విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయిదుగురు భారతీయులు
రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్‌గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు.
వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.
యూసీ సీఎం సంతాపం
ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి ముందు ఫేస్‌బుక్ లైవ్
నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp
— Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023
అసలేం జరిగిందంటే..
నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది.
కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment