ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా షీలా దీక్షిత్‌ | Sheila Dikshit appointed Delhi pcc | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా షీలా దీక్షిత్‌

Published Fri, Jan 11 2019 5:26 AM | Last Updated on Fri, Jan 11 2019 5:26 AM

Sheila Dikshit appointed Delhi pcc - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్‌ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న అజయ్‌ మాకెన్‌ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement