
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది.
రికార్డులు
రెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్‌కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.
రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులు
దేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.
సుష్మా స్వరాజ్ (బీజేపీ)
బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.
షీలా దీక్షిత్, (కాంగ్రెస్)
కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు.
అతిషి మార్లెనా సింగ్ (ఆప్)
8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.
రేఖా గుప్తా(బీజేపీ)
రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment