sheela dixit
-
ఊడ్చుకుపోయింది!
-
హస్తిన హ్యాట్రిక్ విజేత
ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. 81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్. ఆసక్తికరం...షీలా ప్రేమాయణం! ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్‌కు వినోద్ దీక్షిత్‌తో పరిచయమైంది. వినోద్ దీక్షిత్ కాంగ్రెస్ నేత ఉమా శంకర్ కొడుకు. వినోద్ చురుకైన వాడు, మంచి క్రికెటర్ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు. అనూహ్యంగా రాజకీయ ప్రవేశం షీలా మామ ఉమా శంకర్ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. వివాదాలు, పురస్కారాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు, 2009లో బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్ వేలెత్తి చూపించింది. -
షీలా దీక్షిత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్(81) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. షీలా మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. షీలా భౌతిక కాయాన్ని ఈస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. షీలా దీక్షిత్ శనివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స అందించింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి తాత్కాలికంగా కుదుటపడింది. కొద్ది సేపటి తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రముఖుల సంతాపం ఢిల్లీ సీఎంగా షీలా నగర రూపురేఖలనే మార్చేశారని, ఆమె ప్రజల మదిలో కలకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. షీలా మంచి పరిపాలనాదక్షురాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా సేవలు శ్లాఘనీయమని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మోదీ షీలా నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. షీలా మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ను ఆయన..అత్యంత ఆత్మీయురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమాన పుత్రికగా పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ప్రజా నేతలను కాంగ్రెస్ కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆమె మరణం తీరని నష్టమని, ఆమె సేవలను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. షీలా దీక్షిత్ కుమార్తె, కుమారుడికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఉంచారు. ‘మీ తల్లికి నా హృదయంలో గొప్ప స్థానముంది. నా భర్త రాజీవ్‌తో షీలాజీకి మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెతో నాకూ స్నేహం ఏర్పడింది. షీలాజీకి ఉన్న అనేక సుగుణాలను నేను అభిమానించడం ప్రారంభించాను. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, డీపీసీసీ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేశాం’ అని సోనియా పేర్కొన్నారు. సమర్ధురాలైన పాలకురాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: సీనియర్ రాజకీయవేత్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాదంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె మరణంతో దేశం ఒక సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. షీలా దీక్షిత్ పోరాట పటిమకు, సాహసానికి, చురుకుదనానికి పెట్టింది పేరని జగన్ కొనియాడారు. షీలా చివరి ఆదేశాలు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో ప్రతిష్టంభన తొలగని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగాలని పార్టీ కార్యకర్తలను షీలా దీక్షిత్ కోరినట్లు తెలుస్తోంది. యూపీలో పర్యటిస్తున్న ప్రియాంకను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం కూడా ఆమె నిర్బంధం కొనసాగినట్లయితే బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలపాల్సిందిగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ హోదాలో షీలా దీక్షిత్ కార్యకర్తలకు శుక్రవారం ఆదేశాలిచ్చినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అవసరమైతే ఆదివారం కూడా నిరసన కొనసాగించాలని కూడా ఆమె చిట్టచివరి ఆదేశాలు జారీ చేశారని పార్టీ నేత కిరణ్ వాలియా వివరించారు. -
వెనక్కు తగ్గని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జూన్ 1న సీపీపీ భేటీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు. -
మట్టికరిచిన మాజీ సీఎంలు
తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఊహించని రాజకీయ సునామీ సృష్టించారు. దశాబ్దాల అనుభవమున్న హేమాహేమీలైన నేతలు, మాజీ ముఖ్యమంత్రులతోపాటు, ఒక మాజీ ప్రధాని సైతం ఈ సునామీలో కొట్టుకుపోయారు. ఈ రాజకీయ విలయం ధాటికి 12 మంది మాజీ ముఖ్యమంత్రులు మట్టికరిచారు. వీరిలో ఎనిమిది మంది కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులే కావడం గమనార్హం..! ఒక ప్రధాని అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని వరుసగా రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సంభవించింది. ఒకటి ఇందిరాగాంధీ హయాంలోదైతే.. రెండోది తాజాగా నరేంద్ర మోదీ హయాం! అదే సమయంలో ఒక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోవడం కూడా ఇదే ప్రథమం. దేశ రాజధాని ఢిల్లీని ఒకప్పుడు ఏలిన షీలాదీక్షిత్ ఢిల్లీ(ఈశాన్య) లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 3.16 లక్షల ఓట్ల తేడాతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మాజీ ప్రధాని, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయిన హెచ్.డి.దేవెగౌడ తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒక్కళిగలు, లింగాయత్‌ల మధ్య సమరంగా పరిగణించిన తుముకూరు ఎన్నికల్లో 87 ఏళ్ల దేవెగౌడ పోటీ చేయడంపై తొలి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా మాండ్య, హాసన్‌ల నుంచి పోటీ చేసే గౌడ కుటుంబం ఈసారి తుముకూరుకు రావడం స్థానికులకు పెద్దగా రుచించలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ నేత ముద్దె హనుమేగౌడ నుంచి సహకారం అంతంతమాత్రమే అయింది. దీంతో దేవెగౌడ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దిగ్విజయ్ పరాజయం... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ వివాదాస్పద బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. రాజ్గర్ నుంచి బరిలోకి దిగాలని ప్రజ్ఞా సింగ్ ఆలోచించినా.. చివరకు పార్టీ నిర్ణయం ప్రకారం భోపాల్ బరిలోకి దిగి ఏకంగా 8.6 లక్షల ఓట్లు సాధించగా.. దిగ్విజయ్‌కు మాత్రం ఐదు లక్షల ఓట్లే పడ్డాయి. మహారాష్ట్రలో ఇద్దరికి ఓటమి... మహారాష్ట్ర ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో చతికిలపడ్డారు. నాందేడ్‌లో అశోక్ చవాన్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్ రావు చికాలికర్ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే షోలాపూర్ స్థానంలో లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి బరిలోకి దిగడంతో సంప్రదాయ ఓటర్లు చీలిపోయి అది కాస్తా బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్ శివాచార్యకు ఉపకరించిందని అంచనా. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు 5.24 లక్షల ఓట్లు దక్కాయి. ఉత్తరాఖండ్, మేఘాలయాల మాజీ ముఖ్యమంత్రులు హరీశ్ రావత్, ముకుల్ సంగ్మాలతోపాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ చిక్కబళాపురం నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. భూపీందర్ హుడా (హరియాణా), మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), బాబూలాల్ మరాండి (జార్ఖండ్), శిబూ సోరెన్ (జార్ఖండ్)లు కూడా ఓటమిపాలైన మాజీ సీఎంల జాబితాలో ఉన్నారు. -
పొత్తులు లేవు.. త్రిముఖ పోరు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం నామినేషన్ల పర్వం ముగియడంతో లోక్‌సభ ఎన్నికల పోటీ చిత్రం స్పష్టమైంది. పొత్తుపై గత కొద్ది నెలలుగా ఊగిసలాడిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తుండడంతో నగరంలో ముక్కోణపు పోటీ ఖాయమైంది. పొత్తుపై కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతూనే ఆప్ ఏడు సీట్లకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో ఆప్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం మిగతా రెండు పార్టీల కన్నా ముందే ముగిసింది. కాంగ్రెస్ సోమవారం అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ అభ్యర్థులందరు ఆఖరి రోజునే నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులలో మనోజ్‌తివారీ, డా.హర్షవర్థన్, పర్వేష్ వర్మ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా మిగతా నలుగురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు సమర్పించారు. బీజేపీ మంగళవారం వాయవ్య ఢిల్లీ అభ్యర్థిని ప్రకటించింది. వాయవ్య ఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇవ్వకుండా గాయకుడు హన్స్ రాజ్ హన్స్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఢిల్లీ నుంచి పోటీచేసే సెలబ్రిటీల సంఖ్య మూడుకు పెరిగింది. బాక్సర్ విజేందర్ సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా, గాయకుడు హన్స్‌రాజ్‌తోపాటు క్రికెటర్ గౌతం గంభీర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. అనుభవానికి కాంగెస్ర్.. యువతకు ఆప్ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రె‹స్ రాజకీయ అనుభవానికే ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దక్షిణ ఢిల్లీ నుంచి పార్టీ బరిలోకి దింపిన 33 సంవత్సరాల బాక్సర్ విజేందర్ సింగ్ మినహా ఆ పార్టీ అభ్యర్థులంతా రాజకీయంలో తలపండినవారే. మూడు పార్టీల అభ్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థులే పెద్ద వయసు వారు. వారి సగటు వయసు 57 సంవత్సరాలు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న 81 సంవత్సరాల షీలాదీక్షిత్ ఈ ఎన్నికల్లో అభ్యర్థులందరిలోకి పెద్ద వారు. ఇక, మిగతా పార్టీలతో పోల్చుకుంటే అతి తక్కువగా ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న యువ అభ్యర్థులతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచింది. వయసులోనూ మిగతా పార్టీల అభ్యర్థుల కన్నా ఆప్ అభ్యర్థులు తక్కువ వయసు కలిగి ఉన్నారు. వారి సగటు వయకు 45 సంవత్సరాలుగా ఉంది. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న 30 సంవత్సరాల రాఘవ్ చద్దా మూడు పార్టీల అభ్యర్థులలో అతి పిన్న వయçస్కుడు. సిట్టింగ్ అభ్యర్థులు, సెలెబ్రిటీలతో బరిలో బీజేపీ మోడీ బలం నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చింది. తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న 37 సంవత్సరాల గౌతం గంభీర్, వాయవ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న గాయకుడు హన్స్ రాజ్ హన్స్ మినహా మిగతా ఐదుగురు అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసినవారే. ఈ ఇద్దరు కూడా తమ తమ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన సెలబ్రిటీలే. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో మూడు పార్టీలు కంటితుడుపు వైఖరినే పాటించాయి. ఆప్ తూర్పు ఢిల్లీ నుంచి అతిషీని, కాంగ్రెస్ ఈశాన్య ఢిల్లీ నుంచి షీలాదీక్షిత్‌ను, బీజేపీ న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లేఖిని నిలబెట్టాయి. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే నియోజకవర్గం ఆప్ బీజేపీ కాంగ్రెస్ న్యూఢిల్లీ బ్రజేష్ గోయల్ మీనాక్షి లేఖి అజయ్ మాకెన్ తూర్పుఢిల్లీ అతిషీ గౌతం గంభీర్ అర్విందర్ సింగ్ లవ్లీ వాయవ్య ఢిల్లీ గూగన్ సింగ్ హన్స్ రాజ్ హన్స్ రాజేష్ లిలోఠియా ఈశాన్య ఢిల్లీ దిలీప్ పాండే మనోజ్ తివారీ షీలాదీక్షిత్ దక్షిణ ఢిల్లీ రాఘవ్ చద్దా రమేష్ బిధూడీ విజేందర్ సింగ్ చాందినీ చౌక్ పంకజ్ గుప్తా డా.హర్షవర్థన్ జేపీ అగర్వాల్ పశ్చిమ ఢిల్లీ బల్బీర్ సింగ్ ఝాకడ్ పర్వేష్ వర్మ మహాబల్ మిశ్రా -
వేడెక్కిన పొత్తు రాజకీయాలు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ఎలాంటి పొత్తు ఉండదని, ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీచేస్తామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ తెలిపారు. ‘మేం ఒంటరిగానే పోటీచేయాలని సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఆప్‌తో ఎలాంటి పొత్తూ ఉండదు’ అని మంగళవారం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీ పార్టీ నేతల సమావేశం అనంతరం షీలాదీక్షిత్ మీడియాతో చెప్పారు. ‘ఆప్‌తో పొత్తును రాహుల్ కూడా వ్యతిరేకించారు, ఇక మేం ఒంటరిగానే ప్రణాళిక రూపొందించుకుంటాం’ అని ఆమె మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. మెజారిటీ నేతల అభిప్రాయంతోనే వెళ్ళాలని, పార్టీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలని ఆయన నేతలను కోరారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తుందని షీలాదీక్షిత్ తెలిపారు. మూడు సీట్లు కాంగ్రెస్‌కి, మూడు ఆప్‌కి, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించేలా ఆప్ కాంగ్రెస్‌కు ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకుగాను ఆప్ ఆరు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఒంటరిగానే పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని, వారిది అసహజ పొత్తుగా అభివర్ణించారు. కూటమిలో కాంగ్రెస్ భాగమే: అఖిలేశ్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తమ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగమేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ కోసం తమ కూటమిలో రెండు సీట్లు కేటాయించామని వెల్లడించారు. మూడు నియోజకవర్గాలను కూటమిలో భాగంగా రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)కి అప్పగించేందుకు ఎస్పీ–బీఎస్పీలు అంగీకరించాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా, 37 చోట్ల ఎస్పీ, 38 చోట్ల బీఎస్పీ పోటీ చేస్తాయని గతంలోనే పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఆయన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోమని ప్రకటించాయి. కాగా, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. -
ఆప్‌తో పొత్తు ఉండదు : షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు ఉండదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో మంగళవారం సమావేశమైన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఢిల్లీ పార్టీ చీఫ్ షీలా దీక్షిత్ ప్రకటనతో తెరపడింది. ఢిల్లీలో బీజేపీ క్వీన్‌స్వీప్ చేయకుండా నిరోధించేందుకు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అవసరమని కేజ్రీవాల్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లు పరస్పరం ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న క్రమంలో ఆప్‌తో పొత్తు పొసగదని సీనియర్ నేత షీలా దీక్షిత్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీచేస్తే దేశరాజధానిలో బీజేపీకి మేలు చేకూరుతుందని ఆప్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌లో కుదుపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం పెద్ద కుదుపు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను ఉటంకిస్తూ ఆయన రాజీనామా సమర్పించారని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి పీసీ చాకో, అజయ్‌మాకెన్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, రాహుల్ గాంధీ ఆయన రాజీనామాను అంగీకరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం తరువాత 54 సంవత్సరాల అజయ్ మాకెన్ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. సహకారం అందించినందుకు కృతజ్ఞతలు: మాకెన్ తన రాజీనామా విషయాన్ని అజయ్ మాకెన్ ట్వీట్ చేసి తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా çతనకు అందించించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తరువాత తనకు పార్టీ కార్యకర్తల నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కవర్ చేసే మీడియా నుంచి, రాహుల్ గాంధీ నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించాయని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితులలో నాయకత్వం సులభం కాదని, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. సెప్టెంబర్‌లోనే వార్తలు... మాకెన్ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసినట్లు సెప్టెంబర్‌లో కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆరోగ్య కారణాల వల్లనే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆయన రాజీనామా వార్తను ఖండించింది. ఈసారి కూడా రాజీనామాకు కారణాన్ని మాకెన్ వెల్లడించలేదు. కానీ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ çపార్టీ పొత్తు కుదుర్చుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామాపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పొత్తును మాకెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మాకెన్‌ను మళ్లీ అఖిల బారత కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. రేసులో షీలాదీక్షిత్.. మాకెన్ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆ పదవిని ఆక్రమిస్తారని కూడా పార్టీలో కొందరు అంటున్నారు. పార్టీ అధిష్టానం కోరితే తిరిగి ఢిల్లీ రాజకీయాలలో పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని, అధిష్టానం కుదుర్చుకునే పొత్తులు తనకు ఆమోదయోగ్యమని ఆమె ఇదివరకే ప్రకటించారు. పొత్తు ఊహాగానాలను కాంగ్రెస్, ఆప్ కూడా ఖండించడం లేదు. కాంగ్రెస్ నేతలు యోగానందశాస్త్రి, రాజ్‌కుమార్ చౌహాన్, హరూన్ యూసఫ్, చతర్ సింగ్‌ల పేర్లను కూడా పార్టీ డీపీసీసీ అధ్యక్షపదవికి పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు మూడు రోజులు అమే«థీ పర్యటనకు వెళ్తున్నందువల్ల డీపీసీసీ అధ్యక్షపదవిపై నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని వారు చెప్పారు. -
18 ఏళ్లుగా ఆ రోడ్డు నిర్మాణం సా..గుతోంది!!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని రాజకీయ పార్టీలపై విమర్శలు రావడం మామూలే. అయితే 18 ఏళ్ల క్రితం మంజూరైన ఓ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలు.. ఢిల్లీ, నొయిడా, ఫరిదాబాద్ను కలుపుతూ సాగే కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రాజెక్టుతో పాటు అదే ఏడాదిలో ఢిల్లీ మెట్రోకు కూడా కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేశారు. అయితే 277 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మెట్రో నిర్మాణం పూర్తి చేసుకోగా, 13.7 కిలోమీటర్ల కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు మాత్రం అటకెక్కింది. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాడానికి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుని మంజూరు చేయగా, అంతకంతకూ పెరిగిన వాహనాల రద్దీలో దక్షిణ ఢిల్లీ ఊపిరి సలపకుండా ఉంది. అన్నీ ఆటంకాలే..! ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను వివరణ కోరగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల కారణంగా నిర్మాణం ఆగిపోయిందని తెలిపింది. ఓక్లా పరిరక్షణ కేంద్రం(బర్డ్ శాంక్చూరీ) మీదుగా రోడ్డు వేయాల్సి రావడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయని పేర్కొంది. అయితే రీడిజైన్ అనంతరం మట్టి తవ్వకాలు, కొలతలు చేపట్టామని వివరించింది. కానీ, రోడ్డు నిర్మాణానికి అవరసమైన 43 ఎకరాలకు యూపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున 2007లో మరోమారు పనులు నిలిచిపోయాయని తెలిపింది. కాగా, భూ అనుమతుల విషయమై 2017లో ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది. -
డైలమాలో షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ పదవి నుంచి వైదొలగాలా వద్దా అనే డైలామాలో పడ్డారు. సోమవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాజీనామా చేసే విషయం గురించి చర్చించినట్టు సమాచారం. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ షీలా భేటీ కానున్నారు. సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం యూపీఏ హయాంలో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరూ వైదొలగాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే కొందరు గవర్నర్లు వైదొలగగా, మరికొందరు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. మాటవినని గవర్నర్లపై కేంద్ర వేటు వేసి బదిలీ చేసింది. ఇంతకుముందు పదవి నుంచి వైదొలిగేది లేదన్న షీలా ఏంచేస్తారో చూడాలి. -
ఎదురు తిరిగిన గవర్నర్లకు పొగ!
పలు కేసుల్లో సీబీఐ విచారణకు అనుమతించాలని యోచన న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు పదవి నుంచి వైదొలగేందుకు ససేమిరా అంటుండటంతో కేంద్రం వారిని సాగనంపేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. రాజకీయ పలుకుబడిగల లేదా పదవీకాలం తొలినాళ్లలో ఉన్న గవర్నర్ల తొలగింపే మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల కొందరు గవర్నర్లను రాజకీయ ప్రాధాన్యతగల రాష్ట్రాలు లేక పెద్ద రాష్ట్రాల నుంచి అప్రాధాన్య రాష్ట్రాలకు బదిలీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల వారంతట వారే తప్పుకునేలా చేయొచ్చని కేంద్రం భావిస్తోందని వివరించాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, గోవా గవర్నర్ వాంచూలను సాక్షులుగా సీబీఐ ప్రశ్నించేందుకు అనుమతించాలన్న ఆలోచనను అమలుచేయడం గురించి కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ గవర్నర్‌గా ఉన్న షీలాదీక్షిత్‌ను సైతం 2010 నాటి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అవకతవకలపై ప్రశ్నించేలా ఇదే రకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. కాగా, గవర్నర్ల మార్పుపై కేంద్రం తీరును తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తలను నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ ఖండించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రాజీనామా: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్ తన పదవికి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాల్సిందిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శేఖర్ దత్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. -
ఆహారం అంటూ అన్యాయం చేశారు
అన్నశ్రీ యోజన అమలు కావడం లేదు లబ్ధిదారులకు రూపాయి కూడా చెల్లించలేదు ప్రకటనల కోసం మాత్రం రూ.కోట్లు ఖర్చు చేశారు కేజ్రీవాల్, దీక్షిత్‌పై మండిపడ్డ హర్షవర్ధన్ న్యూఢిల్లీ: ఆహారభద్రత పథకం పేరుతో ఇద్దరు ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్ 15 లక్షల మంది ఢిల్లీవాసులను వంచించారని ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం అన్నారు. ఆహారభద్రతలో భాగంగా అన్నశ్రీ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తామని ఆప్, కాంగ్రెస్ ప్రకటించాయన్నారు. ‘ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ రూపాయి కూడా చెల్లించలేదు. ఆహారభద్రత పథకం అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ అంటూ అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియాలో ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రకటనలకే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా పేదలకు ఒక్క పైసా చెల్లించలేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా అన్నశ్రీ యోజనను అమలు చేయలేదు. ఈ పథకం కోసం దాదాపు 15 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. దీనిని జాతీయ ఆహార భద్రత పథకంలో కలిపేశామని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది’ అని హర్షవర్ధన్ వివరించారు. నెలకు రూ.600 వస్తాయనే ఆశతో ఎంతో మంది అధికారులకు లంచాలు చెల్లించి లబ్ధిదారులుగా పేర్లు నమోదు చేసుకున్నరని, ప్రభుత్వం ఒక్క పైసా చెల్లించకుండా దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినా ఢిల్లీలో ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదని బీజేపీ విమర్శించింది. బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వస్తే పేదలందరికీ తక్కువ ధరలకు సరుకులు అందజేస్తామని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రకటించారు. -
కమల వికాసాన్ని ‘ఆప్’తుందా!?
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లుగా దేశరాజధానిలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈమా రు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎంసీడీల్లో బీజేపీ పట్టునిలుపుకుంటున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేప్పటికి ఢిల్లీవాసులు ఆ పార్టీకి మొండి ‘చెయ్యి’ చూపుతూనే ఉన్నారు. ఎలాగైనా ఈమా రు విజయాన్ని ఒడిసిపట్టుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి క్రమంగా పెరుగుతున్న మద్దతుతో బెంగపట్టుకుంది. అసంతృప్త నేతల ఇంటిపోరూ.. కొంపముంచేలా ఉంది. రెండు రోజుల క్రితం విధానసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత అసంతృప్త నాయకులు నగరపార్టీ కార్యాలయంలో, నేతల ఇళ్ల ఎదుట నానాయాగీ చేసిన విషయం తెలి సిందే. ఇందం తా ఓవైపు ఉండగా, మరోవైపు చాపకిందనీరులా ఢిల్లీ అంతటా మద్దతు పెంచుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నాయకులకు నిద్రపట్టనివ్వడం లేదు. ఇన్నాళ్లు ఆ పార్టీని లైట్ తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఆలోచనలో పడింది. కిం కర్తవ్యం? ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకోవాలంటే ఏ ప్రణాళికలు రూపొందిస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉంది ఢి ల్లీ కమల దళం. అధికార కాంగ్రెస్‌ను పదిహేనేళ్ల పాలనలోని లోపాలు, ధరలు పెరుగుదల, కుంభకోణాలు వంటి అంశాలతో ఇరుకున పెడుతూ వస్తున్న బీజేపీ నాయకులకు ‘ఆప్’విషయానికి వచ్చేప్పటికి సరైన అస్త్రాలు దొరకడం లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికలబరిలో దిగుతుండడం, పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ‘నిజాయతీ’గా వెళ్లడంతో ఆప్‌ను ఇరికిం చేందు బీజేపీకి అవకాశాలు అంతగా కనపడడం లేదు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై వ్యతిరేకత కూడగట్టడంలో కొంత వరకు బీజేపీ నేతలు సఫలం అయ్యారు. ఈ సమయంలో ‘ఆప్’బలపడుతుండడం బీజేపీకి నష్టం చేసే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొరకరాని కొయ్యగా మారిన కేజ్రీవాల్.. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అటు కాంగ్రెస్‌పై, ఇటు బీజేపీపై అవినీతి అంశంతో ముప్పేట దాడి మొదలుపెట్టారు. నగరంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలా అయితే ప్రజావ్యతిరేక విధానాలకు, కుంభకోణాలకు పాల్పడిందో.. ఇన్నేళ్లుగా ఎంసీడీల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కూడా అదే పంథా లో వెళ్లిందంటూ రెండు పార్టీలను ఒకేగాటన కట్టేప్రయత్నం చేస్తున్నారు. అవినీతిరహిత పాలన కావాలంటే రెండు పార్టీలకు అవకాశం ఇవ్వొద్దంటూ ముందుకెళ్తుతున్నారు. ఇటీవల సర్వేలన్నీ ఆప్‌కి అనుకూలంగా వస్తుండడంతో ఆయన మరింత ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎత్తులు... రాజధానిలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వెళ్లే ధోరణే అవలంబిస్తుంటుంది. ఈ మారు అదే తరహాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు హస్తం నాయకులు. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ జాబితా విడుదల కావడం ఢిల్లీలో సంప్రదాయంగా వస్తోంది. ప్రత్యర్థి బలాబలాల ఆధారంగా అవసరమైతే పార్టీ అభ్యర్థులను మార్చే యోచనలో ఉంది. పనిలోపనిగా టికెట్లు రాకుండా ఉన్న బీజేపీ అసంతృప్త నాయకులకు గాలం వేయడంలో కాంగ్రెస్ నేతలు తలమునకలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొంత మేర బీజేపీ ఓట్లను చీల్చాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ జాబితా విడుదలవనుంది. కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలిస్తే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం.