సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్‌గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఉండదన్నారు. హరీశ్‌రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.
మహేష్‌కుమార్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే...
- కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు
- సీఎం రేవంత్‌ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదు
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసు
- మీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాం
- జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలి
- అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి
- బీజేపీ,బీఆర్‌ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయి
- కార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది
- కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందే
- మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
- కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది
- బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యింది
- కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయి
- కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదు
- హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
- మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి
- మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాం
- వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉండదు
- హరీశ్‌రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడు
- చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు
Comments
Please login to add a commentAdd a comment