Indians died
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. -
హజ్ యాత్ర మృతుల్లో... 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు. ‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు. -
గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!
విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయిదుగురు భారతీయులు రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు. వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. యూసీ సీఎం సంతాపం ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి ముందు ఫేస్బుక్ లైవ్ నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp — Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023 అసలేం జరిగిందంటే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది. కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నేపాల్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సంతాపం
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం తనను బాధించిందని, ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_ — Narendra Modi (@narendramodi) January 15, 2023 ఈ ఘటనలో చనిపోయిన ఐదుగరు భారతీయుల్లో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన విశాల్ శర్మ, సోను జైశ్వాల్, అనిల్ రాజ్‌భర్, అభిశేస్ కుశ్వాహాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం యోగి ఆదేశాలు.. మృతులు యూపీ వాసులు కావడంతో వారి పార్థీవ దేహాలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహరాల శాఖతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. नेपाल में हुई विमान दुर्घटना अत्यंत दुःखद है। इसमें भारतीय नागरिकों समेत काल-कवलित हुए सभी लोगों के प्रति विनम्र श्रद्धांजलि! मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। प्रभु श्री राम दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें। — Yogi Adityanath (@myogiadityanath) January 15, 2023 చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. -
మాల్దీవుల్లో ఘోరం
మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్ పక్కన ఒక గ్యాస్ సిలిండర్ ఉంది. ఫ్లోర్ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు. -
సూడాన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఖార్టూమ్: ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పరిశ్రమ నిండా మంటలు కమ్ముకొని 18 మంది భారతీయులను బతికుండగానే కాల్చేశాయి. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్ పరిశ్రమలో మంగళవారం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్‌లోని భారత ఎంబసీ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు బుధవారం సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదం బారిన పడిన భారతీయుల వివరాలను వెల్లడించారు. అందులో 7 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిపాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మొత్తం 34 మంది భారతీయులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వెల్లడించింది. ఆ దేశంలోని భారత ఎంబసీ 24 గంటల హెల్ప్‌లైన్ +249–921917471ను ఏర్పాటు చేసింది. సిరామిక్ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన చోట భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉండడంతో ప్రమాద స్థాయి పెరిగింది. దీంతో పరిశ్రమ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. -
ఘోర ప్రమాదం.. 12 మంది భారతీయుల మృతి..!
దుబాయ్: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. మరో తొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఒమనీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మసాలత్‌కు చెందిన బస్సు 31 మంది ప్రయాణికులతో గురువారం ఒమన్ రాజధాని మస్కట్ నుంచి దుబాయ్‌కు బయల్దేరింది. బస్సు సరిగ్గా రషిదీయా మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ్నుంచి బస్సుల కోసం నిర్దేశించిన రోడ్డు మార్గంలో కాకుండా ఇతర వాహనాల కోసం నిర్దేశించిన రోడ్డు లేన్‌లోకి వేగంగా దూసుకెళ్లి ఎత్తైన బారికేడ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయుల మృతిపట్ల దుబాయ్‌లోని భారత కాన్సూల్ జనరల్ విపుల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రషీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు భారతీయుల్ని డిశ్చార్జి చేసినట్లు కూడా కాన్సూల్ జనరల్ ప్రకటించింది. -
ఐస్లాండ్ ప్రమాదంలో భారతీయుల మృతి
లండన్: ఐస్లాండ్లో విహారయాత్రకు వెళ్లిన మహారాష్ట్రీయుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్‌లో ఉండే శ్రీరాజ్, సుప్రీం అనే సోదరులు తమ కుటుంబాలతో కలిసి ఐస్లాండ్లో ‘స్కీయోరార్సండర్’ పర్యాటక ప్రాంతానికి వాహనంలో బయలుదేరారు. గురువారం వేకువజామున నది వంతెన మీదుగా వెళ్తున్న ఆ వాహనం అదుపు తప్పి కిందకు పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఐస్లాండ్ పోలీసులు తెలిపారు. -
కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
-
కువైట్‌లో ఏడుగురు భారతీయుల మృతి
కువైట్ సిటీ: కువైట్‌లోని బుర్గాన్ ఆయిల్ క్షేత్రం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయులు సహా 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్తానీలు ఉన్నట్లు కువైట్ అత్యవసర విభాగం అధికార ప్రతినిధి కల్నర్ ఖలీల్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ కువైట్ పౌరుడితో పాటు ఇద్దరు భారతీయులు గాయపడ్డారన్నారు. వీరిలో ఓ భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాహనాలు నుజ్జునుజ్జు కావడంతో అందులో మరో నలుగురు సిబ్బంది చిక్కుకున్నారనీ, వారందరినీ రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చనిపోయినవారంతా బుర్గాన్ డ్రిల్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులేనని పేర్కొన్నారు. -
హజ్ విషాదంలో 74 మంది భారతీయుల మృతి
న్యూఢిల్లీ : గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా మృతిచెందిన వారి సంఖ్య రోజుకోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భారత్‌కు చెందిన యాత్రికులు 74 మంది మృతిచెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆదివారం నాటికి ఈ మృతుల సంఖ్య 58గా ఉండేది. మీనాలో జరిగిన హజ్‌యాత్ర తొక్కిసలాట మృతుల పేర్లను ఇండియన్ కాన్సులేట్ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మక్కాలో సెప్టెంబర్ 24న జరిగిన ఈ దుర్ఘటన కారణంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా మృతిచెందిన విషయం విదితమే.