జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు | earthquake hits Japan east coast | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

Dec 31 2016 7:42 AM | Updated on Sep 5 2017 12:03 AM

జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది.

టోక్యో: జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు తలెత్తుతుంటాయి. దట్టమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. గత బుధవారం ఇక్కడి డైగో ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం వల్ల తలెత్తిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement