pcc president
-
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌గౌడ్ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్‌పార్కు వద్దకు రానున్న మహేశ్‌గౌడ్ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్‌కు చేరుకుంటారని తెలిపాయి.బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్‌లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్లతో పాటు రాష్ట్ర కేబినెట్లోని మంత్రులు హాజరుకానున్నారు. ముస్తాబైన గాందీభవన్.. కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్‌కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్మెన్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్‌సాగర్‌రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్‌గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్‌లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్‌లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. వచ్చే నెల తొలివారంలో నియామకాలు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు. రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్‌హౌజ్‌లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు.. హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్‌లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్‌లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు. -
చివరి దశకు ‘పీసీసీ’ కసరత్తు!
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఢిల్లీలో విస్తృతంగా చర్చలు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతోపాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్, సంపత్‌కుమార్ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్‌తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీని మహేశ్‌గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ చర్చించారు. తెలంగాణ భవన్లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా..పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు. -
ఎమ్మెల్యేలు జంప్.. పీసీసీ చీఫ్ రాజీనామా
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు. నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ బీజేపీలో చేరారు. -
ఆరేళ్లలోనే... అత్యున్నత హోదాకు
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. వైఫల్యాలను అధిగమిస్తూ.. కాంగ్రెస్ పార్టిలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. -
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్ వారింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్ రాజా వారింగ్‌ను పార్టీ అధినేత సోనియా గాంధీ శనివారం నియమించారు. ప్రతాప్‌సింగ్ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) కొత్త నాయకుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్‌సింగ్ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ పంజాబ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
ఈనెల 23న పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న సిద్దూ
చంఢీగడ్: పంజాబ్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 23న పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్ రావత్ సహా పలువురు ప్రముఖలకు ఆయన ఆహ్వానం పంపారు. ఇదిలా ఉంటే, సీఎం అమరీందర్‌పై సిద్దూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు సిద్దును సీఎం కలిసే అవకాశమే లేదని ప్రభుత్వ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ కోసం అమరీందర్ సింగ్ ఎలాంటి సమయాన్ని కేటాయించలేదనినాయన అన్నారు. మరోవైపు సిద్దూ ఇవాళ 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్‌సర్‌లోని తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతో పాటు పలు ఆథ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. -
చచ్చినా కాంగ్రెస్‌ను వీడను: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, జహీరాబాద్: కాంగ్రెస్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, చచ్చినా పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేయడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. పీసీసీ పదవి భర్తీలో జాప్యం వల్లే కొంత మంది సీనియర్లు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలను సాకుగా చూపుతూ ఇంకా జాప్యం చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తోందని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను ఏఐసీసీ దాదాపు పూర్తి చేసింది. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ మరికొద్ది రోజులు సాగనుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సుమారు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ల బృందం అధిష్టానానికి తమ నివేదికను సమర్పించింది. అయితే గత రెండ్రోజులుగా ఠాగూర్ సమర్పించిన ఆశావహుల జాబితా నివేదికపై ఏఐసీసీ స్థాయిలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసన్‌లు రెండుసార్లు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఇతర రాజకీయపక్షాలకు ధీటుగా పార్టీని నడిపించగల సామర్థ్యం ఉన్న వారినే నియమించాలని ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ కీలక నేత తెలిపారు. మరోవైపు ఈ విషయంపై చర్చించేందుకు అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అనేకసార్లు భేటీ అయ్యారు. చదవండి: (వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం) అసంతృప్తి తగ్గించడం ఎలా..? అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయిలో లేదా ఏఐసీసీ స్థాయిలో మెరుగైన పదవులు కట్టబెట్టడం ద్వారా అసంతృప్తి తగ్గించవచ్చని పెద్దలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాహుల్ గాంధీ స్వయం గా ఆశావహులతో మాట్లాడిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటారని, శని, ఆదివారాల్లో ఆయన వారితో మాట్లాడుతారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) పార్టీ బలోపేతంపై దృష్టి.. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై వచ్చిన వ్యతిరేకతను బీజేపీ కంటే ముందే తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. అందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 2021 జనవరి 1 నుంచి కొత్త యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత మండల స్థాయి అ«ధ్యక్షుల నియామకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేదా కొత్త అధ్యక్షులను నియమించాలా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయ్యాక జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరుగుతాయని తెలిసింది. పీసీసీ కమిటీల్లో భారీ కోతలు.. ప్రస్తు తం భారీగా ఉన్న పీసీసీ కమిటీలో కోతలు ఉండే అవకాశం ఉంది. 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, 27 మం ది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను కుదించనున్నారు. జిల్లా స్థాయి లో ఓ అధికార ప్రతినిధి, పీసీసీ స్థాయిలో 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను కొత్త కమిటీలో నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. -
శివకుమార్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలకు పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం ఉండదని, తనంతట తాను ఉత్తమ్ తప్పుకుంటే తప్ప పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండ దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ తప్పుకుంటే పీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలుంటారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటి ఇచ్చిందని చెప్పిన జగ్గారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 20–25 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలు స్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే సానుకూలత ఉంటుందని, అయినా కాంగ్రెస్ కూడా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం లో యూపీఏ అధికారంలోకి వస్తుందన్నారు. -
ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు. -
సంక్షేమ పథకం అందని కుటుంబమే లేదు
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకం, సహాయం పొందని కుటుంబమే లేదని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేశాయని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దివంగత నేతకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిసిస్తోందన్నారు. నిరంతరం పేదల సంక్షేమం గురించే ఆలోచించే వారని, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కే చెందుతుందని అన్నారు. ఆయన ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని తెలిపారు. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కమల్‌నాథ్‌కు పగ్గాలు!
భోపాల్: గతకొంతకాలంగా సాగిన తర్జనభర్జనలకు తెరదించుతూ మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా సీనియర్ నేత కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ అధిష్టానం పగ్గాలు అప్పగించింది. 2003 నుంచి కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉంది. పార్టీలో సీనియర్ నేతలు అనేకమంది ఉన్నా.. క్యాడర్ మాత్రం దినదినానికి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. పార్టీ సీనియర్ నేత, ఎంపీ కమల్‌నాథ్‌కు పగ్గాలు అప్పగించింది. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. అన్నింటికీ మించి సోనియాగాంధీకి ఆయన నమ్మిన బంటు. పార్టీని పునర్నిర్మించి.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తన ముందున్న అతిపెద్ద సవాలు అని నియామకం అనంతరం కమల్‌నాథ్ పేర్కొన్నారు. పార్టీలో అందరూ తనకు స్నేహితులేనని, పెద్దలు, పిన్నలు, అందరినీ కలుపుకొని ముందుకువెళుతానని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కమల్‌నాథ్ నియామకం వెనుక దిగ్విజయ్‌సింగ్ హస్తమున్నట్టు భావిస్తున్నారు. డిగ్గి రాజా, కమల్ మంచి స్నేహితులు. కమల్‌ను దిగ్విజయ్ ‘సోదరుడి’గా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఎదుగుతున్న జ్యోతిరాదిత్య సింధియాకు చెక్ పెట్టేందుకే దిగ్విజయ్ కమల్‌నాథ్‌కు అండగా నిలిచి.. పీసీసీ పగ్గాలు ఆయనకు దక్కేలా చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
చేవెళ్ల సెంటిమెంట్!
చేవెళ్ల: మరోసారి ‘చేవెళ్ల సెంటిమెంట్’ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ ఇక్కడి నుంచే రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈనెల 26న చేవెళ్లలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర మే 15 వరకు కొనసాగనుంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటకు కారణమైన వైఎస్ ప్రజాప్రస్థానం, జైత్రయాత్రల తరహాలోనే ఈ సారి ఎన్నికలకు చేవెళ్ల సెటింమెంట్ అస్త్రాన్ని హస్తం పార్టీ ప్రయోగించనుంది. వైఎస్ హఠాన్మరణంతో కాం గ్రెస్ పార్టీకి పరాజయాలే ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకునేందుకు బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై గాంధీభవన్‌లో తర్జనభర్జనలు పడిన నేతలు చివరకు.. కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలను అందించిన చేవెళ్ల సెంటిమెంట్‌కే ఓకే చెప్పారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించి పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చారు. తదనంతరం ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చారు. దీంతో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కూడా ప్రచార యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. బస్సు యాత్ర సాగేదిలా.. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్యనేతలు అంతా కలిసి ఈ బస్సు యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈనెల 26న మధ్యాహ్నం చేవెళ్లలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం వికారాబాద్ జిల్లాకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 27న తాండూరుకు చేరుకొని అదే రోజు రాత్రికి సంగారెడ్డి జిల్లాలోకి వెళ్తుంది. -
గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్న సీఎం
మడకశిర: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి, నిపుణులు గ్రాఫిక్స్ చేసినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా సీఎం దత్తత తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు గెలిపిస్తే రాష్ట్ర స్థూల ఆదాయంలో 13వ స్థానంలో నిలిపారన్నారు. 175 నియోజకవర్గాల తలసరి ఆదాయంలో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా అవగాహన లేని జీఎస్టీ, నోట్ల రద్దువల్ల దేశంలో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుదేలైందన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. -
అంతా ఎన్నికల స్టంటే
ఉప ఎన్నికలో గెలిచేందుకు గడ్డితినేందుకైనా చంద్రబాబు సిద్ధమే గుంతకల్లు మహాధర్నాలో చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీర ఫైర్ గుంతకల్లు : సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఎలాంటి గడ్డి తినడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒక్క నంద్యాల పట్టణంలోనే 13 వేల నివాస గృహాలు మంజూరు చేశారని, కరువు జిల్లా అనంతపురంలో మూడేళ్ల కాలంలో ఎన్ని పక్కాగృహాలు నిర్మించారని ప్రశ్నించారు. ఈ సమాధానమే చంద్రబాబు ఎన్నికల స్టంట్‌ను బహిర్గతం చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లులో మహాధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అజంతా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి దౌల్తాపురం ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని పంటలకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేస్తుంటే అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 250కి పైగా చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సాధించడానికే ఈ ధర్నా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణయాదవ్, నాయకులు ఆలంనవాజ్, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారిని బాబు సర్కార్ గాలికొదిలేసింది: రఘవీరా
హైదరాబాద్‌సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కౌలు రైతులను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ఠ్రంలో 5 లక్షల హెక్టార్ల వరిసాగు తగ్గిందని ఆరోపించారు. నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. వారం లోపల రైతు సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రాజధానిలో మొదలైన కబ్జాలు ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించాయన్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను సీఎం కుమారుడు లోకేష్, మంత్రులు దొచుకుంటున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుఫాన్ లో కొట్టుకు పోయిన భూముల డాక్యుమెంట్స్ ను టీడీపీ నేతలు తమ అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఒక్క విశాఖలోనే రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని, సిట్ ను రెండు గ్రామాల స్కామ్ కు పరిమిత చేస్తూ.. కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ తో జరిగేది శూన్యమన్నారు. హైకోర్టు పర్యవేక్షణ లో సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. విశాఖ కలెక్టర్ పై సీఎం వత్తిడి చేస్తున్నారని, చినబాబు జ్యోక్యంతో కలెక్టర్ స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్నారని చెప్పారు. మా దగ్గర ఉన్న ఆధారాలను రేపు కలెక్టర్ కు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను తండ్రీ కుమారులు, పాతర వేస్తున్నారని ఆరోపించారు. -
రహస్య ఒప్పందాలతో దోపిడీ:రఘువీరా
అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్‌తో రహస్య ఒప్పందాలు చేసుకొని సీఎం చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి రాజధాని నిర్మాణానికి చేసుకున్న ఏకపక్ష, రహస్య స్విస్ చాలెంజ్ ఒప్పందాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల పాలన పాపాలపై జూన్ 8వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా చార్జిషీట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి హోదా సాధించి తీరుతామని, అందుకు గాను వచ్చే నెల మొదటి వారం భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రత్యేక హోదాను బలపర్చిన 14 జాతీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగమైన ప్రత్యేక హోదా అమలు చేయకుండా నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించడం సరికాదన్నారు. -
దిక్కుతోచని ‘దిగ్గజాలు’
► నియోజకవర్గంలో సీఎల్పీ నేతకు వలసల భయం ► పార్టీలో పీసీసీ అధ్యక్షుడికి కష్టకాలం ► జిల్లా నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరి భవిష్యత్ ఏమిటో.. ► ఉత్తమ్‌ను పీసీసీ పదవి నుంచి తప్పిస్తారా.. ► జానా నిజంగానే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటారా.. ► పదవీ గండం ఇద్దరికా.. ఒకరికా ► ‘కోమటిరెడ్డి’కి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా..? ► తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తాజా రాజకీయ పరిణామాలు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి బిగ్షాట్స్తోపాటు పార్టీని వదిలివెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అసలు ఏం జరుగుతుందోననే ఆందోళన ‘హస్తం’ శ్రేణుల్లో నెలకొంది. కాంగ్రెస్‌లో జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులున్నప్పటికీ.. పెద్ద ఎత్తున వలసలుకొనసాగుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వారిలో నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను తప్పిస్తారని కొందరు.. సీఎల్పీ నేత జానాను మారుస్తారని మరికొందరు అంటున్నారు. సీఎల్పీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని జానా ప్రకటించడం, ఉత్తమ్‌ను హైకమాండ్ పిలిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో వారిద్దరి భవిష్యత్‌పై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఆ రోజు నుంచి.. అన్నీ అడ్డంకులే గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ సీనియర్ శాసన సభ్యుడు కావడంతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కోటరీకి సన్నిహితుడు కావడంతో ఆయనకు సులువుగానే పీసీసీ అధ్యక్ష పదవి లభించింది. అయితే... ఆయన నియామకం రోజే జిల్లాకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ ఎదిగే అవకాశం లేదని కుండబద్ధలు కొట్టారు. కోమటిరెడ్డి మాట ఏమో గానీ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు పార్టీ నిర్మాణంలో సాధించిందేమీ లేదని కాంగ్రెస్ శ్రేణులే బహిరంగంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉన్న నాయకులంతా అధికార పార్టీ బాట పట్టగా... ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా ‘హస్తం’ విజయం సాధించలేకపోయింది. జిల్లాలో అయితే కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాలో ఇప్పుడు చెప్పుకోదగిన నేతలు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఉత్తమ్, ఆయన సతీమణి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి మాత్రమే శాసనసభ, మండలిలో సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని దాదాపు ప్రముఖ నాయకులంతా పార్టీ వీడి వెళ్లిపోయారు. ఇటీవలే నియమించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా జిల్లాకు తగిన ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోను చెప్పుకోదగిన విజయం నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే. అది కూడా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వయంకృషితో గెలుపు సాధ్యమైందనే అభిప్రాయం వచ్చింది తప్ప ఈ విషయంలో ఉత్తమ్‌కు దక్కిన క్రెడిట్ కూడా ఏమీ లేదు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. ఉత్తమ్ అనుచరులుగా ఉన్న పలువురు ముఖ్యులు అధికార టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ, తన సొంత నియోజకవర్గంలోనూ పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉత్తమ్ నెట్టుకొస్తుండడం గమనార్హం. పార్టీలో జరుగుతున్న వలసలను అడ్డుకోలేకపోయారన్న విమర్శలు, ఎన్నికల్లో విజయం సాధించే ప్ర ణాళికలు రచించలేదన్న ఎత్తిపొడుపులు మినహా ఉత్తమ్‌కు దక్కిం దేమీ లేదు. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ రాజకీయ భవిష్యత్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చలు జరుగుతుండగా, ఆయన కూడా ఏం చేయా లో పాలుపోని స్థితిలో పడ్డారని రాజకీయ వర్గాలంటున్నాయి. జానా వైరాగ్యం మాటున... తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, సీఎల్పీతో సహా ఏ పదవికైనా రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జానారెడ్డి ప్రకటించడంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ వైరాగ్యం వెనుక ఆంతర్యం ఏమిటనేది కాంగ్రెస్ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. వాస్తవానికి తాజా రాజకీయ పరిణామాలతో జానా మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రతి పక్ష నేత హోదాలో అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నప్పటికీ తన సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ నుంచి నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన నీడన ఎదిగిన వారే ఇప్పుడు తనను కాదని వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తోన్న అధికార టీఆర్ఎస్ నేతల వైఖ రిపై ఆయన చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి హుం దాగా ఎన్నికల నుంచి తప్పుకుని తన కుమారుడు రఘువీర్‌ను రాజకీయ వారసుడిగా తెరపైకి తీసుకురావాలనుకున్న జానాకు తాజా పరిణామాలు మింగుడు పడనివే. తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించడంతోపాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌కు అడ్డంకిగా ఈ పరిణామాలు మారుతాయనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎప్పుడూ నిండుకుండలా తొణకకుండా, బల మైన అనుచర గణాన్ని కలిగి ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన జానా ఇప్పుడు ఏకాకి అవుతున్నారా అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతుండడాన్ని ఆయన ఊహించలేదు. ఎవరెటు వెళ్లినా తాను సేఫ్‌గా ఉండేలా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ స్థాయిలో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయాలు, రాష్ట్ర పార్టీలోనూ, హైకమాండ్ వద్ద తాను పలుచన అవుతున్నాననే భావనలో ఆయన ఉన్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. రాజకీయాల పట్ల ఏహ్యభావాన్ని ప్రకటించడం జానాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఈసారి ఎన్నికల్లో తాను పోటీచేయననిప్రకటించారు. కానీ.. చివరి నిమిషంలో ఆయన పోటీ చేయ క తప్పడం లేదు. ఈసారి సీఎల్పీ పదవిని త్యజిస్తానన్న ఆయన ప్రకటన ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో వేచి చూడాల్సిందే. మార్పులు తప్పవా? తాజా పరిస్థితుల్లో జిల్లా నుంచి కాంగ్రెస్ కీలక హోదాల్లో ఉన్న ఇద్దరిలో ఒకరికి లేదంటే ఇద్దరికీ పదవి గండం ఉందనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ముందుగా సీఎల్పీ నేత జానారెడ్డిని మారుస్తారని.. ఆ తర్వాత ఉత్తమ్‌ను తప్పిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. జానాను కానీ, ఉత్తమ్‌ను కానీ ఇప్పటికిప్పుడే మార్చకపోవచ్చనే చర్చ ఉంది. ఒక వేళ జానాను మారిస్తే ఆ పదవిలో మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే డీకే.అరుణకు అవకాశమిస్తారని అం టున్నారు. ఉత్తమ్‌ను మారిస్తే మాత్రం జిల్లాకే చెందిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పదవి అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీల కంగా ఉండడంతోపాటు మంత్రి పదవిని త్యజిం చారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అనుచరగణం ఉందని.. ఈ మేరకు పీసీసీ చీఫ్ పదవి వస్తుందని అంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ కు చెందిన జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశమున్నట్లు పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరినీ కలుపుకుని పోయే నాయకుడిగా గుర్తింపు ఉన్న జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజగోపాల్‌రెడ్డి పేరు గతంలోనే చర్చకు వచ్చినా.. అమల్లోకి రాలేదు. ఈసారి పీసీసీ అధ్య క్ష పదవి రాజగోపాల్‌కు ఇస్తారని, ఆయన కూడా ఆ పదవి ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. -
మోసకారి ‘మోదీ’ - చేతకాని ‘చంద్రబాబు’
-బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేం వచ్చిన తర్వాత ఇస్తాం -పార్లమెంటులో బీజేపీ మద్ధతుతోనే ఆనాడు రాష్ట్ర విభజన -పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్ మోసకారి నరేంద్రమోదీ, చేతకాని చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో వ్యాఖ్యలు చేయటంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి అన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే నాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఐదేళ్లు ప్రకటించిందని.. అయితే పదేళ్లు కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడు పట్టు పట్టాడాని గుర్తు చేశారు. ప్రస్తుతం వెంకయ్య ఆ విషయం గురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కోసమే హోదా డిమాండ్‌పై దష్టి సారించడం లేదని ఇలాగైతే ప్రజలే తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ తిరుపతి, విశాఖపట్నం సభల్లో అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని 11 రాష్ట్రాలకు కేవలం కేబినెట్ నిర్ణయంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే చంద్రబాబు నోరు మెదపకపోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం ఫైల్‌పై ఒక్క సంతకం చేస్తే చంద్రబాబు జైలుకెళ్తాడని, దాన్నుంచి తనను తాను రక్షించుకునేందుకు మోదీ వద్ద గట్టిగా అడగలేకపోతున్నాడని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటి వరకు కనీసం 5 శాతం కూడా మంజూరు చేయలేదన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ఇటు రాష్ట్రం అటు కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ నెల 13న కేవీపీ రామచంద్రారావు రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టే ప్రై వేటు బిల్లుకు సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాద్, జేడీయూ, ఆర్జేడీ పార్టీల మద్ధతు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఇస్తామన్నారు. అయితే అప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఉద్దేశంతోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. -
'కాంగ్రెస్ మద్దతిస్తుంది'
రాజమండ్రి రూరల్ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జాప్యం వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం పార్లమెంట్‌కు పంపిస్తే.. రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పక మద్దతు ఇస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన బలిజ, తెలగ, వంటరి కాపు ప్రతినిధుల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన కాపుల పట్ల తెలుగుదేశం వైఖరిని తప్పుపట్టారు. -
ఏడాది లోపే!
పీసీసీ చీఫ్ పదవి మార్పు ‘పొన్నాల’ను తప్పించిన ఏఐసీసీ తెలంగాణ తొలి అధ్యక్షుడిగా రికార్డు జిల్లాకు కలిసిరాని పీసీసీ పదవి వరంగల్ : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పదవి పోయింది. పీసీసీ అధ్యక్షుడిని మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలోనే ఉన్నత పదవిని పొందిన లక్ష్మయ్య అర్ధంతరంగా ఏడాదిలోపే ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత సాధారణ ఎన్నికల ముందు ఆయన పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా 2014 మార్చి 13న బాధ్యతలు తీసుకున్నారు. ఈయన నేతృత్వంలోనే పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లి దారుణంగా ఓటమిపాలైంది. జనగామలో స్వయంగా ఆయన ఓడిపోయారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నుంచి పొన్నాలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారిక నిర్ణయం ప్రకటించింది. దీంతో ఏడాదిలోపే పొన్నాల పీసీసీ చీఫ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పొన్నాలకు అవకాశం వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కలిసిరాలేదు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి మన జిల్లా నేతలకు కలిసిరాలేదు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండుసార్లు జిల్లా నేతలకు దక్కింది. ఈ రెండు సార్లు సాధారణ ఎన్నికల్లో హస్తం పార్టీ దారుణంగా ఓడింది. తాజా ఎన్నికల్లో పొన్నాల కూడా ఓడిపోయారు. 1999 ఎన్నికల ముందు వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా వచ్చేవి. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన మహమ్మద్ కమాలుద్దిన్ అహ్మద్ నియమితులయ్యారు. అప్పుడు కమాలుద్దిన్ హన్మకొండ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా నుంచి పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లే దక్కాయి. కమాలుద్దిన్ అహ్మద్ సొంత జిల్లాలో డోర్నకల్ స్థానంలో డీఎస్ రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ ఇలాగేజరిగింది. -
ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు?
తొలిసారి జిల్లాకు దక్కే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని శనివారం పార్టీ వర్గా ల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను ఎంపిక చేస్తారని ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. నల్లగొండతో పాటు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు బాణసంచాకాల్చి, ర్యాలీలు నిర్వహించారు. కానీ శనివారం పొద్దుపోయేంత వరకు కూడా ఏఐసీసీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అయితే పొన్నాల లక్ష్మయ్యను మార్చి ఉత్తమ్‌ను నియమించడం ఖాయమని , ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని కాంగ్రె స్ శ్రేణులు అంటున్నాయి. ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు కీలక పదవులూ (పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత) జిల్లాకే దక్కినట్టవుతుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన జానారెడ్డి సీఎల్పీనేతగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తొలిసారి జిల్లాకు చెందిన నాయకుడికి టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో పాటు అదే సమయంలో సీఎల్పీ నేతగా కూడా జిల్లా నాయకుడే ఉండే అవకాశం కనిపిస్తుండడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. -
పొన్నాల.. చూడాల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్గపోరుతో కునారిల్లుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం మరో ప్రయత్నం చేస్తోంది. కమ్యూనిస్టులను దీటుగా ఎదుర్కొని జిల్లాలో నిలదొక్కుకన్న ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం ఒకింత ఇబ్బంది అయినా దీన్ని విజయవంతం చేసి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆశయం గొప్పదే అయినా వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని ఒకతాటిపైకి తీసుకురావడానికి పొన్నాల ఏం మాయచేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. కొలిక్కిరాని అధ్యక్ష ఎన్నిక డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి వనమా వెంకటేశ్వరరావు వైదొలిగినప్పటి నుంచి నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఖమ్మం నుంచి మొదలైన సమావేశాలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయికి చేరినా ఇంత వరకు అధ్యక్షున్ని ఎన్నుకోలేకపోయారు. డీసీసీ కమిటీ ఎన్నిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారీ తమ వర్గీయుడంటే తమ వర్గీయుడినే అధ్యక్షున్ని చేయాలని ఆయా వర్గాలు పట్టుబడుతున్నాయి. చివరికి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగడం గమనార్హం. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే పరస్పర దూషణలకు దిగడంతో అధ్యక్షుని వ్యవహారం ఓ కొలిక్కి రాకుండానే సమావేశాన్ని ముగించారు. ఆ సమావేశం ఆధిపత్య పోరులా సాగింది తప్ప అధ్యక్షున్ని నిర్ణయించేలా సాగకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏకాభిప్రాయం ఎప్పటికి సాధ్యమో... ఢిల్లీలో సమావేశమై 15 రోజులకు పైగా అవుతున్నా ఇంత వరకు ఆ పార్టీ జిల్లా నేతలు ఒక అవగాహనకు రాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీకి, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండే వ్యక్తినే నాయకున్ని చేయాలని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం ఆకాంక్షిస్తోంది. ఢిల్లీ సమావేశంలో తగిన నాయకుని పేరు సూచించాలని దిగ్విజయ్ కోరారు. ఖమ్మం, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మల్లు భట్టివిక్రమార్క ఒక పేరును, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో పేరును, రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి వేరొక పేరును సూచించారు. ఈ సమావేశంలో ఎవరికి వారు తమ వర్గానిదే పైచేయి కావాలని ప్రయత్నించారు తప్ప సమస్యను ఓ కొలిక్కి తేవాలనే ఉద్దేశం ఎవరిలో కనిపించలేదని ఆ సమావేశం తర్వాత వెలువడిన సమాచారం. ఇలా ఏ విషయంలోనూ ఒకతాటిపైకి రాలేని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవటం మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ కేడర్ ఉంది. టీఆర్ఎస్ వైపు చూపు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో విసిగివేసారిన పలువురు పార్టీని వీడి వెళ్తున్నారు. వారంతా అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. వారిని నిలువరించే చొరవ తీసుకునే నాయకుడే కాంగ్రెస్‌కు కరువయ్యారనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సభ్యత్వ నమోదు కోసం జిల్లాకు వస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు తమ ఆవేదన తెలిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడం, సభ్యత్వ నమోదును విజయవంతం చేయడం పొన్నాలకు సవాల్‌గా మారనుంది. -
‘జన్మభూమి’లో ప్రభుత్వాన్ని నిలదీయండి
భీమవరం : రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ శ్రేణుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించాడన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే వరకు టీడీపీ సర్కారును ప్రజలు నిలదీయాలని కోరారు. నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమయ్యాయో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులను, వివిధ శాఖల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి ఉద్యోగుల కడుపు మీద కొట్టారన్నారు. అటువంటి వారంతా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తేవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆధార్‌కార్డుతో అనుసంధానం పేరుతో వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఏరివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అర్హులను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని, ఇతర పార్టీలకూ భాగం ఉందన్నారు. దీన్ని ప్రజలకు వివరించడంలో విఫలం చెందామని, ఇకనైనా కార్యకర్తలంతా ఆగ్రహావేశాలు వీడి కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శ్రమించాలని రఘువీరారెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనేతలు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగాలి కేంద్ర మాజీ మంత్రి కె.చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కనీస స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు వస్తాయని ఆశించామని, అయితే ఇంతదారుణంగా ఫలితం ఉంటుందని ఊహించలేదన్నారు. కార్యకర్తలంతా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాల మాయమాటలను, మోసపూరిత విధానాలను గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ర్ట విభజనలో కాంగ్రెస్‌ని దోషిగా చేశారని విభజన వెనుక టీడీపీ అనే శక్తి బలంగా పనిచేసిందన్నారు. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గోదావరి వలె నిత్యం కళకళలాడుతూ ఉంటుందన్నారు. ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణ రాజు, రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో సాగుతున్న టీడీపీ పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండి లబ్ధిపొందిన నేతలు, కార్యకర్తలంతా పార్టీని వీడటం బాధాకరమని చెప్పారు. అనంతరం కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా నేతలంతా సమీక్షించారు. వారి కష్టాలు, పార్టీ స్థితిగతులను తెలుసుకుని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమాలోచనలు చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గంగాభవాని, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి, మాజీ ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, గిడుగు రుద్రరాజు, డీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, కలవకొలని నాగతులసీ రావు, కత్తుల సత్యప్రసాద్, గాదిరాజు లచ్చిరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ రాము (చేపల రాము), పట్టణ అధ్యక్షుడు ఉండవల్లి రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ను మార్చితే.. నాకూ అవకాశమివ్వండి: డీకే అరుణ
న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు ఎమ్మెల్యే డి.కె.అరుణ తెలిపారు. బుధవారం రాత్రి ఇక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘అధ్యక్షుడిని మార్చుతారా? లేదా అన్న సంగతి నాకు తెలియదు. ఒకవేళ మార్చితే ఆ అవకాశం నాకు ఇవ్వాలని కోరా ను’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో అత్యధికంగా మా జిల్లా నుంచి 5 స్థానాలు గెలిపించా ను. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవికి నాకు అర్హత ఉందని భావిస్తున్నా..’ అని అరుణ అన్నారు. -
ఓటమికి నాదే పూర్తి బాధ్యత: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలిసీ ఈ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రుద్రరాజుపద్మరాజు, తదితరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి చట్టంలో, పార్లమెంటులో ప్రభుత్వం చేసిన ప్రకటనలను అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం లేకపోయినా మండలిలో తమ సభ్యులుంటారని గుర్తుచేశారు. పదేళ్లుగా కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలతో తాను ఏ విధమైన ఆందోళన చెందడం లేదని, పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన పడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. కేవలం చట్టసభల్లో, ప్రభుత్వంలో ఉండి పరిపాలన అందించడమే రాజకీయం కాదని, ప్రభుత్వంలో లేకున్నా ప్రజలకు సేవలందించడమే అసలైన రాజకీయమని తెలిపారు. రాష్ట్ర నిర్మాణం, కాంగ్రెస్ పునర్నిర్మాణమే తమ ప్రాధాన్యాలన్నారు. పార్టీ ఓటమికి రాష్ట్ర విభజన కూడా ఒక కారణమని ఆయన అంగీకరించారు. -
పొన్నాల.. నెరవేరిన కల
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయాలనేది పొన్నాల లక్ష్మయ్య చిరకాల వాంఛ. గత దశాబ్ద కాలంగా పొన్నాల పీసీసీ పీఠం కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు. కలవని నేత లేరు. నాలుగోసారి తన ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నారు.2003 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు పీసీసీ అధ్యక్ష నియామకం చేపట్టారు. 2003లో డి.శ్రీనివాస్, 2005లో కె.కేశవరావు, 2008లో మళ్లీ డి.శ్రీనివాస్ 2011లో బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం విశేషం. బొత్స తూర్పుకాపు సామాజికవర్గ నేతకాగా, మిగిలిన ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. తాజాగా ఐదోసారి కూడా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించటం గమనార్హం. తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి... విశ్వసనీయ సమాచారం మేరకు.. తొలుత జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల కిందటే నిర్ణయించింది. అయితే.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా నియమిస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు దూరమవుతుండటాన్ని గమనించిన రాహుల్‌గాంధీ ఆయా వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జానారెడ్డిని పక్కనపెట్టి పొన్నాలను నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే సంకేతాలు వెళితే తెలంగాణలో రాజకీయంగా పట్టున్న ఆ సామాజికవర్గమంతా కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం పెద్దలు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి.. పార్టీకి విధేయుడైన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆ పదవిలో నియమించినట్లు తెలిసింది. కాగా తెలంగాణలో జరిగే ఎన్నికలకు పార్టీ పరంగా అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని పొన్నాల హైకమాండ్ పెద్దలకు ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలవండి: రఘువీరా
అనంతపురం: సీమాంధ్ర ప్రాంతానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పారు. కష్టకాలంలో కార్యకర్తలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా రఘువీరాను, ప్రచార కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి చిరంజీవిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇతర కార్యవర్గాలను ప్రకటించింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు బొత్స సత్యనారాయణ నిరాకరించినట్టు సమాచారం. అనంతరం రఘువీరా మాట్లాడుతూ.. సీమాంధ్రలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులను కలుపుకొని కలసికట్టుగా పనిచేస్తానని చెప్పారు. విభజన సమస్యను పక్కనబెట్టి అభివృద్దిపై దృష్టిపెడతానని చెప్పారు. -
సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి
న్యూఢిల్లీ: సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాను ఆ పదవిలో కొనసాగలేనని చేతులెత్తేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రఘువీరారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పిసిసి బాధ్యతలు చేపట్టమని రఘువీరారెడ్డికి ఆమె సూచించినట్లు సమాచారం. రఘువీరా రెడ్డి రేపు ఢిల్లీ వెళతారు. తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేసింది ఇంకా వెల్లడించలేదు. అయితే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు దాదాపు ఖారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాలలోనూ బిసి అభ్యర్థులకే పిసిసి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
రాజ్యసభకు బొత్స?
హైకమాండ్ వద్ద లాబీయింగ్ సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టాన పెద్దలందరినీ కలిసి తనను ఈ సారి రాజ్యసభకు పంపాలని కూడా కోరినట్లు తెలిసింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన బొత్స.. పనిలోపనిగా తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని యువనేత రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ ఇన్చార్జీ గులాం నబీ ఆజాద్‌లకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభ జన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడినందున రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనలో ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు. మొన్నటి వరకు విజయనగరం జిల్లా అంతటా బొత్స ప్రభావం చూపారు. కానీ, విభజన పరిణామాలతోపాటు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన ప్రతిష్టను మరింత పలుచన చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మేలని భావించిన బొత్స.. రాజ్యసభ సీటును దక్కించుకునే పనిలో పడ్డట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొందరు విలేకరులు బొత్స వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా కొట్టిపారేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా అన్నారు. అయితే, గత ఏడాది జైపూర్‌లో నిర్వహించిన ఏఐసీసీ సదస్సులో పీసీసీ, డీసీసీ అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నియమావళిని పార్టీ రూపొందించింది. వచ్చే ఎన్నికల నుంచే దానిని అమలు చేస్తామని కూడా పేర్కొంది. ఆ నియమావళిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న బొత్స.. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో పూర్తిగా పార్టీ తరపున రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానని, ప్రతిఫలంగా తనను రాజ్యసభకు పంపాలని హైకమాండ్ పెద్దలవద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. -
సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా కన్నా?
పీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి ముందే తెలంగాణ, సీమాంధ్రులకు వేర్వేరుగా పీసీసీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పదవులకు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు దాదాపు ఖరాయినట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి ఆయన పిలుపువచ్చినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన హస్తిన పర్యటనకు వెళ్లిరావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకే హైకమాండ్ పెద్దలు శ్రీధర్‌బాబును ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఇక సీమాంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హైకమాండ్ పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమవడంతో కన్నాకు పీసీసీ పగ్గాలు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధినేత్రి సోనియా గాంధీతో కన్నా సమావేశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మేడమ్‌తో నేడు ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకుడు తీపి కబురుతో తిరిగొస్తారని కన్నా వర్గీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జోడు పదవులు అనుభవిస్తున్న బొత్స సత్యనారాయణ నుంచి పీసీసీ పీఠాన్ని వేరొకరికి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన నిర్ణయాన్ని హైకమాండ్ అమలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా పదవికి అప్పగిస్తే కాపు ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉంటుందని అధిష్టానం అంచనా వేస్తోస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవికి కన్నా పేరు వినిపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు సత్తిబాబునే తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశమూ లేకపోలేదన్న వాదన విన్పిస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమయితే పీసీసీ పీఠాలు ఎవరికి దక్కుతాయనేది తొందరలోనే తేలుతుంది.