పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS).
ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు.
గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్‌లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్‌లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు.
An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm
— ANI (@ANI) August 2, 2023
ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు?
Comments
Please login to add a commentAdd a comment