88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పరార్..
88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పరార్..
Published Wed, Sep 6 2017 8:20 PM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM
ఖాట్మండూ: చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకుని నేపాల్ పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ కేసులో నిందితులైన చైనా దంపతుల కోసం వేట కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..
వాన్‌మియ్ మింగ్(50), యాంగ్ వై మింగ్ అనే చైనా దంపతులు నేపాల్‌లోని తామెల్ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఈ ముసుగులోనే వారు బంగారం అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం వారు తమ కారులో చైనా-నేపాల్ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్’ మార్గంలో ప్రయాణిస్తుండగా.. పోలీసులు అనుమానంతో వారిని అనుసరించారు. ఈ విషయాన్ని గమనించిన వింగ్ దంపతులు.. కారును రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు.
అనంతరం పోలీసులు కారును తనిఖీ చేయగా.. 88 కేజీల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 440 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారైన దంపతుల కోసం గాలిస్తున్నారు. ఖట్మాండూ పోలీసుల చరిత్రలోనే ఇది అతిపెద్ద పట్టివేత కావడం గమనార్హం.
Advertisement