Bus accidents
-
పాక్ ప్రమాదాల్లో 40 మంది దుర్మరణం
ఇస్లామాబాద్/కరాచీ: పాకిస్తాన్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సుల ప్రమాదాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది యాత్రికులు సైతం ఉన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మాక్రాన్ తీరప్రాంత జాతీయరహదారిపై 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీకొట్టింది. దీంతో బస్సులోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ఇరాన్లో పర్యటించిన షియా యాత్రికులను తిరిగి పంజాబ్ ప్రావిన్స్‌కు తీసుకొస్తుండగా బస్సు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది లాహోర్, గజ్రన్వాలా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.లోయలో పడి..పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 29 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. అయితే పర్వతప్రాంతంలో ఘటన జరగడంతో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతులు సధాయోతి జిల్లాకు చెందిన వారని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ ఉమర్ ఫరూక్ చెప్పారు. ఘటనపై పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంతాపం వ్యక్తంచేశారు. -
ఏఐతో ‘రాస్తే’ సేఫ్: పనిచేస్తుందిలా!
సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. రెండు రైళ్లు ఢీ కొనకుండా కవచ్ పేరుతో రైల్వే ఇటీవలే యాంటీ కొల్యూజన్ డివైస్‌లను అమర్చే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ తరహాలోనే, బస్సుల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో యాంటీ కొల్యూజన్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్‌ను నిరంతరం అప్రమత్తం చేసేలా.. గచ్చిబౌలిలోని ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్–సీఆర్ఆర్ఐ, ఐఎన్ఏఐలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘ఐ–రాస్తే’(ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్) పరిజ్ఞానాన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిజ్ఞానాన్ని నాగ్‌పూర్‌లోని బస్సుల్లో ఇటీవలే ఏర్పాటు చేసి విజయవంతంగా వినియోగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఈ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంలో కీలకంగా వ్యవహరించిన ఐఐఐటీ నిపుణులతో ఇటీవల చర్చించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు తిరిగే 20 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత మూడు రోజులుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పది బస్సుల్లో దీన్ని బిగించారు. వాటి పనితీరును మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ‘ఐ–రాస్తే’ పనిచేస్తుందిలా.. ► ఈ వ్యవస్థ నిరంతరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్‌పై సూచనలువస్తాయి. ► అవసరమైనప్పుడు బీప్ సౌండ్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. తద్వారా ముందు వెళ్లే వాహనానికి బస్సు అతి చేరువగా వెళ్లకుండా చూస్తుంది. ► ముందు వెళ్లే వాహనం నెమ్మదించినా, సడన్ బ్రేక్ వేసినా కూడా డ్రైవర్ గుర్తించేలా సిగ్నల్ ఇస్తుంది. ► రోడ్ల పరిస్థితిని కూడా డ్రైవర్‌కు తెలుపుతుంది. బస్సు రోడ్డుకు ఓ పక్కకు వెళ్లినా, రోడ్డు గతుకులుగా ఉన్నా, గోతులు చేరువవుతున్నా, మలుపులు సమీపించే ముందు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. గరిష్ట స్థాయిలో ప్రమాదాల నివారణ గత రెండుమూడు నెలలుగా ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవటం, ముందు వెళ్లే వాహన డ్రైవర్ల తప్పిదాలు, ఇతర కొన్ని కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని గరిష్ట స్థాయిలో నివారించేందుకు ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 20 బస్సుల్లో ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేసి, ఆ సాంకేతికత ద్వారా డ్రైవర్‌కు అందుతున్న సూచనలు, వాటిల్లో చేయాల్సిన మార్పు చేర్పులపై మరోసారి ఐఐఐటీ నిపుణులతో చర్చించి పూర్తిస్థాయిలో ఆ సాంకేతికతను సమకూర్చుకోనున్నారు. ప్రస్తుతానికి ఆ సాంకేతికతను ఉచితంగానే సమకూరుస్తున్నా.. ప్రయోగం విజయవంతమయ్యాక అవసర మైన బస్సుల్లో దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొనుగోలు చేయాల్సి ఉంది. ధర విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. -
రన్నింగ్ బస్సును ఎక్కబోయిన వృద్ధుడు.. పట్టుతప్పి ప్రాణాలు..
ముంబై: రన్నింగ్ బస్సును ఎక్కడానికి ప్రయత్నించి ఓ వృద్ధుడు ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని గోరేగావ్ బస్ డిపో సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకాం.. ముంబైలోని గోరేగావ్ సబ్బరన్ ప్రాంతంలో 55 ఏళ్ల వృద్ధుడు రోడ్డుపై వెళ్తున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించి ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడిసోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక మృతుడు వసంత్ గోండు ఘోలేగా పోలీసులు గుర్తించారు. బస్సు వెనుక చక్రం కింద పడిపోయిన వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ పుటేజీని సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వాన్రాయ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ వాగ్మారే తెలిపారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు,తప్పిన ప్రమాదం
-
నేపాల్‌లో బస్సు ప్రమాదం 14మంది మృతి
-
ఆర్టీసీ సమ్మె: ‘డేంజర్’ డ్రైవర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంనెలకొంది. పలుచోట్ల డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడపలేకపోతుండడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉంటే చాలు. పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా సరే బస్సులను అప్పగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం లారీలు, ట్రాక్టర్లు, తదితర సరుకు రవాణా వాహనాలను నడిపిన వారే ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓల్వోలు ఎలా అప్పగించాలి... ఈ క్రమంలో సమ్మె మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే నాన్ ఏసీ లోఫ్లోర్, ఏసీ మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంపై ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి సర్వీసులను నిలిపివేశారు. ఒకవేళ తప్పనిసరిగా పూర్తిస్థాయిలో అన్ని బస్సులను నడపవలసి వస్తే ఎలా అనేది ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. 11వ రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బస్‌భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ష్టేషన్లు, డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పూట బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం
-
ఒడిశాలో ఘోర ప్రమాదం
భువనేశ్వర్/కటక్: ఒడిశా రాష్ట్రం కటక్‌లోని మహానది వంతెన పైనుంచి మంగళవారం సాయంత్రం బస్సు బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డీజీపీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ తెలిపిన వివరాల మేరకు..అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ నగరానికి వస్తున్న జగన్నాథ్ అనే ప్రైవేట్ బస్సు కటక్‌లోని మహానది వంతెనపై వస్తున్న దున్నపోతును తప్పించే క్రమంలో దాన్ని ఢీకొని..అనంతరం 30 అడుగుల పైనుంచి నది పక్కకు పడిపోయింది. ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, దున్నపోతు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకదళం, విపత్తు స్పందనదళం (ఒడ్రాఫ్) జవాన్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల్ని ఆదుకోవడంలో తలమునకలయ్యారు. చీకటి పడడంతో సహాయ, పునరుద్ధరణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. బాధితుల వివరాల కోసం 6712304001లో సంప్రదించాలని డీజీపీ తెలిపారు. -
ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య గొడవ..15 మంది మృతి
-
డొల్ల.. తేట తెల్లం!
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది భక్తులు.. వేల కొద్దీ వాహనాలు.. పైగా ఘాట్ రోడ్డు. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం వరుస ప్రమాదాలతో రక్తమోడుతోంది. ఘాట్ రోడ్డు విస్తరణ నిర్లక్ష్యం కంటికి కనిపిస్తున్నా.. ఉన్న రోడ్డు నిర్మాణాన్ని సైతం పాలకులు పట్టించుకోకపోవడంతో 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం.. అక్కడి ఘాట్ పరిశీలనలో సంచలనాత్మక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొండగట్టు గుట్టపై నుంచి కిందికి దిగే 3.5 కిలోమీటర్ల మార్గం అత్యంత భయానక స్థితిలో ఉంది. ప్రమాదకరమైన మలుపులు, వాటి వద్ద కనీసం భద్రతా చర్యలు లేకపోవడం భవిష్యత్‌లో మరెంత మంది ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుట్టపై నుంచి కిందకు వస్తున్న మార్గంలో ఐదు మలుపుల ప్రాంతం భవిష్యత్ ప్రయాణాన్ని ఆందోళనలో పడేస్తోంది. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, రెయిలింగ్ కూడా లేని దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో బయటపడింది. సాధారణ కల్వర్టు కోసం ఎప్పుడో 15 ఏళ్ల కింద నిర్మించిన కల్వర్టు సిమెంట్ రెయిలింగ్ ప్రాంతం ఇప్పుడున్న రోడ్డు కింద భాగంలోకి కుచించుకుపోయింది. ఇదే మలుపు వద్ద డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ మలుపుల ప్రాంతం నుంచి సుమారు 50 మీటర్ల లోతు ఉన్న లోయల్లో వాహనాలు పడే ప్రమాదం ఉంది. కొన్ని మలుపు ప్రాంతాల్లో రెయిలింగ్స్ ఏర్పాటు చేసినా పెద్దగా వాటితో ఉపయోగం లేదు. ఘాట్ రోడ్డులో కనీసం 2 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలి. రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేస్తే ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుంది. భద్రతా చర్యలేవీ? ప్రమాదం జరిగిన కొండగట్టు ఘాట్ రోడ్డులో ఎక్కడ కూడా ప్రమాద నివారణ సూచికలు, భద్రతా చర్యలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. అధిక లోడ్ ఉన్న వాహనాలను ఈ రోడ్డు మార్గంలో నడపడం ప్రమాదకరమని తెలిసినా నడుపుతున్నారు. కాగా, కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఆలయ కమిటీ, పాలక పక్షాలు, ప్రభుత్వవిభాగాలు కనీసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం ఈ కారణానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఘాట్ రోడ్డు కనీసం 100 ఫీట్ల నుంచి 120 ఫీట్లు అంటే డబుల్ రోడ్డుతో పాటు మధ్యలో రెండు ఫీట్ల వాహనల గ్యాప్ వదిలేసేలా ఉండాలి. కానీ ప్రస్తుతమున్న రోడ్డు 60 నుంచి 80 ఫీట్ల పరిధిలోనే ఉంది. ఆ రోడ్డు కూడా విస్తరించాల్సిందే.. ఘాట్‌రోడ్డు కాకుండా కొండగట్టు గుట్టపైకి వచ్చేందుకు దొంగలమర్రి, జేఎన్టీయూ కాలేజీ మీదుగా మరో మార్గం ఉంది. ఆ మార్గం సైతం 80 ఫీట్ల లోపుగానే నిర్మితమైంది. ఈ రహదారిలో 40 శాతం మేర ఘాట్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కీలక మలుపులు సైతం వాహనదారులను వణికించేలా కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్ విస్తరణతో పాటు జేఎన్టీయూ, దొంగలమర్రి రహదారిని విస్తరించే ప్రమాదాల నియంత్రణతో పాటు రాకపోకలు, సౌలభ్యం కూడా కలిసివస్తుందని భక్తులు కోరుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు కొండగట్టు వెళ్లేందుకు ఉన్న రెండు మార్గా లనూ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ డీజీ కృష్ణప్రసాద్ పరిశీలించారు. ప్రమాదం జరగానికి ఓవర్‌వెయిట్ కారణంతో పాటు రోడ్ డెవలప్మెంట్ కూడా ఉందని అభిప్రాయపడ్డారు. రోడ్ రెయిలింగ్స్‌ను విస్తరించి, సూచికలు, భద్రతాచర్యలు, రోడ్డు ఇంజనీరింగ్‌పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. దేశంలో ఈ ఏడాది జరిగిన భారీ బస్సు ప్రమాదాలు జూలై01 ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని పౌరీ గర్వాల్‌లో జరిగిన ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. జనవరి29 పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని గోబ్రా కెనాల్లోకి బస్సు దూసుకెళ్లడంతో 45 మంది చనిపోయారు. జూలై 28 మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో డాపోలి వ్యవసాయ వర్సిటీ సిబ్బందితో వెళ్తున్న బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు. ఏప్రిల్10 హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని నుర్పూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 30 మంది చనిపోయారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
మలుపుల్లో 'మృత్యువు'
ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గతేడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో రోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే 1,856 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో గతేడాది 1,406 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది మరణించారు. జగిత్యాల క్రైం/టౌన్: కొండగట్టు రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది మృతిచెందారు. శనివారంపేటకు చెందిన 15 మంది, హిమ్మత్‌రావుపేటకు చెందిన 10 మంది, డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన 10 మంది, రాంసాగర్‌కు చెందిన 9 మంది, తిర్మలాపూర్‌కు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో మండలమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారంపేటకు చెందిన గర్భిణులు సుమలత (తొమ్మిది నెలలు), నామాల మౌనిక (5 నెలలు) ప్రమాదంలో చనిపోయారు. కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి ఘాట్‌రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్‌రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్ మిర్రర్స్ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్‌రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతు న్నాయి. ఆ ఘాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్‌రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. రోడ్డు తీరుతెన్నులు, ప్రతికూల పరిస్థితులు, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, నిబంధనల్ని పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అని ట్రాన్స్పోర్ట్ ప్లానర్ ప్రొఫెసర్ ఎన్.రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ప్రమాదాలకు కారణాలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో ఇరుకు దారులు, ప్రమాదకర మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి డ్రైౖవర్లు ప్రయత్నించడం, మద్యం సేవించడం వంటివి ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు కారణాలుగా చెప్పొచ్చు. ప్రమాదాల్లో 50% ప్రమాదకరమైన మలుపుల కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యంతో 25% ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల కారణంగా ప్రమాదాలు.. రోడ్లపై గుంతల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత మూడేళ్లలో రహదారులపై గోతుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9,300 మందికి పైగా మరణించారు. 25 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రహదారుల శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ పార్లమెంటులో చెప్పారు. అంటే రోడ్లపై గుంతల కారణంగా దాదాపు రోజుకు 10 మంది మృతి చెందుతున్నారన్నమాట. 2015లో 3,416 మంది, 2016లో 2,324 మంది రోడ్లపై గోతుల కారణంగా మరణించారు. 2017లో పై తరహా ప్రమాదాల్లో 3,597 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి గత సంవత్సరం తీవ్రవాద దాడుల కారణంగా సంభవించిన మరణాల (803) కంటే ఎక్కువ. 2016లో నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర జరిగిన ప్రమాదాల్లో 3,878 మంది మరణించారు. 2017 నాటికి ఈ సంఖ్య 4,250కి పెరిగింది. బస్సులు137 డ్రైవర్లు 62 జగిత్యాల డిపోలో పని ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అంకెలే సాక్ష్యం. మొత్తం 137 బస్సులు ఉన్న జగిత్యాల డిపోలో 62 మంది డ్రైవర్లే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి రెండు బస్సులకు ఒక్క డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అందుకే ప్రతి డ్రైవర్‌కు పని ఒత్తిడి తప్పట్లేదు. చాలాసార్లు తమకు విధులు వద్దని చెప్పినా వినకుండా.. విధులు చేయాల్సిందేనని బలవంతం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఘాట్ రోడ్ కోసం శిక్షణేదీ? కొండగట్టు ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆదాయం కోసం చూపిన ఉత్సాహం ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో చూపట్లేదని తేటతెల్లమైంది. వాస్తవానికి తిరుమలలో ప్రత్యేకమైన బస్సును డిజైన్ చేసి నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేక కంట్రోలర్ ఉంటారు. ఎవరినీ నిలబడనీయరు. అసలు ఎవరు నిలుచుని ఉన్నా.. బస్సు ముందుకు కదలదు. అంతా కూర్చున్నాకే బస్సు స్టార్టవుతుంది. అక్కడి డ్రైవర్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తారు. రద్దీ వల్లే.. వేములవాడ నుంచి కొండగట్టు మీదుగా జగిత్యాలకు ఒకే ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఆర్టీసీ.. భక్తుల రద్దీ నేపథ్యంలో 10 రోజుల క్రితం కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు మీదుగా మరో బస్సును (ప్రమాదానికి గురైంది) ప్రారంభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవాలయం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఎక్కినట్లు తెలుస్తోంది. కాపాడాలని వేడుకున్నరు కొండగట్టు ఘాట్ రోడ్డు కింద ఓ రైతు భూమిని జేసీబీతో చదును చేస్తున్నం. గుట్ట పైనుంచి వస్తున్న బస్సులో నుంచి కాపాడండంటూ అరుపులు వినిపించాయి. మేము అటు చూస్తుండగానే బస్సు లోయలో పడిపోయింది. మేం వెంటనే లోయ వద్దకు వచ్చినం. అప్పటికే అందరూ చెల్లాచెదురుగా పడ్డరు. బస్సులో ఉన్న కొందరిని మొదట మేమే బయటకు తీసినం. ఒక్కొక్కరినీ బయటకు తీస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగినయ్. బస్సులో వెనుక ఉన్న వాళ్లందరూ ముందుకొచ్చి పడ్డరు. – ప్రత్యక్ష సాక్షులు చంద్రశేఖర్,రవిప్రతాప్, జేసీబీ డ్రైవర్లు మా ఆటోకు తాకింది.. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి టాటా ఏస్ ఆటోలో వెళ్లినం. ఆటోలో ఆరుగురు పెద్దవాళ్లం. నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కొండగట్టు గుట్టమీదికి వెళ్తుండగా కిందకు పడుతున్న బస్సు నుంచి అరుపులు వినబడ్డయ్. పక్కకు జరగమని అరిచారు. మా ఆటో డ్రైవర్ వెంటనే స్పీడ్ పెంచిండు. క్షణాల్లో బస్సు మా దగ్గరికి వచ్చి ఆటోకు తాకి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఏమైందో తెల్వలేదు. బస్సు ఆటోను తాకడంతో అద్దాలు పగిలినయ్. అదృష్టం కొద్ది ఆటోలో ఉన్నవారెవరికీ దెబ్బలు తగల్లేదు. మెడబోయిన కొమురయ్య,చిగురుమామిడి వేగానికి భయపడి మధ్యలోనే బస్సు దిగిన.. మా ఊరు కొడిమ్యాల. జగిత్యాలకు వెళ్లేందుకు తిర్మలాపూర్ వద్ద బస్సు ఎక్కిన. డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ ముందు వెళ్లే వాహనాలను వేగంగా ఓవర్ టేక్ చేశాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. దీంతో జేఎన్టీయూ కాలేజీ బస్‌స్టాప్ వద్ద దిగిన. కొద్దిసేపటికే బస్సు కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిందని తెలిసింది. నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడు కూడా దారి మధ్యలో బస్సు దిగిపోలేదు. మొదటిసారిగా బస్సు వేగంగా వెళ్తుంటే భయపడి దిగిన..ప్రాణాలు దక్కినయ్. – ప్రకాశ్, కొడిమ్యాల స్వచ్ఛందంగా యువకుల సాయం మల్యాల: కొండగట్టు ఘాట్‌రోడ్డు సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షత గాత్రులను తరలించేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయిల్నేని సాగర్‌రావు క్షతగాత్రులను ఎత్తుకుని తీసుకొచ్చి తన వాహనంలో జగిత్యాలకు తరలించారు. నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, కొక్కుల రఘు, కృష్ణారావు, దూస వెంకన్న తదితరులు క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి, అంబులెన్స్‌లతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో అధికారులు సైతం తమ వాహనాల్లో తరలించారు. కొండ కింద ట్యాక్సీ జీపులు నడిపే డ్రైవర్లు కూడా సంఘటనా స్థలా నికి చేరుకుని తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోనూ స్థానిక ముస్లిం యువకులు, ఎన్సీసీ కేడెట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం గదికి తరలించడం.. క్షతగాత్రులను వాహనాల నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగానికి సాయం అందించారు. కడవరకూ కలసే.. కొడిమ్యాల (చొప్పదండి): ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ మూడు జంటలు నిలబెట్టుకున్నాయి. కడవరకూ కలసే సాగాయి. కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గొల్కొండ దేవయ్య (60) –గోల్కొండ లక్ష్మి (55), వొడ్నాల కాశీరాం (60)–వొడ్నాల లక్ష్మి (55), శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు (55)–గోలి అమ్మాయి (50) దంపతులు ప్రమాదంలో మృతిచెందారు. దేవయ్యకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం దంపతులు జగిత్యాల ఆసుపత్రికి.. వొడ్నాల కాశీరాం చికిత్స నిమిత్తం జగిత్యాలకు, వొడ్నాల లక్ష్మి కూతురు వద్దకు.. గోలి రాయమల్లు, గోలి అమ్మాయిలు బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో మృతి చెందారు. -
ఆర్టీసి చరిత్రలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
-
దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలైన విషయంతెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదం దేశ చరిత్ర అతిపెద్ద ప్రమాదం. ఇంత వరకు ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదాల వివరాలు ఒక సారి పరిశీలిద్దాం. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మరింత మంది ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వద్ద బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది ప్రయాణికులు మరణించారు. 15మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు చాలా వరకు ఘాట్ రోడ్డు ఉండడంతో పెద్ద ప్రమాదాలే జరిగాయి. జమ్మూ కశ్మీర్ కశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది మరణించారు. మరికొంత మంది ఆచూకి లభించలేదు. గుజరాత్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది దుర్మరణం పాలైయ్యారు. గుజరాత్ చరిత్రలో ఇదే అతిపెద్ద రోడ్డు ప్రమాదం. తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద సంభవించిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం. బస్సు కల్వర్డును ఢీ కొట్టడంతో పెట్రోల్ ట్యాంక్ లీకవ్వడంతో సెకన్లపాటు సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు వ్యాపించడంతో 45 మంది సజీవదహనమయ్యారు. జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్లో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 370 మీటర్ల ఎత్తునుంచి చినాబ్ నదిలోకి పడిపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ప్రమాదాల కశ్మీర్లో చాలానే జరిగాయి. లోయప్రాంతం కావడంతో ప్రయాదాలు జరగడం సాధారణంగా మారింది. మహారాష్ట్రా మహారాష్ట్రాలో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మరణించారు. నాసిన్‌కు భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 39 మంది భక్తులు చనిపోగా.. 40 మంది గాయాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది భక్తులు మరణించారు. నేపాల్‌కి చెందిన భక్తులు ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా బస్సు ఆలకనందా నదిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ మూసాయిపేట వద్ద జరిగిన బస్సు-రైలు ప్రమాదంలో 26 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయినవారంతా పది నుంచి పదిహేనేళ్లలోపు వారే. బస్సు పాఠశాలకు వెళ్తుండగా రైల్వే లెవలింగ్ క్రాస్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. -
కువైట్‌లో ఏడుగురు భారతీయుల మృతి
కువైట్ సిటీ: కువైట్‌లోని బుర్గాన్ ఆయిల్ క్షేత్రం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయులు సహా 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్తానీలు ఉన్నట్లు కువైట్ అత్యవసర విభాగం అధికార ప్రతినిధి కల్నర్ ఖలీల్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ కువైట్ పౌరుడితో పాటు ఇద్దరు భారతీయులు గాయపడ్డారన్నారు. వీరిలో ఓ భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాహనాలు నుజ్జునుజ్జు కావడంతో అందులో మరో నలుగురు సిబ్బంది చిక్కుకున్నారనీ, వారందరినీ రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చనిపోయినవారంతా బుర్గాన్ డ్రిల్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులేనని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కుంటాల(ముథోల్) : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్–కుంటాల రహదారిపై ఆదివారం అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఘటనలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భైంసా డీపోకు చెందిన బస్సు ఉదయం భైంసా నుం చి మహారాష్ట్రలోని అప్పారావు పేట్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న భైంసా మండలం మాలేగాంకు చెందిన కాంతబాయి, దౌనెల్లికి చెందిన లక్ష్మి, శోభ, గంగామణి, మల్లెపువ్వుల సాయిరాంగౌడ్, విజయ, ప్రకాశం జిల్లాకు చెందిన చల్లం పళ్లం రాజు, తానాజీ పవార్, సూర్యవంశీ కేర్‌భ, ముత్తవ్వ, అడెల్లు, డ్రైవర్ ముంతాజ్‌అలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పిన ప్రమాదం బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం, మూలమలుపు వద్ద ఎలాంటి సూచికబోర్డులు ఏర్పాటు చేయని కారణంగా బస్సు బోల్తా పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కలూర్–కుంటాల డబుల్‌రోడ్డు పనులను నిర్మించగా సూచికబోర్డులు ఏర్పాటు చేయడం మరిచారు. కాగా బోల్తా పడిన బస్సుకు చెట్లు అడ్డంకిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన క్షతగాత్రులను 108లో భైంసా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై యూనిస్‌అహ్మద్ అలీ పేర్కొన్నారు. -
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే బస్సు ప్రమాదాలు
⇒ ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలపై చర్చా గోష్టిలో వక్తలు ⇒ అమలు కాని కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ నిబంధనలు ⇒ స్టేజి క్యారేజ్ పద్ధతిలో కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సులు ⇒ ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వాలు సాక్షి, హైదరాబాద్: ‘సమర్థవంతమైన ఆర్టీసీని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రైవేటు ట్రావెల్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు యాజమాన్యం స్పందించదు. ప్రభుత్వాలు సాంత్వన చర్యలు తీసుకుంటాయి. కానీ బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకున్న దాఖలా లుండవు. మరుసటి రోజునుంచి షరా మామూ లుగా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కుతాయి. ప్రభుత్వా ల్లో పెద్దలు, రాజకీయ నాయకుల ప్రవేయం ఉండడంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వాలు స్పందించనంత వరకు ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్ర వారం ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా వ్యతి రేక పోరాట సమితి చర్చాగోష్టి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రవాణాశాఖ మాజీ అదనపు కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ, ఏపీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్, జర్నలిస్టులు జి.సాయి, మురళీకృష్ణ, ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సుధాకర్, పీఎన్.మూర్తి, చైర్పర్సన్ ముక్తాల రేఖ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రావెల్స్ బస్సుల్లో కంటే ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. బస్సు ప్రమాదానికి సంబంధిం చి ముందుగా యాజమానిని బాధ్యులుగా చేయా లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెమో ఇచ్చిం దని, దీని ఆధారంగా పెనుగంచిప్రోలులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే జేసీ బ్రదర్స్‌ను అరెస్టు చేయాలని ఏపీసీసీ నేత గౌతమ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారేజీ పర్మిట్ పద్ధతిలో నడుస్తున్నాయని ఆర్టీఏ మాజీ అధికారి గాంధీ చెప్పారు. పెనుగంచిప్రోలు వద్ద బస్సు ప్రమాదం ఘటనా స్థలానికి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లి అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నా, అధికార పార్టీకి చెందిన వారెవరూ వెంటనే రాలేదని కొండా రాఘవరెడ్డి అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలపై త్వరలో కోదాడ వద్ద మహాధర్నా చేపడతా మని మహబూబ్‌నగర్ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. -
బస్సుల్లో ప్రమాదకర పదార్ధాల రవాణా
ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్లవలసిన బస్సులలో పేలుడు పదార్ధాలు, ప్రమాదకర రసాయన, ఇతర పదార్ధలు కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాదాపు అన్ని ట్రావెల్స్ సంస్థలకు చెందిన బస్సులలో అనుమతిలేకుండా అక్రమంగా ఇటువంటి పదార్ధాలను రవాణా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారు. ఆ తరువాత ఆ విషయం మరచిపోతారు. ఇదంతా షరామామూలైపోయింది. మనుషుల ప్రాణాలంటే ఈ అధికారులకు ఎంత చులకన! మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం సమీపంలో ఎన్‌హెచ్ 44పై బుధవారం ఉదయం ఘోర ప్రమాదానికి గురైన ఓల్వో బస్సులో కూడా ప్రమాదకర పదార్ధాలు రవాణా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటం వల్ల మంటలు వెంటనే దట్టంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఊలు ప్రమాదానికి కారణం కాకపోయినప్పటికీ, తక్షణం మంటలు వ్యాపించడానికి మాత్రం కారణమయిందని చెప్పవచ్చు. ఈ ఓల్వో బస్సు బెంగళూరు కేంద్రంగా పని చేసే జబ్బర్ ట్రావెల్స్‌కు చెందినది. ఈ బస్సులో ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఈ ట్రావెల్స్‌కు చెందిన గోడౌన్లో కెమికల్స్, ఇతర ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి వస్తుండగా ఉదయం 5:10 గంటలకు హైదరాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 45 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంగా వస్తున్న బస్సు మరో వాహనాన్ని తప్పించబోయే సమయంలో కల్వర్టును ఢీకొంది. దాంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. దానికి తోడు డ్రైవర్, క్లీనర్ బస్సులో నుంచి దూకి పారిపోయారు. లాక్ అయిన ఆటోమేటిక్ డోరును తీసేవారులేరు. నిమిషాల వ్యవధిలోనే గాఢ నిద్రలో ఉన్న 45 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అద్దాలు పగులగొట్టి అయిదుగురు మాత్రంమే బస్సులో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు మాత్రమే ప్రయాణించవలసిన బస్సుల్లో ప్రమాదకర పదార్దాలు రవాణా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం అధికం కావడానికి అవి కారణమవుతాయి. అలాగే ప్రమాదానికి గురైన బస్సుకు ఒక్కరే డ్రైవర్ ఉన్నాడు. వాస్తవానికి దూర ప్రయాణాలు చేసే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. రెండవ డ్రైవర్‌ను ఏర్పాటు చేయకపోవడం ట్రావెల్ ఏజన్సీ నిర్లక్ష్యం. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అధికారులకూ తెలుసు. కానీ మళ్లీ అక్కడా నిర్లక్ష్యం, నిర్లక్ష్యం.... నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకుంటుంది! అందుకు కారణమైనవారికి మాత్రం బుద్దిరాదు!! -
బస్సు ప్రమాదాలలో డ్రైవర్ల అప్రమత్తతే కీలకం
బస్సు ప్రమాదాలు.. ముఖ్యంగా బస్సులు తగలబడిపోవడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు డ్రైవర్లు ఏమాత్రం కొంత అప్రమత్తంగా ఉన్నా భారీ ప్రాణనష్టాలు తప్పుతాయి. అదే, వాళ్లు అజాగ్రత్తగా ఉంటే మాత్రం బుధవారం నాటి కొత్తకోట తరహా ఘోరాలు తప్పవు. గతానుభవాలను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో.. ఇదే సంవత్సరం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ సమీపంలో గల అంబర్ పేట వద్ద ఎస్వీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు కూడా ఒకటి తగలబడిపోయింది. కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆ బస్సు పెద్ద అంబర్ పేట ప్రాంతం చేరుకునేసరికి ఏసీలో గ్యాస్ లీకవ్వడం వల్లే మంటలు చెలరేగాయని అప్పట్లో చెప్పారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే బస్సు ఆపి, 40 మంది ప్రయాణికులందరినీ దించేయడం, అగ్ని మాపక దళ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి అక్కడకు చేరుకోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని వాళ్లే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో అక్కడినుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేర్చారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని కూడా అప్పట్లో నిపుణులు చెప్పారు. బస్సు బయల్దేరేముందే ఇన్సులేషన్, ఏసీ గ్యాస్, బస్సు కండిషన్ లాంటివి వెంటనే పరిశీలించుకోవాలి. లేనిపక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని చెప్పారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు కేవలం లాభాపేక్షతో వ్యవహరిస్తున్నాయే తప్ప, ఇద్దరు డ్రైవర్లను నియమించడం, బస్సు మొత్తాన్ని బయల్దేరేముందు చెక్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని బస్సు ప్రమాదాలు ఏప్రిల్ 27, 2011: శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎయిరో ఎక్స్ ప్రెస్ నుంచి ఆకస్మికంగా మంటలొచ్చి ఆ బస్సు దగ్ధమైంది. శంషాబాద్ పరిధిలోని పాతంరాయి వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, అప్పట్లో బస్సులో ఒక్కరే ప్రయాణికుడు ఉండటం, అతడిని కూడా డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వెంటనే దిగిపోయారు. బస్సు డ్రైవర్ జయరాజ్ మంటలు గమనించి వెంటనే బస్సు ఆపేశారు. అయితే, ఫైరింజన్ వచ్చేలోపే బస్సు మాత్రం మొత్తం తగలబడిపోయింది. నవంబర్ 2, 2009: చిత్తూరు పాత బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సులో ఇంజన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సు మంటలో చిక్కుకోవడంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.