బస్సు లోపల భీతావహ దృశ్యం
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది భక్తులు.. వేల కొద్దీ వాహనాలు.. పైగా ఘాట్ రోడ్డు. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం వరుస ప్రమాదాలతో రక్తమోడుతోంది. ఘాట్ రోడ్డు విస్తరణ నిర్లక్ష్యం కంటికి కనిపిస్తున్నా.. ఉన్న రోడ్డు నిర్మాణాన్ని సైతం పాలకులు పట్టించుకోకపోవడంతో 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం.. అక్కడి ఘాట్ పరిశీలనలో సంచలనాత్మక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొండగట్టు గుట్టపై నుంచి కిందికి దిగే 3.5 కిలోమీటర్ల మార్గం అత్యంత భయానక స్థితిలో ఉంది. ప్రమాదకరమైన మలుపులు, వాటి వద్ద కనీసం భద్రతా చర్యలు లేకపోవడం భవిష్యత్‌లో మరెంత మంది ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గుట్టపై నుంచి కిందకు వస్తున్న మార్గంలో ఐదు మలుపుల ప్రాంతం భవిష్యత్ ప్రయాణాన్ని ఆందోళనలో పడేస్తోంది. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, రెయిలింగ్ కూడా లేని దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో బయటపడింది. సాధారణ కల్వర్టు కోసం ఎప్పుడో 15 ఏళ్ల కింద నిర్మించిన కల్వర్టు సిమెంట్ రెయిలింగ్ ప్రాంతం ఇప్పుడున్న రోడ్డు కింద భాగంలోకి కుచించుకుపోయింది. ఇదే మలుపు వద్ద డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ మలుపుల ప్రాంతం నుంచి సుమారు 50 మీటర్ల లోతు ఉన్న లోయల్లో వాహనాలు పడే ప్రమాదం ఉంది. కొన్ని మలుపు ప్రాంతాల్లో రెయిలింగ్స్ ఏర్పాటు చేసినా పెద్దగా వాటితో ఉపయోగం లేదు. ఘాట్ రోడ్డులో కనీసం 2 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలి. రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేస్తే ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుంది.
భద్రతా చర్యలేవీ?
ప్రమాదం జరిగిన కొండగట్టు ఘాట్ రోడ్డులో ఎక్కడ కూడా ప్రమాద నివారణ సూచికలు, భద్రతా చర్యలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. అధిక లోడ్ ఉన్న వాహనాలను ఈ రోడ్డు మార్గంలో నడపడం ప్రమాదకరమని తెలిసినా నడుపుతున్నారు. కాగా, కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఆలయ కమిటీ, పాలక పక్షాలు, ప్రభుత్వవిభాగాలు కనీసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం ఈ కారణానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఘాట్ రోడ్డు కనీసం 100 ఫీట్ల నుంచి 120 ఫీట్లు అంటే డబుల్ రోడ్డుతో పాటు మధ్యలో రెండు ఫీట్ల వాహనల గ్యాప్ వదిలేసేలా ఉండాలి. కానీ ప్రస్తుతమున్న రోడ్డు 60 నుంచి 80 ఫీట్ల పరిధిలోనే ఉంది.
ఆ రోడ్డు కూడా విస్తరించాల్సిందే..
ఘాట్‌రోడ్డు కాకుండా కొండగట్టు గుట్టపైకి వచ్చేందుకు దొంగలమర్రి, జేఎన్‌టీయూ కాలేజీ మీదుగా మరో మార్గం ఉంది. ఆ మార్గం సైతం 80 ఫీట్ల లోపుగానే నిర్మితమైంది. ఈ రహదారిలో 40 శాతం మేర ఘాట్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కీలక మలుపులు సైతం వాహనదారులను వణికించేలా కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్ విస్తరణతో పాటు జేఎన్‌టీయూ, దొంగలమర్రి రహదారిని విస్తరించే ప్రమాదాల నియంత్రణతో పాటు రాకపోకలు, సౌలభ్యం కూడా కలిసివస్తుందని భక్తులు కోరుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు కొండగట్టు వెళ్లేందుకు ఉన్న రెండు మార్గా లనూ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ డీజీ కృష్ణప్రసాద్ పరిశీలించారు. ప్రమాదం జరగానికి ఓవర్‌వెయిట్ కారణంతో పాటు రోడ్ డెవలప్‌మెంట్ కూడా ఉందని అభిప్రాయపడ్డారు. రోడ్ రెయిలింగ్స్‌ను విస్తరించి, సూచికలు, భద్రతాచర్యలు, రోడ్డు ఇంజనీరింగ్‌పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
దేశంలో ఈ ఏడాది జరిగిన భారీ బస్సు ప్రమాదాలు
జూలై01
ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని పౌరీ గర్వాల్‌లో జరిగిన ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది.
జనవరి29
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని గోబ్రా కెనాల్‌లోకి బస్సు దూసుకెళ్లడంతో 45 మంది చనిపోయారు.
జూలై 28
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో డాపోలి వ్యవసాయ వర్సిటీ సిబ్బందితో వెళ్తున్న బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు.
ఏప్రిల్10
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని నుర్పూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 30 మంది చనిపోయారు.
మృతుల వివరాలు:
1. నామాల మౌనిక (23), శనివారంపేట
2. బైరి రిత్విక్(3), రామసాగర్
3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
5. గండి లక్ష్మీ (60), శనివారంపేట
6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి
7. బండపల్లి చిలుకవ్వ(76)
8. గోలి అమ్మాయి(44), శనివారంపేట
9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట
12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట
13. బొల్లారం బాబు (54), శనివారంపేట
14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట
15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట
16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట
17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
18. ఉత్తమ్ నందిని , కోనాపూర్
19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి
21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్
22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
23. కుంబాల సునంద (45), శనివారంపేట
24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట
26. దాసరి సుశీల (55), తిరుమలపూర్
27. డ్యాగల ఆనందం(55), రామసాగర్
28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట
29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట
30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి
31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట
32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి
33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి
34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి
35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి
36.కొండ అరుణ్ సాయి(5), కోరెం
37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి
38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్
39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్
40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి
41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట
42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి
43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్
44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి
45. చిర్రం పూజిత (15, జగిత్యాల
46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట
47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్
48. చెర్ల మౌనిక (24), రాంసాగర్
49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)
50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్
51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట
52. డ్యాగల స్వామి (32), రాంసాగర్
53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట
54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్
55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి
56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల
57. గోలి రాజమల్లు (60), శనివారంపేట
Comments
Please login to add a commentAdd a comment