మక్కామృతుల్లో 14 మంది భారతీయులు!
హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 14 మంది భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మనవాళ్లు 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జెడ్డాలోని కాన్సల్ జనరల్ చెప్పారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న సుష్మా.. ఎప్పటికప్పుడు సౌదీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సౌదీ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే కచ్చితమైన సంఖ్య తెలుస్తుందన్నారు. గురువారం నాటి తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే. మక్కాతో పాటు సౌదీ అరేబియా వెళ్లే యాత్రికుల కోసం ఉద్దేశించిన ఎమర్జెన్సీ నంబర్లను కూడా సుష్మా ప్రకటించారు.
ఎమర్జెన్సీ నంబర్లు ఇవీ..
మక్కాలో ఎమర్జెన్సీ నంబర్లు: 00966125458000, 00966125496000
సౌదీ అరేబియా భక్తుల కోసం టోల్ఫ్రీ నంబర్లు: 8002477786
Our Consul General Jeddah reports loss of 14 Indian lives in stampede. We have 13 injured in hospital. #Mecca
— Sushma Swaraj (@SushmaSwaraj) September 25, 2015
The exact number will be known after confirmation by Saudi authorities.
— Sushma Swaraj (@SushmaSwaraj) September 25, 2015
Our emergency Nos in Mecca : 00966125458000 00966125496000 Toll free number for pilgrims in Saudi Arabia : 8002477786
— Sushma Swaraj (@SushmaSwaraj) September 24, 2015