తాజాగా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఖాట్మండు: నేపాల్‌లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసిన ఘటన మరవకముందే భూమి మరోసారి కంపించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పలుచోట్ల మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఇప్పటికే నేలమట్టమైన ప్రదేశాల్లో శిధిలాలను తొలగించే దిశగా నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతునే ఉన్నాయి.
ఈ సహాయక చర్యల్లో 40మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 50మంది వైద్యులు పాల్గొన్నారు. నేపాల్కు 3 టన్నుల మెడిసిన్స్, సహాయ సామాగ్రిని భారత్ పంపినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భారతీయుల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో ఇప్పటికే 103మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 200మందికి పైగా మృతదేహాలు వెలికితీసినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.