ఖాట్మాండ్లో భూకంపం | Two quakes jolt Nepalese capital | Sakshi
Sakshi News home page

ఖాట్మాండ్లో భూకంపం

Published Tue, Aug 11 2015 11:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

Two quakes jolt Nepalese capital

ఖాట్మాండ్ : దేశంలో వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున 4.20 గంటలకు ఖాట్మాండ్లోని కీర్తిపూర్ ప్రాంతంలో భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదు అయిందని జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత అంటే ఉదయం 10.24 గంటలకు మరోసారి భూమి కంపించిందని తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదు అయిందని పేర్కొంది. భూకంప కేంద్రం ఖాట్మాండ్లో గుర్తించినట్లు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నేపాల్లో సంభవించిన భూకంపంలో తొమ్మిది వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement