
కువైట్ సిటీ: కువైట్‌లోని బుర్గాన్ ఆయిల్ క్షేత్రం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయులు సహా 15 మంది దుర్మరణం చెందారు.
మృతుల్లో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్తానీలు ఉన్నట్లు కువైట్ అత్యవసర విభాగం అధికార ప్రతినిధి కల్నర్ ఖలీల్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ కువైట్ పౌరుడితో పాటు ఇద్దరు భారతీయులు గాయపడ్డారన్నారు. వీరిలో ఓ భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాహనాలు నుజ్జునుజ్జు కావడంతో అందులో మరో నలుగురు సిబ్బంది చిక్కుకున్నారనీ, వారందరినీ రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చనిపోయినవారంతా బుర్గాన్ డ్రిల్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment