మధ్యాహ్నం 2:45 గంటలకు ముహూర్తం.. గన్‌పార్కు నుంచి ర్యాలీగా రానున్న మహేశ్‌గౌడ్
అనంతరం గాంధీభవన్‌లో సభ... హాజరుకానున్న మున్షీ, రాష్ట్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌గౌడ్ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్‌పార్కు వద్దకు రానున్న మహేశ్‌గౌడ్ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్‌కు చేరుకుంటారని తెలిపాయి.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్‌లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్‌లతో పాటు రాష్ట్ర కేబినెట్‌లోని మంత్రులు హాజరుకానున్నారు.
ముస్తాబైన గాందీభవన్..
కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్‌కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్‌మెన్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment