హజ్ విషాదంలో 74 మంది భారతీయుల మృతి | Death toll of Indians in Haj stampede rises to 74 | Sakshi
Sakshi News home page

హజ్ విషాదంలో 74 మంది భారతీయుల మృతి

Published Tue, Oct 6 2015 12:10 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

Death toll of Indians in Haj stampede rises to 74

న్యూఢిల్లీ : గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా మృతిచెందిన వారి సంఖ్య రోజుకోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భారత్కు చెందిన యాత్రికులు 74 మంది మృతిచెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆదివారం నాటికి ఈ మృతుల సంఖ్య 58గా ఉండేది.

మీనాలో జరిగిన హజ్యాత్ర తొక్కిసలాట మృతుల పేర్లను ఇండియన్ కాన్సులేట్ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మక్కాలో సెప్టెంబర్ 24న జరిగిన ఈ దుర్ఘటన కారణంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా మృతిచెందిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement