేయరని అర్థం- హత్యకు ముందు అలెన్ డైరీలో నోటు చేసుకున్న వివరాలు అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే సెంటినలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికా టూరిస్టు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే దాదాపు పన్నెండేళ్ల తర్వాత సెంటినలీస్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో తమకు ఎదురైన అనుభవాల ఆధారంగా అతడి మృతదేహం లభించే అవకాశమే లేదని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలెన్ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చే సాధ్యాఅసాధ్యాలను అండమాన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. (‘వాళ్లు మమ్మల్ని స్వాగతించారు... అంత క్రూరులేం కాదు’ ) అలెన్ డైరీ, అతడికి పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ చెప్పిన వివరాల ఆధారంగా.. అలెన్ నవంబరు 15న సెంటినల్ దీవిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సెంటినలీస్‌ల నాయకుడిని కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెల్లని కిరీటం ధరించిన ఓ వృద్ధుడిని ఆ తెగ నాయకుడిగా అలెన్ భావించాడు. అతడిని చూడగానే ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో మరికొంత మంది సెంటినలీస్‌లు (వారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారు)పరిగెత్తుకు వచ్చారు. అలెన్ వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గుంపులో ఉన్న ఓ పదేళ్ల కుర్రాడు అతడిపై బాణం విసిరాడు. అయితే అది అలెన్ చేతిలో ఉన్న బైబిల్‌కు గుచ్చుకోవడంతో తొలుత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు అతడిపై బాణాలతో విరుచుకుపడటంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!) గాల్లోకి చేతులు లేపారంటే.. ‘ఒక్కో గుడిసెలో సుమారు 10 మంది నివసిస్తారు. నా అంచనా ప్రకారం వీరి జనాభా 250 వరకు ఉండొచ్చు. నేను గమనించిన దాన్ని బట్టి అక్కడ ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. సెంటినలీస్ గాల్లోకి చేతులు లేపారంటే మనకి హాని చేయరని అర్థం. విల్లంబులు సిద్ధం చేస్తున్నారంటే మాత్రం వేటాడం కోసం సిద్ధమైపోయారనేదానికి సంకేతం. ఎవరు చెప్పినా వాళ్ల ప్రయత్నాన్ని విరమించుకోరని అర్థం. వాళ్లు గట్టిగా అరుస్తారు. ఆ శబ్దాల్లో ఎక్కువగా బీ, పీ, ఎల్, ఎస్ అక్షరాలతో మొదలయ్యే అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న బాణాల ఆధారంగా.. వాటిని లోహంతో తయారు చేశారని గుర్తించా. ముఖ్యంగా పడవల తయారీలో ఉపయోగించే లోహాలు అవి. అంటే దీవిలో ఉన్న పాత పడవల నుంచి కొన్ని భాగాలు వేరు చేసి బాణాలు తయారుచేసుకున్నారేమో’ అని సెంటినలీస్‌లను ప్రత్యక్షంగా కలిసే ముందు అలెన్ తన డైరీలో రాసుకొచ్చాడు. కాగా అలెన్ డైరీలో లభించిన వివరాలు, గతంలో అక్కడికి వెళ్లి వచ్చిన వారి అనుభవాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చేందుకు అండమాన్ పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది గిరిజన శాస్త్రవేత్తలు, గిరిజన సంక్షేమ అధికారులు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు విరమించుకుంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సెంటినలీస్‌ల ప్రశాంతకు భంగం కలిగించి, వారి జీవితాల్లో జోక్యం చేసుకోకపోవడమే అందరికీ శ్రేయస్కరమని గిరిజన హక్కుల నేతలు సూచిస్తున్నారు. -
‘వాళ్లు మమ్మల్ని స్వాగతించారు... అంత క్రూరులేం కాదు’
అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. తమదైన ప్రపంచంలో గడుపుతారు.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుంటారు... పడవలు తయారు చేసుకుంటారు... చేపలు పడతారు... తమ ఉనికికి ప్రమాదమని తెలిస్తే ఎవరినైనా చంపేందుకైనా వెనకాడరు.. అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ ప్రజల గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు చెప్పిన వివరాలు. జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ ఇటీవల సెంటినల్ దీవిలో దారుణ హత్యకు గురి కావడంతో సెంటినలీస్‌ల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేటి వరకు అంతరించిపోని అరుదైన తెగగా గుర్తింపు పొందిన సెంటినలీస్‌లు అలెన్ కంటే ముందు అంటే 2006లో తమ ప్రాంతంలో అడుగుపెట్టిన ఇద్దరు జాలర్లను దారుణంగా హతమార్చి పూడ్చిపెట్టారు. అయితే అంతకుముందు మాత్రం ఈ తెగ ప్రజలు ఎవరినీ చంపిన దాఖలాలు లేవు. కానీ బయటి ప్రపంచానికి చెందిన వ్యక్తులు తరచుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో తమ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని భావించినందు వల్లే సెంటినలీస్‌లు క్రూరంగా ప్రవర్తిసున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా సెంటినలీస్‌లను రెండుసార్లు దగ్గరగా చూసి ప్రాణాలతో బయటపడ్డ... అండమాన్ నికోబార్ గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్ ఎస్ఏ అవరాది 1991లో తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘ఇలాంటి అనుభవాలను పంచుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఆరోజు జనవరి 3, 1991. 13 మంది బృందంతో కలిసి సెంటినల్ దీవికి బయల్దేరా. మాలో చాలా మందిని ఒక రకమైన భయం ఆవహించింది. తిరిగి ప్రాణాలతో వస్తామనే నమ్మకం లేదు. కానీ ఎలాగైనా సెంటినలీస్ తెగ గురించి తెలుసుకోవాలనే పట్టుదల. అందులోనూ అధికారులుగా అది మా బాధ్యత. రాజధాని పోర్టు బ్లేయర్ నుంచి సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాం. మరుసటి రోజుకు ఉత్తర సెంటినల్ దీవికి చేరుకున్నాం. గమ్యం సమీపిస్తున్న కొద్దీ భయం, ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బహుశా ఒకేసారి ఇలా రెండు భావాలు కలగడం మాలో చాలా మందికి అదే మొదటిసారి. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో మదర్ షిప్ నుంచి ఓ చిన్న పడవలోకి నేను మారాను. మిగతా వాళ్లు మాత్రం అందులోనే ఉన్నారు. మెల్లగా ఉత్తర సెంటినల్ దీవిలో అడుపెట్టా. అప్పుడే అడవి నుంచి సెంటినలీస్‌లు బయటికి వస్తున్నారు. అంతా కలిపి 27 మంది ఉన్నారు. వారిని చూడగానే నా పైప్రాణాలు పైనే పోయాయి. పర్యటనకు బయల్దేరే ముందు వారి గురించి రాసిన పుస్తకాలను చదివిన అనుభవం నాకు ఉంది. ఎవరినైనా బయటి వ్యక్తిని చూస్తేనే చాలు మరో మాట లేకుండా వెంటనే బాణాలతో వేటాడేస్తారని తెలుసు. కానీ వారి నుంచి నాకు వింత అనుభవం ఎదురైంది. వారి చేతిలో బాణాలు ఉన్నాయి. అయినా నాకు హాని చేయలేదు. దీంతో నాకు కొంచెం దైర్యం వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న కొబ్బరి బోండాలను అందులో ఓ వ్యక్తికి ఇచ్చాను. అతడు నవ్వుతూ వాటిని తీసుకున్నాడు. మిగతావారు కూడా అతడిని అనుసరించారు. ఈ చర్యతో వారు మమ్మల్ని స్వాగతించినట్టుగా భావించాము’ అని అవరాది చెప్పుకొచ్చారు. అందరూ అనుకుంటున్నట్లుగా వాళ్లు మరీ అంత క్రూరులు కాదు అని నమ్మేందుకు ఇటువంటి సంఘటనలు అనేకం అవరాది ఉన్నాయని పేర్కొన్నారు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!) అలెన్ మృతదేహాన్ని వెలికితీసే విషయమై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించగా.. ‘ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. సెంటినలీస్ తెగ ప్రజలు వాళ్ల బతుకు వాళ్లు బతకాలనుకుంటున్నారు. దయచేసి వారిని ప్రశాంతంగా బతకనిస్తే మంచిదని’ బదులిచ్చారు. కాగా బ్రిటిష్ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు. 1967లో టి.ఎన్.పండిట్ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు. మళ్లీ 1974లో నేషనల్ జియోగ్రఫిక్ చానల్ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్ సెంటినలీస్ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు. ఇక.. 1991లో టి.ఎన్.పండిట్ మరోసారి గిరిజన సంక్షేమ శాఖ అధికారి అవరాదితో కలిసి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సెంటినలీస్‌లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది. అయితే అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం వెళ్లి సెంటినలీస్‌ల చేతిలో హత్యకు గురికావడంతో వీళ్లకు సంబంధించి మరోసారి చర్చ జరుగుతోంది. -
అతడి శవం దొరికే అవకాశమే లేదా?!
అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ ప్రజల చేతికి చిక్కిన ఎవరైనా సరే శవంగా మారిన తర్వాత కూడా సొంత వాళ్లను చేరే అవకాశం లేదని ఆ ప్రాంతాన్ని సందర్శించి బయటపడ్డ సాహస యాత్రికులు చెబుతున్నారు. సెంటినలీస్‌ల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్టు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి మృతదేహం ఎక్కడుందో తెలిసినా వెలికితీసే అవకాశం లేదని సెంటినెలీస్‌ల గురించి పూర్తిగా అధ్యయనం చేసినవారు హెచ్చరిస్తున్నారు. గతంలో ఆ ప్రదేశానికి వెళ్లిన జాలర్లు మృత్యువాత పడ్డారని, వారి శవాలను తీసుకువచ్చేందుకు బయల్దేరిన అధికారులకు కూడా చేదు అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా సరే అలెన్ అవశేషాలు ఇక దొరకవనే కఠిన వాస్తవాన్ని అతడి కుటుంబ సభ్యులు అంగీకరించక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కల్లోలం చెలరేగే అవకాశం ఉంది ‘నాకు తెలిసి ఇది అంత మంచి ఆలోచన కాదు. అలెన్ మృతదేహాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో సెంటినెలీస్ తెగ ప్రజల్లో మరోమారు అలజడి రేగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అధికారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్లను మరోసారి ఇబ్బంది పెడితే అధికారులతో పాటు ఆ తెగ ప్రజలను ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది’ గిరిజన హక్కుల నేత,‘ అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్’ రచయిత పంకజ్ సెఖ్సారియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అనూప్ కపూర్ మాట్లాడుతూ.. సెంటినెలీస్ ప్రజలు తమ లాంటి ఆహార్యం(ఒంటిపై దుస్తులు లేకుండా) కలిగి ఉన్న వ్యక్తులకు హాని చేయరని అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. కాబట్టి వాళ్లలో ఒకరిలా కలిసిపోతే అలెన్ మృతదేహాన్ని బయటికి తీసుకురావడం అంత కష్టమేమీ కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. నిర్ణీత గడువంటూ ఏమీ లేదు.. ‘మేము సెంటినలీస్‌ల భద్రత గురించి కూడా ఆలోచించాలి. గతంలో ఇలాంటి చర్యల వల్ల వాళ్లు అనారోగ్యం పాలయ్యారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. అలెన్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణీత గడువునైతే విధించలేదు’ అని అండమాన్ పోలీస్ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. -
‘ఆ తెగ ప్రజలు ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు’
పోర్ట్ బ్లేయర్ : మొత్తం జనాభ 500 మించి ఉండరు.. అది కూడా జనావాసాలకు దూరంగా ఎక్కడో అజ్ఞాతంగా ఉంటారు. వారిని దగ్గరగా చూడడం అంటే చావును ప్రత్యక్షంగా చూడటమే.. వారే అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న సెంటినెలీస్ తెగ ప్రజలు. ఇన్ని రోజులు బయట ప్రంపంచానికి పెద్దగా తెలియని వీరి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురి కావడంతో వీరి గురించి వెలుగులోకి వచ్చింది. బయటి వారి ఉనికినే ఇష్టపడని ఈ ప్రజలను కలవాలనుకోవడం.. జీవితం మీద ఆశలు వదులుకోవడం లాంటిదే అంటున్నారు కమాండెంట్ ప్రవీణ్ గౌర్. 2006లో ఓ రెస్య్కూ ఆపరేషన్‌లో భాగంగా సెంటినెలీస్ ప్రజలను దగ్గరగా చూసిన ప్రవీణ్ తన అనుభావాల గురించి ఎన్డీటీవీతో ముచ్చటించారు. సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో హత్యకు గురైన అమెరికన్ టూరిస్ట్ జాన్ అలెన్ చౌ (ఫైల్ ఫోటో) ఆ వివరాలు.. 2006లో పోర్టు బ్లేయర్ సమీపంలోని గ్రామానికి చెందిన ఇద్దరు జాలరులు సముద్రంలో చేపలు పట్టడానికి మోటారు బోటులో వెళ్లారు. తిరిగి రాలేదు. గల్లంతయిన వీరిని వెదికే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. దాంతో నేను మరికొంత మంది సిబ్బందితో కలిసి ఒక చాపర్‌లో సెంటినెల్ ద్వీపానికి వెళ్లాము. ఒక చోట మాకు పడవ కనిపించింది. దాని దగ్గరకు వెళ్లడం కోసం ప్రయత్నించాము. అంతే ఒక్కసారిగా బాణాలు మా చాపర్ వైపు దూసుకురాసాగాయి. వారు దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ బాణాలు విసిరారు. వారంతా దాదాపు 50 మంది దాకా ఉంటారు. వారి ఒంటి మీద ఎర్ర వస్త్రం లాంటిదేదో ఉంది. అక్కడ ఒక్క స్త్రీ కూడా మాకు కనిపించలేదు. బోటు దగ్గరకు చేరాలంటే.. ముందు అక్కడ ఉన్న వారిని పంపించేయ్యాలి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. దాంతో నేను మా ప్లాన్ - ఏని అమలు చేశాను. ప్లాన్ - ఏలో భాగంగా మా చాపర్ని కొద్ది ఎత్తులోనే పోనిచ్చాను. దాంతో వారు మమ్మల్ని అందుకోవడానికి మా చాపర్ని వెంబడిస్తూ వచ్చారు. అలా వారిని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ తీసుకెళ్లాము. ఆ తర్వాత ప్లాన్ - బీని అమలు చేశాను. దానిలో భాగంగా మా చాపర్ని వెనక్కి.. బోటు ఉన్న ప్రదేశానికి తిప్పాను. ఈ అనుకోని పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి వారికి కాస్తా సమయం పడుతుంది. వారు అక్కడి నుంచి వచ్చేలోపు మృత దేహాలను తీసుకెళ్లాలని భావించాము. బోటు దగ్గరకు వచ్చి అక్కడ గుంతలాగా ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాము. ఒక జాలరి మృతదేహం బయటపడింది. అతన్ని బోటులోనే ఉన్న తాడుతో ఉరి వేసి చంపారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం వెతుకుతుండగా వారు తిరిగి అక్కడికి వస్తున్నట్లు అనిపించింది. దాంతో మొదట వెలికి తీసిన మృత దేహాన్ని చాపర్‌లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాము. మరొక్క సెకన్ అక్కడే ఉంటే మేం కూడా శవాలుగా మారే వాళ్లం. చావుని అంత దగ్గరగా చూశాం. ఆ తరువాత మరోసారి ఇంకో మృతదేహం కోసం తిరిగి అక్కడికి వెళ్లాం. మొదటి సారి అమలు చేసిన ప్లాన్లనే ఈ సారి కూడా అమలు చేయాలని భావించాము. ప్లాన్ - ఏ లో భాగంగా వారిని కొంత దూరం తీసుకెళ్లడానికి ప్రయత్నించిన మాకు ఈ సారి గట్టి షాకే తగిలిందే. మొదటిసారిలానే అందరూ మా వెనకే వస్తారని భావించిన మాకు వారి తెలివి తేటలు చూసి ఆశ్చర్యం వేసింది. మొదటి సారిలా కాకుండా ఈ సారి కొందరు బోటు దగ్గరే ఉండగా.. మరి కొందరు మా చాపర్ వెంట పడ్డారు. మా దగ్గర మిషన్ గన్లు ఉన్నాయి కానీ వాటిని వాడాటానికి లేదు. ఈ లోపు వారు మా చాపర్ మీద దాడి చేయడం ప్రారంభించారు. నాతో పాటు వచ్చిన సిబ్బందిని క్షేమంగా తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. దాంతో మృతదేహాన్ని తీసుకురావాలనే ప్లాన్‌ని ఉపసంహరించుకుని తిరుగు ప్రయాణమయ్యాం. ఈ సంఘటనను బట్టి నాకొక విషయం బాగా అర్థమయ్యింది. సెంటనెలీస్ ప్రజలు ఒకసారి చేసిన తప్పునే మళ్లీ చేయరని తెలిసింది అంటూ తనకు ఎదురైన అనుభావాలను చెప్పుకొచ్చారు ప్రవీణ్ గౌర్. 2006లో భారత ప్రభుత్వం ప్రవీణ్‌ను తత్రక్షక్ మెడల్‌తో సత్కరించింది. -
బైబిల్ కాపాడినా..
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ చౌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. కోపోద్రిక్తులైన సెంటినల్ తెగ ప్రజలు వేసిన బాణం అతని చేతిలోని బైబిలుకు తగలడంతో తొలుత ప్రాణాలతో బయటపడ్డాడు. అలెన్‌కు పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ పోలీసులకు అందజేసిన డైరీలో ఈ వివరాలున్నాయి. అలెన్ క్రైస్తవ మతాన్ని విపరీతంగా విశ్వసించేవాడని, క్రీస్తు బోధనల్ని సెంటినల్ ప్రజలకు పరిచయం చేయడానికే వెళ్లినట్లు తేలింది. హత్యకు ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం..ఆ రోజు సాయంత్రం ఇద్దరు సెంటినల్ తెగ ప్రజలకు కానుకలు ఇవ్వబోయాడు. వారు కోపంతో వేసిన బాణం అతని చేతిలోని బైబిల్‌కు తగిలింది. -
అమెరికన్ టూరిస్ట్ హత్య : కీలకంగా మారిన పుస్తకం
పోర్ట్ బ్లేయర్ : అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ ప్రజల చేతిలో జాన్ అలెన్ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాన్ మృతదేహం కోసం అండమాన్, నికోబార్ పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో జాన్ మృతదేహాన్ని గుర్తించడం కోసం ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అటవీ శాఖ, విద్యావేత్తలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ విభాగాల నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు నార్త్ అండమాన్, నికోబార్ దీవుల డీజీపీ దీపేంద్ర పఠాక్ తెలిపారు. ఈ సందర్భంగా జాన్ రాసిన 13 పేజీల జర్నల్ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పఠాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక సెంటినెలీస్ మనుషులు జాన్ని బాణాలు, విల్లుల వంటి సంప్రదాయ ఆయుధాలతోనే చంపి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జాన్ అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెల్ తెగ ప్రజలను కలిసి, వారిని క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో వారిని కలుసుకునేందుకు ప్రతి రోజు ఆ దీవి దగ్గరకు వెళ్లేవాడు. ఇందుకు గాను జాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో జాన్ తన అనుభావాల గురించి రాసి పెట్టుకునేవాడు. దీనిలో తనను ఇక్కడకు వెళ్లడానికి అనుమతిచ్చిన తల్లికి, దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఆ దీవి వద్దకు క్షేమంగా చేరినట్లు.. వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు రాసుకొచ్చాడు. తాను మరణించే ముందు రోజు వరకూ కూడా జాన్ తన అనుభవాలను రాసి పెట్టుకున్నాడు. జాన్ మరణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన అలెగ్జాండర్, ఈ జర్నల్‌ని కూడా పోలీసులకు అందచేశాడు. జాన్ మరణించినట్లు తొలుత గుర్తించిన వ్యక్తి అలెగ్జాండర్. నవంబర్ 17న కొందరు వ్యక్తులు ఒక మనిషిని సముద్రం ఒడ్డున పూడ్చిపెట్టడం చూసిన అలెగ్జాండర్ మృతదేహానికి ఉన్న బట్టలను బట్టి చనిపోయిన వ్యక్తిని జాన్‌గా గుర్తించాడు. అనంతరం ఈ విషయం గురించి అమెరికాలో ఉన్న జాన్ స్నేహితుడు బాబి పార్క్స్‌కు తెలియజేశాడు. బాబి ఈ విషయాన్ని జాన్ తల్లికి చెప్పగా ఆమె అమెరికా కాన్సులేట్‌కి తెలియజేసింది. అమెరికా కాన్సులేట్ అధికారులు ఈ విషయం గురించి భారత అధికారులకు తెలియజేయడంతో నవంబర్ 19న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జాన్ని నిషేధిత ప్రాంతంలోకి తీసుకెళ్లినందుకు గాను జాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అలెగ్జాండర్‌తో పాటు మరో ఆరుగురు చేపలు పట్టే వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారందరి మీద హత్యా నేరం నమోదు చేశారు. -
అండమాన్‌లో హత్యకు గురైన టూరిస్ట్ చివరి మెసేజ్
న్యూఢిల్లీ : క్రైస్తవ మత ప్రచారం కోసం అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవికి వెల్లిన జాన్ అలెన్ అనే ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే జాన్ అండమాన్, నికోబార్ దీవులకు వెళ్లడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది. ‘మీ అందరికీ నేను పిచ్చివాడిలా కనిపించొచ్చు. కానీ అండమాన్‌లోని సెంటినెలీస్ తెగకు చెందినవారికి జీసస్ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు’ అంటూ జాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాతే జాన్ అండమాన్ దీవులకు వెళ్లారు. గతంలో జాన్ ఐదుసార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించారు. జాన్ క్రైస్తవ మతబోధకుడు కావడంతో ఆ ఆదివాసీ తెగవారికి కూడా బోధనలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ తెగ వారు బయటివారితో సంబంధాలను ఏమాత్రం ఇష్టపడరు. అందుకే జాన్‌పై బాణాలు వేసి చంపేశారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని క్షమిస్తున్నాం: జాన్ కుటుంబం జాన్ అలెన్ మృతి గురించి తెలిసిన అతని కుటుంబ సభ్యులు జాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్‌ని పోస్ట్ చేశారు. జాన్ అలెన్ ‘మరణించాడని మాకు తెలిసింది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటనెలీస్ తెగ ప్రజలు అతన్ని చంపారని చెపుతున్నారు. జాన్ మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఈ విషాదం గురించి మేం మాటల్లో చెప్పలేం. తను మా ప్రియమైన కుమారుడు, సోదరుడు, స్నేహితుడు. తనో క్రైస్తవ మత ప్రచారకుడు, సాకర్ కోచ్, పర్వాతారోహకుడు కూడా. అతను దేవున్ని ప్రేమిస్తాడు.. అవసరమున్న వారికి సాయం చేయడంలో ముందుంటాడు. అతను సెంటినెలీస్ ప్రజలను కూడా అలానే ప్రేమించాడు. జాన్ మరణానికి కారణమైన వారిని మేము క్షమిస్తున్నామని తెలిపారు. అంతేకాక ‘జాన్‌ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి సాయం చేసిన అతని మిత్రులను అరెస్ట్ చేసినట్లు మాకు తెలిసింది. వారిని కూడా వదిలిపెట్టాల్సిందిగా నా మనవి. తన ఇష్టప్రకారమే అక్కడికి వెళ్లాడు. అతని చర్యలకు వేరేవాళ్లని శిక్షించడం సరికాదు. కుటుంబ సభ్యులుగా మీరు మా మనవిని మన్నిస్తారని ఆశిస్తున్నామం’టూ పోస్ట్ చేశారు. View this post on Instagram John Allen Chau A post shared by John Chau (@johnachau) on Nov 21, 2018 at 11:36am PST -
ఇప్పటివరకు ఆ దీవిలో అడుగుపెట్టిన వాళ్లు లేరు!
డబ్బులు వాడని.. దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుని బతికే సెంటినలీస్‌లను సంప్రదించేందుకు సాధారణ మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. దండోపాయం మినహా సామ, దాన ఉపాయాలు అన్నీ వాడారు. అయినా ఇప్పటివరకూ వాళ్లు ఈ ట్రిక్కులకు లొంగింది లేదు! దూరం నుంచి గమనించిన దాని ప్రకారం.. వీరికి పడవలు తయారు చేయడం వచ్చు. లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చేపలు పడతారు. ‘మా బతుకు మాది.. ఇందులో మీలాంటి వారి జోక్యం అవసరం లేదు’ అన్న వారి వైఖరి ఎంత బలమైందంటే.. 2004లో వచ్చిన సునామీతో సర్వం కోల్పోయినా.. భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారాన్ని కూడా ముట్టుకోలేదు. అప్పట్లో దారి తప్పి ఆ దీవిలోకి అడుగు పెట్టిన ఇద్దరు జాలర్లను చంపేశారు. ఆ తరువాత భారత ప్రభుత్వం వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడూ కోస్ట్‌గార్డ్‌కు చెందిన పడవలు నార్త్ సెంటినెల్ ద్వీపం వద్ద కాసేపు లంగరేసి నిలబడతాయి..అంతే! అటువైపుగా వెళ్తే తరిమికొట్టారు.. బ్రిటిష్ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు. ► 1967లో టి.ఎన్.పండిట్ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు. ► 1974లో నేషనల్ జియోగ్రఫిక్ చానల్ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్ సెంటినలీస్ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది. బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు. ► 1991లో టి.ఎన్.పండిట్ మరోసారి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు. ► ఆ తరువాత సెంటినలీస్‌లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది. అండమాన్‌లో అమెరికన్‌ను బాణాలేసి చంపేశారు న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవిలో అమెరికా పర్యాటకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివసించే సెంటినల్ ఆదిమ తెగకు చెందిన ప్రజలే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు బుధవారం వెల్లడించారు. నవంబర్ 17న జరిగిన ఈ ఘోరంలో మృతుడిని 27 ఏళ్ల జాన్ అలెన్ చౌగా గుర్తించారు. ఈ ఘటనలో హత్య కేసు నమోదుచేసిన పోలీసులు...అలెన్‌ను ఆ దీవికి తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్ని అరెస్ట్ చేశారు. తమ దీవిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అలెన్‌ను సెంటినల్ ప్రజలు బాణాలతో హత్య చేసి ఉంటారని, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, అలెన్ కనిపించడం లేదని మాత్రమే అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. గోప్యత కారణాల రీత్యా ఇంతకు మించి వెల్లడించలేమని తెలిపింది. అలెన్ ఇంతకు ముందు అండమాన్‌లో ఐదు సార్లు పర్యటించినట్లు పోర్ట్‌బ్లెయిర్‌కు చెందిన ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని సెంటినల్ తెగ ప్రజలను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపేవాడని వెల్లడించింది. చిదియాటాపు ప్రాంతంలో మత్స్యకారుల పడవను అద్దెకు తీసుకున్న అలెన్ నవంబర్ 16న నార్త్ సెంటినల్ దీవి సమీపానికి చేరుకున్నట్లు తెలిపింది. మత ప్రచారానికే వెళ్లాడా? మతబోధకుడిగా పనిచేస్తున్న అలెన్.. తన మతం గురించి సెంటినలీస్‌కు వివరించేందుకు ఆ దీవి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడని, వాళ్లు బాణాలతో దాడులు చేయడంతో అతడు మరణించాడని అండమాన్ షీఖా అనే పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ‘నార్త్ సెంటినల్ దీవికి కొంతమంది జాలర్ల సాయంతో వెళ్లిన అలెన్ బీచ్‌లో నడుస్తుండగానే సెంటినలీస్ తెగ ప్రజలు బాణాలతో దాడులు చేశారు. అయితే అలెన్ వీటిని లెక్క జేయకుండా అలాగే ముందుకు వెళ్లసాగాడు. ఆ తరువాత సెంటినలీస్‌లు అలెన్‌ను చుట్టుముట్టి లాక్కెళ్లారు’’ అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. సెంటినలీస్‌లను చూసి భయపడ్డ జాలర్లు అక్కడి నుంచి పారిపోయారని.. మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అలెన్ శరీరం తీరంలో పడి ఉందని వివరించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే నార్త్ సెంటినల్ దీవిలో విదేశీయులు పర్యటించేందుకు కేంద్రం ఇటీవలే అనుమతి ఇచ్చింది. -
అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య
న్యూఢిల్లీ : అండమాన్, నికోబర్ దీవుల్లో ఓ అమెరికన్ టూరిస్టును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బాధిత టూరిస్ట్‌ను జాన్ అలెన్‌గా గుర్తించారు. జాన్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. బాధితుడు గతంలో ఐదు సార్లు అండమాన్‌కు వచ్చారని, క్రైస్తవ బోధనలను ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని తపన పడేవాడని స్ధానిక మీడియా పేర్కొంది. జాన్ అలెన్ చిదియతపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న ఉత్తర సెంటినెల్ ద్వీపానికి చేరుకున్నారు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే తెగ బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు. కాగా ఈ తెగలో కేవలం 50 మంది జనాభా ఉన్నట్టు సమాచారం. -
స్వచ్ఛమైన మనసు
తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్ ఎడిషన్. దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. వీటి రాజధాని పోర్ట్బ్లెయిర్లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం.. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది. అనాథల ఆకలి తీరుస్తూ.. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. యాస్మిన్ అంటే అరబిక్‌లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్‌లోని జాస్మిన్ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్ మనసు కూడా స్వచ్ఛమైనదే. -
అండమాన్‌లో బయటపడ్డ.. అరుదైన చీమలు
సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్‌కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు. అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్‌లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. -
మెరుపు వేగంతో అండమాన్‌కు..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మొన్నటి వరకూ అండమాన్ ఎవరైనా వెళ్తున్నారంటే అబ్బో... అండమానే...అని ఆశ్చర్యంగా ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండుంపావు గంటల్లోనే అండమాన్ చేరుకోవచ్చు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా రెండేళ్లుగా పోర్టుబ్లెయిర్(అండమాన్)కు విమాన సర్వీసులు వారానికి రెండు మార్లు అందిస్తోంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు చేరుస్తోంది. ఈ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో ఆ సంస్థ ఇంకో రెండు సర్వీసులు పెంచే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మీదుగా కనెక్టివిటీ పెంచింది. మొత్తం ఢిల్లీ ప్రయాణికులే నెలకు 30 వేల మంది వరకూ ఉన్నారు. ఢిల్లీ, పోర్టుబ్లెయిర్‌లకు విమాన సర్వీసులు పెంచుతూ చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీ–విశాఖ–పోర్టుబ్లెయిర్–ఢిల్లీకి ఇలా... ఢిల్లీ –విశాఖ–పోర్టుబ్లెయిర్ –ఢిల్లీకి సోమ, గురు, శనివారాల్లో సర్వీసులు అందించడానికి ప్రణాళిక చేసింది. ఆ రకంగా ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి విశాఖకు 7.40కి చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.15కి బయలుదేరి 10.10కి పోర్టుబ్లెయిర్ చేరుతుంది. పోర్టుబ్లెయిర్‌లో 10.50కి బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 2.35కి వెళ్తుంది. ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి... ఎయిరిండియా విమాన సంస్థ ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి మంగళ, బుధ, శుక్ర,ఆదివారాల్లో సర్వీసులు అందించనుంది. ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి పోర్టుబ్లెయిర్‌కు 9.15కు చేరుతుంది. అక్కడి నుంచి 9.55కి బయలుదేరి విశాఖకు 11.55కి వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.30కి బయలుదేరి 2.35కి ఢిల్లీ చేరుతుంది. వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది... అండమాన్‌కు కోస్తాంధ్ర జిల్లాలనుంచి ప్రయాణికులు, వ్యాపారులు, టూరిస్టులు విపరీతంగా పెరిగారు. శ్రీకా కుళం నుంచి అధికంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి నేవీ అధికారులు,ఉద్యోగులూ రక్షణ రంగ అవసరాల కోసం తరచూ వెళ్లొస్తున్నారు. ప్రయాణాలకు వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది.దీంతో ఎయిరిండియా విమాన సంస్థ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ప్రతి రోజూ సర్వీసులు ఇచ్చే ప్రతిపాదన జరుగుతోంది. – డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు విమాన ప్రయాణం బాగుంది అండమాన్ నుంచి విమాన ప్రయాణం చాలా బాగుంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు వస్తున్నాం. ఓడలో కంటే విమాన ప్రయాణం హాయిగా ఉంది. గతంలో వ్యయ ప్రయాశపడేవాళ్లం. సులభప్రయాణం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. – మాధవరావు, అండమాన్ ప్రయాణికుడు, శ్రీకాకుళం అవస్థలు తప్పాయి గతంలో షిప్‌పై అండమాన్ వెళ్లేవాళ్లం. ఇపుడు విమాన సదుపాయంతో అవస్థలు తొలగాయి. సులువుగా ప్రయాణిస్తున్నాం. తాజాగా కొత్త సర్వీసులు వస్తే మరింత సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు. – సంగీత,అండమాన్ ప్రయాణికురాలు, కవిటి -
అక్కడ పర్యటించకండి
బీజింగ్ : భారత్‌తో సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసేలా మళ్లీ డోక్లాంకు పది కిలోమీటర్ల దగ్గర్లో రహదారి నిర్మిస్తున్న చైనా.. తాజాగా భారత్‌లో పర్యటించే తమ దేశస్తులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. ప్రతి ఏడాది భారత్‌లో గణనీయంగా చైనీయులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ డోక్లాం వద్ద రహదారి నిర్మిస్తున్న నేపథ్యంలోనూ, అంతర్జాతీయ మారుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలకు వెళ్లవద్దంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లోని అండమాన్, నికోబార్‌దీవుల్లో చైనీయులు పర్యటించడం ప్రమాదరమంటూ.. చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లో పర్యటిస్తున్న చైనీయులు తగిన అనుమతి పత్రాలతోనే పర్యటించాలని సూచించింది. అంతేకాక మిలటరీ వాహనాలు, సరిహద్దు బద్రతా బలగాలు, ఇతర రక్షణ, పోలీసుల వ్యవస్థలను ఫోటొలు, వీడియోలు తీయవద్దంటూ తెలిపింది. అంతేకాక భారత్-నేపాల్ పరిహద్దులోనూ పర్యటించడం మానుకోవాలని సూచనలు చేసింది. జూలై 7న డోక్లామ్ వివాదం మొదలైన తరువాత చైనా తొలిసారి తమ పర్యాటకులకు హెచ్చరికలు చేసింది. తరువాత మళ్లీ తాజాగా చైనా ప్రభుత్వం హెచ్చరించింది. భారత్‌ను చూసేందుకు చైనా నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారికి వీసా ఇబ్బందులు తలెత్తకుండా భారత ప్రభుత్వం.. ఈ-వీసా సదుపాయాన్ని గతంలో అందించించడం గమనార్హం. -
మయన్మార్‌లో విమానం గల్లంతు
సముద్రంలో శకలాలు గుర్తించినట్లు ప్రకటించిన సైన్యం యాంగాన్: సుమారు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై–8ఎఫ్–200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయినప్పటి నుంచి నేవీ ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాలింపు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరు వైద్య పరీక్షలకు, మరికొందరు పాఠశాలలకు బయల్దేరినట్లు భావిస్తున్నారు. దావేయ్ పట్టణానికి 218 కి.మీ దూరంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిలిటరీ అన్వేషణ కొనసాగిస్తోందని చెప్పారు. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానం మయన్మార్ దక్షిణ తీరంలో ఉండగా సంబంధాలు తెగిపోయాయని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో ప్రస్తుతం వర్షాకాలం. అయితే విమానం గల్లంతైనపుడు వాతావరణం బాగానే ఉంది. -
అండమాన్‌కు తొలకరి
-
అండమాన్‌కు తొలకరి
► మూడ్రోజుల ముందుగానే రుతుపవనాలు ► జూన్ 1న లేదా అంతకన్నా ముందే కేరళను తాకే అవకాశం ► అదేనెల 5వ తేదీకల్లా తెలంగాణలోకి.. సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్‌ను తాకాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసినదాని కన్నా మూడ్రోజుల ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా అండమాన్‌కు మే 20–21 తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. గతేడాది మే 18న తాకాయి. ఈసారి మే 17న రావొచ్చని ఐఎండీ అంచనా వేసినా 14నే రావడం గమనార్హం. రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన రోజు నుంచి సీజన్ ప్రారంభమైనట్లు భావిస్తారు. అండమాన్‌కు ముందుగా వచ్చినంత మాత్రాన కేరళకు కూడా అలాగే వస్తాయని చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ముందుగానే..? సాధారణంగా రాష్ట్రంలోకి జూన్ 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కేరళకు ఒకవేళ ముందస్తుగానే వస్తే.. జూన్ నాలుగైదు తేదీల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని, వారం అయ్యాక సరిగ్గా అంచనా వేయొచ్చని పేర్కొంటున్నారు. తాజాగా రుతుపవనాలు తాకడంతో వాయువ్య దిశ నుంచి అండమాన్ వైపు గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలోకి వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. అలాగే అక్కడక్కడ జల్లులు కురిసే కూడా అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత అంతగా లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు కురిసిన అకాల వర్షాలు ఉష్ణోగ్రతల ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పడ్డాయి. ఇక నుంచి కురిసే వర్షాలను రుతుపవనాల కారణంగా కురిసే ముందస్తు వర్షాలుగా పరిగణిస్తారు. ఈసారి ఆశాజనకమే.. గతేడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా కీలకమైన జూలై, ఆగస్టులో పెద్దగా వర్షాలు కురవలేదు. జూన్, సెప్టెంబర్ నెలల్లో భారీగా కురిశాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలే గత రబీని నిలబెట్టింది. ఈసారి గతేడాది కంటే కాస్తంత తక్కువగానే వర్షాలు కురవొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రైతుకు ఆశాజనకంగానే ఉంటాయన్న అంచనా ఉంది. మండిన రామగుండం.. 45 డిగ్రీలు రాష్ట్రంలో ఆదివారం ఎండలు మండిపోయాయి. రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండల్లో 44.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 44, మెదక్, హన్మకొండల్లో 43, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేటలో 40 డిగ్రీలు నమోదైంది. -
150 ఏళ్లకు ఎగసిన లావా
పణజీ: దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్ ఐలాండ్’అగ్నిపర్వతం తాజాగా తిరిగి లావాను వెదజల్లుతోందని పరిశోధకులు శుక్రవారం చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న అగ్ని పర్వతం ఇదొక్కటే. అండమాన్ నికోబార్ దీవుల్లో, రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో ఉంటుంది. 1991 నుంచే అప్పుడప్పుడు ఈ అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వచ్చేవి. గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ ఐఓ)లో పనిచేసే పరిశోధకుల బృందం ఈ ఏడాది జనవరి 23న అండమాన్ తీరంలోని సముద్ర మట్టిని సేకరించేందుకు అగ్ని పర్వతం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో బూడిద వెలువడుతుండటం చూసి పరిశోధకులు పర్వతానికి దూరంగా వచ్చి గమనించారు. అగ్నిపర్వతం విడతల వారీగా లావాను వెదజల్లుతోందనీ, ప్రతిసారీ 5 నుంచి 10 నిమిషాల పాటు లావాను బయటకు చిమ్ముతోందని పరిశోధకులు గుర్తించారు. జనవరి 26న ఇదే సంస్థకు చెందిన మరో బృందం అక్కడకు వెళ్లినప్పుడు కూడా బూడిద వెలువడింది. పగటి సమయంలో కేవలం బూడిద మాత్రమే కనపడగా, చీకటి పడ్డాక చూస్తే ఎర్రటి లావా కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. అగ్ని పర్వత బిలం వద్ద పొగ మేఘాలు కమ్ముకున్నాయి. -
మరో ముప్పు
► తరుముకొస్తున్న అల్పపీడనం ► అండమాన్ వద్ద అల్పపీడన ద్రోణి సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాన్ విలయం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి తమిళనాడువైపు కదులుతున్నట్లు చెన్నై వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు సహజంగా అక్టోబర్ 20వ తేదీన ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు సాగుతున్నా నవంబరులో తగినంతగా వర్షాలు పడలేదు. ఈశాన్య రుతుపవనాలు ఆరంభమైన తొలిరోజుల్లో బంగాళాఖాతంలో గియాండి తుపాన్ ఏర్పడింది. ఈ తుపాన్ వల్ల తమిళనాడులో వర్షాలు పడలేదు. ఆ తరువాత నడా తుపాన్ కారైక్కాల్ సమీపంలో తీరం దాటినపుడు కడలూరు, నాగపట్టినం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, ఈనెల 10వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాన్ 12వ తేదీన చెన్న నగరాన్ని నేరుగా తాకింది. చెన్నైలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ తీరం దాటేపుడు గంటకు 130–140 కీలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని, శివార్లను దారుణంగా కుదిపేసింది. సగటున డిసెంబరులో 191 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం రెండు వారాల్లో 329 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మళ్లీ ముప్పు: ఇదిలా ఉండగా, రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాల కాలం మరో 15 రోజుల్లో ముగుస్తున్న దశలో భారీ వర్షాలు పడతాయని అంచనా. ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేణా బలపడి ఈశాన్యం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంచనా ప్రకారం అల్పపీడన ద్రోణి రాష్ట్ర తీరాన్ని తాకిన పక్షంలో భారీ వర్షాలు కుదిపేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అండమాన్‌లో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు!
అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్, నీల్ ద్వీపాల్లో భారీ వర్షాలు, తుపానులో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయన్నారు. పర్యాటకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ట్వీట్లో పేర్కొన్నారు. తుపాను తీవ్రత తగ్గగానే రక్షణ చర్యలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే బృందాలు పోర్ట్ బ్లెయిర్‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వార్దా తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ద్వీపంలో ఉన్నవారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు నౌకాదళం నాలుగు నౌకలను అక్కడకు పంపింది గానీ, వాతావరణం బాగోకపోవడంతో అవి లంగరు వేయలేకపోయాయి. ఐదు మీటర్ల ఎత్తులో కెరటాలు వస్తుండటంతో ప్రయాణికులను నౌకల్లోకి చేర్చడం అసాధ్యంగాను, ప్రమాదకరంగాను మారింది. నౌకలు పోర్టు వెలుపల వేచి చూస్తున్నాయని, వాటిలో తగినంత ఆహారం, తాగునీరు, మందులు, వైద్యసిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా తుపాను పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలు, బలమైన గాలులతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీన్ని ఎల్1 విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నీల్, హేవ్‌లాక్ ద్వీపాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. పలు నౌకలు, హెలికాప్టర్లలో ఇక్కడకు చేరుకుంటారు. కానీ సోమవారం నుంచి అసలు నౌకలు గానీ, హెలికాప్టర్లు గానీ ఇక్కడకు రాలేకపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం పది గ్రామాలకు నిత్యావసరాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. పలు చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోర్ట్బ్లెయిర్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొబైల్ సిగ్నళ్లు, ఇంటర్నెట్ కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి. -
విశాఖ చేరుకున్న హర్షవర్దన్ నౌక
విశాఖపట్నం : ప్రయాణికులతో అండమాన్‌కు వెళ్తూ.. సాంకేతిక లోపం తలెత్తడంతో నడి సముద్రంలో నిలిచిన హర్షవర్దన్ నౌక గురువారం తిరిగి విశాఖకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు దాదాపు 600 మంది ప్రయాణికులతో విశాఖ పోర్టు నుంచి అండమాన్‌కు బయలుదేరింది. అయితే బయలుదేరిన రెండు మూడు గంటలకే... నౌకలోని జనరేటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నౌక నడి సముద్రంలో నిలిచిపోయింది. బుధవారం విశాఖ నుంచి ఇంజినీర్లు వెళ్లి.. జనరేటర్లకు మరమ్మతులు చేశారు. అనంతరం తిరిగి విశాఖకు తీసుకువచ్చారు. దాదాపు 38 గంటల పాటు ప్రయాణికులు సముద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు పోర్టు ట్రస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ చేరుకున్న హర్షవర్దన్ నౌక
-
మరికాసేపట్లో అండమాన్‌కు 'హర్షవర్దన్'
విశాఖపట్నం : అండమాన్ వెళ్తున్న హర్షవర్దన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తి నడి సముద్రంలో నిలిచిపోవడంపై విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు బుధవారం విశాఖపట్నంలో స్పందించారు. మధ్యాహ్నాం 2.00 గంటల తర్వాత ఈ నౌక అండమాన్ బయలుదేరే అవకాశం ఉందని తెలిపారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులను పంపుతున్నట్లు చెప్పారు. అలాగే నౌకలో ప్రయాణిస్తున్న 560 మందికి ఆహారాన్ని పంపుతున్నట్లు కృష్ణాబాబు వెల్లడించారు. హర్షవర్దన్ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు పోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారులను సంప్రదించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్‌లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. -
నడిసముద్రంలో ఆగిపోయిన నౌక
-
నడి సంద్రంలో నిలిచిన నౌక: ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: అండమాన్ వెళ్తున్న 'హర్షవర్దన్' నౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నడి సంద్రంలో నౌక నిలిచిపోయింది. దీంతో నౌక సిబ్బంది వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో సాంకేతిక సిబ్బంది బృందాన్ని హర్షవర్దన్ నౌక వద్దకు పంపి లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు విశాఖ ఫోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం విశాఖలో వెల్లడించారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు సిబ్బంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. అయితే రాత్రి సమయంలో నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్‌లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదు అయింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే సూచనలు కూడా లేవని తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. -
హమ్మయ్యా...నౌక బయలుదేరింది
ప్రయాణికులకు మూడు రోజులు నరకం చూపించిన ఎం.వి.స్వరాజ్‌దీప్ నౌక ఎట్టకేలకు శనివారం ఉదయం పదిగంటలకు విశాఖ పోర్టు నుంచి అండమాన్‌కు బయలుదేరింది. ఈనెల 18నే బయలుదేరాల్సిన ఈ నౌక తుపాను కారణంగా మూడు రోజులుగా విశాఖ పోర్టులోనే నిలిచిపోయింది. నౌక సిబ్బంది సహా 1200 మంది మూడు రోజులుగా ఓడలోనే ఉండిపోయారు. డబ్బులు అయిపోయి.. ఆహారం అందక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుపాను విశాఖ తీరం దాటడంతో వాతావరణం నౌక ప్రయాణానికి అనుకూలంగా మారింది.