Kathmandu
-
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. #WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's KathmanduDetails awaited pic.twitter.com/DNXHSvZxCz— ANI (@ANI) July 24, 2024ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది. కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. #BREAKING : A plane has crashed at Tribhuvan International Airport. Sources at TIA reported that the aircraft skidded off the runway during takeoff as it was departing for Pokhara with 19 passengers. #Nepal #planecrash #TribhuvanInternationalAirport #skid #landing #airport… pic.twitter.com/ILnl0zQnZH— mishikasingh (@mishika_singh) July 24, 2024 -
Earthquake in Nepal: నేపాల్‌లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది. దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్‌ల వరకు కనిపించింది. -
ఆదిపురుష్‌పై బ్యాన్ ఎత్తివేత! జరగనివ్వనంటున్న మేయర్..
మొదట్లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఆదిపురుష్ ఇప్పుడు కలెక్షన్ల వేటలో నెమ్మదించింది. అయితే వివాదాలు, విమర్శలు మాత్రం ఇంతవరకు తగ్గనేలేదు. పైపెచ్చు రోజుకో వివాదం సినిమాను చుట్టుముడుతూనే ఉంది. ఇకపోతే ఆదిపురుష్‌లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం భారతీయ సినిమాలపై కన్నెర్రజేసింది. ఈ సినిమాలో.. సీత భారత్‌లో పుట్టిందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో సినిమాపై నిషేధం విధించారు. అంతేకాకుండా హిందీ సినిమాలను సైతం బ్యాన్ చేశారు. దీనిపై మేకర్స్ క్షమాపణలు కోరినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. దీంతో నేపాల్ ఫిలిం యూనియన్ ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పఠాన్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను కూడా ఆపడానికి వీల్లేదని తెలిపింది. ఆదిపురుష్‌పై బ్యాన్‌ను ఎత్తివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు మాటలు కూడా వినేదే లేదంటున్నాడు ఖాట్మండు మేయర్ బాలెన్ షా. 'దేశ సార్వభౌమాదిధికారం, స్వతంత్రత విషయానికి వస్తే నేను ఏ చట్టానికి, న్యాయానికి కూడా కట్టుబడి ఉండను' అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా? నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: నటి ఎమోషనల్ -
నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
న్యూఢిల్లీ: నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్ చంద్రనుతో ఖాట్మాండులోని మహారాజ్‌గంజ్ త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కాగా గత నెల రోజుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన్ను త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని ఖాట్మండు వార్తాపత్రిక పేర్కొంది. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్ర.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. ఈయనకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. చదవండి: అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్‌లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!
విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయిదుగురు భారతీయులు రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు. వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. యూసీ సీఎం సంతాపం ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి ముందు ఫేస్బుక్ లైవ్ నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp — Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023 అసలేం జరిగిందంటే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది. కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరు కూడా..
నేపాల్‌లోని పోఖారా సమీపంలో ఆదివారం విమానం కుప్పకూలిన ఘటన ఘోర విషాదాన్ని మిగిల్చింది. సమయం గడిచే కొద్దీ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దుర్ఘటన సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరూ ప్రాణాలతో బయట పడేలా కనిపించడం లేదు. ఒక్కరైనా బతికి బట్టకడతారనే ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి అధికారులు ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు. కాగా యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఖాట్మండు నుంచి బయలుదేరిన విమానం పోఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో కుప్పకూలింది. మరికొద్ది క్షణాల్లో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరింత బాధాకరం. ఘటన సమయంలో విమానంలోప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 68 ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. విమాన శిథిలాల నుంచి ఆర్మీ అధికారులు 68 మృతదేహాలను వెలికితీయగా.. మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతం ప్రమాదకర ప్రదేశం కావడంతో రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఆదివారం రాత్రి చీకటి పడటంతో రెస్క్యూ చర్యలకు బ్రేక్ పడిందని సోమవారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరిని ప్రాణాలతో గుర్తించలేదని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి క్రిష్ణ ప్రసాద్ బండారి తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులలో 15 మంది విదేశీ పౌరులు ఉన్నారని చెప్పారు. వీరిలో అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒక ఆస్ట్రేలియన్, ఒక ఫ్రెంచ్, ఒకరు అర్జెంటీనా కాగా మరొకరు ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి. नेपाल प्लेन हादसे से पहले फेसबुक का लाइव वीडियो#NepalPlaneCrash pic.twitter.com/N7lyXS8HEV — Dhyanendra Singh (@dhyanendraj) January 15, 2023 Tragic plane crash in #Pokhara . In this difficult situation, we must acknowledge the bravery of the pilot in potentially preventing further loss of life by avoiding a crash in a populated area.#YetiAirlines #planecrash #Nepalcrash #PokharaAirport #NepalPlaneCrash pic.twitter.com/6yGLgUqEvK — Mutahir Showkat (@mutahirshowkat) January 15, 2023 -
ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు
నవంబర్ 20న నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ 200 వాహానాలను నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మకు అందజేశారు. ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్ మాట్లాడుతూ...నేపాల్ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు నేపాల్ మంత్రి జనార్దన్ శర్మ. అదీగాక ఎన్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
‘త్రీ’ చీర్స్.. చరిత్ర సృష్టించిన అక్కాచెల్లెళ్లు
కాఠ్మాండు: చాలా మంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా పొందుతారు. కానీ తండ్రి ఇష్టాన్నే తమ ఇష్టంగా భావించారీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తండ్రికి ఇష్టమైన పర్వతారోహణను వారూ స్వీకరించి ముగ్గురికి ముగ్గురూ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డునూ నెలకొల్పారు. ఇప్పటివరకూ ఇంతమంది అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కలేదట. ఆ రికార్డును వారు తమ తండ్రికి అంకితం కూడా చేశారు. ఇది తమ మొదటి అడుగేనని, త్వరలో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన ‘సెవెన్ సమ్మిట్స్’ పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నారు నేపాల్‌కు చెందిన దావా ఫుతి షెర్పా, నిమా జంగ్మూ షెర్పా, సెరింగ్ నంగ్యా షెర్పా. వీళ్ల తాత కూడా పర్వతారోహకుడే. ఇక వాళ్ల నాన్న డోర్జీ షెర్పా పర్వతారోహణ శిక్షకుడిగా, గైడ్‌గానూ పనిచేశాడు. మొట్టమొదటి సారి ఆయన 1982లో జపనీస్ పర్వతారోహకులతో కలిసి చలికాలంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆ చల్లదనానికి ఆయన ఎనిమిది వేళ్లు పాడైపోయాయి. అయినా ఆయన పర్వతారోహణను మానలేదు. 2007 వరకు కొనసాగించాడు. ఆ తండ్రి వారసత్వాన్ని పిల్లలూ తీసుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్లకంటే ముందు వాళ్ల సోదరుడు మింగ్మా సైతం ఆరుసార్లు ఎవరెస్టును అధిరోహించాడు. అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పర్వతారోహకులన్నమాట. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు
కఠ్మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శనివారం 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది. రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే! 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ ఈ ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది. -
నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం
ఖాట్మండూ: నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో వర్షం బీబత్సం సృష్టించిందని మధ్య నేపాల్ జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సింధుపాల్‌చౌక్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అరుణ్ పోఖ్రెల్ మాట్లాడుతూ.. మంగళవారం ఎడతెగని వర్షం వల్ల ఇంద్రవతి, మేలంచి నదిలో నీటి మట్టం పెరిగినట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించినట్లు వెల్లడించారు. కాగా పదుల సంఖ్యలో జనం వదల్లో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వర్ష ప్రభావం భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో నిరంతర వర్షం కారణంగా బీహార్‌లోని గండక్ నదిలో నీటి మట్టం చాలా వరకు పెరిగింది. చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం -
నేపాల్ ప్రధానికి సుప్రీం షాక్
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి ప్రయత్నాలకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. మధ్యంతర ఎన్నికల ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఆ నిర్ణయం చెల్లుబాటుకాదని తెలిపింది. పునరుద్ధరించిన పార్లమెంట్ దిగువ సభను 13 రోజుల్లోగా తిరిగి సమావేశపర్చాలంటూ ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోళేంద్ర షంషేర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెలువ రించింది. అధికార పార్టీకి, ప్రధాని కేపీ ఓలికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన దిగువ సభ రద్దు, ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటిస్తూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. -
విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి
ఖాట్మండు : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నదులవెంట ఉన్న ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా కస్కీ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే 12 మంది మృతిచెందగా మరో 19 మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో చాలామంది వాటికింద చిక్కుకుపోయారు. అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్‌కోట్, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. -
ఎన్‌బీఐతో ఎస్బీఐ ఒప్పందం
ముంబై: ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. మౌలిక, పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని ఒక ప్రకటనలో వివరించింది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
కూలిన హెలికాప్టర్.. ఏడుగురు గల్లంతు
ఖాట్మండు : సెంట్రల్ నేపాల్‌లోని కొండప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్టిట్యూడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో పైలట్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఓ జపాన్ పర్యాటకుడితోపాటూ ఐదుగురు నేపాలీలు ఉన్నట్టు సమాచారం. నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలోని సమాగౌన్ నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతమైన సత్యవాహిలో హెలికాప్టర్ శకలాలు ఉన్నట్టు గుర్తించారు. శకలాలు ఉన్న ప్రాంతం ఎత్తైన కొండపైన ఉండటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. -
ఖట్మాండు; ఇండియన్ ఎంబసీ వద్ద పేలుడు
ఖట్మాండు: నేపాల్ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరత్‌నగర్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు . పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఘటన జరిగిందని, పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైందని, అయితే ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని నేపాల్ పోలీసులు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు గల కారణాలను కనిపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారతీయ రాయబార కార్యాలయంలో సాధారణ స్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. -
ప్రపంచ వలసల సదస్సులో పాల్గొన్న డా. త్రిలోక్
ఖాట్మండు : నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు లో జరిగిన ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక) పక్షాన డా. కలాలి త్రిలోక్ చందన్ గౌడ్ హాజరయ్యారు. 'ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ' అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన తుది ముసాయిదాపై ఈనెల 21 నుండి 23 వరకు జరిగిన సమావేశాల్లో త్రిలోక్ పాల్గొన్నారు. భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను డా. త్రిలోక్ మూడు రోజుల సదస్సులో వివరించారు. వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన కోరారు. ప్రవాస భారతీయ కార్మికుల స్థితిగతుల గురించి పరిశోధన చేసిన త్రిలోక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డా. త్రిలోక్ తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక సంస్థలో ప్రవాస భారతీయుల విభాగం కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు. -
నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ వలసల శిక్షణకు బషీర్
ఖాట్మండు : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి గల్ఫ్ వలసల భాగస్వామ్య వ్యూహాల శిక్షణకు వరంగల్ జిల్లాకు చెందిన తమ సంస్థ సభ్యుడు మహ్మద్ బషీర్ అహ్మద్ కు ఆహ్వానం అందిందని ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒమన్ దేశంలోని మస్కట్ లో 12 సంవత్సరాలపాటు ఉపాధ్యాయులుగా పనిచేసిన బషీర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (తెలంగాణ ప్రవాసి వేదిక) లో రిటర్న్డ్ ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ (విదేశాల నుండి తిరిగి స్వదేశం వచ్చిన నిపుణులు) విభాగానికి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే 'డిప్లొమసి ట్రేనింగ్ ప్రోగ్రాం', ఫిలిప్పీన్స్ లోని మనీలా కేంద్రంగా పనిచేసే 'మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా', నేపాల్ లోని ఖాట్మండు కేంద్రంగా పనిచేసే 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ సేఫ్ మైగ్రేషన్' అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ (గల్ఫ్ కు వలసలు వెళుతున్న ప్రాంతాలు) లో పనిచేసే సివిల్ సొసైటీ అడ్వొకేట్స్ సమీక్ష కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి వివిధ దేశాల నుండి పలువురు వలస కార్మిక నాయకులు, సమాజ సేవకులను ఆహ్వానించారు. కార్మికులను పంపే దేశాలు, కార్మికులను స్వీకరించే దేశాల మధ్య సమర్థవంతమైన వలసల భాగస్వామ్య వ్యూహాలపై ప్రధానమైన చర్చ జరుగుతుంది. -
నేపాల్ విమాన ప్రమాదం
-
కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం
-
విమానం క్రాష్‌ల్యాండ్: 50 మంది మృతి
కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది. నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పరార్..
ఖాట్మండూ: చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకుని నేపాల్ పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ కేసులో నిందితులైన చైనా దంపతుల కోసం వేట కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. వాన్‌మియ్ మింగ్(50), యాంగ్ వై మింగ్ అనే చైనా దంపతులు నేపాల్‌లోని తామెల్ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఈ ముసుగులోనే వారు బంగారం అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం వారు తమ కారులో చైనా-నేపాల్ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్’ మార్గంలో ప్రయాణిస్తుండగా.. పోలీసులు అనుమానంతో వారిని అనుసరించారు. ఈ విషయాన్ని గమనించిన వింగ్ దంపతులు.. కారును రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు. అనంతరం పోలీసులు కారును తనిఖీ చేయగా.. 88 కేజీల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 440 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారైన దంపతుల కోసం గాలిస్తున్నారు. ఖట్మాండూ పోలీసుల చరిత్రలోనే ఇది అతిపెద్ద పట్టివేత కావడం గమనార్హం. -
అష్టముఖ పశుపతినాథుడు
పశుపతినాథుడి త్రినేత్రం నుంచి పుట్టిన ఆయుధం పాశుపతాశ్రం. దీనిని మించిన ఆయుధం లేదని శివపురాణం చెబుతుంది. త్రిపుర సంహారంలో కాళికాదేవికి, ద్వాపరయుగంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చినవాడు పశుపతినాథుడు. పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్‌లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నా నది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు గలవాడుగా పేరొందాడు. శివ్నా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్సౌర్ పట్టణంలో ఉంది. ఈ నదీ తీరంలో ప్రపంచంలో మరెక్కడా లేని మూర్తిగా అష్ట ముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు. శివ్నా నది గలగలలతో, పశుపతినాథుడిని కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామాగా నిలుస్తోంది. మంద్సౌర్ పట్టణంలోని శివ్నా నదికి 90 అడుగుల ఎత్తులో 30 అడుగుల విస్తీర్ణంలో 101 అడుగుల పొడవుతో పశుపతినాథ్ దేవాలయం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంది. దేవాలయం పైన 100 కిలోల స్వర్ణంతో చేసిన గోపుర భాగం సూర్యకిరణాల కాంతిలో మెరుస్తూ భక్తులను అలౌకికమైన ఆనందానికి చేరువచేస్తోంది. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మహాద్వారాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భక్తులు అంతా పశ్చిమ మహాద్వారం గుండానే లోపలికి ప్రవేశిస్తారు. ముందుగా అతి పెద్ద నంది దర్శనమిస్తాడు. నంది ఆశీస్సులు తీసుకొని గర్భాలయంలో అడుగుపెట్టగానే వర్ణించనలవి కానంత అద్భుతంగా స్వామి మూర్తి దర్శనమిస్తుంది. 3.5 మీటర్ల ఎత్తులో శివలింగం పై భాగంలో 4 ముఖాలు, కింది భాగంలో మరో 4 ముఖాలు మొత్తం ఎనిమిది ముఖాలతో ఉన్న స్వామి మూర్తి ప్రకాశవంతమైన నల్లని అగ్నిశిల. పై 4 ముఖాలు స్పషం్టగా, కింది ముఖాలు అస్పష్టంగా కనిపిస్తాయి. మానవజీవితంలోని 4 దశలకు ఈ ముఖాలను సూచికగా చూపుతారు. రుద్ర మూర్తిగా దర్శనమిచ్చే ముఖం మాత్రం ద్వారానికి ఎదురుగా ఉంటుంది. తలకట్టును పాములతో ముడివేసినట్టుగా, మూడో కంటితో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. నాలుగు తలలపైన ఉండే లింగం మీద ‘ఓంకారం’ దర్శనమిస్తుంది. భవ, పశుపతి, మహదేవ, ఈశాన, రుద్ర, వర్వ, ఉగ్ర, అశని రూపాల ముఖాలతో స్వామి భక్తులచే పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక ఏకాదశి పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సమయాలలో భక్తులే స్వామికి నైవేద్యాలు సమర్పిస్తారు. స్వామి బరువును తూచతరమా! సృష్టికి ఆద్యుడైన స్వామి ఎత్తు, బరువు ఎంతో చెప్పడం అసంభవమని శివపురాణం స్పష్టం చేస్తోంది. అయితే, ఇక్కడ కొలువున్న పశుపతినాథుడి మూర్తి బరువు 4,665 కిలోలని, స్వర్ణయుగంగా భాసిల్లే గుప్తుల కాలంలో స్వామి ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాలుగు వేల సంవత్సరాలు అష్టముఖి పశుపతినాథ్ మహాదేవుని రూపాల గురించి వర్ణించడం ఎంత దుర్లభమో ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడం అసంభమని శివపురాణం చెబుతుంది. పశువులను సంరక్షించేవాడు పశుపతి అని,. సింధూ నాగరికతలో పశుపోషణ ప్రధానంగా ఉండేది కాబట్టి ఆ కాలంలోనే ఈ స్వామి ఆవిర్భవించి ఉంటాడనే కథనాలూ ఉన్నాయి. ఆ విధంగా ఆధారాలను బట్టి చూస్తే 46 వేల ఏళ్ల క్రిందటే స్వామి ఇక్కడ వెలశాడనేది అవగతం అవుతుంది. అగ్నిశిల కావడం వల్లే నేటికీ ఈ రూపం చెక్కుచెదరలేదని తెలుస్తోంది. స్వయంభువు అష్టదిక్కులను సంరక్షించే అధినాయకుడిగా వెలుగొందే స్వామి ఇక్కడ స్వయంభువు. 500 ఏళ్ల కిందట శివ్నా నది ఒడ్డున గల పెద్ద బండరాయి వద్దకు ఒక రజకుడు రోజూ బట్టలు ఉతుక్కోవడానికి వెళుతుండేవాడట. ఒకరోజు అతనికి శివుడు కలలో దర్శనమిచ్చి ఆ చోట బట్టలు ఉతకడం మానేసి, అక్కడ తనను వెలికి తీసి, గుడి కట్టమని, ఈ మూర్తిని దర్శించుకున్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేశాడట. మరునాడు ఆ రజకుడు తన సహచరులతో వెళ్లి, అక్కడ తవ్వి చూడగా స్వామి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట. వెలుగు చూసిన విధం వేల ఏళ్లక్రితమే ఇక్కడ వెలిసినా 1940 వేసవి వరకు శివ్నా నది నీటిలో మునిగే ఉన్నాడు పశుపతినాథుడు. నది నీటి మట్టం తగ్గడంతో భక్తులకు పూర్తి రూపంతో 1961లో దర్శనమిచ్చాడు. ఆ మరుసటి యేడు అత్యంత ఘనంగా స్వామి ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తరువాత పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. ఇక్కడ స్వామిని అందరూ చేత్తో స్పర్శించవచ్చు. అభిషేకాలు చేయవచ్చు. మహాశివరాత్రికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు జరుపుతారు. జలమే అభిషేకించే పుణ్యస్థలి శివుడు అభిషేకప్రియుడనే విషయం తెలిసిందే! అయితే, జలమే జలాభిషేకం చేయడం ఇక్కడి అరుదైన ఘటన. ప్రతి వర్షాకాలం శివ్నా నది ప్రవాహం పెరుగుతుంది. 90 అడుగులకు ఉప్పొంగిన నది శివలింగం అగ్రభాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని దూరం నుంచే దర్శించే వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యానికి పులకించిపోతుంటారు. - చిలుకమర్రి నిర్మలారెడ్డి ప్రత్యేక ప్యాకేజీ మధ్యప్రదేశ్ పర్యాటకశాఖ పశుపతినాథ్, మహాకాళేశ్వర్.. ఇతర ఆలయాల సందర్శ నకు6 రోజుల ప్యాకేజీని అందిస్తోంది. సోమవారం: హైదరాబాద్ - అజ్మీర్ (ట్రెయిన్) ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు స్టార్ట్. మంగళవారం: మంద్సౌర్ రైల్వేస్టేషన్‌కు 21:51 గంటలకు చేరుతుంది. స్టేషన్ నుంచి ట్యాక్సీ, హోటెల్లో బస, భోజన వసతి. బుధవారం: ఉదయం పశుపతినాథ్ ఆలయ సందర్శనం. ఉజ్జయిని వయా రత్నలమ్. ఇక్కడి విరూపాక్ష, బైద్యనాథ్ మహాదేవ్‌ల దర్శనం. గురువారం: ఉదయం మహాకాళేశ్వర్ భస్మహారతి, జ్యోతిర్లంగ, హరసిద్ధి మాత శక్తిపీఠం, గడకాళిక, కాలభెరవ్, మంగళనాథ్ దేవాలయాల సందర్శన. శుక్రవారం: ఉదయం ఓంకారేశ్వర్ దర్శ నం, మహేశ్వర్ కోట, సాయంకాలం ఓంకార మాంధాత, అమలేశ్వర్ జ్యోతిర్లింగం, నర్మదా నది హారతి దర్శనం. శనివారం: ఉదయం దేవాలయాల సందర్శన. అల్పాహారం. 11 గంటలకు ఖండ్వా రైలేస్టేషన్ నుంచి హైదరాబాద్‌కు అజ్మీర్ ఎక్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం. ఈ మొత్తం సందర్శన ప్యాకేజీ ధర ఒకరికి: రూ. 8200/- (మినిమమ్ 6 పర్సన్స్) అన్ని చోట్ల బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, బస. అన్ని చోట్ల లగ్జరీ వసతి సదుపాయాలున్నాయి. మరిన్ని వివరాలకు: మధ్యప్రదేశ్ టూరిజమ్, టూరిజమ్ ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్ ఫోన్: 040-40034319, 9866069000 -
నేపాల్‌లో భూకంపం
ఖాట్మాండు: నేపాల్‌లో మరోసారి స్వల్ఫ భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మాండులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఒక్కసారిగా తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఖాట్మాండుకు సమీపంలో ఉన్న లలిత్‌పూర్‌లోని భైన్సేపతిలో భూకంప కేంద్రాన్ని నేషనల్ సెస్మలాజికల్ సెంటర్ గుర్తించింది. -
అమల్లోకి నేపాల్ రాజ్యాంగం
కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ‘రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిన, రాజ్యాంగ సభ చైర్మన్ ధ్రువీకరించిన రాజ్యాంగం ఈ రోజు నుంచి.. అంటే 2015 సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటిస్తున్నాను’ అని దేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ ఆదివారం పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తూ ప్రకటించారు. ‘ప్రజాస్వామ్యం, శాంతి కోసం ప్రజలు ఏడు దశాబ్దాలు పోరాడారు. కొత్త రాజ్యాంగం రావడంతో తాత్కాలిక రాజ్యాంగం రద్దయింది. దేశ శాంతి, సుస్థితర, ఆర్థిక ప్రగతికి కొత్త రాజ్యాంగం బాటలు వేస్తుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, అందరి హక్కులకు అవకాశమిచ్చింది. అందరూ ఏకతాటిపైకొచ్చి, సహకరించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ అమలు ప్రకటనకుగాను అధ్యక్షుడికి కృతజ్ఞలు తెలుపుతూ అసెంబ్లీ చివరి సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్టసభలు ఉంటాయి. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 375 మంది సభ్యులు, ఎగువ సభలో 60 మంది సభ్యులు ఉంటారు. కొత్త రాజ్యాంగం రావడంతో నేపాలీలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు ఎగరేసి, బాణసంచా కాల్చారు. మరోపక్క.. మదేశీ తెగ ప్రజలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారత్ సరిహద్దులోని దక్షిణ ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసం జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిరాట్‌నగర్, బీర్గంజ్, ధరాన్‌లలో రాజ్యాంగ అనుకూల, వ్యతిరేక వర్గాలు ర్యాలీలు నిర్వహించాయి. బీర్‌గంజ్‌లో సీపీఎన్-యూఎంఎల్ ఎంపీ ఇంటిని ధ్వంసం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు చనిపోయాడు. రాజ్యాంగంలో తమ డిమాండ్లను నెరవేర్చలేదని మదేసీ, థారు తెగలు ఆరోపిస్తున్నాయి. -
నేపాల్‌లో భూప్రకంపనలు
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్‌లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.. అదే నగరానికి తూర్పున ఉదయం 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అయితే, భూకంప కేంద్రం ప్రకంపనలు ఏర్పడిన ప్రాంతానికి చాలా దూరంలో ఉండటం వల్ల ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదు. ప్రకంపనల అనంతరం మాత్రం సంబంధిత ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరగులు తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి నేపాల్‌లో పది వేలమంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. -
ఖాట్మాండ్లో భూకంపం
ఖాట్మాండ్ : దేశంలో వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున 4.20 గంటలకు ఖాట్మాండ్‌లోని కీర్తిపూర్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదు అయిందని జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత అంటే ఉదయం 10.24 గంటలకు మరోసారి భూమి కంపించిందని తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు అయిందని పేర్కొంది. భూకంప కేంద్రం ఖాట్మాండ్లో గుర్తించినట్లు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో తొమ్మిది వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. -
కిడ్నీ గ్రామం కూలిపోయింది...
కఠ్మాండు: అది సరిగ్గా కఠ్మాండు నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోవున్న హాక్సే అనే గ్రామం. ఆ గ్రామాన్ని అందరు 'కిడ్నీ గ్రామం' అని పిలుస్తారు. పెళ్లి చేసుకున్న ఓ తరానికి తరం ఆడ, మగ తేడాలు లేకుండా కిడ్నీలు అమ్ముకోవడం వల్ల ఆ గ్రామానికి ఆ పేరు వచ్చింది. తాగడానికో, తందానాలాడడానికో వారు కిడ్నీలు అమ్ముకోలేదు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ గ్రామ ప్రజలు ఓ చిన్నపాటి స్థలం కునుక్కొని ఇల్లు కట్టుకుందామనే ఆశతోనే కిడ్నీలు అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బులో వారు నయాపైసా కూడా వృధా చేయలేదు. ఆశించినట్టుగానే స్థలం కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నారు. హమ్మయ్యా జీవిత కల నెరవేరిందంటూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే వారిపై ప్రళయం విరుచుకుపడింది. గత ఏప్రిల్ 25వ తేదీన వచ్చిన భూకంపం వారిళ్లన్నింటిని తుడిచిపెట్టేసింది. కొంతమంది మృత్యువాత పడ్డారు. ఆ రోజు కఠ్మాండు ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు తొమ్మిదివేల మంది ప్రజలు, వేలాది ఇళ్లు కూలిపోయిన విషయం తెల్సిందే. అలా ఇల్లు కోల్పోయిన వారిలో 37 ఏళ్ల గీత ఒకరు. ఆమె తన పిల్లలతో రేకులు, రైస్ బ్యాగ్‌లు, టార్పాలిన్ కవర్లతో నిర్మించుకున్న తాత్కాలిక షెడ్డులో నివసిస్తోంది. ఆమె తన కిడ్నీని లక్షా పాతికవేల రూపాయలకు అమ్ముకుంది. కూలిపని చేసుకునే ఆమె భర్త కూడా సొంతింటి కోసం కిడ్నీ అమ్ముకున్నాడు. కిడ్నీలు తొలగించాక కూడా బాడీలో అవి మళ్లీ పెరుగుతాయంటూ బ్రోకర్ చెప్పిన మాటలు తాను నమ్మానని ఆమె అమాయకంగా చెప్పింది. ఆమెను బ్రోకర్లు భారత్‌లోని చెన్నై నగరానికి తీసుకొచ్చి మరీ కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ఆశ్చర్యంగా ఆ గ్రామం ప్రజలందరిని దక్షిణ భారత దేశానికి తీసుకొచ్చే కిడ్నీలు తొలగించారు. ఆమె లాంటి ఎంతోమంది యువతీ యువకులు డబ్బుకు ఆశపడి, బ్రోకర్ల మాయమాటలను నమ్మి కిడ్నీలు అమ్ముకున్నారు. పాతిక వేల నుంచి లక్షా పాతిక వేల రూపాయల రేటు వరకు కిడ్నీలు అమ్ముకున్నారు. కవ్రేపాలనచౌక్ జిల్లాలోవున్న ఈ హాక్సే గ్రామం ప్రధానంగా పేదరికం కారణంగానే కిడ్నీ గ్రామంగా మారింది. కిడ్నీలు అమ్మగా వచ్చిన సొమ్ముతో తమ కలల సౌధాలు (సాధారణ ఇళ్లే) కళ్ల ముందే కూలిపోవడంతో ఆడవాళ్లు లోలోనే కుమిలిపోతుండగా, మగవాళ్లు మాత్రం మానసిక ఒత్తిడికి గురై తాగుబోతులుగా మారారు. వాళ్ల దు:ఖానికి ఖరీదుకట్టే షరాబులు లేరక్కడ! భారత్‌కు అవసరమైన కిడ్నీలు సరఫరా చేయడానికి నేపాల్ గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం పెద్ద మార్కెట్‌గా మారిపోయిందని నేపాల్ డాక్టర్లే చెబుతున్నారు. బ్రోకర్లు పాతిక వేల నుంచి లక్షా పాతిక వేల వరకు కిడ్నీ బాధితులకు చెల్లిస్తుండగా, వారు మాత్రం కొనుగోలుదారులకు ఆరున్నర లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కిడ్నీల అక్రమ వ్యాపారం ద్వారా ఏటా ఆరున్నరవేల కోట్ల రూపాయల లాభం సంపాదిస్తున్నారని 'గ్లోబల్ ఫైనాన్సియన్ ఇంటెగ్రిటీ' సంస్థ తెలియజేసింది. ఏటా పదివేల వరకు అక్రమంగా కిడ్నీలను తొలగించే ఆపరేషన్లు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. -
కొండచరియలకు వైద్య దంపతులు బలి
కఠ్మాండు: నేపాల్‌లో ఇద్దరు భారతీయ వైద్య దంపతులు మృత్యువాత పడ్డారు. లుంబినీ జోన్ లో తాము వెళుతున్న కారుపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం డాక్టర్ తరుణ్ దీప్ సింగ్(కంటి వైద్యుడు), అతడి భార్య యశోద కొచ్చర్ (గైనకాలజిస్ట్) బుతావల్ నుంచి పాల్పా వద్ద గల ఆస్పత్రికి వెళుతుండగా బైర్వాడా జిల్లాలోని సిద్ధబాబా ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా కుప్పపోసినట్లుగా బురద, రాళ్లు వారి కారుపై పడ్డాయి. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ వారు తీవ్ర గాయాలవల్ల చనిపోయారు. బుధవారం పలుమార్లు నేపాల్ లో భూమి కంపించడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
నేపాల్‌లో మళ్లీ భూకంపం
కఠ్మాండు: భారీ భూకంపం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ మరోసారి భయం గుప్పిట్లోకి జారుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. కఠ్మాండుకు 65 కిలో మీటర్ల దూరంలోని సింధుపాల్ చౌక్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలు పై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదై కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించి దాదాపు పదివేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
అక్కడ మాంసాహారం నిషిద్ధం..
కఠ్మాండు: తీవ్ర భూకంపంతో నేలమట్టమైన నేపాల్‌లో జంతువులు, పక్షుల వేటను, మాంసాహారాన్ని నిషేధించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని భావించిన కఠ్మాండు ప్రభుత్వం వేటను, మాంసాహారాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాంసాహారం భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, మాంసం, సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నోటీసులు జారీ చేసింది. పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం తామీ నిర్ణయం తీసుకున్నామని కఠ్మాండు జిల్లా అధికారి ఈకె నారాయణన్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 6,600మందిని పొట్టన పెట్టుకున్న భూకంపం లక్షలాదిమందిని క్షతగాత్రులుగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరుస భూకంపాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడిపోయారు. ఆరుబయటే టెంట్లలో కాలం గడుపుతున్నారు. ఎక్కడా చూసినా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అనేక ఏజెన్సీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
సాయం.. కఠ్మాండు లోయకే పరిమితం!
ఇంకా మారుమూల ప్రాంతాలకు చేరని సహాయ బృందాలు నేపాల్ భూకంప బాధితుల్లో ఆగ్రహావేశాలు భక్తపూర్లో నాలుగు నెలల చిన్నారిని రక్షించిన రక్షక దళాలు కఠ్మాండు: నేపాల్‌లో సహాయ, రక్షక చర్యలు కఠ్మాండు లోయకే పరిమితమయ్యాయి. భూకంప తీవ్రత భారీగా ఉన్న గోర్ఖా, ధాడింగ్, సింధుపల్‌చౌక్, కావ్రె, నువాకోట్ జిల్లాల్లో, ముఖ్యంగా మారుమూల పర్వత పాద ప్రాంతాల్లో సాయం కోసం బాధితుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. భారీ వర్షం, విరిగిపడ్తున్న కొండచరియలు, భూకంపం ధాటికి దెబ్బతిన్న రహదారుల కారణంగా సహాయ బృందాలు ఆ ప్రాంతాలకు చేరలేకపోతున్నాయి. వర్షం వల్ల హెలీకాప్టర్లు సహాయ చర్యల్లో పాలుపంచుకోలేకపోతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే నిపుణులు, యంత్ర సామగ్రి కొరత కూడా భారీగా కనిపిస్తోంది. ఇప్పటికీ బాధితులందరికీ అవసరమైన సాయం అందించలేకపోతున్నామని నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజల్ పేర్కొనడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడ్తోంది. భూవిలయంతో సర్వం కోల్పోయి రోడ్డున పడి దాదాపు 5 రోజులవుతున్నా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, తాగునీరు, పాలు మొదలైన నిత్యావసరాలను కూడా అందించలేకపోతోందని మండిపడ్తున్నారు. పలు ప్రాంతాల్లో సహాయ సామగ్రిని, ఆహర పదార్థాలను తీసుకెళ్తున్న వాహనాలపై దాడులు చేసి, నిత్యావసరాలు తీసుకెళ్లిపోతున్నారు. పాకిస్తాన్.. నేపాల్‌కు పశుమాసం ఉన్న ఆహార పదార్థాలు పంపడంతో వివాదం రేగింది. ఆ ఆహారాన్ని తీసుకోవడానికి బాధితులు నిరాకరించారు. భూకంప మృతుల సంఖ్య 10 వేల నుంచి 15 వేల దాకా ఉండొచ్చని నేపాల్ సైనిక దళాల ప్రధానాధికారి గౌరవ్ రాణా పేర్కొన్నారు. మృత్యుంజయులు: శిథిలాల తొలగింపు సందర్భంగా ప్రాణాలతో బయటపడ్తున్న మృత్యుంజయుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 15 ఏళ్ల బాలుడు పెంబ లామాను నువాకోట్ ప్రాంతంలో సహాయ దళాలు కొన్ని గంటల పాటు శ్రమించి రక్షించాయి. భారత్ నుంచి వైమానిక దళ విమానాల్లో ఇప్పటివరకు 314. 6 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు తరలించారు. ఇక ఎవరెస్ట్ పర్వత శిఖరం దగ్గరలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 19 మందిలో 15 మందిని అధికారులు గుర్తించారు. -
విపత్తు మనుషులు
మాధవ్ శింగరాజు నేపాల్ మనకు ప్రత్యేకం. అక్కడికి వెళ్లడానికి వీసా అక్కర్లేదు. పాస్‌పోర్ట్ ఉండనక్కర్లేదు. అందుక్కాదు ప్రత్యేకం. నేపాల్ ఒక దేశంలా ఉండదు. మనింటి పూదోటలా ఉంటుంది. మనం వెళ్లే గుడిలా ఉంటుంది. మనం ఆడుకునే మైదానంలా, మనం ఎక్కిదిగే కొండలా ఉంటుంది. మన శీతాకాలపు వెచ్చదనంలా, మన కునుకుతీతల కావలి నేస్తంలా ఉంటుంది. నేపాల్ స్వతంత్ర దేశం అయితే కావచ్చు. ప్రపంచ దేశాలన్నిటికీ అది సొంత దేశం. టూరిస్ట్ కంట్రీ. నేపాల్ ఎక్కడుందీ అంటే 26-31 డిగ్రీల ఉత్తర అక్షాంశాలకు, 80-89 డిగ్రీల తూర్పు రేఖాంశాలకు మధ్య దక్షిణాసియాలో ఉందని చెప్పగలం. నేపాల్ అందం ఎక్కడుందీ అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేం. అక్కడి లోయల్లోనా, హిమాలయాల్లోనా, మనుషుల్లోనా చెప్పలేం. అయితే నేపాల్ ఇప్పుడు పూదోటలా లేదు. గుడిలానూ, మైదానంలానూ, కొండలానూ లేదు. శిథిల రాజ్యంలానూ లేదు. అలా పడి ఉంది. అంతే. ఎవరైనా వెళ్లి వెచ్చదనం ఇవ్వాలి. ఎవరైనా వెళ్లి ఆసరాగా నిలవాలి. వేల ప్రాణాలు పోయాయి. ప్రాణ సమానమైన సాంస్కృతిక వారసత్వపు కట్టడాలు నేల కూలాయి. ఈ రోజుకీ నేపాలీల గుండెల్లో ప్రకంపనలే! కఠ్మాండు వాలీలోని మూడు దర్బార్ భవంతులు; స్వయంభూనాథ్, బౌద్ధనాథ్లలోని బౌద్ధ స్థూపాలు; పశుపతినాథ్, ఛంగునారాయణ్లలోని హిందూ ఆలయ ప్రాంగణాలు రాళ్ల దిబ్బలుగా మిగిలాయి. అంత పోగొట్టుకున్నా నేపాల్ ‘అందం’గానే ఉంది! కష్టకాలంలో మనిషికి మనిషి అండగా ఉండడంలోని అందం అది!! విపత్తు వచ్చింది. వెళ్లింది. మనిషే మనిషికోసం మిగిలాడు. మనిషే మనిషికోసం పరుగెత్తుకొస్తున్నాడు. విలవిలలాడుతున్న మనిషిని చేతులకెత్తుకుంటున్నాడు. ఆ పక్కనే విలపిస్తూ కూర్చున్న మనిషి భుజం మీద చెయ్యి వేస్తున్నాడు. మంచినీళ్లు అందిస్తున్నాడు. అంబులెన్స్ ఎక్కిస్తున్నాడు. ‘‘గుట్టల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా?’’ అని అరుస్తున్నాడు. నేపాల్ నిండా ఇప్పుడు మనుషులు, మనుషులు, ఒకటే మనుషులు. ప్రభుత్వం ఒక మనిషి. ఆర్మీ ఒక మనిషి. ఎన్జీవో ఒక మనిషి, అమెరికా ఒక మనిషి. ఇండియా ఒక మనిషి. పాకిస్తాన్ ఒక మనిషి. హిమాలయమంత దుఃఖం. ఇప్పట్లో కరగకపోవచ్చు. చల్లబడిన నేపాల్ చేతుల్ని, పాదాల్ని అరిచేతులతో రుద్ది వెచ్చబరుస్తున్నారు ఈ మనుషులంతా కలిసి. జీవితంలోని అందానికి నేపాల్ ఇప్పుడు కొత్త నిర్వచనం. భూకంపాలను రిక్టర్ స్కేళ్లతో కొలవచ్చు. మానవత్వపు సౌందర్యాన్ని కొలిచే స్కేళ్లు మౌంట్ ఎవరెస్టులో ఎవరికైనా, ఎప్పటికైనా దొరుకుతాయేమో చూడాలి. -
ఓవైపు విషాదం...మరోవైపు సెల్ఫీలు
కఠ్మాండు: ఎక్కడికెళ్లినా సెల్ఫీ(స్వీయ చిత్రం)లు క్లిక్ చేసుకోవడం, ఫేస్బుక్, ట్వీటర్ వంటి సైట్లలో పోస్ట్ చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది. ఓవైపు విషాదం చివరికి కఠ్మాండులో భూకంపం వల్ల కుప్పకూలిన చారిత్రక ధారాహర టవర్ వద్ద కూడా ఇప్పుడు సెల్ఫీల గోల మొదలయింది. విషాదమే అయినా.. చారిత్రక సాక్ష్యం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చర్య విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు గూడు చెదిరి, కూడు, గుడ్డతో పాటు గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే నవ్వుతూ సెల్ఫీలు తీసుకోవసం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
కఠ్మాండు కదిలినా.. ఎవరెస్టు తగ్గలే
సిడ్నీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించి అక్కడి కఠ్మాండు నగరం మూడు మీటర్లు పక్కకు జరిగినా దానికి పక్కనే ఉండి భూకంప ప్రభావానికి గురైన ఎవరెస్టు పర్వతం ఎత్తు మాత్రం ఏమాత్రం తగ్గలేదని, చెక్కు చెదరకుండా ఉందని ఆస్ట్రేలియా పర్వత నిపుణులు తెలిపారు. 80 ఏళ్లలోనే అత్యంత పెను భీభత్సంగా మారి రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీనివల్ల భారీ భవనాలన్ని కూడా మొదలు నరికినా చెట్ల మాదిరిగా పడిపోయాయి. హిమాలయ పర్వతాల్లో మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ భూకంపంపై ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్లేషణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరెస్టు శిఖరాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ నిపుణులు దాని ఎత్తు తగ్గిపోలేదని నిర్ధారించారు. అయితే, ఇది శాటిలైట్ ఆధారంగా వచ్చిన డేటా మాత్రమేనని, కొద్ది రోజులు ఆగితేగానీ అసలు విషయం తెలియబోదని వివరించారు. -
భూకంప మృతులు 4 వేలు
-
నేపాల్‌కు అండగా నిలవాలి ట్విటర్లో వైఎస్ జగన్
హైదరాబాద్: నేపాల్ భూకంపం ప్రజలకు తీరని వేదనను మిగిల్చిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆపత్కాలంలో భారత్.. నేపాల్‌కు అండగా నిలవాలని, అన్ని విధాలా సాయపడాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు సోమవారం భారత పార్లమెంట్ సంఘీభావం ప్రకటించింది. మృతులకు నివాళులర్పించింది. సహాయ చర్యల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ ఎంపీలు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు భారత్ వచ్చేందుకు వీసాలిస్తామని భారత్ ప్రకటించింది. నేపాల్‌ను అన్ని రకాలా ఆదుకుంటామంది. నేపాల్‌కు సాయం చేయడానికి తక్షణమే స్పందించిన ప్రభుత్వాన్ని, మోదీని పలువురు ఎంపీలు ప్రశంసించారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్ర మహాజన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూకంపం వల్ల నేపాల్‌లో, భారత్‌లో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. సభ్యులంతా నిల్చుని మృతులకు నివాళిగా కాసేపు మౌనం పాటించారు. రాజ్యసభలోనూ సభ్యులు నివాళులర్పించారు. ఈ బాధాకర సమయంలో పొరుగుదేశానికి సాయంగా నిలవడం ప్రశంసనీయమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఉభయ సభల్లోనూ భూకంపంపై, ఆ విపత్తును ఎదుర్కొనే సన్నద్ధతపై చర్చ జరిగింది. -
కన్నీటి కఠ్మాండు..!
న్యూఢిల్లీ: ఎటు చూసినా మట్టి దిబ్బలు.. ఎవరిని కదిపినా కన్నీటి గాథలు.. కన్నవారిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఓ అభాగ్యుడు.. శిథిలమైన ఇంటి ముందు దీనంగా కూర్చున్న ఓ వృద్ధుడు.. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులు.. కాసిన్ని నీళ్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు..! శిథిల నగరి కఠ్మాండులో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ!! పెను భూకంపం వచ్చి మూడ్రోజులు గడిచిపోతున్నా ఇక్కడి ప్రజలు ఇంకా భయం నీడనే బతుకులీడుస్తున్నారు. భూకంపం మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. టార్పాలిన్ గుడారాలు వేసుకొని ఆరుబయటే కాలం వెళ్లబుచ్చుతున్నారు. అన్నపానీయాలు దొరకడం గగనమైపోయింది. చంటిబిడ్డలున్న తమకు పాల ప్యాకెట్లు కూడా దొరకడం లేదని మహిళలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక్క మంచి నీళ్ల బాటిల్ కొనాలంటే రూ.50 వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక భోజనానికి వందల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో కూరగాయలు కూడా అందుబాటులో లేవు. ఇళ్లు విడిచి అందరూ గుడారాలు వేసుకుంటుండడంతో టార్పాలిన్ ధరలు సైతం మూడు రెట్లు పెరిగిపోయాయి. చాలా మందికి ఫుట్‌పాత్‌లే ఆవాసాలయ్యాయి. స్నానాలు, భోజనం, నిద్ర అంతా ఫుట్‌పాత్‌లపైనే! పశుపతినాథ్ ఆలయాన్ని ఆనుకొని ఉన్న నదీ తీరంలో సామూహిక అంత్యక్రియలు జరుపుతున్నారు. సోమవారం దాదాపు 200 మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహించారు. క్షతగాత్రులకు వైద్యులు రోడ్లపైనే చికిత్స అందజేస్తున్నారు. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో డాక్టర్లు, రోగులు ఆసుపత్రుల గదుల్లోకి వెళ్లడం లేదు. కఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వద్ద తెలుగువారు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమను సొంత రాష్ట్రానికి చేర్చే ఏర్పాట్లు చేయడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని విజయవాడకు చెందిన సత్యనారాయణ కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. -
భూకంప మృతులు 4 వేలు
నేపాల్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు; మృతుల సంఖ్య 5 వేలకు చేరే అవకాశం నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న బాధితులు భూప్రకంపనలతో ప్రాణభయంతో ప్రజలు ఆరుబయట ప్లాస్టిక్ టెంట్లలోనే జీవనం; సాయం కోసం ఎదురుచూపులు అంతర్జాతీయ సాయం కోసం వేడుకోలు సహాయ చర్యల్లో ముమ్మరంగా భారత్ బృందాలు నేపాల్ చేరిన భారత సామగ్రి కఠ్మాండు: నేపాల్‌లో విలయం మిగిల్చిన విషాదం కొనసాగుతోంది. భూకంప మృతుల సంఖ్య సోమవారం నాటికి దాదాపు 4 వేలకు, క్షతగాత్రుల సంఖ్య 7 వేలకు చేరింది. ఒక్క కఠ్మాండు లోయలోనే సుమారు 11 వందల మంది మృత్యువాత పడ్డారు. వారిలో అసోంకు చెందిన 8 మంది మహిళలు కూడా ఉన్నారు. సింధుపాల్ చౌక్‌లో 875 మంది చనిపోయారు. సహాయ బృందాలు చేరని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పర్వతప్రాంతాల్లోని చిన్న చిన్న జనావాసాలు మంచుచరియల కింద కూరుకుపోయాయి. భూకంపం వచ్చి దాదాపు 3 రోజులు కావస్తుండటంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే పరిస్థితి నెలకొంది. దాంతో మృతుల సంఖ్య 5 వేలు దాటొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంటువ్యాధుల భయంతో మృతులకు అధికారులు సామూహిక దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ స్థాయి భారీ విలయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం లేని నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోసం అర్థిస్తోంది. సహాయ చర్యల నిపుణులు, వైద్యులు, ఔషధాలు, టెంట్లు, దుప్పట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, తాగునీరు, ఇంధనం.. మొదలైన నిత్యావసరాలను పంపించాలని కోరుతోంది. సహాయ చర్యల్లో పాలుపంచుకునే హెలీకాప్టర్లు, ఇతర వాహనాలు కూడా ప్రభుత్వం వద్ద పరిమితంగానే ఉన్నాయి. నేపాల్‌లో ఆహారం, తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, దాదాపు 10 లక్షల మంది చిన్నారులకు తక్షణం మానవతాసాయం అవసరమని ఐక్యరాజ్య సమితి సంస్థలు పేర్కొన్నాయి. సాయం అందిస్తూ.. అనేక దేశాల నుంచి వచ్చిన రక్షక నిపుణులు, సహాయ బృందాలు, వైద్యులు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. పలు దేశాలు భారీగా సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. వర్షంతో పాటు నిలిచిపోయిన విద్యుత్, రవాణా, సమాచార సౌకర్యాలు సహాయ చర్యలను ఆటంకపరుస్తున్నాయి. స్వదేశం కోసం వెళ్లేందుకు బారులు తీరిన బాధితులు, వివిధ దేశాల నుంచి పలు విమానాల్లో భారీగా వస్తున్న సహాయ సామగ్రితో కఠ్మాండులోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. భారత్ ఆపన్నహస్తం.. పొరుగుదేశం నేపాల్‌కు ఆపన్న హస్తం అందించడంలో భారత్ ముందుంది. జాతీయ విపత్తు స్పందన దళానికి(ఎన్డీఆర్ఎఫ్) చెందిన 10 బృందాలు, 13 సైనిక విమానాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఓపీ సింగ్ నేపాల్‌కు వెళ్లి స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం వైద్య సేవలందిస్తోంది. మరింతమంది నిపుణులను, సిబ్బందిని, సహాయ సామగ్రిని పంపించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 011-1078 నంబర్‌తో ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నేపాల్నుంచి సోమవారం రాత్రి వరకు 30 మంది విదేశీయులు, 5370 మంది భారతీయులు భారత్ చేరుకున్నారు. -
నేపాల్ భూకంపం దృశ్యాలు
-
ఇళ్లలోకి వెళ్లాలంటే భయం..వణికిపోతున్నారు!
కఠ్మాండు: నేపాల్‌లో రెండు రోజుల పాటు గంటగంటకు భూమి కంపిచండంతో ఇక్కడి ప్రజలు తమ ఇళ్లోకి వెళ్లాంటే భయపడుతున్నారు.వణికిపోతున్నారు. ఇళ్లలో ఉండలేని పరిస్థితి వారిది. పార్కులలో, ఆరుబయట డేరాలలోనే ఉంటున్నారు. నేపాల్ నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్ అందించిన వివరాల ప్రకారం నేపాల్‌లో పరిస్థితి దయనీయంగా ఉంది. చాలా చోట్ల మంచినీరు కూడా దొరకడంలేదు. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్దరించలేదు. చాలా చోట్ల జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను అందిస్తున్నారు. వాటితోనే మొబైల్స్‌ను రీఛార్జి చేసుకుంటున్నారు. ఎప్పుడు, ఎక్కడ మళ్లీ భూకంపం వస్తుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. శిథిలాలు తొలగించే ప్రక్రియ 25శాతం కూడా పూర్తి కాలేదు. ఈ దేశంలో 90 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలేదు. స్థానిక మార్కెట్లు అన్నిటినీ మూసివేశారు. తోపుడుబండ్లపై కొన్ని నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారు. వేలాది మంది భారతీయులు ఇంకా నేపాల్‌లోనే ఉన్నారు. కఠ్మాండు విమానాశ్రయం వద్ద పడిగాపులు గాస్తున్నారు. విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ సెక్యూరిటీ తప్ప ఇతర సిబ్బంది లేరు. టిక్కెట్ల కోసం భారీ క్యూలు ఉన్నాయి. కఠ్మాండులోని భారత రాయభార కార్యాలయం కూడా దెబ్బతింది. సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. కఠ్మాండు విమానాశ్రయం వద్ద టిక్కెట్ల కోసం బారులుతీరిన యాత్రికులు -
నేపాల్‌లో 3700కు చేరిన మృతులు
న్యూఢిల్లీ/కఠ్మాండు: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపాల ధాటికి ఇప్పటివరకు 3 వేల 700 మంది మృతి చెందారు. 6 వేల 833 మంది గాయపడ్డారని నేపాల్ హొం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భూకంపం వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కఠ్మాండులో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆపరేషన్ ప్రారంభమైంది. భూటాన్ ప్రధాన మంత్రి త్షేరింగ్ తోబ్గాయ్ కఠ్మాండులో పర్యటిస్తున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాలలో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక నానా అవస్తలు పడుతున్నారు. మార్కెట్లు అన్నీ మూసివేశారు. కొందరు తోపుడు బండ్లపైన కొన్ని వస్తువులు అమ్ముతున్నారు. నేపాల్‌లో ఇంకా 90 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలేదు. ఇదిలా ఉండగా, నేపాల్ భూకంపంలో అస్సాంకు చెందిన ఏడుగురు పర్యాటకులు మృతి చెందినట్లు కేంద్ర మంత్రి సోనోవల్ చెప్పారు. నేపాల్ భూకంప బాధితులకు సీపీఎం పది లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. -
మహా పర్వతంపై మంచు చరియలు
-
కళ్ల ముందే ప్రళయం!
⇒ భూకంపం నుంచి బయటపడినవారి చేదు జ్ఞాపకాలు ⇒ క్షణమొక యుగంలా గడిపామంటూ ఉద్వేగం కఠ్మాండు/న్యూఢిల్లీ: కళ్ల ముందే పేకమేడలా కూలిపోతున్న భవనాలు.. శిథిలాల నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు.. క్షణక్షణం భయభ్రాంతులకు గురిచేసిన ప్రకంపనలు.. వెరసి ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూశామంటూ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు భూకంపం నుంచి బయటపడినవారు! రాత్రంతా నిద్ర లేకుండా క్షణమొక యుగంగా గడిపామని చెబుతున్నారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి తీర్థయాత్రలకు, పర్యాటకులుగా నేపాల్ వెళ్లినవారంతా తమ అనుభవాలను చెబుతూ వణికిపోతున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న 150 మందిలో కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. చనిపోతామనుకున్నాం..: లలిత ‘‘ పశుపతి నాథ్ ఆలయం సందర్శించిన తర్వాత అక్కడి షాపుల్లో వస్తువులు కొంటున్నాం. అప్పుడే భూకంపం వచ్చింది. 30 సెకన్లపాటు భూమి తీవ్రంగా ఊగింది. కళ్లముందే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ప్రాచీన కట్టడాలు పేకమేడల్లా కూలిపోవడం చూసి వణికిపోయాం. నేను నా భర్త, పిల్లల్ని గట్టిగా పట్టుకొని పరుగెత్తాం. అప్పటికీ నా భర్తకు ఇటుకలు తగిలి గాయపడ్డారు. ఎలాగో అలా ఇద్దరు పిల్లలతో బయటపడ్డాం’’ 12 మందిని కాపాడాం: ఢిల్లీకి చెందిన వైద్యుడు ‘‘నేను, నా భార్య ఇద్దరం వైద్యులం. కఠ్మాండులో ఉంటున్నాం. భూకంపం రావడంతో మూడడుగుల దూరం వరకు పడిపోయాం. వెంటనే బయటకు వచ్చేశాం. మా ముందే ఇల్లు కూలిపోయింది. శిథిలాల నుంచి రక్తమోడుతున్నవారిని బయటకు తీసి చికిత్స అందేజేశాం. దాదాపు 12 మందిని అలా కాపాడాం’’ సాధువులు కాపాడారు: పంకజ్ అహూజా, వారణాసి ‘‘మేం కఠ్మాండులోని స్వయంభునాథ్ కాంప్లెక్స్‌లో ఉండగా భూకంపం వచ్చింది. బయటకు పరుగెత్తాం కానీ అప్పటికే ద్వారం కూలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపటికి కొందరు సాధువులు వచ్చి బయటకు తేవడంతో ప్రాణాలతో బయటపడ్డా. రూ.7 వేలు చెల్లించి ట్యాక్సీ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడ్నుంచి భారత్ ఏర్పాటు చేసిన విమానంలో వచ్చాం’’ -
‘ఆపరేషన్ మైత్రి’ ముమ్మరం
నేపాల్‌లో భారీస్థాయిలో భారత్ సహాయక చర్యలు న్యూఢిల్లీ: భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకోవడానికి ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో చేపట్టిన సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరం చేసింది. ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు. ఢిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. సహాయచర్యల సమన్వయానికి హోం శాఖ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించనుందన్నారు. నేపాల్ నుంచి శనివారం 546, ఆదివారం 504 మందిని భారత్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ప్రమాద ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఇతర దేశస్తులను కూడా మన బృందాలు రక్షిస్తున్నాయన్నారు. భూకంపం తర్వాత వచ్చే చిన్న ప్రకంపనల వల్ల కఠ్మాండు ఎయిర్‌పోర్టును చాలా సేపు మూసివేయడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని చెప్పారు. పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు కఠ్మాండుకు పంపినట్లు వెల్లడించారు. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించామన్నారు. నేపాల్‌లో వర్షాలతో పాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, భారీగా హిమపాతానికి ఆస్కారం ఉందని ఐఎండీ డీజీ ఎల్ఎస్ రాథోర్ తెలిపారు. భూ అంతర్భాగంలోని ప్లేట్ల సర్దుబాట్ల వల్ల మరికొన్ని వారాలు, నెలలు లేదా ఏళ్ల పాటు భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం ప్రధాన భూకంపం అనంతరం 46 ఆఫ్టర్‌షాక్స్ వచ్చాయని తెలిపారు. వీటిలో చాలామటుకు రిక్టర్ స్కేల్‌పై 4 నుంచి 6గా నమోదయ్యాయని, వాటిల్లో ఒకటి 6.9గా, మరోటి 6.6గా స్కేల్‌పై నమోదైందని తెలిపారు. -
10 అడుగులు కదిలిన కఠ్మండు
కఠ్మాండు: భారీ భూకంపం ధాటికి నేపాల్ రాజధాని కఠ్మాండు నగరం విలయాన్ని చవిచూడటమే కాదు.. ఏకంగా పది అడుగులు దక్షిణం వైపునకు కదిలిపోయిందని నిపుణులు వెల్లడించారు. కఠ్మాండు ఉన్న ప్రదేశమే దాని పాలిట శాపంగా మారిందని వారు చెబుతున్నారు. అదేవిధంగా భౌగోళిక పరిస్థితి దృష్ట్యా నేపాల్‌కు భూకంపాలు అనివార్యమని, ప్రతి 75 ఏళ్లకోసారి అక్కడ భూ విలయం జరిగే అవకాశముందని అంటున్నారు. నిపుణులు ఇంకా ఏమంటున్నారంటే... ‘నాలుగు కోట్ల ఏళ్ల క్రితం భారత ఉపఖండం ఒక ప్రత్యేక ద్వీపం. ప్రస్తుతం హిమాలయాలు ఉన్న ప్రదేశానికి దక్షిణాన ఐదు వేల కి.మీ. దూరంలో భారత్ ఉండేది. ఖండచలనం వల్ల భారత ఉపఖండం ఉన్న భూ ఉపరితలం(క్రస్ట్) భాగం కాలక్రమంలో ఆసియా వైపు కదిలింది. చివరికి ఇండియన్, యురేసియా టెక్టానిక్ ప్లేట్లు(భూ ఫలకాలు) రెండూ పరస్పరం ఢీకొన్నాయి. వాటి మధ్య ఢీ నేటికీ కొనసాగుతోంది’ అని అహ్మదాబాద్‌లోని భూకంప పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, అమెరికాలోని ‘జియోహజార్డ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ నిపుణులు వెల్లడించిన వివరాలు... ⇒ టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఉండటం వల్ల కఠ్మాండు సమీపంలోని భూభాగం తీవ్రంగా ప్రకంపనలకు గురి అయింది. ⇒ పురాతన కాలంలో సరస్సు ఉన్న చోటే ఇప్పుడు కఠ్మాండు ఉన్నందున భూకంపం ధాటికి ఆ మట్టిపొరలు సులభంగా కదిలాయి. ⇒ తాజా భూకంపం వల్ల మొత్తం నగరం దక్షిణం వైపుగా పది అడుగులు ముందుకు కదిలింది. నేపాల్ కు భారీ వర్షాల ముప్పు న్యూఢిల్లీ: భూకంప ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలతో పాటు మట్టి చరియలు జారిపడవచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కఠ్మాండుతో పాటు నేపాల్ తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. భారత్‌లో బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలకు ఆస్కారముందని తెలిపింది. వారం క్రితమే కఠ్మాండుకు నిపుణులు కఠ్మాండు: నేపాల్‌కు భారీ భూకంప ముప్పు ఉందని ముందే అంచనా వేసినందున.. భూకంపాన్ని ఎదుర్కోవడంలో అక్కడి పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్నది అధ్యయనం చేసేందుకుగాను 50 మంది అంతర్జాతీయ నిపుణులు వారం క్రితమే కఠ్మాండుకు చేరుకున్నారు. ‘ఎర్త్‌క్వేక్స్ వితౌట్ ఫ్రంటియర్స్’ గ్రూపునకు చెందిన వివిధ దేశాల భూకంప శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు వారిలో ఉన్నారు. రద్దీగా, ఇరుకిరుకు ఇళ్లలో నివసిస్తున్న నేపాల్‌లోని పేద ప్రజలను భూకంప సన్నద్ధులను చేయడంపై వారు చర్చలు జరిపారు. అయితే, ఇంతలోనే భూకంపం విలయం సృష్టించింది. -
ఎవరెస్టు వద్ద 217 మంది గల్లంతు?
మహా పర్వతంపై మంచు చరియలు విరిగిపడి 22 మంది మృతి ⇒ 60 మందికి గాయాలు.. సహాయం కోసం వందల మంది నిరీక్షణ ⇒ ఆదివారం నాటి భూ ప్రకంపనలతో మళ్లీ కూలిన మంచుదిబ్బలు కఠ్మాండు: భూగోళంపై మహా పర్వతమైన ఎవరెస్ట్ సైతం శనివారం నాటి పెను భూకంపానికి వణికిపోయింది. పర్వతం పై నుంచి భారీ మంచు చరియలు విరిగిపడటంతో.. నేపాల్ వైపున గల బేస్ క్యాంపుల్లో ఉన్న పర్వతారోహకుల్లో 22 మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 217 మంది ఆచూకీ తెలియటం లేదు.విదేశీయలతో సహా వందలాది మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుబడి ఉన్నారు. ఆదివారం నాటి తీవ్ర భూప్రకంపనల కారణంగా కూడా ఎవరెస్ట్‌పై మళ్లీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ చిక్కుబడి ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. వారిని రక్షించటానికి, తరలించటానికి మరికొంత సమయం పడుతుందని నేపాల్ మౌంటెయినీరింగ్ అసోసియేషన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. అయితే.. ఎవరెస్ట్ పర్వతానికి టిబెట్ వైపున బేస్ క్యాంపుల్లో 400 మంది పర్వతారోహకులు క్షేమంగా ఉన్నారని చైనా అధికారులు తెలిపారు. వారిలో చాలా మంది పర్వతం దిగిపోయారని, ఇంకొంత మంది దిగుతున్నారని చెప్పారు. మొత్తం 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శిఖరం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా వందలాది మంది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వస్తుంటారు. నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ అధికారుల అంచనా ప్రకారం.. శనివారం నాటి పెను భూకంపం వచ్చి, ఎవరెస్ట్‌పై మంచు చరియలు విరిగిపడినప్పుడు.. నేపాల్ వైపు బేస్ క్యాంప్ వద్ద 400 మంది విదేశీయులతో సహా దాదాపు 1,000 మంది పర్వతారోహకులు ఉన్నారు. మంచు చరియలు బేస్ క్యాంపులోని ఒక భాగాన్ని ముంచేశాయి. బేస్ క్యాంప్ వద్ద 17 మంది చనిపోగా.. క్యాంపు దిగువు ప్రాంతాల్లో మరో ఐదుగురు చనిపోయారు. ఈ విపత్తులో 60 మంది పర్వతారోహకులు గాయపడ్డారు. ఇంకా చాలా మంది విదేశీ పర్వతారోహకులు, వారి సహాయకులు, మార్గదర్శకులు ఈ మంచు కింద సమాధి అయివుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 22 మందిని భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు ఐదు విడతల్లో తరలించాయి. కొందరిని కఠ్మాండుకు తరలించారు. ఎవరెస్ట్ వద్ద బస చేసివున్న భారత సైనిక పర్వతారోహణ బృందం బేస్ క్యాంప్ వద్ద (17,500 అడుగుల ఎత్తులో) క్షేమంగా ఉందని.. శనివారం మంచు చరియల్లో చనిపోయిన 13 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సాయపడిందని భారత సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.ఏడు ఖండాల్లోని అన్ని అతి పెద్ద పర్వతాలనూ అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ పర్వతారోహకుడు అంకుర్ బహల్ (54), ఆయన సహ పర్వతారోహకులు మరో 15 మంది ఎవరెస్ట్ పర్వతంపై రెండో క్యాంపు వద్ద చిక్కుకుపోయారు. ఎవరెస్ట్‌పై గూగుల్ ఉద్యోగి మృతి ఎవరెస్ట్ పర్వతంపై మంచుచరియలు విరిగిపడడంతో గూగుల్ ఉద్యోగి డాన్ ఫ్రెడిన్బర్గ్ శనివారం మరణించారు. ఈయన గూగుల్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్రైవర్ లేని కారు’ ప్రాజెక్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. ఈయనతోపాటున్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. -
30 గంటల్లో 25 సార్లు కంపించిన భూమి!
ఖాట్మండు: నేపాల్‌లో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. క్షతగాత్రులను చూస్తుంటే మనసు కదిలిపోయిందని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఎంతో బాధతో చెప్పారు. నిన్న, ఈరోజు తెల్లవారుజామున వరుసగా అనేకసార్లు భూమి కంపించింది. గత 30 గంటల్లో నేపాల్‌లో 25 సార్లు భూమి కంపించింది. నేపాల్‌కు భవిష్యత్తులో భారీ భూకంపాల ముప్పు ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాజీ అధ్యక్షుడు హరీష్ గుప్తా చెప్పారు. నేపాల్ శిథిలాల నుంచి మృతదేహాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ఒక్క నేపాల్ లోయలోనే వెయ్యి మంది చనిపోయినట్లు సమాచారం. మొత్తం 2123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఎవరెస్ట్ శిఖరంపై 18 మంది చనిపోయారు. భారత్‌లో భూకంపం దాటికి 67 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి కుటుంబాలకు మోదీ ప్రభుత్వం 2 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. నిన్న వచ్చిన భూకంపానికి నేపాల్ భూమి దద్దరిల్లింది. హిమాలయ పాదాల చెంత భారీ భూకంపం వస్తుందని హెచ్చరికలు నిజం చేస్తూ నిన్న విరుచుకుపడిన భూకంపానికి నేపాల్ నరకంగా మారింది. నేపాల్‌కు మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హరీష్ గుప్తా చెప్పారు. ఖట్మాండు నడిబొడ్డున ఠీవీగా తలెత్తుకొని కనిపించే రెండు శతాబ్దాల చరిత్ర గల కట్టడం దర్హారా టవర్ మరుభూమిలా మారిపోయింది. ఎంతో చారిత్రాక నేపధ్యం ఉన్న ఈ టవర్ భూకంపంలో పూర్తిగా నేలమట్టమైంది. తొమ్మిది అంతస్తుల దర్హారా కట్టడం కళ్లముందే కాలగర్భంలో కలిసిపోయింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా కోసం నిర్మించిన దర్హారా టవర్ నగరానికే ప్రధాన ఆకర్షణగా ఉండేది. 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్సేన్ తపా ఆధ్వర్యంలో నిర్మాణమైన దర్హారా టవర్‌ను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే ఇంత ఘనచరిత్ర ఉన్న శిఖరం ఇపుడు తుడిచిపెట్టుకుపోయింది. -
ఖాట్మండు నుంచి తిరిగి వచ్చిన భారత్ విమానాలు
న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన నేపధ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఖాట్మండు వెళ్లిన భారత్ విమానాలు వెనక్కు తిరిగి వచ్చాయి. నేపాల్‌లో మరోసారి భూకంపం రావడంతో విమానాశ్రయంలోని అధికారులు ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బందిని ఖాళీ చేయించారు. దాంతో భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు ఖాట్మండులో ల్యాండ్ కాకుండానే తిరిగి వచ్చాయి. నేపాల్‌లో మరోసారి భూమి కంపించడంతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి వారంతా మరోసారి తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇది సంభవించినట్లు తెలిపారు. -
నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు
ఖాట్మండు: నేపాల్‌లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసిన ఘటన మరవకముందే భూమి మరోసారి కంపించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పలుచోట్ల మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఇప్పటికే నేలమట్టమైన ప్రదేశాల్లో శిధిలాలను తొలగించే దిశగా నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ సహాయక చర్యల్లో 40మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 50మంది వైద్యులు పాల్గొన్నారు. నేపాల్‌కు 3 టన్నుల మెడిసిన్స్, సహాయ సామాగ్రిని భారత్ పంపినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భారతీయుల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో ఇప్పటికే 103మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 200మందికి పైగా మృతదేహాలు వెలికితీసినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
భారత్‌లోనూ భారీ విధ్వంసం
* భూకంపం ధాటికి దేశవ్యాప్తంగా 51 మంది మృతి; * 237మందికి పైగా గాయాలు * బిహార్‌లో 38 మంది, యూపీలో 11 మంది, పశ్చిమబెంగాల్లో ఇద్దరు మృత్యువాత * యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు; స్వయంగా సమీక్షించిన ప్రధాని * నేపాల్‌కు భారత్ తక్షణ సాయం; ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సామగ్రితో బయల్దేరిన 4 విమానాలు * నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం పంపేందుకు ప్రయత్నాలు న్యూఢిల్లీ: పొరుగుదేశం నేపాల్‌లో దారుణ విధ్వంసం సృష్టించిన తీవ్ర భూకంపం భారత్‌ను కూడా కుదిపేసింది. ముఖ్యంగా నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బిహార్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో భూకంపం వల్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనల్లో 23 మంది మరణించగా, 48 మంది గాయాలపాలయ్యారు. ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు సహా పలు ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో శనివారం నేపాల్‌ను దాదాపు నేలమట్టం చేసిన భూకంపం ప్రభావం కఠ్మాండుకు 1,100 కిమీల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. మొత్తంమీద భూకంపం ధాటికి భారత్‌లో 38 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. వాటిని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ అధ్యక్షుడు రాం బరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలకు ఫోన్ చేసి భారత్ తరఫున తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, భారత్‌లోని ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్‌కు, దేశంలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే రక్షణ, సహాయ సిబ్బందిని.. పునరావాస సామగ్రిని పంపించాలని ఆదేశించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులను సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం రాత్రి సీ 130 విమానంలో దాదాపు 250 మంది భారతీయులు ఇండియా చేరుకున్నారు. తక్షణం స్పందించిన భారత్ నేపాల్‌లో జరిగిన భూ విలయంపై భారత్ తక్షణం స్పందించింది. ఒక సీ 130 విమానం సహా నాలుగు విమానాల్లో సహాయ సామగ్రిని, జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన(ఎన్డీఆర్ఎఫ్) రక్షక సిబ్బందిని కఠ్మాండుకు తరలించింది. భారత్‌లోని నేపాల్ దేశీయుల కోసం విదేశాంగ శాఖ ఒక 24 గంటలపాటు పనిచేసే ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ.. భూకంపం సృష్టించిన విధ్వంసం, నేపాల్‌కు అందిస్తున్న సాయం, భారత్‌లోని ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టిన సహాయక చర్యలు.. తదితరాలపై సమీక్షించారు. నేపాల్ అభ్యర్థనపై కొన్ని ఇంజినీరింగ్ బృందాలను, వైద్య బృందాలను, మొబైల్ ఆసుపత్రులను పంపిస్తున్నామని విదేశాంగశాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఖట్మండూ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన విమానాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. కఠ్మాండులోని ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ని ప్రస్తుతం మూసేశారని, దాన్ని పునఃప్రారంభించగానే కఠ్మాండుకు విమాన సేవలు మొదలవుతాయని చెప్పారు. కఠ్మాండు విమానాశ్రయం మూతపడటంతో కఠ్మాండు వెళ్లాల్సిన అన్ని అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి, కఠ్మాండుకు దగ్గర్లోని విమానాశ్రయాలకు మళ్లిస్తున్నామన్నారు. భారత్ స్పందనపై నేపాల్ కృతజ‘తలు తెలిపింది. నేపాల్నుంచి 55 మంది భారత్‌కు భారతీయ వైమానిక దళానికి చెందిన సీ 130 జే విమానం శనివారం రాత్రి నేపాల్ నుంచి55 మంది భారతీయులను ఢిల్లీకి చేర్చింది. వారిలో నలుగురు చిన్నారులున్నారు. భారత్ నుంచి జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని, సహాయ సామాగ్రిని నేపాల్‌కు పంపించి, అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావడం కోసం ఈ విమానంతో పాటు మరో రెండు ఐఏఎఫ్ విమానాలను(ఐఎల్ 76, సీ 17) ఖట్మాండూ పంపించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. భారత్ నుంచి శనివారం మధ్యాహ్నం కఠ్మాండు వెళ్లిన ఐఎల్ 76లో 153 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 28 టన్నుల సహాయ సామగ్రిని పంపించగా, సీ17లో 96 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 15 టన్నుల సహాయ సామగ్రిని పంపించారు. ఈ రెండు విమానాలు కూడా నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో ఆదివారం ఉదయం వరకు ఢిల్లీ చేరుకునే అవకాశముంది. ప్రముఖుల ప్రార్థనలు నేపాల్‌కు అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి,ప్రాణ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప బాధితుల కోసం ప్రార్థించానని సోనియా తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అత్యంత కనిష్టంగా ఉండాలని భావిస్తున్నానన్నారు. భూకంపం బారిన పడిన నేపాల్, భారత్‌లకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. సిక్కింలో విరిగిపడ్డ కొండ చరియలు తమిళనాడు, పుదుచ్చేరీ తమిళనాడు, పుదుచ్చేరీల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. సరిగ్గా ఉదయం 11.45 గంటల సమయంలో చెన్నై నగరంలోని కోడంబాక్కంలో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో భూకంపంగా గుర్తించి ప్రజలు బైటకు పరుగులు తీశారు. వడపళని, మైలాపూర్, అంబత్తూరు గిండిలో ఎక్కువగా నివాస ప్రాంతాలు కావడంతో అపార్టుమెంట్లలో నివసించే కుటుంబాలు బయటకు పరుగులు పెట్టారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. బిహార్ నిన్నటివరకు వరదలు, తాజాగా భూకంపం బిహార్‌ను అతలాకుతలం చేశాయి. ఈ నేపాల్ సరిహద్దు రాష్ట్రంలో భూకంపం విధ్వంసానికి తూర్పు చంపారన్ జిల్లాలో ఆరుగురు, సీతామర్హిలో నలుగురు, దర్భంగ జిల్లాలో ఇద్దరు సహా మొత్తం 23 మంది బలయ్యారు. పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్లో ముగ్గురు చనిపోగా, 43 మంది పాఠశాల విద్యార్థులు సహా 69 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి డార్జిలింగ్‌లో ఇద్దరు, జల్పైగురిలో ఒకరు చనిపోయారు చనిపోగా, మాల్దా జిల్లాలో భవనాలు కూలిన 69 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ భూకంపం వల్ల ఉత్తరప్రదేశ్‌లో 12 మంది చనిపోయారు. డజనుమందికి పైగా గాయపడ్డారు. బారాబంకి జిల్లాలో ముగ్గురు, గోరఖ్‌పూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు, సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒకరు మరణించారు. -
భూవిలయం నేపాల్ నేలమట్టం
నేపాల్‌లో పెను భూకంపం.. 1,500 మందికిపైగా మృతి రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.9 భారత్ లో 51 మంది మృతి ► వేలాది మందికి గాయాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు ► మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ► వణికిపోయిన కఠ్మాండు.. ఆస్తి, ప్రాణనష్టం ఇక్కడే ఎక్కువ ► ఎటు చూసినా మట్టి దిబ్బలు.. మొండి గోడలు.. చీలిన దారులు ► రోడ్డు, రవాణా, సమాచార వ్యవస్థలు ఛిన్నాభిన్నం ► దర్హారా టవర్ నేలమట్టం.. శిథిలాల కింద 200 మంది మృతి ► తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ వారసత్వ సంపద ‘దర్బార్ స్క్వేర్’ ► పలు ఆలయాలు ధ్వంసమైనా చెక్కుచెదరని పశుపతినాథ్ ఆలయం ► ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రకంపనలు ► చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనూ ప్రభావం నేపాల్ గుండె చెదిరింది! కాళ్ల కింది నేలే కాలరేకపై కన్నీళ్ల చరిత్రను లిఖించింది! హిమాలయ రాజ్యాన్ని మృత్యువులా చుట్టుముట్టి నిలువునా వణికించింది. ప్రకృతి ఒడిలో ఒద్దికగా ఒదిగిన దేశం పంచప్రాణాలను పిండేసింది. పుడమితల్లి ప్రకోపంలో 1,500 మందికి పైగా ప్రాణాలు మట్టి దిబ్బల కింద ముగిసిపోయాయి. నేపాల్‌లో గత 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఘోర విపత్తు ఇది!! భూకంప ధాటికి చారిత్రక భవనాలు నామరూపాల్లేకుండా కూలిపోయాయి. జనావాసాలు మొండి గోడల్లా మిగిలిపోయాయి. శిథిలాల కింద నలిగి వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప కోరలు భారత్‌కూ విస్తరించాయి. వివిధ రాష్ట్రాల్లో 51 మంది చనిపోయారు. బిహార్‌లోనే 23 మంది మృత్యువాత పడ్డారు. నేపాల్‌లో మట్టి దిబ్బల కింద నుంచి అభాగ్యుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. శనివారం నేపాల్ రాజధాని కఠ్మాండుకు 80 కిలోమీటర్ల దూరంలోని లమ్జంగ్ కేంద్రంగా పెను భూకంపం మిగిల్చిన విషాద ఛాయలివి! కఠ్మాండు: నేపాల్‌లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసింది. ఉదయం సరిగ్గా 11.56 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. 1934లో నేపాల్-బిహార్ సరిహద్దుల్లో 8.4 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత మళ్లీ అంతటిస్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి. మొదటిసారి భూమి కంపించిన తర్వాత కూడా వెంట వెంటనే వచ్చిన ప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. 4.5, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 25 సార్లు భూమి కంపించింది. ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత నేపాల్‌కే పరిమితం కాలేదు. భారత్‌లోని బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతోపాటు ఈశాన్య ప్రాంతాలనూ కుదిపేసింది. చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో కూడా ప్రభావం కనిపించింది. ‘ఈ ఘోర విపత్తులో కనీసం 1,457 మంది చనిపోయి ఉంటారు. వందల మంది ఆచూకీ గల్లంతైంది. బర్పాక్ లర్పాక్ ప్రాంతంలోనే దాదాపు వెయ్యి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి’ అని నేపాల్ ఆర్థిక మంత్రి రాం శరణ్ మహత్ తెలిపారు. సహాయ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా ఆలయాలు దెబ్బతిన్నా ఆశ్చర్యకరంగా కఠ్మాండులోని ఐదో శతాబ్దం నాటి ప్రఖ్యాత పశుపతినాథ్ దేవాలయం చెక్కుచెదరకుండా నిలిచింది. నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేిశారు. ఇప్పటివరకు భక్తపూర్లో 150, సింధులో 250, లలిత్‌పూర్‌లో 67, ధడింగ్ జిల్లాలో 37 మంది మృత్యువాత పడ్డట్టు హోంశాఖ వెల్లడించింది. ఓ పర్వతారోహకుడు సహా నలుగురు చైనీయులు కూడా మరణించారు. ఈ ఘోర విపత్తులో ప్రపంచ దేశాలు తమకు ఉదారంగా సాయపడాలని నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజాల్ కోరారు. కఠ్మాండు.. కకావికలం కఠ్మాండులోని పురాతన భవనాలన్నీ భూకంపం దెబ్బకు నేలమట్టమయ్యాయి. ఎటు చూసినా మొండిగోడలు, శిథిలాలు, పక్కకు ఒరిగిన భవనాలు, నైచ్చిన దారులు కనిపిస్తున్నాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. జనసాంద్రత ఎక్కువున్న ఈ నగరంలోనే ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద 876 మందికి పైగా చనిపోగా ఒక్క కఠ్మాండులోనే కనీసం 250 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో నగరంలోని వేలాది మంది రాత్రి ఆరుబయటే నిద్రించారు. దెబ్బతిన్న రాయబార కార్యాలయం కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయ భవనం కూడా దెబ్బతింది. కాంప్లెక్సులోని ఓ ఇల్లు కూలిపోవడంతో ఎంబసీ ఉద్యోగి మదన్ కూతురు చనిపోయిందని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో వెల్లడించారు. తమ తరఫున రెండు హెల్ప్లైన్లు(+977 98511 07021, +977 98511 35141) ఏర్పాటు చేసినట్లు ఎంబసీ ప్రతినిధి అభయ్ కుమార్ తెలిపారు. బీర్ ఆసుపత్రిలో మరో భారతీయుడు మరణించారు. భూకంప కేంద్రమైన లమ్జంగ్ జిల్లాలో కూడా పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఈ జిల్లాలో 1.8 లక్షల మంది జనాభా ఉంది. జిల్లా కేంద్రమైన బెసిసహర్ లో నష్టం ఎక్కువగా ఉంది. అత్యవసర సేవలు అందించేందుకు భారత్ నుంచి 50 మంది వైద్యుల బృందం కఠ్మాండుకు చేరుకుంది. ప్రమాదం నుంచి బయపడిన రాందేవ్ యోగా క్యాంపు కోసం కఠ్మాండు వచ్చిన బాబా రాందేవ్ భూకంపం నుంచి త్రుటిలో బయటపడినట్లు ఆయన ప్రతినిధి ఎస్కే తిజరావాలా తెలిపారు. ‘‘మా యోగా శిబిరం ఉదయం 5 గంటలకు మొదలైంది. అది ముగిసిన తర్వాత అక్కడ్నుంచి రాందేవ్ వేరే శిబిరానికి బయల్దేరారు. అంతలోనే ఆయన బయటకు వచ్చిన భవనం కూలింది. ఆయన ముందున్న మరో భవనం కూడా అదే సమయంలో కుప్పకూలింది’’ అని ఆయన చెప్పారు. రాందేవ్‌తో మాట్లాడామని, ఆయన క్షేమంగానే ఉన్నారని మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. -
ఏపీలో భూ ప్రకంపనలు
రాష్ట్ర రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి విజయవాడ బ్యూరో: నేపాల్ రాజధాని కఠ్మాండు కేంద్రంగా శనివారం సంభవించిన భూకంపం ఆంధ్రప్రదేశ్‌పైనా ప్రభావం చూపింది. రాష్ట్ర రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని అమరావతి, ఉండవల్లి ప్రాంతాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఇదిలా ఉండగా భూప్రకంపనల వల్ల కొన్నిచోట్ల ఇళ్లల్లో సామాను కదిలిపోయింది. అయితే ఎక్కడా చెప్పుకోదగిన నష్టమేది జరగలేదు. నిజానికి కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలను ప్రజలు తొలుత గుర్తించలేక పోయారు. ఒళ్లు తూలుతున్నట్టు.. కళ్లు తిరుగుతున్న అనుభూతికి లోనై తమకు ఏదో అవుతోందంటూ కంగారు పడ్డారు. ఆ తరువాత భూప్రకంపనలుగా గుర్తించారు. భూ ప్రకంపనల తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే వీటిని గుర్తించిన ప్రజలు ఇళ్లు, షాపుల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 3 సెకన్ల అత్యల్ప సమయం పాటు ప్రకంపనలు రాగా... మరికొన్ని ప్రాంతాల్లో 8 సెకన్ల వరకు భూ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. -
మరుభూమిలా మారిన దర్హారా
దర్హారా టవర్.. కఠ్మాండు నడిబొడ్డున ఠీవీగా తలెత్తుకొని కనిపించే రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ చారిత్రక కట్టడం మరుభూమిలా మారిపోయింది. భూకంపంలో పూర్తిగా నేలమట్టమైంది. తొమ్మిది అంతస్తుల ఈ టవర్ శిథిలాల కింద 200 మందికిపైగా మంది సమాధి అయ్యారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన దర్బార్ స్క్వేర్ కూడా తీవ్రంగా దెబ్బతింది. కూలిన చరిత్ర రాజరిక నేపాల్‌లో రాణి లలిత త్రిపుర సుందరి ఆదేశాల మేరకు 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్సేన్ తపా ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా ఉంచడానికి ఈ శిఖరం లాంటి నిర్మాణం అప్పట్లో ఉపయుక్తంగా ఉండేది. క్రమేణా ఈ భారీ నిర్మాణం ఖాట్మండు నగరానికే ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. ఆర్కిటెక్చర్ ఆఫ్ ఖాట్మండులో భాగంగా భీమ్సేన్ టవర్స్‌కు యూనె స్కో గుర్తింపు కూడా లభించింది. దీన్ని స్థానికంగా ధారహరగా వ్యవహరిస్తారు. అయితే, దీని నిర్మాణం పూర్తి అయిన రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రాంతాన్ని భూకంపం వణికించింది. అయినా ఎన్నో భూకంపాలను తట్టుకొని నిలిచింది. కానీ 1934లో సంభవించిన మరో భూకంపంలో ఈ టవర్ దెబ్బతింది. దీన్ని అప్పటి పాలకుడు ధారహర మరమ్మతు చేయించారు. అప్పటి నుంచి ‘ధారహర’గా వ్యవహరించడం మొదలైంది. గత 80 సంవత్సరాల్లో ఏనాడూ ఎరగనంత తీవ్ర స్థాయి తాజా భూకంపంతో ఈ చారిత్రక భవనం పూర్తిగా ధ్వంసం అయినట్టే. ఇంత పెద్ద నిర్మాణం ఒక్కసారిగా కూలడంతో రేగిన దుమ్మూధూళీ ఖాట్మండు నగరాన్ని దట్టంగా ఆవరించింది. దర్బార్ స్క్వేర్.. ధ్వంసం కఠ్మాండులోని నేపాల్ పాత రాజభవనం ముందు నిర్మించిన పురాతన ప్లాజా ఇది. కఠ్మాండు దర్బార్ స్క్వేర్‌గా పిలుస్తారు. కఠ్మాండు వ్యాలీలోని మూడు దర్బార్ (రాజ భవనం) స్క్వేర్లలో ఇదీ ఒకటి. మల్లా, షా రాజుల హయాంలో మూడో శతాబ్దిలో నిర్మించిన ఈ మూడు దర్బార్ స్క్వేర్లనూ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించింది. శనివారం నాటి భూకంపంలో కఠ్మాండు దర్బార్ స్క్వేర్ పూర్తిగా ధ్వంసం అయింది. -
భారత రాయభార కార్యాలయ ఉద్యోగి కుమార్తె మృతి
న్యూఢిల్లీ/ఖాట్మండు: భారీ భూకంపం సృష్టించిన బీభత్సం కారణంగా ఇక్కడి భారత రాయభార కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రాయభార కార్యాలయం ఉద్యోగి కుమార్తె మృతి చెందినట్లు భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. రాయభార కార్యాలయం కాంప్లెక్స్‌లోని వారు నివాసం ఉండే ఇల్లు కూలిపోవడంతో దురదృష్టవశాత్తు మన ఉద్యోగి మదన్ కుమార్తె మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన అతని భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నేపాల్‌కు భారత్ అపన్న హస్తం అందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయిదు రెస్క్యూ బృందాలను ఖాట్మండు పంపినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయానికి ఈ బృందాలు ఫోఖారా చేరుకుంటాయని తెలిపింది. భారీ భూకంపం ధాటికి ఖాట్మండులో వేయి భవనాలు కుప్పకూలిపోయాయి. కూలిపోయినవాటిలో చారిత్రక ప్రాధాన్యత గల భవనాలు కూడా ఉన్నాయి. రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. -
నేపాల్‌లో చిక్కుకున్న టాలీవుడ్ బృందం!
-
నేపాల్‌లో చిక్కుకున్న టాలీవుడ్ బృందం!
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారి సంఖ్య గంట గంటకూ పెరిగిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు దాదాపు 40 మందికి పైగా ఖాట్మండులో చిక్కుకుపోయినట్లు సమాచారం. కాగా 'వెటకారం.కామ్' అనే టాలీవుడ్ చిత్ర బృందం 20 మంది ఫోన్లు కూడా పనిచేయడం లేదని బాధితుల బంధువులు మీడియాకు తెలిపారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడైన వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'వెటకారం.కామ్' అనే తెలుగు సినిమా చిత్రీకరణ కోసం నేపాల్‌కు వెళ్లిన వీరేందర్ రెడ్డి సహా మరో 20 మంది చిత్ర బృందం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. -
ఖాట్మండులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
-
ఖాట్మండులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
హైదరాబాద్/ఖాట్మండు: హైదరాబాద్ రామంతాపూర్‌కు చెందిన 28 మంది యాత్రికులు /ఖాట్మండులో చిక్కుకున్నారు. వారం రోజుల క్రితం వారు సాయిబాబా ట్రావెల్స్ ద్వారా ఖాట్మండ్ వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో వారు చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమవారిని హైదరాబాద్‌కు రప్పించాలని వారు కోరుతున్నారు. గుంటూరు జిల్లా వాసులు కూడా పలువురు ఖాట్మండ్‌లో చిక్కుకుపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన 20 మంది ఈ నెల 20వ తేదీన ఖాట్మండ్‌కు యాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం కుటంబ సభ్యులతో యాత్రకు వెళ్లినవారు ఫోన్లో మాట్లాడారు. అయితే భూకంపం వార్త తెలిసిన తర్వాత ఇంటి నుంచి యాత్రకు వెళ్లిన వారికి ఫోన్లు చేయగా ఎలాంటి స్పందన లేదని యాత్రికుల బంధువులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ వారి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే విజయవాడ నుంచి కూడా మరో 27 మంది ఖాట్మాండు ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. వాళ్లంతా ఏమయ్యారన్న విషయం తెలియడంలేదు. భూకంపం తాకిడికి ఖాట్మాండులోని విమానాశ్రయం మూసేశారు. దాంతో వాళ్లు అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే మార్గం కూడా కనిపించడం లేదు. -
రన్ వే నుంచి జారిన విమానం
-
జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
ఖట్మండ్ : ఖట్మండ్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొనటంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం
ఖాట్మాండ్: స్కూటర్లో భారీగా బంగారపు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శనివారం ఖాట్మాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖాట్మాండ్ పరిసర ప్రాంతాల్లో బంగారం అక్రమ రవాణ అధికమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్కూటర్ డిక్కీలో భారీగా బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
విస్తృత సహకారం దిశగా..!
ముగిసిన సార్క్ సదస్సు విద్యుత్ సహకార ఒప్పందంపై సంతకాలు పాక్ మోకాలడ్డడంతో కుదరని అనుసంధాన ఒప్పందాలు కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులో రెండు రోజుల పాటు జరిగిన 18వ సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఆఖరి నిమిషంలో.. విద్యుత్‌రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సార్క్ దేశాలు సంతకాలు చేశా యి. ఈ ఒప్పందం ద్వారా 8 సభ్య దేశాల ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల అనుసంధానత, వాటి ఐక్య నిర్వహణ, సభ్య దేశాల మధ్య విద్యుత్ వాణిజ్యం సాధ్యమవుతుంది. కాగా, పాకిస్తాన్ సహకరించకపోవడంతో సార్క్ సభ్య దేశాల మధ్య మరింత మెరుగైన అనుసంధానత కోసం రూపొందించిన ఒప్పందాలకు నేపాల్‌లో ఈ సదస్సులో ఆమోదం లభించలేదు. వాటిలో సభ్యదేశాల మధ్య రోడ్డు, రైల్వే, జల రవాణాల ద్వారా ప్రజలు, వస్తువుల రవాణాను సులభతరం చేసే మోటారు వాహన, రైల్వే ఒప్పందాలున్నాయి. పాక్ మినహా మిగతా సభ్యదేశాలన్నీ ఆ ఒప్పందాలకు అత్యంత సానుకూలంగా ఉన్నాయి. విద్యుత్‌రంగంలో సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా మొదట్లో పాక్ వ్యతిరేకించింది. పాక్‌లో అంతర్గత ప్రక్రియ పూర్తి కానందున ఈ ఒప్పందాన్ని ఇప్పుడే అంగీకరించలేమంది. కానీ పలువురు సభ్యదేశాధినేతలు పాక్ ప్రధాని షరీఫ్‌తో చర్చించి ఒప్పించారు. తదుపరి సదస్సు నిర్వహణకు పాక్‌కు అవకాశం ఇచ్చినందుకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సభ్య దేశాధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరిగేలా.. సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక కార్యాచరణను రూపొం దించుకోవాలన్నారు. ఈ సదస్సుకు అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, మాల్దీవుల అధ్యక్షులు, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల ప్రధానులు హాజరయ్యారు. పరిశీలక దేశాలకు మరింత ప్రాతినిధ్యం పరిశీలక హోదాలో ఉన్న చైనా తదితర దేశాలకు మరింత ప్రాధాన్యతనివ్వాలని సార్క్ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాధాన్య రంగాల్లో ఉత్పత్తి, డిమాండ్ ఆధారిత ప్రాజెక్టుల్లో వారిని భాగస్వామ్యులను చేయాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. సార్క్‌లో శాశ్వత సభ్యత్వం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న చైనా ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సార్క్‌ను విస్తరించాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా, మారిషస్, మయన్మార్, అమెరికా, యూరోపియన్ యూనియన్ పరిశీలక హోదాలో సార్క్ సదస్సులో పాల్గొన్నాయి. కఠ్మాండు ప్రకటన సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా ‘కఠ్మాండు ప్రకటన’ను సభ్య దేశాలు విడుదల చేశాయి. ‘ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని, అవి ఏ రూపంలో ఉన్నప్పటికీ.. సభ్య దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. వాటిపై పోరులో సభ్య దేశాల మధ్య సమర్థ సహకారం అవసరమని స్పష్టం చేశారు’ అని అందులో పేర్కొన్నారు. ‘సార్క్ ఏర్పడి ముప్పై యేళ్లయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా.. ప్రాంతీయ సహకారానికి పునఃప్రతిష్ట చేయాల్సిన, కూటమిని పునరుత్తేజపర్చాల్సిన అవసరాన్ని సభ్య దేశాల నేతలు గుర్తించారు’అని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, మౌలిక వసతులు, సంస్కృతి రంగాల్లో సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని నిర్ణయించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ఉమ్మడి మార్కెట్, ఉమ్మడి ఆర్థిక, ద్రవ్య వ్యవస్థగా ‘సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్(ఎస్‌ఏఈయూ)’ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. సార్క్ అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్)ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. మోదీపై నేపాల్ మీడియా గరం గరం! నేపాల్ రాజ్యాంగ రచనకు సంబంధించి భారత ప్రధా ని మోదీ నేపాల్ నేతలకు సలహాలివ్వడంపై ఆ దేశ మీడియా మండిపడింది. వాటిని దౌత్య నియమాల ఉల్లంఘనగా అభివర్ణించింది. నేపాల్ రాజకీయ నేతలతో భేటీ సందర్భంగా ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగ రచన సాగించాలని, నిర్ణీత గడవు అయిన జనవరి 22లోగా రాజ్యాంగ రచనను పూర్తి చేయాలని మోదీ సూచించారు. సదస్సు ముగిసిన తరువాత మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. -
మాటలు కలిశాయి..!
కఠ్మాండు: చేతులు కలిశాయి.. నవ్వులు విరిశాయి.. పలకరింపులు తోడయ్యాయి.. సార్క్ వేదిక మురిసింది. సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన ఆత్మీయ కరచాలన సన్నివేశం మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. బుధవారం నాటి అంటీముట్టని వైఖరికి భిన్నంగా.. సుదీర్ఘ షేక్‌హ్యాండ్‌తో, మధ్యమధ్య కాసేపు మాట్లాడుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తూ.. వారిరువురు అందరి దృష్టిని ఆకర్షించారు. భారత్, పాక్‌ల మధ్య సానుకూల స్నేహసంబంధాలు సార్క్ దేశాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయో సజీవంగా చూపేలా.. వారిద్దరి ఆత్మీయ పలకరింపులను ఇతర సభ్య దేశాధినేతలు, ప్రతినిధులు గట్టిగా హర్షధ్వానాలతో స్వాగతించారు. వచ్చే సంవత్సరం సార్క్ సదస్సు పాకిస్తాన్లో జరగనున్న దృష్ట్యా.. ఈ ఏడాది సార్క్ సదస్సు ముగిసిన అనంతరం ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్’ చెప్పేందుకు షరీఫ్ వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు మిగతా నేతలతో పాటు మోదీ కూడా చప్పట్లతో అభినందించారు. బుధవారం సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగాన్ని పట్టించుకోకుండా మోదీ వార్తపత్రిక చదువుకుంటూ కూర్చున్న విషయం తెలిసిందే. హిమాలయాల పాదాల వద్ద సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా కఠ్మాండూకు 30 కిమీల దూరంలోని ప్రఖ్యాత ధూలిఖేల్ రిసార్ట్‌లో నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల సభ్య దేశాధినేతల కోసం విందును ఏర్పాటు చేశారు. ఈ రిసార్ట్‌ను పర్యాటకుల స్వర్గధామంగా భావిస్తారు. రిసార్ట్ వద్ద భారత ప్రధాని మోదీ మర్రి మొక్కను నాటారు. -
మాట నిలబెట్టుకుందాం..
ఉగ్రవాదాన్ని కట్టడి చేద్దాం.. సార్క్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు 166 మందిని బలిగొన్న ముంబై మారణహోమాన్ని మర్చిపోలేం సమష్టి పోరుతోనే శాంతియుత దక్షిణాసియా సాకారమవుతుంది దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉందని వ్యాఖ్య సార్క్ 18వ సమావేశాలు ప్రారంభం.. కఠ్మాండు: ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని, సీమాంతర నేరాలను కట్టడి చేస్తామని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనేందుకు కృషి చేయాలని సార్క్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి అవగాహన, సున్నితంగా స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని... ఇది అంతిమంగా శాంతికి, సుస్థిరతకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో బుధవారం సార్క్ 18వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల తొలిరోజున ప్రధాని మోదీ దాదాపు దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఉగ్రవాద అంశంతో పాటు సార్క్ దేశాల మధ్య సహకారం, వీసాల సరళీకరణ, వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగించారు. 2008లో ముంబైలో 166 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడి జరిగి బుధవారం నాటికి ఆరేళ్లయిన సందర్భంగా మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ఆ భయంకర మారణ హోమాన్ని భారత ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలకు పాల్పడడాన్ని నిర్మూలిస్తామని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి సార్క్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి ఇరుగుపొరుగు ఉండాలనే అన్ని దేశాల కోరిక అని... భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని మోదీ పేర్కొన్నారు. సమీకృత దృష్టితో, ఉమ్మడి చర్యలతో అందరూ కృషి చేస్తే.. శాంతియుత, సౌభాగ్యమైన దక్షిణాసియా సాకారమవుతుందన్నారు. ఐదేళ్ల వాణిజ్య వీసా..: సార్క్ దేశాలతో వాణిజ్యం, వ్యాపార సంబంధాలు పెంపొందడం కోసం వారికి మూడు నుంచి ఐదేళ్ల బిజినెస్ వీసా అందజేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దీనిని ‘సార్క్ బిజినెస్ ట్రావెలర్ కార్డు’ ద్వారా మరింత సులభం చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. సార్క్ దేశాల మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో... ఈ దేశాల మధ్య జరుగుతున్నది కేవలం 5 శాతమేనని, దీనిని పెంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లో మౌలిక వసతుల కొరత పెద్ద సమస్య అని.. అందువల్ల భారత్‌లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం, ఘనమైన వారసత్వం ఉన్న ప్రాంతం దక్షిణాసియా. అభివృద్ధి సాధించాలనే తపన, యువత మన బలం. ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.. ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యం కోసం భారత్ వచ్చేవారికి.. వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కాగా, మోదీ బుధవారం అఫ్ఘానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారి మధ్య వాణిజ్యపరమైన అంశాలు, రక్షణ సహకారంపై చర్చలు జరిగాయి. అఫ్ఘాన్‌తో సంబంధాలు పరిపుష్టం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి మోదీ హామీఇచ్చారు. ‘సార్క్’ ఒప్పందాలకు పాక్ చెక్ సార్క్ దేశాల అనుసంధానతకు సంబంధించిన ఒప్పందాలను బుధవారం పాకిస్తాన్ అడ్డుకుంది. ఆ ఒప్పందాల అమలుకు దేశీయంగా తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ వాటిపై సంతకాలు చేసేందుకు నిరాకరించింది. సార్క్ దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరగడం, సభ్య దేశాల మధ్య వస్తు రవాణా సులభతరం కావడం.. మొదలైనవి లక్ష్యాలుగా రూపొందించిన ఆ ఒప్పందాలను పాక్ అడ్డుకోవడంపై భారత్, శ్రీ లంకలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, పాక్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం. -
అభివృద్ధి ఓ ఛాలెంజ్: మోదీ
-
మన ముందు ఎన్నో అవకాశాలున్నాయి: మోదీ
కఠ్మండ్ : పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలు కోరుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కఠ్మండ్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పరస్పర సహకారంతో కలిసి నడుస్తున్న దేశాల సమాహారం సార్క్గా మోదీ అభివర్ణించారు. అభివృద్ధి ఓ చాలెంజ్ అని మోదీ వ్యాఖ్యానించారు. సహకారం పెరిగితే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. ప్రాంతీయ సహకారం అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరోవైపు చూడాల్సిన అవసరం రాదన్నారు. మన మధ్య రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాలన్నారు. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ప్రజలు ఆశించినంతగా మనం ముందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. యువతను మంచి దిశలో నడిపించాల్సి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యత అని మోదీ తెలిపారు. -
18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
కఠ్మండ్ : 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు బుధవారం నేపాల్ రాజధాని కఠ్మండ్లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన నిన్నే కఠ్మండ్ చేరుకున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో కీలక రంగాల్లో ప్రాంతీయ సహకార విస్తృతిపై కూలంకషంగా చర్చ సాగనుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎనిమిది దేశాల అధినేతలు హాజరు అయ్యారు. సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సదస్సు ముగింపు కార్యక్రమం అనంతరం భారత్, పాకిస్తాన్ ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ కానున్నట్లు సమాచారం. -
ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందే: మోదీ
కఠ్మాండ్ : నవంబర్ 26 ముంబయి దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల భీకర దాడిని మర్చిపోలేమని ఆయన అన్నారు. నాటి ఘటనలో బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని 26/11 ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కఠ్మాండు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి ఆరేళ్లు గడిచింది. 2008, నవంబర్ 26న పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు. -
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్: సుష్మాస్వరాజ్
కఠ్మాండు: దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్ర భూతాన్ని తరిమికొట్టేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణాసియా మరింత శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు సంస్కతి, వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం కీలకమన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో మంగళవారం జరిగిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మ ప్రసంగించారు. అఫ్ఘానిస్థాన్‌లో రెండు రోజుల కిందట వాలీబాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 50 మందికిపైగా హతమార్చడాన్ని ఆమె గుర్తు చేశారు. దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ అని ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. ఉగ్రవాద సమస్యను అధిగమించేందుకు సభ్య దేశాల మధ్య సమష్టి కృషి అవసరమన్నారు. అలాగే ఆర్థిక వృద్ధిరేటును పెంచేందుకు సభ్య దేశాల మధ్య రోడ్డు, రైల్వే, విమాన సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌లోని తమ ప్రభుత్వం 'అందరితో కలసి, అందరి అభివద్ధి' అనే నినాదంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. సార్క్ దేశాల ప్రాంతీయ ఏకీకరణకు కూడా ఇదే తమ దేశ విధానమని సుష్మా అన్నారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశం సందర్భంగా విదేశీ వ్యవహరాలు, జాతీయ భద్రతకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్‌ను సుష్మాస్వరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ** -
న్యాయ పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయాడు!
ఖాట్మండు: కన్న కొడుకు హత్యకు గురి కావడం ఆ తల్లిదండ్రులను కలచివేసింది. 17 ఏళ్ల తమ కుమారుడిని మావోయిస్టులు హత్య చేయడంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. వారికి న్యాయం దక్కలేదు. దీంతో నందప్రసాద్ అధికారి(56) ఆయన భార్య గంగామాయ(54) గతేడాది అక్టోబర్ 25న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయినా వారి అభ్యర్థనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సుదీర్ఘకాలం ఆహారం లేకపోవడంతో నందప్రసాద్ సోమవారం ఖాట్మండులోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీక్షలోనూ భర్తతో కలసి సాగిన గంగామాయ పరిస్థితి సీరియస్‌గా ఉంది. 2004లో ఈ దంపతుల కుమారుడు కష్ణప్రసాద్‌ను గోర్ఖాలోని ఫుజెల్ ప్రాంతంలో ఇంటి నుంచి మావోయిస్టు రెబల్స్ అపహరించి తీసుకెళ్లగా... తర్వాత రత్నానగర్ ప్రాంతంలో అతడు శవమై తేలాడు. -
ముంచెత్తిన వరదలు : 84 మంది మృతి
ఖట్మాండ్: భారీ వర్షాలు, వరదలతో నేపాల్ అతలాకుతలం అవుతుంది. దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 84 మంది మృతి చెందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లక్మీ ప్రసాద్ దక్కల్ ఆదివారం నేపాల్‌లో వెల్లడించారు. 156 మంది గల్లంతు అయ్యారని తెలిపారు. మృతుల్లో 56 మంది మృతదేహాలను కనుగొన్నామని చెప్పారు. వరదలు, కొండ చరియలు విరిగిపడి దేశంలోని పశ్చిమ ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని వివరించారు. ఇళ్లు, పోలాలు... అన్ని వరద నీటికి కొట్టుకుపోయాయని... అలాగే కొండ చరియల విరిగి పడటంతో ఆస్తులు, పలువరు ప్రాణాలు శిథిలాల కింద చిక్కుకుని పోయారని తెలిపారు. దాదాపు 15 వందల మంది నిరాశ్రయులైయ్యారని చెప్పారు. వారందరికి సురక్షిత ప్రాంతాలకు తరలించి... ఆశ్రయం కల్పించామన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని... వరదలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని... దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని వివరించారు. అయితే హెలికాప్టర్ల కోసం వేచి ఉన్నామని చెప్పారు. -
పశుపతినాథ్ ఆలయంలో మోడీ పూజలు
ఖాట్మాండ్ : నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు గంటపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మోడీకి తీర్థప్రసాదాలు అందచేశారు. మోడీ రాక సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇక నరేంద్ర మోడీ తన పర్యటనలో భాగంగా నేపాల్‌కు 10 వేల కోట్ల(నేపాల్ రూపాయలు) రాయితీయుత రుణాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఖాట్మాండ్లో పలు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మోడీ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నందున రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. -
భారత్‌కు పది స్వర్ణాలు
దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతోపాటు ఒక్కొక్కటి చొప్పున రజతం, కాంస్య పతకాలు సాధించారు. భారత్‌తోపాటు దక్షిణాసియాలోని అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. భారత బృందంలో పురుషుల విభాగంలో నవ్‌జోత్ చానా (60 కేజీ), ఐరోమ్ సంజూ సింగ్ (66 కేజీ), నవ్‌దీప్ చానా (73 కేజీ), వికేందర్ సింగ్ (81 కేజీ), అవతార్‌సింగ్ (90 కేజీ)లు స్వర్ణాలు సాధించగా, ఖెదైమ్ యైమా సింగ్ (100 కేజీ) రజతం దక్కించుకున్నాడు. మహిళల్లో అంగోమ్ అనితా చాను (52 కేజీ), సుచికా తరియాల్ (57 కేజీ), గరిమా చౌదరి (63 కేజీ), హిడ్రామ్ సునిబాల దేవి (70 కేజీ), జైన దేవి (78 కేజీ)లు పసిడి, రజనీ బాల (48 కేజీ) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. -
ఇండిగో విమానంలో మంటలు
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో శనివారం ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే దిగిన ఇండిగో విమానం కుడి భాగంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని వెంటనే ఎయిర్ట్‌పోర్ట్ సిబ్బంది వెంటనే గుర్తించి, అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. అయితే ఇండిగో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కిందకు దింపారు. ఆ ఇండిగో విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ఖాట్మాండ్ బయలుదేరింది. అయితే శుక్రవారం నేపాల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన ఇంజన్లో అవాంతరం ఏర్పడటంతో త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో వెంటనే దింపివేసిన సంగతి తెలిసిందే.