richter scale
-
Andhra Pradesh: ఏపీలో వణికించిన భూకంపం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఏపీలో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామాన్లు, బీరువాలు ఊగడాన్ని స్పష్టంగా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఏపీలో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. భూప్రకంపనల కారణంగా తిరువూరు రాజుపేటలోని ఓ గృహంలో గోడలు బీటలు వారాయి. సుందరయ్య కాలనీలోని మోటూరు చింతయ్య ఇంట్లోని సామగ్రి కిందపడిపోయింది. భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిలా్లలో ఉండగా.. అక్కడ దాని తీవ్రత 5.3గా నమోదైంది. రాష్ట్రంలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్ల మేర వాయువ్య దిశలో దాని ప్రభావం రిక్టర్ స్కేల్‌పై 2.9గా ఉందని అధికారులు తెలిపారు. ఏపీ సేఫ్ జోన్లోనే..రాష్ట్రంలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇక్కడ వచ్చింది రెండో స్థానమేనని పేర్కొన్నారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని, ఈ స్థాయిలో భూకంపం సంభవిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రకంపనలు ఎక్కడెక్కడ వచ్చాయంటే..విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం, దుద్దుకూరు, దాసియ్యపాలెం, వేలేరుపాడు, రుద్రమకోట, కన్నాయిగుట్ట, కుక్కునూరు మండలం సీతారామనగరం, వేలేరు, శ్రీధర్, ఉప్పేరు, కుక్కునూరు, రాజానగరం, మాధవరం, కొయ్యలగూడెం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి మండలం, ఆగిరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. -
మేడారంలో భూకంపం!
సాక్షి, హైదరాబాద్/ ములుగు/ ఏటూరునాగారం/ సాక్షి నెట్వర్క్: బుధవారం ఉదయం.. సమయం 7.27 గంటలు.. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ఉన్నట్టుండి ఏదో కలకలం.. ఒక్కసారిగా అంతా ఊగిపోవడం మొదలైంది.. నిమిషాల్లోనే ఇది వందల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతమంతటా విస్తరించింది. తమ చుట్టూ ఉన్నవన్నీ ఊగిపోతున్నట్టుగా కనిపించడంతో జనం గందరగోళానికి గురయ్యారు.. మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఇది. ఇక్కడ రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – ఎన్సీఎస్) ప్రకటించింది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ప్రకంపనలు రావడం గమనార్హం. అయితే భూకంపాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న జోన్–2, 3ల పరిధిలో తెలంగాణ ఉందని... ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’శాస్త్రవేత్తలు తెలిపారు. కంపించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం వద్ద ప్రభావం ఎక్కువగా కనిపించింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు, పూజారులు ఉన్న సమయంలో వచ్చిన ప్రకంపనలతో.. అమ్మవార్ల హుండీలు, పల్లెం, ఇతర సామగ్రి కదలిపోయాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కూడా. బుధవారం మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నడోలతో వేలాది చెట్లు నేలమట్టం కావడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూకంపం రాగా.. సుమారు రెండు, మూడు నిమిషాల తర్వాత దూర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం నుంచి చుట్టూ సుమారు 225 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయి. ఏపీలో ఎనీ్టఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్పంగా రెండు, మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెబ్సైట్, భూకంప్ మొబైల్యాప్ ద్వారా వెల్లడైంది. ఇది రెండో పెద్ద భూకంపం... గోదావరి నది పరీవాహక ప్రాంతం వెంబడి రిక్టర్ స్కేల్‌పై 2 నుంచి 4 తీవ్రత వరకు భూకంపాలు వచ్చినా.. ఇలా 5 పాయింట్లకు పైన తీవ్రత ఉండటం అరుదని నిపుణులు చెబుతున్నారు. 1969 జూలై 5న భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే పెద్దది. 1983లో మేడ్చల్‌లో 4.8, 2021లో పులిచింతలలో 4.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు మేడారంలో వచ్చిన భూకంపం గత 55 ఏళ్లలో రెండో పెద్దదిగా రికార్డయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి చూస్తే... ఇది నాలుగో అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. సమ్మక్క, సారలమ్మ మహిమ అనుకున్నాం.. మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద ఉదయం పూజలు చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మవార్ల గద్దెలు, గ్రిల్స్ ఊగడం మొదలుపెట్టాయి. రెండు, మూడు సెకన్లు గద్దెలు కదిలాయి. భయాందోళనకు గురయ్యా. ఇది సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అనుకున్నా.. తర్వాత భూకంపం అని తెలిసింది. – కాక కిరణ్, సారలమ్మ, పూజారి దేశంలోనే సురక్షిత ప్రాంతం హైదరాబాద్ భూకంపాల విషయంలో దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశం హైదరాబాద్. తెలంగాణలోని చాలా ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై ఉండటంతో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. సాధారణంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకింత సేఫ్‌జోన్‌లోనే ఉన్నాయి. అయితే గోదావరి నదికి దగ్గరిలోని పరీవాహక ప్రాంతాల్లో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా నది ప్రవాహం వల్ల భూగర్భంలో ఏర్పడే పగుళ్లు (ఫాల్ట్స్) దీనికి కారణం. 5 పాయింట్లలోపు వచ్చే భూకంపాలతో ప్రమాదమేమీ ఉండదు. భవనాలు ఊగడం, పగుళ్లురావడం వంటివి జరగొచ్చు. ఆరు, ఏడు పాయింట్లు దాటితేనే భవనాలు కూలిపోతాయి. – పూర్ణచంద్రరావు, పూర్వ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇక్కడ తరచూ ప్రకంపనలు సాధారణమే.. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తరచూ మనం గమనించలేనంత స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ జోన్ పరిధిలో రిక్టర్ స్కేల్‌పై 6 పాయింట్ల వరకు భూకంపాలు వచ్చే వీలుంది. జియోలాజికల్, టెక్టానిక్ యాక్టివిటీని బట్టి తెలంగాణ జోన్–2, జోన్–3ల పరిధిలో ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు జోన్–2లోకి వస్తాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతం జోన్–3లో ఉంది. ఏపీలోని ప్రకాశం, ఒంగోలు, అద్దంకి వంటివి కూడా జోన్–3లోనే ఉన్నాయి. – ఎం.శేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ భూమి పొరల్లో సర్దుబాటుతోనే.. భూమి లోపలి పొరల్లో అసమతౌల్యత ఉంటే సర్దుబాటు అయ్యే క్రమంలో భూకంపాలు వస్తాయి. మేడారం భూకంపం అలాంటిదే. నేల పొరల్లో సర్దుబాటు పూర్తయ్యే వరకు కంపనాలు వస్తూ ఉంటాయి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు లినియమెంట్ ఉన్నట్టు తేలింది. అయితే భారీ వర్షాలు, పెనుగాలులకు భూకంపాలకు సంబంధం లేదు. వాటికి గ్లోబల్ వార్మింగ్ వంటి వాతావరణ మార్పులే కారణం. ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో భీకర వర్షాలు కురిశాయి. దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో వరదలు వచ్చాయి. – చకిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా -
రెండు రోజుల్లో 155 ప్రకంపనలు
వజిమ: జపాన్‌లో సోమ, మంగళవారం సంభవించిన వరుస ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. రెండు రోజుల్లో మొత్తం 155 ప్రకంపనలు నమోదైనట్లు భూకంప విభాగం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. మంగళవారం పశ్చిమ తీరంలోని ఇషికావ ప్రిఫెక్చర్లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనల్లో 50 మందికి పైగా చనిపోగా మరో 16 మంది గాయపడ్డారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ వ్య వస్థలు దెబ్బతినడంతో సుమారు 33 వేల నివాసా లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన హైవేలు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదమున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు కోరారు. పశ్చిమ తీరంలోని హొన్షు దీవి నుంచి 97 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జపాన్‌లో భూకంపం నేపథ్యంలో పొరుగునే ఉన్న రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. -
అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS). ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్‌లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్‌లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు. An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm — ANI (@ANI) August 2, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? -
భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్ కోర్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్‌యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌లో పని చేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇలా వెలుగు చూసింది భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్‌లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. ఐదో పొర కూర్పు ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్‌లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కంపించిన భూమి
సాక్షి, సూర్యాపేట: చింతలపాలెం మండల కేంద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం వాసుల్ని వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 1.8గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ధ్రువీకరించారు. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి పరుగులు పెట్టారు. -
మహారాష్ట్రలోని పాల్ఘర్లో భూకంపం
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్‌కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. -
ఉత్తరాఖండ్‌లో భూకంపం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో గురువారం వేకువజామున 6 గంటల 12 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తరకాశి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 30.8 ఉత్తర అక్షాంశం, 78.2 తూర్పు రేఖాంశాల మధ్య కేంద్రీకృతమైంది. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:4.0, Occurred on:14-06-2018, 06:12:08 IST, Lat:30.8 N & Long: 78.2 E, Depth: 10 Km, Region:Uttarkashi, Uttarakhand pic.twitter.com/Jrg6NXmrJ2 — IMD-Earthquake (@IMD_Earthquake) June 14, 2018 -
తెహ్రాన్‌లో స్వల్ప భూకంపం
తెహ్రాన్: ఇరాన్ రాజధాని తెహ్రాన్, పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అయితే ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతం తెహ్రాన్-అల్బోర్జ్ ప్రావిన్స్‌లో మలార్డ్ నగరానికి సమీపంలో ఉంది. ఇది 12 కి.మీ. లోతులో సంభవించిందని స్థానిక టీవీ పేర్కొంది. -
భయపెట్టిన భూకంపం
యూనివర్సిటీ క్యాంపస్/యాదమరి: జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో శనివారం అర్ధరాత్రి భూకంపం కలకలం సృష్టించింది. యాదమరి మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పలుమార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. ఈ వివరాలను హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్కు సమాచారం అందించారు. చిత్తూరుకు 30 కిమీ దూరంలో అర్ధరాత్రి 01.02 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని, వీటి తీవ్రత 2.6గా నమోదైనట్లు వారు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, చిత్తూరు జిల్లా ప్రమాదకర జోన్లో లేదని సేఫ్ జోన్లోనే ఉందని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్వీయూకు చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. మళ్లీ ప్రకంపనలు.. యాదమరి మండలం తాళ్లమడుగులో ఆదివారం రాత్రి 7–8గంటల మధ్య నాలుగు పర్యాయాలు కంపించింది. భూమి కదలడం, పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. -
హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో శుక్రవారం భూమి స్పల్పంగా కంపించింది. ఉదయం 8:09 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎక్కడా నమోదు కాలేదు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 4.4 పాయింట్లుగా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల మొదటివారంలో చంబా ప్రాంతంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇలా వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 1905లో అత్యంత తీవ్ర స్థాయిలో భూంకపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
ఈటానగర్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం వేకువజామున భూ భూకంపం సంభవించింది. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. త్రిపురలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైంది. కమల్ పూర్లో పలు ఇళ్లు బీటలు వారాయి. భూకంప భయంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో కురుంగ్ కుమె జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు
టోక్యో: జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు తలెత్తుతుంటాయి. దట్టమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. గత బుధవారం ఇక్కడి డైగో ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం వల్ల తలెత్తిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. -
భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు
భారత్-నేపాల్ సరిహద్దుల్లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చంపావత్, నగర్ గర్హ్వాల్, అల్మోరా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. భూ ప్రకంపనలు రావడంతో ఆందోళనకు గురైన ఆ ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకైతే ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇండోనేసియాలో మళ్లీ భూప్రకంపనలు
జకర్తా: ఇండోనేసియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. లాంబోక్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ వారంలో ఇండినేషియాలో భూకంపం రావడం ఇది మూడోసారి. నేటి ఉదయం మరోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. గత వారం రోజుల్లో ఇండోనేసియా ఉత్తర ప్రాంతంలో చాలా చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కాగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
భూప్రకంపనలు చిన్నవే..
ఆందోళన వద్దు కలెక్టర్ జానకి నెల్లూరు(పొగతోట): ఉదయగిరి, వింజ మూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో సంభవిస్తున్న భూప్రకంపనలు చిన్నవే అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ ఎం.జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 అక్టోబర్ నుంచి వస్తున్న భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. శనివారం వింజమూరు ప్రాంతంలో వచ్చిన భూప్రకంనాలు రిక్టర్ స్కేల్‌పై 2.5 నమోదు అయిందని తెలిపారు. వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో భూకంప గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భూకంపనాలు భూగర్భంలో 3 నుంచి 5 కిలోమీటర్ల లోతులో సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారని పేర్కొన్నారు. భూకంపనాలపై శాస్త్రవేత్తలు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
ఫ్రాన్స్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2
పారిస్: ఫ్రాన్స్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్ లోని లా రోచెల్ నగరంలో, సమీప ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. 2014 తర్వాత ఫ్రాన్స్ దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదేనని సెంట్రల్ ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. -
జపాన్‌లో మరో భారీ భూకంపం, 13 మంది మృతి
రిక్టర్‌స్కేల్‌పై 7.2గా తీవ్రత కుమమొటోను మళ్లీ కుదిపేసిన భూకంపం టోక్యో: జపాన్‌లోని కుమమొటో ప్రాంతాన్ని మరో భూకంపం కుదిపేసింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో శనివారం (స్థానిక సమయం) తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం దక్షిణ జపాన్‌లోని కుమమొటోలో అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారికంగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. మరో 760 మంది గాయపడ్డారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అక్కడ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మనిమా సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాల కింద 11మంది చిక్కుకున్నారని, అయితే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలియటం లేదన్నారు. కాగా మీటరు ఎత్తువరకు సముద్రం ఎగిసిపడి ముందుకు రావచ్చంటూ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీచేసి గంట అనంతరం ఉపసంహరించుకుంది. తాము ఇళ్లల్లో చిక్కుపోయామని పలువురు మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. భూకంపం తర్వాత అనేక చిన్నపాటి ప్రకంపనలొచ్చాయి. ‘మషికి’ పట్టణంలో భారీ సంఖ్యలో అత్యవసర వాహనాల శబ్దాలు వినిపించాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం వివరాలు తెలియరాలేదు. మషికి పట్టణంలోని టౌన్‌హాలు బయట రోడ్డుకు భారీ పగులు ఏర్పడింది. పలువురు బిల్డింగుల్లో చిక్కుకుని సాయం కోసం అర్థించారు. తాజా భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.మి దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10కిలోమీటర్లలోతులో ఇది ఉంది. గురువారం కుమమొటోలో భూకంప సంభవించి 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నెల్లూరులో భూకంపం
జిల్లాలోని వరికుంట పాడు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నాం 12.15 గంటల సమయంలో భూకంపం సంభవించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత మూడు నెలల్లో భూమి కంపించడం ఇది నాలుగోసారి. ఎప్పుడు మళ్లీ భూమి కంపిస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత ఎంత నమోదు అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రీకులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు
ఏథెన్స్ : గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైంది. సముద్ర తీరప్రాంతం సోరంగ్ నగరంలో గురువారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా భూవిజ్ఞానశాస్త్ర విభాగం వెల్లడించింది. ఎలాంటి సునామీ హెచ్చరికలు వెలువడలేదని సమాచారం. -
ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేసే స్థాయిలో భూమి పలుసార్లు కంపించిందని చెప్పారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని సంఘీ ద్వీపానికి 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. -
అండమాన్‌లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్‌కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఆదమరచి ఉండగా దెబ్బతీసింది
తాజా భూకంపంపై నేపాల్ ప్రధాని కఠ్మాండు: పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో.. తాజాగా మంగళవారం సంభవించిన భూకంపాన్ని ఎదుర్కోలేకపోయామని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. ‘‘మేం ఆదమరచి ఉండగా దెబ్బతీసింది’’ అని చెప్పారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన తాజా భూకంపం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆయన గురువారం దోలఖా ప్రాంతంలో పర్యటించారు. కాగా, తాజా భూకంపంలో మృతుల సంఖ్య 110కి పెరిగింది. -
ఏపీలో మళ్లీ భూప్రకంపనలు..
వివిధ జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి ఇళ్ల నుంచి జనం పరుగులు విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి భూప్రకంపనలు కలవరపెట్టాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భూమి స్వల్పంగా కంపించింది. 20 రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు భూప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. గత నెల 25న నేపాల్ సమీపంలోని భూకంప కేంద్రం నుంచి వచ్చిన భూప్రకంపనలు ఏపీలోని పలుప్రాంతాలను తాకిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి నేపాల్‌లో వచ్చిన భూకంపం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రభావం చూపింది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పది సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5 నుంచి 6 మధ్య ఉంటుందని అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ గుణదల సిస్మోలాజికల్ ల్యాబ్‌లో భూకంప లేఖిని నమోదు చేసిన వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడిస్తారన్నారు. విజయవాడలో గవర్నర్‌పేట, బెంజిసర్కిల్, కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా జిల్లాల్లోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోను భూప్రకంపనలు వచ్చాయి. గుంటూరు, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు కంగారుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.