సాక్షి,నిజామాబాద్‌జిల్లా:రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా?
పీసీసీ పదవి రాగానే మహేష్‌గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.
బీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్‌లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment