Mahesh Kumar Goud
-
కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్మా సిటీ ఒక్కచోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామని చెప్పారు. లగచర్లలో భూమిలేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్ములా వన్ రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని, ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే జైలుకుపోతా అంటున్నాడని తెలిపారు.ఈ మేరకు శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అధికారులపై పద్దతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిపక్షహోదా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు. ఆయన ఎక్కడ దాకున్నారని ఆయన ప్రశ్నించారు.‘కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే మేము 9 నెలల్లో ఎక్కువ చేశాం. నిర్బంధ పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాం. అందుకే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగింది కాబట్టే విజయోత్సవాలు చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోని అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి.హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటుచేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రక్షాళన అవసరం. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. -
ఢిల్లీకి టీపీసీసీ చీఫ్.. కార్యవర్గం కూర్పుపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా కార్యవర్గం కూర్పు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, వీహెచ్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొననున్నారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పార్టీ పెద్దలను ఆయన కలువనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, కార్యవర్గం కూర్పు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొననున్నారు. -
గ్రూప్–1 పరీక్షలు యథాతథం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రూప్–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్లో పని చేయాల్సిందేనని ఆదేశించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. -
దీపావళిలోపు కార్పొరేషన్ పదవులు
సాక్షి, హైదరాబాద్: దీపావళిలోపు రెండోదఫా కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. దసరాలోపు చేద్దామని అనుకున్నా హరియాణా, కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదని, ఏఐసీసీ నాయకత్వం కూడా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటులోనూ జాప్యం జరిగిందన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ⇒ ఎంఐఎంతో స్నేహం వేరు. శాంతిభద్రతల సమస్య వేరు. నాంపల్లి నియోజకవర్గంలో మా పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటాం. విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. ⇒ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అవుతోంది. అందుకే చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేశాం. కానీ బీఆర్ఎస్కు చెందిన చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ చేరికలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ⇒ సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కావాలని మాట్లాడలేదు. కేటీఆర్ వ్యవహారశైలి కారణంగానే అలా మాట్లాడారని అనుకుంటున్నా. అయినా అలా మాట్లాడాల్సింది కాదు. నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విషయంలో అధిష్టానం మమ్మల్ని ఎలాంటి వివరణ అడగలేదు. అయినా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజే ఆ విషయం క్లోజ్ అయ్యింది. ⇒ పేదలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మూసీ, హైడ్రాలు భావితరాల కోసమే చేపట్టాం. ⇒ బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. మమ్మల్ని ఎదుర్కోవడమే ఆ రెండు పార్టీల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశముంది. అయినా మాకేం నష్టం లేదు. ⇒ సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీఆర్ఎస్ మా మీద దు్రష్పచారం చేస్తోంది. దుబాయి నుంచి ఖాతాలు తెరిచి మరీ నడిపిస్తున్నారు. రూ. వందల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాను దురి్వనియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ⇒ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. బీసీల పక్షాన మాట్లాడితే పార్టీ లైన్ తప్పారని అనలేం. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని మల్లన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ⇒ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంత దు్రష్పచారం చేసినా ప్రజలు నమ్మరు. ⇒ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు ఉన్నాయి. నెలరోజుల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతా. -
హైడ్రా మాదిరిగా నిడ్రా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ను ఆపేదే లేదని.. దీనిపై ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా ముందుకు వెళ్తా మని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. హైడ్రాను ఆపితే భవిష్యత్తులో హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. జిల్లాలోనూ హైడ్రా మాదిరిగా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ క్రమించిన వారిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వా రి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నా సదరు ఆక్రమణలు తొలగిస్తామని తెలి పారు. దీంతో ఈ విషయమై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో కబ్జాలు, ఆక్రమణల విషయమై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగా, ఆక్రమణదారుల్లో మా త్రం టెన్షన్ నెలకొంది. దీంతో చెరువులు, వాగుల్లో నిర్మాణాలు చేపట్టి విక్రయించిన బిల్లర్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చివరకు వాళ్లు వేసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్నా మధ్యతరగతి అమాయకులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.నగరంలో అనేక ఆక్రమణలునిజామాబాద్లో కీలకమైన పూలాంగ్ వాగు అడుగడుగునా కబ్జా అయింది. మాలపల్లి నుంచి ప్రారంభమయ్యే డి –54 కెనాల్ చంద్రశేఖర్‌కాలనీ వరకు కబ్జా అయింది. అర్సపల్లిలోని రామర్తి చెరువు 90 శాతం కబ్జా అయింది. భారీ నిర్మాణాలు చేశారు. ధర్మపురి హిల్స్, డ్రైవర్స్ కాలనీ, పెయింటర్స్ కాలనీల్లో 40 ఎకరాల ప్రభు త్వ భూమి కబ్జా అయింది. వీటికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు.కనుమరుగవుతున్న కాలువలుఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ 82/2/1 మైనర్ కాలువ ఆక్రమణలతో కనుమరుగు అవుతోంది. 70 ఫీట్ల వెడల్పుతో పట్టణంలోని మామిడిపల్లి, పెర్కిట్–కొటార్మూర్ మీదుగా వెళ్లే ఈ కాలువ ఉనికిని కోల్పోయింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ 68వ డిస్ట్రిబ్యూటరీని కబ్జా అయింది. ఈ కాలువను ఆక్రమించి కొందరు వెంచర్లు వేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసి ఏకంగా ప్రహరీలతో బిల్డింగ్లు నిర్మించారు. ఫలితంగా చిన్న వర్షం కురిస్తే జాతీయ రహదారి జలమయం అవుతోంది.సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలునగరంలో చాలా చోట్ల సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లు వచ్చినా అక్రమార్కులకు పాల్పడుతున్న అధికారులను కాపాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో కిందిస్థాయి అధికారులు మాఫియా మాదిరిగా వ్యవహారాలు నడిపి రూ.కోట్లలో దండుకుంటున్నారు.చెరువుల్లో కబ్జాలుజిల్లాలోని పలు చెరువులు కబ్జా అయ్యాయి. నవీపేట దర్యాపూర్ చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 5 ఎకరాల వరకు రియల్ స్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. నవీపేట మండలం మోకన్‌పల్లి చెరువులో 60 ఎకరాల శిఖం భూమిని కొందరు పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు గతంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్ రాధం చెరువు భూములు ఎన్నో ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్మేశారు. ఇందల్వాయి చెరువు 80 ఎకరాలు కబ్జా అయింది. కొందరు ఈ ఆక్రమిత స్థలాల్లో డెయిరీ ఫామ్‌లు కట్టారు. నందిపేటలోని రఘునాథ చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. -
కార్యకర్తల కృషి వల్లే పీసీసీ పీఠం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయి పదవుల వరకు చేరుకోవాలంటే కాంగ్రెస్ పారీ్టతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. తనకు పీసీసీ పీఠం దక్కడమే ఇందుకు నిదర్శనమని.. ఈ గౌరవం కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో మహేశ్‌కుమార్ గౌడ్ సన్మాన సభ జరిగింది. ఈ సభకు సగానికిపైగా మంత్రివర్గం తరలివచ్చి0ది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తండ్రి మరణంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విదేశాల్లో ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు రాలేకపోయారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ మాట్లాడుతూ 38 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక కష్టనష్టాలు చవిచూశానని.. కానీ కష్టపడినందుకు పార్టీ నాయకత్వం గుర్తించి కలలో కూడా ఊహించని రీతిలో వడ్డీతో సహా పీసీసీ పీఠం అప్పగించిందన్నారు. డీఎస్ ఆశీర్వాదం తీసుకొనేవాడిని.. దివంగత మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో తనకు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ గురువుగానే భావిస్తానని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరాటే మాస్టర్‌గా ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన డీఎస్.. 1986లో తనను ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా చేశారని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ డీఎస్ బతికి ఉంటే పీసీసీ చీఫ్ హోదాలో వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొనేవాడినని చెప్పారు. సోషల్ ఇంజనీరింగ్‌తో ముందుకు.. రాహుల్ గాంధీ ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నా రు. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్, బీసీ గణన జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు. 2028 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలో 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. పీసీసీ కమిటీలో, డీసీసీల్లో 60 శాతం బీసీలకే పదవులు.. పీసీసీ కమిటీతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల్లోనూ 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికే కేటాయించనున్నట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కొదవ లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలాంటి రాజకీయ అండ లేనప్పటికీ పార్టీ అత్యున్నత గుర్తింపు ఇచ్చి0దని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలమన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ బలహీనంగా ఉందని గతంలో విన్నానని.. కానీ అభినందన సభకు ఇంత భారీగా కార్యకర్తలు, అభిమానులు రావడం చూస్తుంటే పార్టీ బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. -
800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే వారికి హైడ్రా అంటే భయం అంటూ కామెంట్స్ చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి. ఆయన ఏం చదువుకున్నాడో అని అనుమానం వస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 800 చెరువులను కబ్జా చేశారు. వారికే ఇప్పడు భయం. హైడ్రాకు, మూసీకి, రాహుల్ గాంధీకి సంబంధం లేదు. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వవైభవం తెస్తాం.మూసీపై డీపీఆర్ సిద్ధం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధంగా ఉంది. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. బయట రాష్ట్రంలో వీడియోలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చి వేస్తోంది. హైడ్రా పని వేరు. మూసీ ప్రాజెక్ట్ వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు -
43 లక్షల మందిలో 40 మందికి అవకాశమిచ్చాం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 43 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలున్నాయి. అందులో కార్పొరేషన్ చైర్మన్లుగా 40 మందికి అవకాశమిచ్చాం. సామాజిక, ప్రాంతీయ సమీకరణలతో పాటు సీనియారిటీ, శ్రమ ఆధారంగా అనేక వడపోతల తర్వాత మీకు చైర్మన్ పదవులొచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరంతా బాగా పనిచేశారు. మీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాల్సిన వారు కూడా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మీరు ఎలా పనిచేస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పార్టీ కోసం మీరేం చేస్తున్నారన్న సమాచారం ఎప్పటికప్పుడు మాకు వస్తోంది. పనిచేయకపోతే భవిష్యత్‌లో మీరే నష్టపోతారు.’అని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. 10 మంది చైర్మన్లు మాత్రమే చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారని, సీఎం, మంత్రులు రోజుకు 18 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంటే మీరెంతసేపు పనిచేస్తున్నారంటూ మంగళవారం గాం«దీభవన్‌లో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లతో జరిగిన సమావేశంలో ఆయన క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు పనికట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులేంటి? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలేంటి? ఆ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలను వివరిస్తూ కార్పొరేషన్ చైర్మన్లకు సమాచారంతో కూడిన రిపోర్టులు అందజేశారు. సమావేశంలో భాగంగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ తమ సమస్యలను పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ముందు ఏకరువు పెట్టారు. తమకు గన్మెన్లను ఇంకా ఇవ్వలేదని, అటు శాఖాపరంగా, ఇటు నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం సరిపోవడం లేదని కొందరు, బీఆర్ఎస్ హయాంలో పెట్టిన కేసులను ఎత్తివేయించాలని మరికొందరు ఫిర్యాదు చేశారు. చైర్మన్ల సమస్యలు విన్న మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని.. అలాగని ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాందీల వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడొకడు వీడొకడు మోపైండు. కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తామన్నారు. కానీ మనవాళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడికి చింతపండు అయినంక దాడికి వచ్చారని అంటున్నాడు. మరి ఇంటికి ఎందుకు రమ్మనాలి? .. .. డానికి పిలవాల్నా’’ అని పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఎవరైనా తమ జోలికి వస్తే.. వీపు చింతపండు అవుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడేనని.. కానీ ఆయన వెనుక తాను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటామని.. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళతామని చెప్పారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం గాందీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉంటాం.. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌పై పార్టీ గురుతర బాధ్యతను పెట్టిందని రేవంత్ అన్నారు. ‘‘మా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యతలను నేను, మహేశ్‌గౌడ్ తీసుకుంటాం. మా ఎన్నికల కంటే ఎక్కువగా మీ ఎన్నికల కోసం పనిచేస్తాం. మీరు గెలిస్తేనే మేం గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పునరంకితమవుదాం’’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు, నాలుగు నెలల్లో కులగణన పూర్తవుతుందని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ చెప్పారు. గతంలో పదేళ్లు టీడీపీ, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్, మళ్లీ పదేళ్లు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని.. ఇదే పద్ధతిలో మరో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. ఆ ఎన్నికలు ఫైనల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్‌లో లభించిన విజయం మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘‘2029లో ఫైనల్స్ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మోదీని ఓడించి రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయాలి. అప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్టు. తెలంగాణ నుంచి ఆ ఎన్నికల్లో 15 మందిని కాంగ్రెస్ ఎంపీలుగా గెలిపించాలి. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు’’అని పిలుపునిచ్చారు. రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఎక్కడ? తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇంద్రవెల్లిలో సమరశంఖం పూరించానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల అమలు ప్రారంభించామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ? కావాలంటే వివరాలు పంపిస్తా..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని.. చెప్పినట్టుగానే ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేశానికి ఒలింపిక్స్ బంగారు పతకం తెస్తాం! క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాన్ని తెచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నేను పవర్ సెంటర్‌ను కాదు – సీఎం, మంత్రులు గాంధీభవన్‌కు రావాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందనేందుకు తన నియామకమే నిదర్శనమని నూతన టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని.. పార్టీ బాధ్యతలు చూడాల్సి వస్తుందని అప్పుడప్పుడూ రేవంత్‌రెడ్డి అంటుంటే ఊరికే అంటున్నారని భావించేవాడినని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకెలాంటి భేషజాలు లేవని.. తాను పవర్ సెంటర్‌ను కానని చెప్పారు. తాను ప్రభుత్వానికి, పారీ్టకి మధ్య వారధిగా ఉంటానని.. తాను పీసీసీ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలపై గీత కూడా పడనీయమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రులు వారంలో రెండు రోజులు గాంధీ భవన్‌కు రావాలని.. జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. సీఎం రేవంత్ కూడా వీలును బట్టి నెలకు రెండు సార్లయినా గాం«దీభవన్‌కు వచ్చి వెళ్లాలన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులతో మమేకం కావొచ్చన్నారు. సౌమ్యుడినేగానీ.. కరాటే బ్లాక్ బెల్ట్ ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని.. సోషల్ మీడియాను సోషల్సెన్స్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయని మహేశ్‌గౌడ్ విమర్శించారు. వాటిని ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని, గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తనను సౌమ్యుడని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో తాను సౌమ్యుడినే అయినా కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందని చమత్కరించారు. గాందీభవన్‌లో ‘లాల్ సలామ్’! టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కమ్యూనిస్టుల తరహాలో ‘లాల్‌సలామ్’ వినిపించడం ఆసక్తిగా మారింది. ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అరి్పస్తూ సాగిన పాటలో ‘లాల్‌సలామ్’ అనే చరణం ఉంది. ఇది విని కొందరు కాంగ్రెస్ ఆఫీసులో కమ్యూనిస్టు పాట అంటూ చమత్కరించారు. – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ప్రసంగిస్తున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు వేదిక మీదకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన మహేశ్‌గౌడ్.. ‘అయ్యగారు వచ్చారు. ఆయన రాకతో మంత్రిమండలి సంపూర్ణంగా వచ్చినట్టయింది..’ అని వ్యాఖ్యానించారు. – సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ వేదికపైకి వచ్చినప్పుడు.. తొలి వరుసలో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి, వీహెచ్‌కు తన స్థానం ఇచ్చి వెనుక వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. – సభలో ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో గందరగోళం లేకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ జాబితాను రాసి ఇచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టిన అయ్యగారితోనే.. మహేశ్‌కుమార్‌గౌడ్ తన పెళ్లికి ముహూర్తం పెట్టిన పురోహితుడితోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పూజలు చేయించారు. ఆయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన పూజారి కృష్ణమాచార్యులు. ఆయన, గాంధీభవన్ పూజారి శ్రీనివాసమూర్తి ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ఇక గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన అడుగుపడని మిల్లీమీటర్ స్థలం కూడా గాందీభవన్‌లో లేదని.. ప్రతి గోడ, కిటికీ, తలుపును తాను తాకానని మహేశ్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంతోనే కార్యకర్తలను ఆకట్టుకున్నారు. సౌమ్యుడిని అంటూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందన్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం కోసం మంత్రులు తరచూ గాంధీభవన్‌కు, జిల్లా కార్యాలయాలకు రావాలని కోరారు. రేవంత్ నుంచి జెండా అందుకుని.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు మహేశ్‌గౌడ్ హైదరాబాద్‌లోని నార్సింగి నుంచి భారీ ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గాందీభవన్‌కు చేరుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను అందుకున్నారు. -
పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌గౌడ్ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్‌పార్కు వద్దకు రానున్న మహేశ్‌గౌడ్ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్‌కు చేరుకుంటారని తెలిపాయి.బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్‌లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్లతో పాటు రాష్ట్ర కేబినెట్లోని మంత్రులు హాజరుకానున్నారు. ముస్తాబైన గాందీభవన్.. కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్‌కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్మెన్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.