ఇస్లామాబాద్/కరాచీ: పాకిస్తాన్‌లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సుల ప్రమాదాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది యాత్రికులు సైతం ఉన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మాక్రాన్ తీరప్రాంత జాతీయరహదారిపై 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీకొట్టింది. దీంతో బస్సులోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ఇరాన్‌లో పర్యటించిన షియా యాత్రికులను తిరిగి పంజాబ్ ప్రావిన్స్‌కు తీసుకొస్తుండగా బస్సు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది లాహోర్, గజ్రన్‌వాలా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
లోయలో పడి..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 29 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. అయితే పర్వతప్రాంతంలో ఘటన జరగడంతో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతులు సధాయోతి జిల్లాకు చెందిన వారని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ ఉమర్ ఫరూక్ చెప్పారు. ఘటనపై పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంతాపం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment